2022 ← తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2023 → 2024
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు, అనేవి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ వివిధ కళాశాలల అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానిస్తారు.[1]
2023 విద్యాసంవత్సరానికి హెడ్ మాస్టర్ కేటగిరిలో 10 మంది, స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ/ పీజీటీ కేటగిరిలో 11 మంది, డైట్ లెక్చరర్ కేటగిరిలో ఒకరు, స్పెషల్ కేటగిరిలో 12 మంది టీచర్లు చొప్పున మొత్తం 54 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన రెండు వేర్వేరు జీవోలను 2023 సెప్టెంబరు 2న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీచేసింది.[2]
2023, సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి సభ్యులు సురభి వాణిదేవి, కూర రఘోత్తంరెడ్డి, ఏ.వీ.ఎన్. రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్.కె.మహమూద్, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర అధికారులు పాల్గొని ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.[3]