Jump to content

పొంగలి

వికీపీడియా నుండి
(పొంగళి నుండి దారిమార్పు చెందింది)
వడ్డించిన పొంగలి.
కట్టు పొంగలి
పొంగలి

పొంగలి లేదా పొంగళి (Pongal) తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నంతో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే అన్నం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. చక్కెర పొంగలి, మెలి పొంగలి. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స్వీట్ గా తింటారు. మెలి పొంగలిలో మిరియాలు వేస్తారు. ఇది కారంగా ఉంటుంది. రెంటినీ ప్రసాదానికి కూడా వినియోగిస్తారు. ఇష్ట ప్రకారం రెంటిలోనూ జీడి పప్పు వేసుకొనవచ్చును.

తమిళనాడు, ఆంధ్ర లలో పొంగలి ఒకే రకంగా ఉంటుంది. ఉప్మా లాగా హస్తం గరిటెతో ముద్దలు ముద్దలుగా పెట్టుకోవటానికి వీలౌతుంది. వేరుశనగ కాయలతో లేదా పప్పులతో చేసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబారుతో మరింత రుచిగా ఉంటుంది. మినప వడ లని కూడా ఇందులో నంజుకొంటారు.

కర్ణాటకలో పొంగలిలో పాలని వినియోగిస్తారు. అందువల్ల ఇది పాయసం లాగా ద్రవ పదార్థం లాగా ఉంటుంది. వడ్డించటానికి గుంట గరిటెలు వాడవలసి వస్తుంది. ఈ పొంగలి లోకి మినప వడ అంతగా రుచించదు.

తమిళులు, కన్నడిగులు పొంగల్ అంటారు. ఆంధ్రులు పొంగలి అంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పొంగలి&oldid=2320668" నుండి వెలికితీశారు