ద్రాక్ష గింజల నూనె
ద్రాక్ష గింజల నూనె లేదా ద్రాక్ష నూనెను ద్రాక్ష పళ్ల గింజల నుండి ఉత్పత్తి చేస్తారు. వైన్ తయారీలో ద్రాక్ష గింజలు ఉపఉత్పత్తిగా లభిస్తాయి.ద్రాక్షగింజల్లో నూనె 8-10-20% వరకు ద్రాక్ష రకాన్ని, పెరిగిన ప్రదేశాన్ని బట్టి వుండును.ఒమేగా -6 ఫ్యాటి ఆమ్లం/కొవ్వు ఆమ్లంగా పిలువబడు లినోలిక్ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ద్రాక్ష గింజల నూనెలో ఉంది. ద్రాక్ష గింజల్లో ప్రో ఎంథోసైనైడ్ వంటి పాలీ పెనోల్స్ వున్నప్పటికి, గింజలనుండి తీసిన నూనెలో పెనోల్స్ లేవు.
ద్రాక్ష
[మార్చు]ద్రాక్ష (స్పానిష్, పోర్చుగీస్ Uvas, ఫ్రెంచ్ Raisins, ఆంగ్లం Grapes, జర్మన్ Trauben) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు,, వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని 'వైటికల్చర్' అంటారు. ద్రాక్ష పండులో గింజలు 5% వరకు ఉండును (Choi and Lee, 2009).ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి మూడు మిలియను టన్నుల గింజలు ఉత్పత్తి అగును, ముఖ్యంగా వైన్ ఉత్పత్తి మిల్లుల నుండి (Fernandes etal., 2012).కేవలం ఒక బల్గేరియాలోనే సంవత్సరానికి పది వేలనుండి 20 వేల టన్నుల వరకు విత్తనాలు ఉప ఉత్పత్తిగా వైన్ తయారీ మిల్లుల నుండి లభించును.ద్రాక్ష విత్తనాలు ప్రోటీను, కార్బో హైడ్రేట్ లు, నూనెను కల్గి ఉన్నాయి.ద్రాక్ష గింజల్లో ప్రోటీన్ 6-9% వరకు ఉంది.అలాగే నూనె కూడా 8-20% వరకు వున్నది (Ohnishi et al., 1990; Schuster, 1992; Baydar and Akkurt, 2001; Schieber et al., 2002; Luque-Rodriguez et al., 2005; Baydar et al., 2007;Martinello et al., 2007; Campos et al., 2008; Ahmadiand Siahsar, 2011; Canbay and Bardakçi, 2011; Sabiret al., 2012).[1]
- ద్రాక్ష గురించి ప్రత్యేక వ్యాసం ద్రాక్ష చూడండి
నూనె సంగ్రహణ
[మార్చు]నూనెను ప్రెస్సింగ్ ద్వారాలేదా సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ద్వారా ద్రాక్ష గింజల నుండి సంగ్రహించవచ్చును.ద్రాక్షగింజల్లో నూనె 8-10-20% వరకు ఉంది..ద్రాక్ష పళ్ల రకాలను బట్టి గింజల్లోని నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం,, టోకోపేరోల్స్ పరిమాణం మారును.ముఖ్యంగా లినోలిక్ ఆమ్లం శాతంలో హచ్చు తగ్గులు వుండును.
ద్రాక్ష గింజల నూనె
[మార్చు]లేత పసుపు రంగులో వుండును.అహార యోగ్యమైన నూనె.అరోమాథెరపిలో కారియరు/వాహక నూనెగా వాడుటకు సరైనది.ద్రాక్ష గింజల నూనె స్మోక్ పాయింట్ 216 °C వుండటం వలన ద్రాక్ష నూనెను వంత నూనెగా ఉపయోగించుటకు అనుకూలమైనది.ద్రాక్ష గింజల నూనెలో దాదాపు 20రకాల కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి ప్రధాన మైనవి 6రకాల కొవ్వు ఆమ్లాలు మాత్రమే మిగిలినవి నామమాత్రంగా 1% కన్నతక్కువ ప్రమాణంలో వుండును.నూనెలో అధిక సాతం బహు ద్విబంధ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.సంతృప్త కొవ్వూఆమ్లాలు తరువాత స్థానంలో ఉన్నాయి. ద్రాక్ష గింజల నూనెలో 0.8-1.5% వరకు ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు ఉన్నాయి.ఈ ఆన్ సపోనిఫియబుల్ పదార్థాల్లో పెనోల్లు (టోకోపెరోల్స్), స్టెరాయిడ్స్ (కాంపేస్టేరోల్, బెటా-సిటోస్టేరోల్, స్టిగ్మాస్టేరోల్) లు అధికంగా ఉన్నాయి.
నూనెలోని కొవ్వు ఆమ్లాలు
[మార్చు]నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఒమేగా-6 రకానికి చెందిన రెండు ద్విబంధాలున్న లినోలిక్ ఆమ్లం 65-70%వరకు ఉండూను.తరువాత ఏక ద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం15-18%వరకు వుండును.మూడు ద్విబంధాలున్న, ఒమేగా -3 రకానికి చెందిన లినోలినిక్ ఆమ్లం 0.1% వరకు అలాగే 16 కార్బనులున్న, ఏక ద్విబంధమున్న పామిటోలిక్ ఆమ్లం 1.0% కన్న తక్కువ వుండును. నూనెలోని ప్రధాన మైన కొన్ని కొవ్వు ఆమ్లాలను దిగువ పట్టికలో పొందుపర్చబడినవి.[1]
వరుస సంఖ్య | కొవ్వు ఆమ్లం | శాతం | కొవ్వు ఆమ్లం రకం |
1 | లినోలిక్ ఆమ్లం | 69.6% | ద్వి ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం |
2 | ఒలిక్ ఆమ్లం | 15.8% | ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం |
3 | పామిటిక్ ఆమ్లం | 7% | సంతృప్త కొవ్వు ఆమ్లం |
4 | స్టియరిక్ ఆమ్లం | 4% | సంతృప్త కొవ్వు ఆమ్లం |
5 | లీనోలినిక్ ఆమ్లం | 0.1 | త్రి ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం |
6 | పామిటోలిక్ ఆమ్లం | 1.0%కన్న తక్కువ | ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం |
నూనె ఉపయోగాలు
[మార్చు]- ద్రాక్ష గింజల నూనె స్మోక్ పాయింట్ 216 °C వుండటం వలన ద్రాక్ష నూనెను వంత నూనెగా ఉపయోగించుటకు యోగ్యమైనది.
- పాన్ కేక్స్, బేక్డ్ ఫుడ్స్ తయారీలో ఉపయోగించుటకు అనుకూలం
- లీనుస్ పౌలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒమేగా -6, -3 కొవ్వు ఆమ్లాలు చర్మం పై అనుకూల ప్రభావం చూపును. చర్మం యొక్క వెలుపలి, మధ్యపొరలను ఒమేగా -6 కొవ్వు ఆమ్లం మెరుగు పరచును.సంరక్ష్హించ్చును.ద్రాక్ష నూనెలోని లినోలిక్ ఆమ్లం ఒమేగా -6 రకానికి చెందిన కొవ్వు ఆమ్లం.[2]
- చర్మ పొరల్లో తేమను వృద్దిపరచును. చర్మరంగును తేలిక పరచును. మొటిమలను తగ్గించును.[2]
- చర్మ రంధ్రాలను గట్టి పరచును.గాయపు మచ్చలను తొలగించును.మేకప్ ను తొలగించుటకు ఉపయోగ పడును.కేశ వృద్ధికి తోడ్పడును.పాపిటిని/ నెత్తిచర్మం scalp మెరుగు పరచును.చుండ్రు వలన కల్గు ఇబ్బందులు తొలగించును.[2]
- ద్రాక్ష నూనెలోని లినోలేనిక్ ఆమ్లం కేశ వృద్దికి దోహద పడును బట్ట తల రావటాన్ని నివారించును.ఆరోమా తేరపిలో ద్రాక్ష నూనెను కారియర్ నూనె/వాహక నూనెగా ఉపయోగపడును.[2]
- ద్రాక్ష నూనెలో విటమిన్ E వున్నందున దేహం లోని ఇమ్యూన్ ను బలవర్థకం చేయును.క్యాన్సరు నిరోధకంగా పని చేయును.మతిమరుపు/అల్జీమరును వ్యాధి రాకను నిలువరించును.గాయాలు త్వరగా మానుటకు సహాయ పడును.[3]
- మంచి కొలెస్ట్రాల్ ను వృద్ధిపరచును.[3]
- జిడ్డు చర్మానికి స్వస్థి పలకాలనుకునే వారికి గ్రేప్ సీడ్ ఆయిల్ బెస్ట్ అప్షన్‌గా చెప్పుకో వచ్చు.అవును, గ్రేప్ సీడ్ ఆయిల్‌లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు చర్మంపై జిడ్డు ఉత్పత్తిని తగ్గించి ఫ్రెష్ లుక్‌ను అందిస్తాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Chemical composition of seeds of four Bulgarian grape varieties" (PDF). ctv-jve-journal.org. Archived from the original on 2018-07-21. Retrieved 2018-11-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 2.2 2.3 "The health and beauty benefits of grapeseed oil". medicalnewstoday.com. Archived from the original on 2018-01-06. Retrieved 2018-11-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 "9 Impressive Benefits Of Grapeseed Oil For Skin, Hair & Health". naturallivingideas.com. Archived from the original on 2018-10-07. Retrieved 2018-11-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)