ఆలీ (నటుడు)
అలీ | |
---|---|
జననం | మహమ్మద్ అలీ 1968 అక్టోబరు 10 రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | జుబేదా |
పిల్లలు | ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా |
తల్లిదండ్రులు | ఆబ్దుల్ సుభాన్ అలియాస్ మహమ్మద్ భాష, జైతున్ బీబీ |
పురస్కారాలు | నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారము |
ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత.[1] 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు.[2] ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.[3][4] ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు.
నేపథ్యము
[మార్చు]ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు.[ఆధారం చూపాలి] తండ్రి అబ్దుల్ సుభాన్ (మహమ్మద్ బాషా అని పిలిచేవారు) దర్జీ పని చేసేవాడు.[1] తల్లి జైతున్ బీబీ గృహిణి.[5] ఆలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా, డ్యాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మవీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడినుండి వేరే ప్రాంతానికి మారారు.[6]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఈ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్ళాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రంద్వారా అవకాశం కల్పించాడు. ఈ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.[7]
కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]ఆలీ నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాల జాబితా.
- సీతాకోక చిలుక (1981)
- రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
- మాయలోడు (1993)
- అమ్మాయి కాపురం (1994)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- హలో బ్రదర్ (1994)
- యమలీల (1994)
- ముద్దుల ప్రియుడు (1994)
- ఘటోత్కచుడు (1995)
- సాహసవీరుడు - సాగరకన్య (1996)[8]
- తొలిప్రేమ (1998)
- తమ్ముడు (1999)
- పాపే నా ప్రాణం (2000)
- ఖుషి (2001)
- అందాల ఓ చిలకా (2001)
- ప్రేమసందడి (2001)
- దేవీ పుత్రుడు (2001)
- ఆది (2002)
- ఇడియట్ (2002)
- శివమణి (2003)
- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- ఐతే ఏంటి (2004)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- శివ్ శంకర్ (2004)
- 143 (2004)[9][10]
- సూపర్ (2005)
- పోకిరి (2006)
- పెళ్ళైన కొత్తలో (2006)
- ఖతర్నాక్ (2006)
- దేశముదురు (2007)
- యమదొంగ (2007)
- చిరుత (2007)
- గుండమ్మగారి మనవడు (2007)
- కంత్రి (2008)
- హీరో (2008)
- శౌర్యం (2008)
- జల్సా (2008)
- ఆదివిష్ణు (2008)
- కిక్ (2009)
- పిస్తా (2009)
- శంఖం (2009)
- ఆలస్యం అమృతం (2010)
- వీడు తేడా (2011)
- గబ్బర్ సింగ్ (2012)
- నా ఇష్టం (2012)
- అయ్యారే (2012)
- అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ (2013)[11]
- అత్తారింటికి దారేది (2013)
- బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
- ఒక్కడినే (2013)
- యమలీల 2 (2014)
- గలాట (2014)[12]
- రేసుగుర్రం (2014)
- రోమియో (2014)[13]
- వినవయ్యా రామయ్యా (2015)
- సుప్రీమ్ (2016)
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)[14]
- ఖైదీ నం. 150 (2017)
- రోగ్(2017)
- రాధ (2017)
- జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)
- చాణక్య (2019)[15][16]
- 90ఎంల్ (2019)
- పండుగాడి ఫొటో స్టూడియో (2019)
- తెలంగాణ దేవుడు (2021)
- అందరూ బాగుండాలి అందులో నేనుండాలి (2021)
- లాయర్ విశ్వనాథ్ (2021)
- లెహరాయి (2022)
- అంటే సుందరానికి (2022)
- ఎస్5 నో ఎగ్జిట్ (2022)
- అల్లంత దూరాన (2023)
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)
- కథ వెనుక కథ (2023)
- పరారీ (2023)
- రామబాణం (2023)
- మిస్టర్ ప్రెగ్నెంట్ (2023)
- సౌండ్ పార్టీ (2023)
- యమధీర (2024)
- వి లవ్ బ్యాడ్ బాయ్స్ (2024)
- గీతాంజలి మళ్ళీ వచ్చింది (2024)
- హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (2024)
- డబుల్ ఇస్మార్ట్ (2024)
- బడ్డీ (2024)
- ఎర్రచీర - ది బిగినింగ్ (2024)
రాజకీయాలు
[మార్చు]1999 లో నటుడు మురళీమోహన్ తెలుగు దేశం పార్టీ సభ్యత్వం ఇప్పించాడు. అప్పుడు ఎన్నికల సమయంలో పలు నియోజక వర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాడు. 2019 మార్చి 11 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[17] ఆలీని 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[18] ఆలీ 2024 జూన్ 28న రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు.[19]
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఆలీ వివాహము జుబేదాతో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము. వీరికి ముగ్గురు సంతానము. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ బి. డి. ఎస్ విద్యార్థి. రెండో కుమార్తె జుబేరియా. కుమారుడు మహమ్మద్ బాషా. అలీ తమ్ముడు ఖయ్యూం అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.[3]
వ్యాపార ప్రకటనలు
[మార్చు]ఇతను చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాం కు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు.
టీవీ కార్యక్రమాలు
[మార్చు]1999 లో జెమిని టివి అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన ఆలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీ తో జాలీగా, ఆలీ తో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
పురస్కారాలు
[మార్చు]- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడి గా ఫిల్మ్ ఫేర్ పురస్కారం.
- సూపర్ (2005) సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం.[20]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఎర్రకోట, నర్సిమ్ (18 March 2018). "పది లక్షలు చాలని వస్తే వందకోట్లిచ్చారు". eenadu.net. ఈనాడు. Archived from the original on 19 March 2018. Retrieved 19 March 2018.
- ↑ "Telugu actor Ali dedicates doctorate honour to his father". ibnlive. Archived from the original on 2013-06-19. Retrieved 2013-05-23.
- ↑ 3.0 3.1 "Ali dedicates doctorate honor to his father". timesofindia.indiatimes.com. Times of India. 15 Jan 2017. Retrieved 20 March 2018.
- ↑ Kavirayani, Suresh (14 July 2014). "Family, friends, and prayer". deccanchronicle.com. Deccan Chronicle. Retrieved 20 March 2018.
- ↑ Sakshi (20 December 2019). "అలీకి మాతృవియోగం". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
- ↑ సితార, తారాతోరణం. "హాస్య కేళి ...అలీ". www.sitara.net. పి.వి.డి.ఎస్.ప్రకాష్. Retrieved 7 August 2020.[permanent dead link]
- ↑ Eenadu. "ఆర్నెల్లపాటు టీ.. బన్నుతోనే గడిపా! - EENADU". www.eenadu.net. Retrieved 2019-10-10.
- ↑ ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
- ↑ Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
- ↑ సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
- ↑ "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
- ↑ "వైకాపాలో చేరిన అలీ". ఈనాడు. న్యూస్ టుడే. 11 March 2019. Archived from the original on 11 March 2019.
- ↑ V6 Velugu (27 October 2022). "ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (28 June 2024). "రాజకీయాలకు అలీ గుడ్‌బై .. ఇకపై సినిమాలు చేసుకుంటా". Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.
- ↑ "Filmfare South awards 2006". idlebrain.com. 2006. Retrieved 20 March 2018.
బయటి లింకులు
[మార్చు]- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- 1968 జననాలు
- తెలుగు సినిమా హాస్యనటులు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా బాలనటులు
- జీవిస్తున్న ప్రజలు
- రాజమండ్రి
- తూర్పు గోదావరి జిల్లా టెలివిజన్ వ్యాఖ్యాతలు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా నటులు