ప్రకాష్ రాజ్

వికీపీడియా నుండి
(ప్రకాష్‌రాజ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రకాష్ రాజ్
Prakashraj Bhung.jpg
జననంప్రకాష్ రాజ్
మార్చి 26,1965
బెంగళూరు, కర్ణాటక
నివాస ప్రాంతంచెన్నై
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
పిల్లలుఒకరు

ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. [1] ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. [2]

బాల్యం[మార్చు]

ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.

కుటుంబం[మార్చు]

ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో రెండవ వివాహము చేసుకున్నాడు.[3]

పురస్కారాలు[మార్చు]

జాతీయ పురస్కారాలు[మార్చు]

ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.

నంది పురస్కారాలు[మార్చు]

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

తమిళం[మార్చు]

.కంచీవరం vinod yadav==

SINGAM 2012

మూలాలు[మార్చు]

  1. ఏప్రిల్ 19, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...
  2. http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Im-no-womanizer-Prakash-Raj/articleshow/5045579.cms
  3. http://timesofindia.indiatimes.com/articleshow/6129884.cms
  4. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.

బయటి లింకులు[మార్చు]