బంతి పూల నూనె

వికీపీడియా నుండి
(బంతిపువ్వు నూనె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

టగెటెస్
మేరి గోల్డ్(బంతిపువ్వు)
టగెటస్ ఎరెక్ట(Tagetes erecta,
ఆఫ్రికా మారిగోల్డ్
శాస్త్రీయ వర్గీకరణ
Synonyms
  • Diglossus Cass.
  • Enalcida Cass.
  • Solenotheca Nutt.
  • Vilobia Strother

బంతి పూల నూనె ఒక ఆవశ్యక నూనె.బంతిపూల/బంతిపువ్వు నూనె ఒక సుగంధ నూనె. బంతి పూల నూనె ఓషధీ గుణాలున్న ఆవశ్యక నూనె. బంతి పూలలలో ముద్ద బంతి, రేకు బంతి అంటు,దాదాపు 50 రకాలు వివిధరంగుల్లో సైజుల్లో ఉన్నాయి.బంతి పూలమొక్క కాంపోసిటే /ఆస్టరేసి కుటుంబానికి చెందినమొక్క. ఒకరకపు బంతి మొక్క వృక్షశాస్త్రపేరు టాగేటేస్ (Tagete)s గ్లాండులీఫెర (టాగేటేస్ మినుట).వ్యవహార భాషలో బంతి మొక్కను ఆంగ్లంలో మారిగోల్డ్, మెక్సికన్ మారి గోల్డ్, టాగేటేట్టే అని అంటారు.[1] కొన్ని సందర్భాలలో ట్రూ మెరిగోల్డ్ అనబడే (క్యాలెండుల అఫ్ఫీసినలిస్)గా బంతిని పొరబడుతుంటారు.ఈ నూనెను సుగంధం తైలంగా తక్కువ శాతం మంది ఉపయోగిస్తారు.ఎక్కువ మంది ఔషధంగా ముఖ్యంగా అంటు రోగాలు సంక్రమించకుండా,వ్యాప్తి చెందకుండా వుండుటకు వాడతారు.ప్రధానంగా weeping wounds, ఛాతీ నొప్పులకు పని చేయును.

బంతి పూల మొక్క[మార్చు]

ఆఫ్రికాలో ఈ చెట్టును కాకి బుష్ అంటారు. ఈ మొక్క ఫ్రాన్స్,ఉత్తర అమెరికాలలో కూడా పెంచ బడుతున్నది.మొక్క ఆకులు చీలి వుండి తేలికగా వుండి ముదురు ఆకుపచ్చ రంగులో వుండును.పువ్వు పలు రెక్కలను /రేకులను గుత్తిగా కల్గి వుండును. మొక్క ఆకులు, పూలు క్రిమి వికర్షణ గుణాన్ని కల్గి ఉన్నాయి.అందుకే దోమలను ఈగ లను పారద్రోలాటానికి కొన్ని ప్రాంతాలలో మొక్కలను వ్రేలాడ దీస్తారు.దక్షిణ ఆఫ్రికాలో బోయర్ యుద్ధం తరువాత ఆస్ట్రేలియా సైనికులు బంతి మొక్కను వాళ్ళ దేశానికి తీసుకెళ్ళారు.అక్కడ ఈ మొక్క బాగా వ్యాప్తి చెందినది.[1]

భారత దేశంలో బంతి మొక్క సాగు/పెంపకం[మార్చు]

ఆనాదిగా భారతదేశంలో బంతి పువ్వు మొక్క భాగాలను కీళ్లనొప్పులు,జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు, అల్సరులు,, కంటి జబ్బుల నివారణకు వాడుతున్నారు.బంతి మొక్క భారత దేశమందట పెరుగుతున్నది.దీనిని ఎక్కువ అలంకరణ మొక్కగా పెంచుతున్నారు. పూలను ప్రధానంగా అలంకరణకు, పూల దండల తయారీలో, దేవతార్చనలో భారతదేశంలో ఉపయోగిస్తున్నారు.బంతి పూల నూనెను ఎక్కువగా సుగంధ తైలంగా వాడతారు. బంతిమొక్క మూల జన్మస్థానం మెక్సికో,తరువాత అక్కడి నుండి అమెరికాలోని వెచ్చని వాతావరణ ప్రాంతాలకు వ్యాపించింది.భారత దేశానికి ఈ మొక్క పోర్చుగీసు వారిచే తేబడింది. బంతిలోని పలు రకాలు, తోటలలో అలంకరణ మొక్కలుగా పెంచబడినవి. బంతిపూవు మొక్కలలోలో దాదాపు 33 రకాలు (జాతులు) ఉన్నాయి. ఇందులో ఐదు రకాలు భారత దేశతోటల్లో విస్తారంగా పెంచబడినవి. టగేటీస్ ఎరెక్టా (ఆఫ్రికన్ మేరి/మారిగోల్డ్), టగేటీస్ మినుట (టగేటీస్ గ్లాండులీఫెర), టగేటీస్ పాటుల (ఫ్రెంచి మేరిగోల్డ్), టగేటీస్ లూసిడా (స్వీట్ సెంటెడ్ మేరిగోల్డ్), టగేటీస్ టెన్యూఫోలియా (స్ట్రిపెడ్ మేరిగోల్డ్) రకాలు.బంతి పూలమొక్క భాగాలను పలురకాల మందుల్లో ఓషధిగా ఉపయోగిస్తారు. టగేటీస్ మినుట (టగేటీస్ గ్లాండులీఫెర) మొక్కపూలనుండి తీసిన ఆవశ్యకనూనెను మిగతా బంతి రకాల నూనె కన్న ఉత్తమైన నూనెగా భావిస్తారు.టగేటీస్ మినుట (టగేటీస్ గ్లాండులీఫెర) నూనె మిగతా నూనెలకన్నా ఎక్కుబ గాఢత, సువాసన వున్న నూనె.[2]

నూనె సంగ్రహణ[మార్చు]

మొక్క పువ్వుల నుండియే కాకుండా ఆకులు, రెమ్మల,పూలకాడల నుండి కూడా నూనెను ఆవిరి డిస్టిలేసను పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.[1]

నూనె[మార్చు]

నూనెలోని రసాయనాలు
నూనెలోని రసాయనాలు
నూనెలోని రసాయనాలు

నూనె బలమైన తియ్యని,సిట్రస్ వంటి వాసన వున్న నూనె.పసుపు నుండి ఎరుపుతో కూడిన జేగురు రంగు కల్గి వుండును.మధ్యస్తాయి స్నిగ్థత కల్గి ఉంది.ఎక్కువ కాలం గాలికి గురైన చిక్కగా లేదా జెల్ లా మారును. బంతి నూనెలో చాలా రసాయన సమ్మేళనాలు వున్నప్పటికి టాజెటోన్, లిమోనెన్,వలేరిక్ ఆమ్లం,ఓసీమెన్‌లు ప్రధాన రసాయన పదార్థాలు.కీటోనుల ఎక్కువ శాతంలో కల్గి వుండును.[1] బంతిమొక్క పెరిగిన ప్రదేశం, మొక్కరకాన్నిబట్టి నూనెలోని రసాయన పదార్థాల సంఖ్య,పరిమాణం మారును.కొన్నింటిలో ఒక రకం మొక్క నూనెలో వున్న రసాయనాలు మరో రకం /జాతి మొక్క నూనెలో వుండక పోవచ్చును.అరేబియా దేశంలోని టగేటీస్ మినుట రకం మొక్క నూనెలో టెగెటోన్ 11.52%, 5-ఆక్టైన్-4 -1,2,7-డై మిథైల్ 11.52%,ప్రోపేన్ డినిట్రిల్,డై సైక్లోహెక్సైల్ 10.45%,, 2-పైనేన్-4-18.3% పరిమాణంలో ఉండగా,తక్కువ ప్రమాణంలో 1-ఏసీటోక్సీ-p-మెంథ్-3-1 (0.17%), 9-ఆక్టాసేనమైడ్ (Z) (0.48%) వునట్లు గ్యాస్ క్రోమాటోగ్రపీ, మాస్ స్ప్రేక్ఱోస్కోపి ద్వారా విశ్లేషించి లెక్కించారు.[3]

నూనెలోని రసాయన సమ్మేళనాల వివరాలు[మార్చు]

ఈశాన్య హిమాలయలప్రాంతంలోని టగెటెస్ మినుట రకపు మొక్కనుండి తీసిన నూనెలో 20 రకాల రసాయన పదార్థాలు వున్నట్లు గుర్తించారు.అందులో ప్రధానమైనవి (Z)-β-ఓసిమేన్ (39.44%),డైహైడ్రో టజెటోన్ (15.43%), (Z)- టాగెటోన్ (8.78%), (E) -ఒసిమెనోన్ (14.83%), (Z)-ఒసిమెనోన్ (9.15%).[4] టగెటెస్ గ్లాండులిఫెర (tagetes glandulifera) మొక్క పూలు, ఆకులు, మొక్క యొక్క అడుగు భాగాల నుండి తీసిన నూనెలో డై హైడ్రోటాజెటోన్ 47.05%, ట్రాన్స్ బిటా ఒసిమేన్ 21%, ట్రాన్స్-టాజెటోన్ 7.49%. ప్రధానంగా ఉన్నాయి.[5] బ్రెజిల్*లో సేకరించిన టగేటీస్ ఎరెక్టa మొక్క నూనెలో 27 రకాల రసాయనాలను గుర్తించారు. అందులో ప్రధానమైనవి టెర్పినోలిన్ (12.4%), (E)-ఓసీమెన్ (13.1%), పిపేరిటోన్ (20%), లిమోనేన్ (11%), ఇండోల్ తక్కువ ప్రమాణంలో ఉన్నాయి. టగేటీస్ లూసిడా నూనెలో లినలూల్, ఎస్డ్రాగోల్,, మైథైల్ యూజెనోల్ ప్రధానముగా ఉన్నాయి. టగేటీస్ అర్జెంటీనా మొక్క నూనెలో ప్రధానముగా ( Z) ఓసిమేన్ (43.62-45.59%), (E) ఓసీమేన్ (37.29-40.38%)వున్నవి.[3] టగేటీస్ మినుట ఆకుల నుండి తీసిన నూనెలో d-లిమోనెన్,ఓసీమెన్,బి-మైరెసేన్అర్మా డెన్డ్రెన్,,1- లినలూల్,లినలైల్ అసిటేట్,లినలూల్ మోనాక్సైడ్,d-కార్వోన్,టగెటోన్,1:8 సినోల్,, సలిసైల్ అల్డిహైడ్^లను కల్గి ఉంది. టగేటీస్ మినుట ఆకుల నుండి తీసిన నూనెలో d-లిమోనెన్,ఓసీమెన్,బి-మైరెసేన్అర్మా డెన్డ్రెన్,1- లినలూల్,లినలైల్ అసిటేట్, లినలూల్ మోనాక్సైడ్, d-కార్వోన్, టగెటోన్, 1:8 సినోల్,, సలిసైల్ అల్డిహైడ్ లను కల్గి ఉంది. టగేటీస్ ఎరెక్టా ఆకుల నూనెలో d-లిమోనెన్, ఆల్ఫా పైనేన్, బీటా పైనేన్, డై పెంటెన్, ఓసీమెన్, బీటా పెల్లాన్ద్తెన్, లినలూల్, జెరేనియోల్, మెంతోల్, టగెటోన్, నోననల్, లినలైల్ ఆసీటేట్ లను కల్గి ఉంది.వాటితో పాటు అదనంగా కాంపెన్,సబినెన్,మైర్సేన్, (z)-b ఓసీమెన్, (E)-b- ఓసీమెన్,యే-టెర్పినేన్,టెర్పీనోలెన్, p-మెంథ-1,3,8-ట్రైఎన్, టెర్పినేన్-4-ఓల్,ప-సైమెన్ -9-ఓల్, పైపెరిటోన్, తైమోల్, ఇండోల్, కర్వాక్రోల్, పైపెరిటోనేన్, గెరానైల్ ఆసీటేట్, బీటా ఏలేమేన్, సైపరెన్,బీటా కారియోపిల్లేన్, (E)-b-ఫార్నేసేన్, y-ముర్రోలెన్, y-ఏలేమేన్,, నేరోలిడోల్&ను కల్గి ఉంది.టగేటీస్ ఎరెక్టా ఆకుల నూనెలో మొత్తం 44 రకాల రసాయనాలు వున్నట్లు గుర్తించారు.టగేటీస్ ఎరెక్టా (ఏ‌ఏ‌ఎఫ్‌ఆర్‌ఐకేి‌ఏ‌ఎన్ మెరిగోల్డ్)పూల నూనెలో మొదట d-లిమోనెన్, ఓసీమెన్1-లినైల్ ఆసిటెట్,1-లినలూల్,టాజేటోన్,, n-నోనైల్ అల్డిహైడ్ లు ప్రధానంగా వున్న రసాయనాలుగా గుర్తించారు.తరువాత పరిశోధనలో ఆరోమా డెన్డ్రేన్,పైనైల్ ఇథైల్ ఆల్కహాల్, సలిసైల్ అల్డిహైడ్, పెనాల్ ఆసిటా అల్డిహైడ్,, 2-హెక్సేన్-1-అల్,యుడేస్మోల్,, గుర్తింపబడని కార్బోనైల్ రసాయనాలు వున్నట్లు గుర్తించారు.[2] ఆరు బంతిరకాల్లో 35 రకాల రసాయనాలు వున్నట్లు గుర్తించారు. అందులో నాలుగు రకాలైన టగేటీస్ ఎరెక్టా, టగేటీస్ మినుట, టగేటీస్ పటుల,, టగేటీస్ టెన్యూ ఫోలియా ఇంచు మించూ ఒకే రకమైన రసాయనాలు ఉన్నాయి. టగేటీస్ స్టెర్ను ఫోలియా మొక్క భాగాల్లో (వేర్లు మినహాయించి)65 రసాయనాలు ఉన్నాయి. అందులో ప్రదానమైనవి టగెటోనెస్, ఓసిమెన్స్, ఓసిమోనెన్స్, (E)-b- ఓసిమెన్,ట్రాన్స్ టజేటోన్, లిమోనేన్, ఇసో మేంథోన్, స్పతులేనోల్, సీస్-అనెథోల్,, ట్రాస్‌అనథోలులు. ఎండబెట్టిన టగెటస్ మినుట మొక్కలో ట్రాన్స్ –ఓసిమోనెన్, సీస్-ఓసీమేన్, డై హైడ్రో టజేటోన్,, సీస్- టజేటోన్ ఎక్కువ ప్రమాణంలో ఉన్నాయి. (Hadjiakhoondi et al., 2008). ఎండబెట్టిన టగెటస్ మినుట పళ్లలో (Z)-b- ఓసీమేన్, (Z)- టజెటోన్, (Z)- టజెటోనేన్,, (E)- టజెటోనేన్ ఎక్కువ పరిమాణంలో వున్నవి (Kaul et al.2005).[2]

భౌతిక ధర్మాలు[మార్చు]

దక్షీణ ఆఫ్రికాలోని టగేటీస్ మినుట మొక్క నుండి తీసిన నూనె యొక్క భౌతిక గుణాలు

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 సాంద్రత, 20Cవద్ద 0.837-0.985
2 వక్రీభవన సూచిక 1.425-1.528
3 భాస్పీభవన ఉష్ణోగ్రత 180C
4 ఫ్లాష్ పాయింట్ 59C
5 ద్రావణీయత నీటిలో కరుగదు
5 దృశ్య భ్రమణం -15 నుండి 5

నూనె వైద్యపరమైన గుణాలు[మార్చు]

యాంటి ఇన్ఫెక్సియస్ (anti-infectious=అంటువ్యాధి సంక్రమణ నిరోధంగా).సూక్మజీవులు/క్రిముల నాశనిగా,యాంటి భయాటిక్ (సూక్ష్మజీవ నిరోధకం)గా,పరానజీవి నాశని,కందరాల నొప్పుల నివారకం,, యాంటి సెప్టిక్ ఔషధ గుణాలను బంతి పూలనూనె కల్గి ఉంది.

నూనె ఉపయోగాలు[మార్చు]

  • ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
  • లావెండరు,లెమన్,జాస్మిన్ వంటి నూనెలతో మిశ్రమం చెసి సుగంధ తైలంగా ఔషధంగా ఉపయోగిస్తారు.
  • మర్ధన నూనెల్లో,లోషన్లు,, బాత్ ఆయిల్స్ లలో ఉపయోగిస్తారు.
  • మానసిక వ్యాకులత (depression)తగ్గించును.
  • టగేటీస్ ఎరెక్టానూనె antihaemorrhagic,యాంటి ఇంఫ్లమేటరి,యాంటి సెప్టిక్,కండరసంకోచ/ ముకుళన నిరోధక,కణ జాలాన్ని, కండరాలను కుంచింపజేసే ఔషధంగా,చమట పుట్టించే మందుగా, పనిచేయును.అరోమాథెరపీలో కూడా ఉపయోగిస్తారు.రుతుస్రావన్ని క్రమపరచును,[2]

నూనె వినియోగంలో జాగ్రత్తలు[మార్చు]

బంతి నూనె ఎక్కువ గాఢత వున్న నూనె కావున తగు జాగ్రత్తలు తీసుకుని వాడవలెను. ముఖ్యంగా గర్భవతిగా వున్న వారు వాడరాదు.అలాగే సెన్సిటివ్ చర్మ గుణమున్న వారు వాడరాదు.సున్నితమైన చర్మ తత్వమున్న వారు వాడిన వెలుతురుకు చర్మము పై విష ప్రభావం చూపును.[1]

బయటి విడియో లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Tagetes essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-03-08. Retrieved 2018-09-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 2.3 "Marigold" (PDF). applications.emro.who.int. Archived from the original on 2017-10-13. Retrieved 2018-09-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "CHEMICAL COMPOSITION OF THE ESSENTIAL OIL OF TAGETES MINUTA GROWING IN SAUDI ARABIA". citeseerx.ist.psu.edu. Retrieved 2018-09-25.
  4. "Chemical Composition of Tagetes minuta L. Oil from Himachal Pradesh (India)". researchgate.net. Retrieved 2018-08-19.
  5. "Tagetes Oil-Indian". indiamart.com. Archived from the original on 2018-09-19. Retrieved 2018-09-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)