మల్లీశ్వరి (2004 సినిమా)

వికీపీడియా నుండి
(మల్లీశ్వరి(2004 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మల్లీశ్వరి
(2004 తెలుగు సినిమా)

ది ప్రిన్సెస్
దర్శకత్వం కె. విజయ భాస్కర్
నిర్మాణం డి.సురేష్ బాబు
రచన విజయ భాస్కర్
కథ త్రివిక్రమ్ శ్రీనివాస్
చిత్రానువాదం కె. విజయ భాస్కర్
తారాగణం నరేష్,
వెంకటేష్,
కత్రినా కైఫ్,
సునీల్,
కోట శ్రీనివాసరావు,
తనికెళ్ళ భరణి,
బ్రహ్మానందం,
గజాలా,
స్మిత
సంగీతం కోటి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్, శంకర్ మహదేవన్, సునీత, కె.ఎస్.చిత్ర, కార్తిక్, శ్రేయా ఘోషాల్
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
కూర్పు ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 18 ఫిబ్రవరి 2004
దేశం భారతదేశం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

[[వర్గం:2004_తెలుగు_సినిమాలు]]

మల్లీశ్వరి The Princess 2004లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తెలుగు కుటుంబకథా చిత్రం. దీనిలో వెంకటేష్, కత్రినా కైఫ్ ముఖ్యభూమికలను పోషించారు.కె. విజయ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సంగీతం కోటి అందించిన స్వరాలు వీనుల విందుగా ఉన్నాయి. ఫిబ్రవరి 18 ,2004 లో విడుదలై మంచి విజయం సాధించింది.

విశాఖపట్నంలో ఆంధ్రా బ్యాంకులో అకౌంటెంటుగా పనిచేసే ప్రసాద్ (వెంకటేష్) కి వయసు మీద పడుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఆఫీసులో అందరూ అతన్ని పెళ్ళికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. అన్నయ్య (నరేష్), వదిన (రాజ్యలక్ష్మి) వాళ్ళు తెచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా మల్లీశ్వరి (కత్రినా కైఫ్) విశాఖపట్నంలో ఉండే తన బాబాయి (తనికెళ్ళ భరణి) వాళ్ళ ఇంటికి వస్తుంది. ప్రసాద్ ఆమెను చూసి ప్రేమలో పడతాడు. కానీ మల్లీశ్వరికి మాత్రం అతనంటే పడదు. ఒక రోజు తన అన్న, వదినలతో సంబంధం మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తాడు. కానీ వాళ్ళు మల్లీశ్వరి వాళ్ళ ఇంట్లో పనిమనిషి అని చెప్పి పంపేస్తారు. కానీ ప్రసాద్ మాత్రం మల్లీశ్వరినే పెళ్ళి చేసుకోవాలనే పట్టుదలతో ఆమె వెంట పడుతూ ఉంటాడు. ఒకసారి మల్లీశ్వరి స్నేహితురాలి పుట్టినరోజుకు వెళ్ళిన ప్రసాద్ అనుకోకుండా ఆమె మీద హత్యాప్రయత్నం చేయబోయే కిల్లర్ (బెనర్జీ) ని అడ్డుకుంటాడు. అలాగే ఆమె మీద మరోసారి హత్యాప్రయత్నం జరగబోతే అది కూడా అడ్డుకుని ఆమెను హైదరాబాదు చేర్చడంలో సహాయపడతాడు. అక్కడ ఆమె నిజానికి మీర్జాపురం యువరాణి అని తెలుస్తుంది.

కొద్దిరోజులు ఆ భవంతిలోనే ఉంటూ మల్లీశ్వరి వెంటే ఉంటూ ఆమెను అనేక ప్రమాదాల బారి నుండి కాపాడుతుంటాడు. ఈ హత్యాప్రయత్నాలన్నీ చేయిస్తుంది భవానీ శంకర్ (కోట శ్రీనివాసరావు) అని తెలుస్తుంది. ప్రసాద్ తను ఉండగా మల్లీశ్వరిని ఏమీ చేయలేరని అతన్ని హెచ్చరించి వస్తాడు. ఈలోపు మల్లీశ్వరి తాత రామ్మోహన్ రావు భవానీ శంకర్ తో సయోధ్య కుదుర్చుకుని మల్లీశ్వరిని అతని కొడుక్కిచ్చి పెళ్ళి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ మల్లీశ్వరి తనకు వచ్చిన ఆస్తిని మదర్ థెరిసా సంస్థకు రాసిచ్చేసి ప్రసాద్ ను పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇది చూసి భవానీ శంకర్ గుండె ఆగి చనిపోతాడు.

తారాగణం

[మార్చు]

ఈ చిత్రంలోని సంభాషణలు

[మార్చు]
  • మల్లీశ్వరిని మీరు పనిమనిషి అంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.
  • నీ తో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళి పోతావు.
  • ఇది తింటానికి నడిచినట్టు లేదురా, తిన్నది అరగటానికి నడిచినట్టు ఉంది.
  • దీన్ని మెయింటెయిన్ చెయ్యాలంటే బ్యాంకులో పని చేస్తే చాలదు. బ్యాంకుకు కన్నమెయ్యాలి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టంట్: శివ
  • కోరియోగ్రఫీ: కృష్ణారెడ్డి, రాజశేఖర్, రాజు సుందరం

పాటలు

[మార్చు]
పాట గీతరచన గానం సంగీతం నటీనటులు
మల్లీశ్వరి... గుండెల్లో గులాబి సిరివెన్నెల సీతారామశాస్త్రి శంకర్ మహదేవన్, కె.ఎస్.చిత్ర కోటి వెంకటేష్, కత్రినా కైఫ్
చెలి సోకు లేత చిగురాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కె.కె., కె.ఎస్.చిత్ర కోటి వెంకటేష్, కత్రినా కైఫ్
జన్మ జన్మల సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ కోటి వెంకటేష్, గజాలా
నీ నవ్వులే వెన్నెలని మల్లెలని సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమార్ సాను, సునీత కోటి వెంకటేష్, కత్రినా కైఫ్
నువు యెవ్వరి యెదలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ కోటి వెంకటేష్, కత్రినా కైఫ్
నువ్వెంత అందగత్తెవైన సిరివెన్నెల సీతారామశాస్త్రి కార్తిక్ కోటి వెంకటేష్, కత్రినా కైఫ్

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.