తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు
Jump to navigation
Jump to search
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళుగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలతోపాటు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాజకీయాల్లో మహిళలు కీలకపాత్ర పోషించారు.[1]
అంతటి ప్రతిభవున్న మహిళలు రాజకీయనాయకులుగా చట్టసభల్లో మాత్రం వెనుకబడివున్నారు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే భారీగా పెరుగుతున్న మహిళా ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగా శాసనసభలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం లేదన్నది వాస్తవం. 1951 నుండి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఎంతమంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు, వారిలో ఎవరు గెలిచారన్నది కింది జాబితాలో ఇవ్వడం జరిగింది.
మహిళా ఎమ్మెల్యేల జాబితా[మార్చు]
క్రమసంఖ్య | ఎన్నికల సంవత్సరం | గెలుపొందిన మహిళలు | ఇతర వివరాలు |
---|---|---|---|
1 | 1951 | 1. మసూమా బేగం-షాలిబండ 2. షాజహాన్ బేగం-పరిగి 3. శాంతాబాయి-మక్తల్ ఆత్మకూరు 4. లక్ష్మీబాయి-బాన్సువాడ 5. జేఎం రాజమణి దేవి-సిరిసిల్ల 6. ఆరుట్ల కమలాదేవి-ఆలేరు |
142 నియోజకవర్గాలతో తొలిసారిగా జరిగిన హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో ఆరుగురు మహిళలు విజయం సాధించారు |
2 | 1957 | 1. ఆరుట్ల కమలాదేవి-ఆలేరు 2. కె. కనకరత్నం-నర్సంపేట 3. ఎల్లాప్రగడ సీతాకుమారి-బాన్సువాడ 4. టి.ఎన్.సదాలక్ష్మి-కామారెడ్డి 5. మసూమా బేగం- పత్తర్ ఘట్టి 6. షాజహాన్ బేగం-షాద్ నగర్ 7. జయలక్ష్మీ దేవమ్మ-ఆలంపూర్ |
తెలంగాణ ప్రాంతానికే జరిగిన ఎన్నికల్లో 17మంది మహిళలు పోటీ చేయగా 7మంది మహిళలు గెలుపొందారు |
3 | 1962 | 1. కుముదిని దేవి-వనపర్తి 2. సుమిత్రా దేవి-హైదరాబాద్ ఈస్ట్ 3. రోడామేస్రీ-జూబ్లీహిల్స్ 4. ఎస్.ఎల్. దేవి- ఆందోల్ 5. కేవల్ ఆనందాదేవి-మెదక్ 6. పెద్ద రత్తమ్మ-రామాయంపేట 7. టి.ఎన్.సదాలక్ష్మి-ఎల్లారెడ్డి 8. ఆరుట్ల కమలాదేవి-ఆలేరు |
8మంది మహిళలు గెలుపొందారు |
4 | 1967 | 1. ఎన్.ఆర్.దేవి-చెన్నూరు 2. రత్నమ్మ-రామాయంపేట 3. జెట్టి ఈశ్వరీ బాయి-ఎల్లారెడ్డి 4. ఎస్.దేవి-మేడ్చల్ 5. బీఎస్‌పీ రెడ్డి-మలక్ పేట 6. జేకే దేవి-వనపర్తి |
ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు ఎన్నికయ్యారు |
5 | 1972 | 0 | 49మంది మహిళలు పోటీచేయగా ఎవరూ గెలవలేదు |
6 | 1978 | 1. సుమిత్రాదేవి-ఇబ్రహీంపట్నం 2. మల్లు స్వరాజ్యం-తుంగతుర్తి |
ఈ ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు |
7 | 1983 | 1. కాట్రగడ్డ ప్రసూన- సనత్‌నగర్ 2. మల్లు స్వరాజ్యం-తుంగతుర్తి |
ఈ ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు |
8 | 1985 | 1. ఎం. ఇందిర-షాద్‌నగర్(ఎస్సీ) | ఈ ఎన్నికల్లో ఒక్కరే గెలుపొందారు |
9 | 1989 | 1. మేరీ రవీంద్రనాథ్-సికింద్రాబాద్ 2. సింగిరెడ్డి ఉమా వెంకట రామారెడ్డి-మేడ్చల్ 3. గీతా రెడ్డి-జహీరాబాద్ |
ఈ ఎన్నికల్లో 3గురు మహిళలు గెలుపొందారు |
10 | 1994 | 1. అన్నపూర్ణ-ఆర్మూరు | ఈ ఎన్నికల్లో ఒక్కరే గెలుపొందారు |
11 | 1999 | 1. కొండా సురేఖ-శాయంపేట 2. పాటి సుభద్ర-ఆసిఫాబాద్ 3. పాల్వాయి రాజ్యలక్ష్మీ-సిర్పూర్ 4. అరుణతార-జుక్కల్ 5. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి-నర్సాపూర్ 6. కొండ్రు పుష్పలీల-ఇబ్రహీంపట్నం |
6మంది మహిళలు గెలుపొందారు |
12 | 2004 | 1. ఎలిమినేటి ఉమామాధవరెడ్డి-భువనగిరి 2. బండారు శారారాణి-పరకాల 3. కొండా సురేఖ-శాయంపేట 4. అమురాజుల శ్రీదేవి-ఆసిఫాబాద్ 5. పద్మా దేవేందర్ రెడ్డి-రామాయంపేట 6. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి-నర్సాపూర్ 7. గీతారెడ్డి-గజ్వెల్ 8. సబితా ఇంద్రారెడ్డి-చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం 9. సాల్గూటి స్వర్ణసుధాకర్-అమరచింత 10. డి.కె.అరుణ-గద్వాల్ |
10మంది మహిళలు గెలుపొందారు |
13 | 2009 | 1. ఆత్రం సక్కు-ఆసిఫాబాద్ 2. ఆలేటి అన్నపూర్ణ-ఆర్మూర్ 3. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి-నర్సాపూర్ 4. గీతారెడ్డి-జహీరాబాదు 5. సబితా ఇంద్రారెడ్డి-మహేశ్వరం 6. టంగుటూరి మణెమ్మ-ముషీరాబాద్ 7. జయసుధ-సికింద్రాబాదు 8. సీతాదయాకర్ రెడ్డి-దేవరకద్ర 9. డి.కె.అరుణ-గద్వాల్ 10. ఎలిమినేటి ఉమామాధవరెడ్డి-భువనగిరి 11. సత్యవతి రాథోడ్-డోర్నకల్ 12. కవిత మాలోత్-మహబూబాబాద్ 13. రేవూరి కవిత రెడ్డి-నర్సంపేట 14. కొండా సురేఖ-పరకాల 15. బానోత్ చంద్రావతి-వైరా 16. కుంజా సత్యవతి-భద్రాచలం, |
74 నియోజకవర్గాల్లో 125మంది మహిళలు పోటీ చేయగా 16మంది విజయం సాధించారు |
14 | 2014 | 1. పద్మా దేవేందర్ రెడ్డి-మెదక్ 2. కొండా సురేఖ-వరంగల్ ఈస్ట్ 3. కోవ లక్ష్మీ-ఆసిఫాబాద్ 4. అజ్మీరా రేఖ నాయక్-ఖానాపూర్ 5. బోడిగ శోభ-చొప్పదండి 6. గొంగిడి సునీత-ఆలేరు 7. గీతారెడ్డి-జహీరాబాదు 8. డి.కె.అరుణ-గద్వాల్ 9. నలమాడ పద్మావతిరెడ్డి-కోదాడ |
39 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా తొమ్మిది మంది గెలిచారు |
15 | 2018 | 1. పద్మా దేవేందర్ రెడ్డి-మెదక్ 2. అజ్మీరా రేఖ నాయక్-ఖానాపూర్ 3. గొంగిడి సునీత-ఆలేరు 4. సబితా ఇంద్రారెడ్డి- మహేశ్వరం 5. బానోతు హరిప్రియ నాయక్- ఇల్లందు |
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఐదుగురు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు గెలిచారు. |
మూలాలు[మార్చు]
- ↑ కాసం, ప్రవీణ్ (10 November 2018). "'ఆమె'కు ఎందుకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు?". Archived from the original on 3 December 2018. Retrieved 3 December 2018.