Jump to content

దేవదారు నూనె

వికీపీడియా నుండి
(దేవదారు తైలం నుండి దారిమార్పు చెందింది)
దేవదారు ఆవశ్యక నూనె

దేవదారు నూనె ఒక ఆవశ్యక నూనె.దేవదారు నూనె ఒక సుగంధ పరిమళాన్ని కలిగిన నూనె. దేవదారు నూనెను ఆయుర్వేద, దేశీయ వైద్యంలో ఉపయోగిస్తారు.దేవదారు చెట్టు వృక్షశాస్త్రపరంగా కుప్రేసియే కుటుంబానికి చెందినది. దేవదారు వృక్షశాస్త్ర పేరు జునిపెరస్ విర్జినియాన. దేవదారులో ఎరుపు, తూర్పు ఎరుపు లేదా దక్షిణాది ఎరుపు దేవదారు అంటూ పలురకాలు ఉన్నాయి.అలాగే బెడ్ ఫోర్డ్ దేవదారు కూడా దేవదారును గృహోపకరణాలు చెయ్యటానికి ఉపయోగిస్తారు.దేవదారు నూనె శ్వాసకోసం మార్గంలోని శ్లేషాన్ని తోలగించి శుభ్రపరచును. ముక్కు దిబ్బడను తగ్గించును.ముత్ర నాళరోగాలను నయం చేస్తుంది.అలాగే మూత్రపిండాలలోని అస్వస్థతను తొలగిస్తుంది.జిడ్డు చర్మాన్ని మేరిపిస్తుమ్ది.చుండ్రును నియంత్రించును.

దేవదారు చెట్టు

[మార్చు]

దేవదారు చెట్టు వృక్షశాస్త్రపరంగా కుప్రేసియే కుటుంబానికి చెందినది. దేవదారు వృక్షశాస్త్ర పేరు జునిపెరస్ విర్జినియానా.దేవదారు చెట్టులో పలు రకాలు ఉన్నాయి.దేవదారు చెట్టు జన్మ స్థానం ఉత్తర అమెరికా. ఈ చెట్టు 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తు వరకు పెరుగును. దాదాపు వెయ్యి సంవత్సరాల అయురార్దం కల్గివున్నది.ఈ చెట్టు కర్రను ఉపయోగించే సోలోమన్ జెరూసలేంలో దేవాలయాన్నినిర్మించాడు.సిడ్రస్ లిబని, లేదా లిబనోన్ అనబడే దేవదారునుండి మొదటగా ఆవశ్యక నూనె తయారు చేయబడింది.అయితే ఈ రకపు దేవదారు చెట్టును విరివిగా వాడటం వలన ఈ రకం చెట్తు లభ్యం కావడం లేదు.ఇజిప్తులు మమ్మిలను తయారు చేయునపుడు దేవదారు నూనె/ తైలాన్ని ఉపయోగించారు.అంతేకాదు సౌందర్య సాధనాలలో, క్రిమికీటకాల వికర్షినిగా కుడా వాడారు.దేశీయ అమెరికనులు దేవదారు నూనెలను వైద్యంలో ఉపయోగించారు.ప్రస్తుతం దేవదారునుపెన్ను&సిల్లను, పెట్టెలను, ఇంటి సామానులు తయారు చేయుటకు ఉపయోగిస్తున్నారు.[1]

నూనె ఉత్పత్తి

[మార్చు]

దేవదారు నూనె ఆవిరి స్వేదన క్రియ ద్వారా దేవదారు చెక్కముక్కలనుండి, దేవదారు రంపపు పొడి నుండి ఉత్పత్తి చేస్తారు.

నూనె లక్షణాలు

[మార్చు]

ఇది మృదువైన, కలప, "పెన్సిల్వంటి" వాసన కలిగి ఉంటుంది, గంధపుచెట్టు వంటి లేత వాసన కలిగి ఉంటుంది.ఇది నారింజ రంగు తోకూడిన లేత పసుపు రంగులోచిక్కగా / జిగటగా ఉంటుంది.

  • నూనె భౌతిక లక్షణాల పట్టిక [2]
వరుస సంఖ్య గుణం మితి విలువ
1 సాంద్రత 0.952 (25 °Cవద్ద)
2 వక్రీభవన సూచిక 1.456-1.460
3 భాస్పీభవన ఉష్ణోగ్రత 279 °C
4 ఫ్లాష్ పాయింట్ 175 °F
5 రంగు లేత పసుపు రంగు ద్రవం

నూనెలోని రసాయన సమ్మేళన పదార్థాలు

[మార్చు]

నూనెలో దాదాపు 20 వరకు ఆరోమాటిక్ రసాయన సమ్మేళనాలు ఉన్నాయి. దేవదారు నూనెలోని కొన్నిప్రధాన రసాయనాలు ఆల్ఫా-సేడ్రేన్, బీటా సేద్రెన్, తుజోప్సేన్, సెస్కవిటెర్పీన్లు, సెడ్రోల్, విడ్డ్రోల్.[1]

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • యాంటి సెబోర్హోహెయిక్ గా (సెబోర్హోహెయిక్ అనగా ఒకరకమైన చర్మవ్యాధి) చెడకుండ కాపాడు ఔషధముగా (antiseptic) శూలరోగమును పోగొట్టేఔషదముగా, కండరాలను సంకోచంకల్గించే గుణముగలమందుగా, మూత్రవర్ధకము, కఫహరమైనమందుగా పనిచేయును.అలాగే రుతుస్రావాన్ని నియంత్రణ కావించు ఔషదంగా, కిటక నాసనిగా, శిలీంద్రనాశినిగా పనిచేయును.[1]
  • దురదాలను తగ్గిస్తుంది.మొతిమలను తగ్గిస్తుంది.చుండ్రును నియంత్రిచును.నుత్ర సంబంధ మైన రోగాలను తగ్గించును. శ్లేష్మపొరమిద ప్రభావం చూపును.[1]
  • ఎక్జిమా వంటి చర్మరోగాలను తగ్గించి చర్మాన్ని మెరుగు పరచును.కేశ వృద్ధికి దోహద పడుతుంది.నెత్తి మీది పొడి చర్మాన్ని మెరుగు పరచును.సహజ యాంటీ సెప్టిక్ గుణాలు కల్గి ఉంది.కీళ్ల వాతం తగ్గించును.[3]
  • సహజ మూత్రవర్దకంగా పనిచేయును.[3]
  • దగ్గు నివారణి.కీటక వికర్షీణీగా ఆపని చేయును.వత్తిడిని తగ్గిస్తుంది.ఫంగస్ వలన సంక్రమించు వ్యాధులను నిలువరించును.మొటిమలు తగ్గించును.[3]
  • నల్లులను (మత్కుణము) నశింప చెయును.

బయటి వీడియోల లింకుల్

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Cedarwood essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-08. Retrieved 2018-08-16. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Cedarwood oil". chemicalbook.com. Retrieved 2018-08-16.
  3. 3.0 3.1 3.2 "14 Cedarwood Essential Oil Uses". draxe.com. Archived from the original on 2018-08-07. Retrieved 2018-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)