ప్రాసియోడిమియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాసియోడిమియం,  59Pr
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˌprzəˈdɪmiəm/[1] (PRAY-zee-ə-DIM-ee)
కనిపించే తీరుgrayish white
ఆవర్తన పట్టికలో ప్రాసియోడిమియం
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
-

Pr

Pa
సీరియంప్రాసియోడిమియంనియోడిమియం
పరమాణు సంఖ్య (Z)59
గ్రూపుgroup n/a
పీరియడ్పీరియడ్ 6
బ్లాక్f-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Xe] 4f3 6s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 21, 8, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1208 K ​(935 °C, ​1715 °F)
మరుగు స్థానం3793 K ​(3520 °C, ​6368 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)6.77 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు6.50 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
6.89 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
331 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ27.20 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1771 1973 (2227) (2571) (3054) (3779)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2 (mildly basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.13
పరమాణు వ్యాసార్థంempirical: 182 pm
సమయోజనీయ వ్యాసార్థం203±7 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంhexagonal
Hexagonal crystal structure for ప్రాసియోడిమియం
Speed of sound thin rod2280 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం(r.t.) (α, poly) 6.7 µm/(m·K)
ఉష్ణ వాహకత12.5 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం(r.t.) (α, poly)
0.700 µ Ω·m
అయస్కాంత క్రమంparamagnetic[2]
యంగ్ గుణకం(α form) 37.3 GPa
షేర్ గుణకం(α form) 14.8 GPa
బల్క్ గుణకం(α form) 28.8 GPa
పాయిసన్ నిష్పత్తి(α form) 0.281
వికర్స్ కఠినత్వం400 MPa
బ్రినెల్ కఠినత్వం481 MPa
CAS సంఖ్య7440-10-0
చరిత్ర
ఆవిష్కరణCarl Auer von Welsbach (1885)
ప్రాసియోడిమియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
141Pr 100% - (SF) <48.450
142Pr syn 19.12 h β 2.162 142Nd
ε 0.745 142Ce
143Pr syn 13.57 d β 0.934 143Nd
Decay modes in parentheses have been predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

ప్రాసియోడిమియం (Pr) పరమాణు సంఖ్య 59 కలిగిన రసాయన మూలకం. ఇది లాంతనైడ్ సిరీస్‌లో మూడవది. అరుదైన-భూ లోహాలలో ఒకటి. ఇది మెత్తటి, వెండి రంగులో ఉండే, సున్నితమైన, సాగే లోహం. దాని అయస్కాంత, విద్యుత్, రసాయన, ఆప్టికల్ లక్షణాలకు గాను ఇది విలువైనది. ఇది చాలా రియాక్టివ్‌గా ఉండడం వలన స్వస్వరూపంలో లభించదు. స్వచ్ఛమైన ప్రాసోడైమియం లోహం గాలికి గురైనప్పుడు నెమ్మదిగా ఆకుపచ్చ ఆక్సైడ్ పూత ఏర్పడుతుంది.

ప్రాసియోడిమియం ఎల్లప్పుడూ ఇతర అరుదైన-భూ లోహాలతో కలిసి సహజంగా సంభవిస్తుంది. ఇది ఆరవ-అత్యంత సమృద్ధిగా ఉన్న అరుదైన-భూమూలకం, నాల్గవ-అత్యంత సమృద్ధిగా ఉన్న లాంతనైడ్. ఇది భూమి పెంకులో మిలియన్‌కు 9.1 భాగాలు ఉంటుంది. ఇది బోరాన్‌తో సమానమైన సమృద్ధి. 1841లో, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త కార్ల్ గుస్తావ్ మొసాండర్ అరుదైన-భూ ఆక్సైడ్ అవశేషాన్ని వెలికితీసాడు. అతను దాన్ని డిడిమియం అన్నాడు. ఆ అవశేషాన్ని సిరియం లవణాల నుండి వేరు చేశాడు. 1885లో, ఆస్ట్రియన్ రసాయన శాస్త్రవేత్త బారన్ కార్ల్ ఔర్ వాన్ వెల్స్‌బాచ్ డిడిమియమ్‌ను రెండు మూలకాలుగా విభజించి, వాటికి ప్రసియోడిమియం, నియోడిమియం అని పేర్లు పెట్టాడు. ప్రసియోడిమియం అనే పేరు ప్రాచీన గ్రీకు నుండి వచ్చింది.

చాలా అరుదైన-భూ మూలకాల వలె, ప్రాసియోడిమియం చాలా సులభంగా +3 ఆక్సీకరణ స్థితిని ఏర్పరుస్తుంది, ఇది సజల ద్రావణంలో మాత్రమే స్థిరమైన స్థితిలో ఉంటుంది. అయితే కొన్ని ఘన సమ్మేళనాలలో +4 ఆక్సీకరణ స్థితి, ప్రత్యేకంగా లాంతనైడ్‌లలో, మాతృక-ఐసోలేషన్ పరిస్థితులలో +5 ఆక్సీకరణ స్థితిని సాధించవచ్చు. 0, +1, +2 ఆక్సీకరణ స్థితులు చాలా అరుదుగా కనిపిస్తాయి. సజల ప్రాసియోడిమియం అయాన్లు పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అదే విధంగా, ప్రాసియోడిమియంను గ్రాస్‌లలో చేర్చినప్పుడు పసుపు-ఆకుపచ్చ రంగు యొక్క వివిధ షేడ్స్‌లో ఉంటుంది. ప్రాసియోడిమియం యొక్క అనేక పారిశ్రామిక ఉపయోగాల్లో కాంతి వనరుల నుండి పసుపు కాంతిని ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

లక్షణాలు[మార్చు]

భౌతిక లక్షణాలు[మార్చు]

ప్రాసియోడిమియం లాంతనైడ్ సిరీస్‌లో మూడవది. అరుదైన-భూ లోహం.ఆవర్తన పట్టికలో, సెరియం కు కుడివైపున, నియోడైమియం కు ఎడమవైపున, ఆక్టినైడ్ ప్రొటాక్టినియంకు పైన కనిపిస్తుంది. ఇది వెండితో పోల్చదగిన కాఠిన్యంతో సాగే గుణం గల లోహం. [4] దీని 59 ఎలక్ట్రాన్లు ఆకృతీకరణ [Xe]4f36s2 లో అమర్చబడి ఉంటాయి; సిద్ధాంతపరంగా, మొత్తం ఐదు బయటి ఎలక్ట్రాన్‌లు వాలెన్స్ ఎలక్ట్రాన్‌లుగా పనిచేస్తాయి, అయితే మొత్తం ఐదింటినీ వాడాలంటే తీవ్రమైన పరిస్థితులు అవసరం. సాధారణంగా, ప్రాసియోడిమియం దాని సమ్మేళనాలలో మూడు లేదా కొన్నిసార్లు నాలుగు ఎలక్ట్రాన్‌లను మాత్రమే ఇస్తుంది. [5]

లాంతనైడ్ శ్రేణిలోని చాలా ఇతర లోహాల మాదిరిగానే, ప్రాసియోడిమియం సాధారణంగా మూడు ఎలక్ట్రాన్‌లను వాలెన్స్ ఎలక్ట్రాన్‌లుగా ఉపయోగిస్తుంది. తర్వాత మిగిలిన 4f ఎలక్ట్రాన్‌లు చాలా బలంగా కట్టుబడి ఉంటాయి: ఎందుకంటే 4f కక్ష్యలు ఎలక్ట్రాన్‌ల జడ జినాన్ కోర్ ద్వారా కేంద్రకంలోకి చొచ్చుకుపోతాయి. అయితే, ప్రాసియోడిమియం నాల్గవ అప్పుడప్పుడు ఐదవ వాలెన్స్ ఎలక్ట్రాన్‌ను కోల్పోవడం కూడా జరుగుతుంది. లాంతనైడ్ సిరీస్‌లో చాలా ముందుగానే ఉండే ఈ మూలకానికి అణు ఛార్జ్ ఇంకా 4f సబ్‌షెల్ శక్తి మరింత వాలెన్స్ ఎలక్ట్రాన్‌లను తొలగించడానికి వీలైనంత తక్కువగా ఉంటుంది [6] అందువలన, ఇతర ప్రారంభ ట్రివాలెంట్ లాంతనైడ్‌ల మాదిరిగానే, ప్రాసియోడిమియం గది ఉష్ణోగ్రత వద్ద డబుల్ షట్కోణ క్లోజ్-ప్యాక్డ్ క్రిస్టల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సుమారు 560 °C వద్ద ఇది ఫేస్ సెంటర్‌డ్ క్యూబిక్ నిర్మాణానికి పరివర్తన చెందుతుంది. ద్రవీభవన స్థానం 935 °C కంటే కొంచెం ముందు బాడీ సెంటర్‌డ్ క్యూబిక్ నిర్మాణం కనిపిస్తుంది. [7]


ప్రాసియోడిమియం, అన్ని లాంతనైడ్‌ల వలె ( లాంథనమ్, యెటర్‌బియం, లుటెటియం మినహా), గది ఉష్ణోగ్రత వద్ద అర్ధ అయస్కాంతం. [8] తక్కువ ఉష్ణోగ్రతల వద్ద యాంటీఫెరోమాగ్నెటిక్ లేదా ఫెర్రో అయస్కాంత లక్షణాలను చూపే కొన్ని ఇతర అరుదైన-భూ లోహాల మాదిరిగా కాకుండా ప్రాసోడైమియం, 1 కెల్విన్‌ కంటే పైన అన్ని ఉష్ణోగ్రతల వద్దా అర్ధ అయస్కాంతంగానే ఉంటుంది.

ఐసోటోపులు[మార్చు]

ప్రాసియోడిమియంకు ఒకే ఒక స్థిరమైన, సహజంగా సంభవించే ఐసోటోప్‌ 141Pr ఉంది. ఇది ఒక మోనోన్యూక్లిడిక్, మోనోఐసోటోపిక్ మూలకం. దాని ప్రామాణిక పరమాణు బరువును అధిక ఖచ్చితత్వంతో నిర్ణయించవచ్చు -ఇది ప్రకృతి స్థిరాంకం కాబట్టి. ఈ ఐసోటోప్‌లో 82 న్యూట్రాన్‌లు ఉన్నాయి, ఇది అదనపు స్థిరత్వాన్ని అందించే మేజిక్ సంఖ్య. ఈ ఐసోటోప్ s-, r- ప్రక్రియల ద్వారా నక్షత్రాలలో ఉత్పత్తి అవుతుంది. [9]

38 ఇతర రేడియో ఐసోటోప్‌లు సంశ్లేషణ చేయబడ్డాయి. ఈ ఐసోటోపులన్నీ ఒక రోజులోపు (చాలా వరకు ఒక నిమిషంలోపు) అర్ధ జీవితాలను కలిగి ఉంటాయి, 143Pr ఒక్కటే మినహాయింపు - 13.6 రోజుల అర్ధ జీవితం.చ్143Pr, 141Pr రెండూ యురేనియం యొక్క విచ్ఛిత్తి ఉత్పత్తులుగా సంభవిస్తాయి. 141Pr కంటే తేలికైన ఐసోటోప్‌ల యొక్క ప్రాధమిక క్షయ విధానం పాజిట్రాన్ ఉద్గారాలు లేదా సిరియం యొక్క ఐసోటోప్‌లకు ఎలక్ట్రాన్ కాప్చర్. అయితే భారీ ఐసోటోప్‌లు, నియోడైమియం ఐసోటోప్‌లకు బీటా క్షయం చెందుతాయి.

రసాయన లక్షణాలు[మార్చు]

ప్రాసియోడిమియం లోహం గాలిలో నెమ్మదిగా మసకబారుతుంది. ఇనుప తుప్పులాగా పచ్చి ఆక్సైడ్ పొరను ఏర్పరుస్తుంది; ప్రాసియోడిమియం లోహపు సెంటీమీటర్-పరిమాణ నమూనా దాదాపు ఒక సంవత్సరంలో పూర్తిగా క్షీణిస్తుంది. [10] ఇది 150 °C వద్ద వెంటనే మండిపోయి, ప్రాసియోడిమియం(III,IV) ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. ఇది Pr6O11 కి దాదాపుగా సరిపోయే నాన్‌స్టోయికియోమెట్రిక్ సమ్మేళనం : [11]

12 Pr + 11 O 2 → 2 Pr 6 O 11

ప్రాసియోడిమియం ఒక ఎలెక్ట్రోపోజిటివ్ మూలకం. చల్లటి నీటితో నెమ్మదిగాను, వేడి నీటితో చాలా వేగంగానూ చర్య జరిపి ప్రాసోడైమియం(III) హైడ్రాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది: [12]

2 Pr (s) + 6 H 2 O (l) → 2 Pr(OH) 3 (aq) + 3 H 2 (g)

ప్రాసియోడిమియం లోహం అన్ని స్థిరమైన హాలోజన్‌లతో చర్య జరిపి ట్రైహాలైడ్‌లను ఏర్పరుస్తుంది: [13]

2 Pr (s) + 3 F 2 (g) → 2 PrF 3 (s) [ఆకుపచ్చ]
2 Pr (s) + 3 Cl 2 (g) → 2 PrCl 3 (s) [ఆకుపచ్చ]
2 Pr (లు) + 3 Br 2 (g) → 2 PrBr 3 (లు) [ఆకుపచ్చ]
2 Pr (లు) + 3 I 2 (g) → 2 PrI 3 (లు)

ప్రాసియోడిమియం పలుచన సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సులభంగా కరిగిపోయి, [Pr(H2O)9]3+ కాంప్లెక్స్‌లుగా ఉన్న చార్ట్‌రూస్ Pr3+ అయాన్‌లను కలిగి ఉండే ద్రావణాలను ఏర్పరుస్తుంది : [14] [15]

2 Pr (s) + 3 H 2 SO 4 (aq) → 2 Pr 3+ (aq) + 3 SO2−
4
</br> SO2−
4
(aq) + 3 H 2 (g)

లభ్యత, ఉత్పత్తి[మార్చు]

ప్రాసియోడిమియం చాలా అరుదైనదేమీ కాదు. ఇది అరుదైన-భూ లోహాలలో ఉన్నప్పటికీ, భూమి పెంకులో 9.2 mg/kg ఉంటుంది. ఈ విలువ థోరియం విలువకు (9.6 mg/kg), సమారియం విలువకూ (7.05 mg/kg) మధ్య ఉంటుంది. ప్రాసియోడిమియం లాంతనైడ్‌లలో నాల్గవ అత్యంత సమృద్ధిగా, సిరియం (66.5) mg/kg), నియోడైమియం (41.5 mg/kg), లాంతనమ్ (39 mg/kg) ల తరువాత ఉంటుంది. ఇది అరుదైన-భూ మూలకాలైన యట్రియం (33 mg/kg), స్కాండియం (22 mg/kg) ల కంటే తక్కువ సమృద్ధిగా ఉంది. [16] ప్రాసోడైమియం కలిగి ఉండే సున్నం, మెగ్నీషియా వంటి "సాధారణ భూ సమ్మేళనాల" కంటే అరుదైన కారణంగా ప్రాసోడైమియంకు అరుదైన-భూ లోహం అనే వర్గీకరణ వచ్చింది. [17] ప్రత్యేకించి అరుదైనది కానప్పటికీ, ప్రాసోడైమియం-ఉండే ఖనిజాలలో ప్రాసియోడిమియం ఎప్పుడూ ఆధిపత్య స్థాయిలో ఉండదు. ఇది ఎల్లప్పుడూ సిరియం, లాంతనమ్‌ నియోడైమియమ్‌ లకు వెనక ఉంటుంది. [18]

ఉపయోగాలు[మార్చు]

లియో మోజర్ 1920ల చివరలో గాజు రంగులో ప్రాసోడైమియం వాడకాన్ని పరిశోధించాడు. పసుపు-ఆకుపచ్చ గాజుకు "ప్రాసెమిట్" అని పేరు పెట్టాడు. అయితే, ఆ సమయంలో ఆ రంగును ఇచ్చే చాలా చౌకైన పదార్థాలుండేవి కాబట్టి ప్రాసెమిట్ ప్రజాదరణ పొందలేదు. మోసెర్ "హెలియోలైట్" గ్లాసును ఉత్పత్తి చేయడానికి నియోడైమియంతో ప్రసోడైమియమ్‌ను మిళితం చేశాడు. ఇది మరింత విస్తృతంగా ఆమోదం పొందింది. శుద్ధి చేయబడిన ప్రాసియోడిమియం యొక్క మొట్టమొదటి శాశ్వత వాణిజ్య ఉపయోగం, సిరామిక్స్ కోసం పసుపు-నారింజ "ప్రాసియోడిమియం ఎల్లో" స్టెయిన్ రూపంలో ఉంది. ఇది ఈనాటికీ వాదుకలో ఉంది. ఈ స్టెయిన్‌లో ఆకుపచ్చ రంగు లేదు; దీనికి విరుద్ధంగా, తగినంత అధిక లోడింగ్‌ల వద్ద, ప్రాసియోడిమియం గాజు స్వచ్ఛమైన పసుపు రంగులో కాకుండా స్పష్టంగా ఆకుపచ్చగా ఉంటుంది. [19]

లాంతనైడ్‌లు చాలా సారూప్యంగా ఉన్నందున, ప్రాసియోడిమియం చాలా ఇతర లాంతనైడ్‌లకు ప్రత్యామ్నాయంగా పనితీరును కోల్పోకుండా వాడవచ్చు. నిజానికి మిస్‌మెటల్, ఫెర్రోసెరియం మిశ్రమాలు వంటి అనేక అప్లికేషన్‌లలో అనేక లాంతనైడ్‌ల వేరియబుల్ మిక్స్‌లుంటాయి. వీటిలో చిన్న పరిమాణాల్లో ప్రాసోడైమియం కూడా ఉంటుంది. కింది ఆధునిక అనువర్తనాల్లో ప్రత్యేకంగా ప్రాసోడైమియం ఉంటుంది. లేదా లాంతనైడ్‌ల చిన్న ఉపసమితిలో కనీసస్థాయిలొ ఉంటుంది:

  • నియోడైమియంతో కలిపి, ప్రాసియోడిమియం అధిక-శక్తి అయస్కాంతాలను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. [20]
  • ప్రాసియోడిమియం- నికెల్ ఇంటర్‌మెటాలిక్ (PrNi5) బలమైన మాగ్నెటోకలోరిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఎంతంటే, సంపూర్ణ సున్నా డిగ్రీలో వెయ్యి వంతులోపు చేరుకోవడానికి వీలు కలిగింది. [21]
  • ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌లలో ఉపయోగించే అధిక-బలం కలిగిన లోహాలను రూపొందించడానికి మెగ్నీషియంతో మిశ్రమ ఏజెంట్‌గా వాడతారు.[22]
  • ప్రాసియోడిమియం ఫ్లోరైడ్ కార్బన్ ఆర్క్ లైట్లలో ప్రధాన భాగం. [21]
  • ప్రాసియోడిమియం సమ్మేళనాలు అద్దాలు, ఎనామెల్స్, సిరామిక్స్ లకు పసుపు రంగును అందిస్తాయి. [23] [24]
  • ప్రాసియోడిమియం అనేది డిడిమియం గ్లాస్‌లోని ఒక భాగం. కొన్ని రకాల వెల్డర్లు, గ్లాస్ బ్లోవర్స్ గాగుల్స్‌ను తయారు చేయడానికి దీన్ని వాడతారు. [25]
  • సెరియా లేదా సెరియా-జిర్కోనియాతో కూడిన ఘన ద్రావణంలో ప్రాసెయోడైమియం ఆక్సైడ్ ఆక్సీకరణ ఉత్ప్రేరకం వలె ఉపయోగపడుతుంది. [26]

జీవ పాత్ర, జాగ్రత్తలు[మార్చు]

 

మెథైలాసిడిఫిలమ్ ఫ్యూమరియోలికం వంటి అగ్నిపర్వత బురదలో నివసించే కొన్ని మెథనోట్రోఫిక్ బాక్టీరియాకు ప్రారంభ లాంతనైడ్‌లు అవసరం అని కనుగొనబడింది: లాంతనమ్, సిరియం, ప్రాసియోడిమియం, నియోడైమియం దాదాపు సమానంగా ప్రభావవంతంగా ఉంటాయి. [27] [28] ప్రాసియోడిమియం ఇతర జీవులలో జీవసంబంధమైన పాత్ర లేదు. కానీ ఇది చాలా విషపూరితమైనది కాదు. జంతువులలోకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్ చేస్తే కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది, అయితే మానవులలో అరుదైన-భూ ఆక్సైడ్‌లను పీల్చడం వల్ల వచ్చే ప్రధాన దుష్ప్రభావాలు రేడియోధార్మిక థోరియం, యురేనియం మలినాల నుండి వస్తాయి.

మూలాలు[మార్చు]

  1. మూస:OED
  2. M. Jackson "Magnetism of Rare Earth" The IRM quarterly col. 10, No. 3, p. 1, 2000
  3. మూస:OED
  4. Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  5. Greenwood and Earnshaw, pp. 1232–5
  6. Greenwood and Earnshaw, pp. 1235–8
  7. "Phase Diagrams of the Elements", David A. Young, UCRL-51902 "Prepared for the U.S. Energy Research & Development Administration under contract No. W-7405-Eng-48".
  8. Cullity, B. D.; Graham, C. D. (2011). Introduction to Magnetic Materials. John Wiley & Sons. ISBN 978-1-118-21149-6.
  9. . "Abundance of the Elements in the Solar System". Archived 2011-10-21 at the Wayback Machine "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-10-21. Retrieved 2022-10-25.
  10. "Rare-Earth Metal Long Term Air Exposure Test". Retrieved 2009-08-08.
  11. "Chemical reactions of Praseodymium". Webelements. Retrieved 9 July 2016.
  12. "Chemical reactions of Praseodymium". Webelements. Retrieved 9 July 2016.
  13. "Chemical reactions of Praseodymium". Webelements. Retrieved 9 July 2016.
  14. "Chemical reactions of Praseodymium". Webelements. Retrieved 9 July 2016.
  15. Greenwood and Earnshaw, pp. 1242–4
  16. Greenwood and Earnshaw, p. 1229–32
  17. Patnaik, Pradyot. Handbook of Inorganic Chemical Compounds. pp. 444–446.
  18. Hudson Institute of Mineralogy (1993–2018). "Mindat.org". www.mindat.org. Retrieved 14 January 2018.
  19. (1942). "RARE EARTHS*".
  20. Rare Earth Elements 101 Archived 2013-11-22 at the Wayback Machine, IAMGOLD Corporation, April 2012, pp. 5, 7.
  21. 21.0 21.1 Emsley, pp. 423–5
  22. Error on call to Template:cite paper: Parameter title must be specified
  23. Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  24. McGill, Ian. "Rare Earth Elements". Ullmann's Encyclopedia of Industrial Chemistry. Vol. 31. Weinheim: Wiley-VCH. p. 183–227. doi:10.1002/14356007.a22_607.
  25. Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  26. Error on call to Template:cite paper: Parameter title must be specified
  27. Error on call to Template:cite paper: Parameter title must be specified
  28. Kang, L., Shen, Z. & Jin, C. Neodymium cations Nd3+ were transported to the interior of Euglena gracilis 277.