న్యాయ దర్శనం
స్వరూపం
(న్యాయ దర్శనము నుండి దారిమార్పు చెందింది)
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
- న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు.
- న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము అను రెండునూ ఒకనాడు ఒకే దర్శనముగా ఉండెడిది. కాలక్రమేణా రెండు దర్శనములుగా విడిపోయినవి.
- కొందరు ప్రథమ దర్శనము అంటే వైశేషిక దర్శనము మాత్రమే అని, మరికొందరు న్యాయ దర్శనము అను వాదనలు ఉన్ననూ, చివరికి ఏకాభిప్రాయమునకు వచ్చి, వైశేషిక దర్శనము ప్రమేయముల గురించి విపులముగా చెప్పడము జరిగింది.
- తాత్విక సమస్యలపై వాదోపవాదాలకు అవసరమైన నియమ నిబంధనలే న్యాయ దర్శనముగా గౌతమ మహర్షి సూత్రబద్దం చేసాడు. దీనిలో మొత్తం 524 సూత్రాలు ఉన్నాయి.
గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.
- ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
- దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
- వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
- జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
- న్నిఃశ్రేయ సాధిగమః
ప్రమాణములు
[మార్చు]- న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి:
- ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి, నిగ్రహ స్థానం.
- ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.
ప్రమేయములు
[మార్చు]- ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము, అపవర్గము.