లఖింపూర్ ఖేరి జిల్లా
లఖింపూర్ ఖేరి జిల్లా
लखीमपुर खीरी ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | లక్నో |
ముఖ్య పట్టణం | లఖింపూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఖేరీ, ధౌరహారా |
• శాసనసభ నియోజకవర్గాలు | లఖింపూర్, ధౌరహార, గోలా గోకర్ణనాథ్, కాస్తా, మొహమ్మదీ, నిఘాసాన్, పలియా కలాన్, శ్రీనగర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,680 కి.మీ2 (2,970 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 40,21,243 |
• జనసాంద్రత | 520/కి.మీ2 (1,400/చ. మై.) |
• Urban | 11.46% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.56% |
• లింగ నిష్పత్తి | 894 |
Vehicle registration | UP-31 |
అక్షాంశ రేఖాంశాలు | 27°36′N 80°20′E / 27.6°N 80.34°E - 28°36′N 81°18′E / 28.6°N 81.30°E |
సగటు వార్షిక వర్షపాతం | 1085.3 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో లఖింపూర్ ఖేరి జిల్లా ఒకటి. లఖింపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[1] [1] ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 7680 చ.కి.మీ.[1] ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో జిలా ఒకటి. 2001 సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది. .[2] 2010లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దేశంలో అతితక్కువ పారిశుద్ధ్య వసతులు కలిగిన జిల్లాల్లో లఖింపూర్ ఖేరి జిల్లా రెండవ స్థానంలో ఉందని గుర్తించింది.[3] ధుద్వా నేషనల్ పార్కులో అంతరించి పోతున్న పులి, చిరుత, చిత్తడి నేలల జింక, హిస్పిడ్ హేర్, బెంగాల్ ఫ్లోరికాన్ మొదలైన జంతువులు ఉన్నాయి.[1][4]
పేరువెనుక చరిత్ర
[మార్చు]లఖింపూర్ పూర్వం లక్ష్మీపూర్ అని ఉండేది.[1] ఖేర్ అనే పట్టణం లఖింపూర్‌కు 2 కి.మీ దూరంలో ఉంది. సయ్యిద్ కుర్ద్ సమాధి నిర్మించిన ప్రదేశం కనుక ఖేర్ అని పిలువబడిందని భావిస్తున్నారు.[5] [6] మరొక కథనం అనుసరించి ఈ ప్రాంతంలో తుమ్మ చెట్లు (ఖయిర్) అధికంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి కేరి అని వచ్చిందని భావిస్తున్నారు.
చరిత్ర
[మార్చు]చరిత్రకాలానికి ముందు
[మార్చు]హస్థినాపురానికి ఈ ప్రాంతానికి సంబంధం ఉందని మభారతం సూచిస్తుంది. జిల్లాలో పలుప్రాంతాల గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉంది. [7] [8] పలుగ్రామాలలో పురాతనమైన మట్టి గుట్టలు ఉన్నాయి. వీటిలో పురాతన శిల్పాలు లభించాయి. బాల్మిర్ - బర్కర్, ఖైర్ల్గర్ ప్రధానమైనవి. ఖైరాబాద్ (సీతాపూర్) సమీపంలో రాతి గుర్రం ఒకటి లభించింది. దీనిమీద 4వ శతాబ్ధానికి గుప్తుల కాలానికి చెందిన శిలాక్షరాలు ఉన్నాయి. మగధరాజు సముద్రగుప్తుడు నిర్వహించిన అశ్వమేధయాగంలో భాగంగా విడిచిపెట్టిన అశ్వం ఈ భూభాగం అంతా సంచరించింది. అశ్వం సంచరించిన ప్రదేశం అంతా సామ్రాజ్యంలో భాగం ఔతుంది. సార్వభౌమత్వాన్ని ఎదిరించే వారు అశ్వన్ని అడ్డగించవచ్చు. రాతి గుర్రం ప్రస్తుతం లక్నో జూ మ్యూజియంలో ఉంది. లక్నో పాతపేరు లఖింపూర్.
మద్యయుగం
[మార్చు]లఖింపూర్ ఖేరి 10 వశతాబ్ధానికి రాజపుత్రుల ఆధీనంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో ముస్లిం పాలన క్రమంగా విస్తరించింది. నేపాల్ దాడిని తట్టుకుని నిలబడడానికి 14వ శతాబ్ధానికి ఉత్తర సరిహద్దులో పలు కోటలు నిర్మించబడ్డాయి.
ఆధునిక యుగం
[మార్చు]17వ శతాబ్ధానికి అక్బర్ పాలనలో జిల్లాప్రాంతం మొగల్ సామ్రాజ్యంలో అవధి సుభాహ్‌లో కైరాబాద్ సర్కారులో భాగాంగా మార్చబడింది. 17వ శతాబ్ధపు చివరిలో అవధ్ నవాబులు బలపడ్డారు. అలాగే చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు క్షీణించాయి.
రోహిల్ ఖండ్
[మార్చు]1801లో రోహిల్‌ఖండ్ బ్రిటిష్ వారికి ఆధీనం చేయబడింది. జిల్లాలోని కొంతప్రాంతం కూడా అందులో భాగం అయింది. 1814 - 1816లో ఆంగ్లో - నేపాలీ యుద్ధం తరువాత ఇది తిరిగి అవధ్ నవాబు స్వంతం అయింది. 1856లో జిల్లాలో పశ్చిమ ప్రాంతం మొహమ్మది అని పిలువబడింది. తూర్పు భాగం మల్లన్‌పూర్ అని పిలువబడింది. ఇది ప్రస్తుతం సీతాపూర్‌లో భాగం అయింది. 1857 భారతీయ తిరుగుబాటు మొహమ్మది స్వతంత్రంత్ర సమరంలో ప్రధాన కేంద్రాలలో ఒకటిగా మారింది. షాజహాన్‌పూర్ శరణార్ధులు 1857 జూన్ 2 నాటికి మొహమ్మదికి చేరుకున్నారు. రెండురోజుల తరువాత మొహమ్మదిని విడిచారు. ఈ తిరుగుబాటులో చాలామంది కాల్చి చంపబడ్డారు. కొంతమంది హత్యచేయబడ్డారు. బ్రిటిష్ అధికారులు సీతాపూర్ నుండి మల్లన్‌పూర్‌కు పారిపోయి నేపాల్ చేరుకున్నారు. వారిలో చాలామంది మరణించారు. 1858 నాటికి బ్రిటిష్ అఫీషియల్స్ భూభాగంలో ప్రధానకార్యం మీద అధికారాన్ని తిరిగి స్థాపించారు. తరువాత క్రమంగా జిల్లా అంతటా అధికారాన్ని పునః స్థాపించారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా హిమాలయ పాదాలలో తెరై దిగువభూములలో ఉపస్థితమై ఉంది. జిల్లాలో పలు నదులు ప్రవహిస్తున్న కారణంగా పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. 27.6° నుండి 28.6° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80.34° నుండి 81.30° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 7680చ.కి.మీ. జిల్లా దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది.
సరిహద్దులు
[మార్చు]సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మోహన్ నది (నేపాల్ సరిహద్దు ఉంది) |
ఉత్తర సరిహద్దు | కురియాలా నది (బహ్రిచ్ సరిహద్దు ఉంది) |
దక్షిణ సరిహద్దు | సీతాపూర్, హర్దోయి |
పశ్చిమ సరిహద్దు | పిలిభిత్, షాజహాన్‌పూర్ [1][9][10] |
వాతావరణం
[మార్చు]విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వాతావరణ విధానం | వేడి వాతావరణం |
వేసవి | మార్చి - జూన్ |
శీతాకాలం | అక్టోబరు - ఫిబ్రవరి (పొగమంచు కూడా సంభవం).[1] |
వర్షాకాలం | జూలై - సెప్టెంబరు .[11] |
గరిష్ఠ ఉష్ణోగ్రత | 40 ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 4 ° సెల్షియస్ |
వర్షపాతం | 1085.3మి.మీ |
నదులు
[మార్చు]లఖింపూర్ జిల్లాలో పలు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో శారదా నది, ఘఘ్రా నది, కొరియా, ఉల్, సరయాన్, చౌకా, గోమతి, ఖతన, సరయు, మొహన.
శారదా వంతెన
[మార్చు]దిగువ శారదా వంతెన [12][13] శారదానది మీద 163 దిగువ ప్రవాహం వద్ద నిర్మించబడింది. ఇది లఖంపూర్ గ్రామానికి 28 కి.మీ దూరంలో ఉంది. ఇది శరదా సహాయాక్ ప్రియోజనలో భాగంగా పనిచేసింది [14] దీనికి నీరు శారదా సహాయక్ లింకు కెనాల్ నుండి నీరు అందుతుంది. శారదా వంతెన నుండి 16.77 హెక్టారుల భూమికి నీరు అందుతూ ఉంది. ఇది జిల్లాలో 77% వ్యవసాయభూములకు నీరు అందిస్తుంది. [15]
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లఖింపూర్ ఖేరి జిల్లా ఒకటి అని గుర్తించింది.[16] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి[16]
వ్యవసాయం
[మార్చు]గోధుమలు, వరి, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలలు పందించబడుతున్నాయి. సమీపకాలంలో వ్యవసాయదారులు పుదీనా పంట పండించడం ఆరంభించారు. తెరై భూభాగం పుదీనా పంటకు అనుకూలమైనదిగా భావిస్తున్నారు.[17] చెరకు, నూనెగింజలు మొదలైన వాణిజ్యపంటలు కూడా పండించబడుతున్నాయి. చెరకు పంట చక్కెర తయారీ జిల్లా ఆదాయానికి వెన్నెముకగా నిలిచింది.
పరిశ్రమలు
[మార్చు]జిల్లాలో భారతదేశంలోని బృహత్తర చక్కెర మిల్లులలో కొన్ని ఉన్నాయి.[18] బజాజ్ గోలా గొకరన్నాథ్ వద్ద బజాజ్ హిందూస్థాన్ లిమిటెడ్ (బి.హెచ్.ఎల్) షుగర్ ప్లాంట్, పాలియా కలన్ వద్ద బజాజ్ హిందూస్థాన్ లిమిటెడ్ (బి.హెచ్.ఎల్) పేరుతో రెండు చక్కెర మిల్లులు ఉన్నాయి.[19][20][21][22] ఇవి ఆసియాలో అతి పెద్ద చక్కెర మిల్లులూలుగా గుర్తించబడుతున్నాయి.2008లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) జిల్లాలోని బెజం వద్ద ప్రధాన స్టీల్ ప్రొసెసింగ్ ప్లాంట్ స్థాపించాలని ప్రకటించింది. .[23][24] ప్రొసెసింగ్ యూనిట్ 1,00,000 టన్నులు ఉంది. జిల్లాలో కుటీర పరిశ్రమలు కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి.
డివిజన్లు
[మార్చు]జిల్లా కలిగి ఉంటుంది -
- 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు - ఖేరి (లోక్ సభ నియోజకవర్గం),, దౌరహ్రా (లోక్ సభ నియోజకవర్గం),
- 8 అసెంబ్లీ నియోజకవర్గాలు - లఖింపూర్, దౌరహ్రా, గోలా గొకరన్నాథ్, త్రో, మొహమ్మది (ఉత్తర ప్రదేశ్), నిఘాసన్, పాలియా కలాన్, శ్రీనగర్
- 6 తాలుకాలు - లఖింపూర్, మొహమ్మది, గోలా గొకరన్నాథ్, నిఘాసన్, దౌరహ్రా, మితౌలి, పాలియా, కలాన్
- 15 బ్లాక్స్ - లఖింపూర్, బెహ్జం, మితౌలి, పస్గవన్, మొహమంది, గొల గొకరన్నథ్, బంకెయ్గంజ్, బిజువ, పలియ, నిఘసన్, రమియబెహర్, ఇస్సనగర్, ధౌరహర, నకహ, ఫూల్బెహర్
- 4 నగర్ Palikas - లఖింపూర్, గొల గొకరన్నథ్, మొహమ్మది, ఉత్తర ప్రదేశ్, పాలియా కలాన్
- 6 టౌన్ ప్రాంతాలు - ఖేరి, ఒయెల్, మైలని, ది బార్బేరియన్, సినోహి, దౌరహ్రా.
- 2 జ్యుడీషియల్ కోర్టు సముదాయాలు - లఖింపూర్ జిల్లా, సెషన్స్ కోర్టులు, మొహమ్మది వద్ద సబ్ డివిజనల్ / సివిల్ కోర్టులు
రాజకీయ నాయకులు
[మార్చు]నియోజకవర్గం | ఇయర్ | లీడర్ | పార్టీ |
---|---|---|---|
లఖింపూర్ | 2012 | వాహబ్ [25] | బిఎస్పి |
దౌరహర | 2012 | ||
గోలా గొకర్న్నాథ్ | 2012 | వినయ్ తివారి | సమాజవాది పార్టీ |
త్రో | 2012 | ||
మొహమ్మది | |||
నిఘాసన్ | 2012 | సురేష్ బన్సల్ | బహుజన్ సమాజ్ పార్టీ |
పలియా కలాన్ | 2012 | ||
శ్రీనగర్ | 2012 |
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]లఖింపూర్ నగరం లక్నో నగరానికి 124 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు సులువుగా మీటర్ గేజి రైలు మార్గం, యు.పి.ఎస్.ఆర్. టి.సి బస్ సర్వీస్ ద్వారా చేరుకోవచ్చు.
వాయుమార్గం
[మార్చు]లఖింపూర్ ఖేరి ఎయిర్‌పోర్ట్ ( పాలియా కలాన్ ఎయిర్‌పోర్ట్) లఖింపూర్ ఖేరి లోని దుధ్వా నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఇది లఖింపూర్ నగరానికి 90 కి.మీ దూరంలో ఉంది. జిల్లాకు సమీపంలో నగరానికి 135 కి.మీ దూరంలో అమౌసీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (లక్నో) ఉంది.
రహదారి మార్గాలు
[మార్చు]యు.పి.ఎస్.హెచ్ సంఖ్య | రూట్ | మొత్తం పొడవు (కి.మీ.లలో లో) |
---|---|---|
ఉత్తర ప్రదేశ్ స్టేట్ హైవే 21 (యు.పి.ఎస్.హెచ్ 21) | Bilaraya - 'లఖింపూర్' - సీతాపూర్-పంవారి మార్గ్ | 385,46 |
ఉత్తర ప్రదేశ్ స్టేట్ హైవే 25 (యు.పి.ఎస్.హెచ్ 25) | 'Paliya (లఖింపూర్)' - లక్నో మార్గ్ | 265,50 |
ఉత్తర ప్రదేశ్ స్టేట్ హైవే 26 (యు.పి.ఎస్.హెచ్26) | పిలిభిత్ - లఖింపూర్ - బహరయిచ్ -బస్తీ మార్గ్ | 402,03 |
ఉత్తర ప్రదేశ్ స్టేట్ హైవే 90 ( యు.పి.ఎస్.హెచ్90) | 'లఖింపూర్' - బిజుయా- పలియ- గౌరీఫాంటా మార్గ్ | 91,030 |
ఉత్తర ప్రదేశ్ స్టేట్ హైవే 93 (యు.పి.ఎస్.హెచ్ 93) | 'గోలా (లఖింపూర్)' - షాజహాంపూర్ మార్గ్ | 58,62 |
బస్
[మార్చు]లఖింపూర్ ఖేరి జిల్లాలో యు.పి.ర్స్.ఆర్.టి.సి బసు సేవలను అందిస్తుంది. గోలా గోకర్న్నాథ్, సీతాపూర్, లక్నో, ఫైజాబాద్, గోరఖ్పూర్. డి.టి.సి బసులను ఢిల్లీ లోని ఆనంద్ విహార్ నుండి ఇంటర్ స్టేట్ బసులను నడుపుతుంది.
రైలు
[మార్చు]- ఢిల్లీ నుండి
- రైలు ద్వారా - ఢిల్లీ నుండి మురాదాబాద్ - బారెల్లీ ఆపై బారెల్లీ సిటీ - పిలిభిత్ - మైలాని - గోలా గోకరనాథ్ - లఖింపూర్
- రైలు ద్వారా లక్నో: -, లక్నో - సీతాపూర్ - ఢిల్లీ - లఖింపూర్
- రైలు ద్వారా: - మురాదాబాద్ (102 కి.మీ పొడవు) - బారెల్లీ - ఢిల్లీ షాజహాన్ పూర్ (ఎన్.ఆర్) ఆపై (వయా: గోలా గోకరనాథ్ ) లఖింపూర్ రోడ్డు 102 కిలోమీటర్లు (63 మై.)
- లక్నో నుండి
- రైలు ద్వారా సీతాపూర్ - లఖింపూర్ (ఎన్.ఇ.ఆర్) లక్నో:
గణాంకాలు
[మార్చు]2001 గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,021,243[27] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[28] |
అమెరికాలోని. | ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం..[29] |
640 భారతదేశ జిల్లాలలో. | 56వ స్థానంలో ఉంది.[27] |
1చ.కి.మీ జనసాంద్రత. | 523 [27] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.38%.[27] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 894:1000 [27] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 60.56%.[27] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో హిందీ వ్యవహారభాషలలో ఒకటైన అవధ్ భాష వాడుకలో ఉంది. ఇది అవధ్ భూభాగంలో 3.8 కోట్లమంది ప్రజలకు వాడుకలో ఉంది. [30]
సంస్కృతి
[మార్చు]చారిత్రక ప్రాంతాలు
[మార్చు]నసీరుద్దీన్ మెమోరియల్ హాల్
[మార్చు]1924లో ఈస్టిండియా కాలని " సర్ రాబర్ట్ విలియం డౌగ్లాస్ విలౌటీ " స్మారకార్ధం విలౌమెమోరియల్ హాల్ నిర్మించింది. ఖేరి డెఫ్యూటీ కమీషనర్ సర్ రాబర్ట్ విలియం డౌగ్లాస్ విలౌటీ 1920 ఆగస్టు 26న కాల్చివేయ బడ్డాడు. . [31] డెఫ్యూటీ కమీషనర్ సర్ రాబర్ట్ విలియం డౌగ్లాస్ విలౌటీ కాల్చివేత మీద విచారణ జపిన కాలనీ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులు నసీరుద్దీన్ షాహ్, రాజనారాయణన్ మిశ్రాలను మీద నేరారోపణ చేసి ఉరిశిక్ష విధించింది.[32] 1936 ఏప్రిల్ 26 న విలౌఘ్బీ మెమోరియల్ లైబ్రరీ స్థాపించబడింది. ది విలౌఘ్బీ మెమోరియల్ హాల్ పేరు సమీపకాలంలో నసీరుద్ధీన్ మెమోరియల్ హాల్ అని మార్చబడింది.
ఎయిడ్‌గా (ఖేరి)
[మార్చు]ఎయిడ్‌గా (ఖేరి) అందమైన మసీదు. ఇది లఖింపూర్ - ఖేరి రైల్వే మార్గం సమీపంలో ఉంది. ఇది సుమదరమైన నిర్మాణవైభం కలిగిన నిర్మాణంగా గుర్తించబడుతుంది..
గోలా గోకరనాథ్ శివాలయం
[మార్చు]గోలా గోకరనాథ్ శివాలయం ఒక శివాలయం.[33] గోలా గోకరనాథ్‌ని చోటీ కాశీ అని పిలుస్తారు. పరమశివుడు రావణుని తపసుకు మెచ్చి వరం ప్రసాదించాడని రావణుడు హిమాలయాలను విడిచి శాశ్వతంగా తనవెంట వచ్చి శాశ్వతంగా లంకలో నివసించమని ఈశ్వరుడిని కోరాడు. శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చి దానిని శీలంకకు చేరే లోపల మద్యలో ఎక్కడ భూమి మీద పెట్టకూడదని షరతు పెట్టాడు. ఒకవేళ అది ఎక్కడ ఉంచితే తాను అక్కడే శాశ్వతంగా ఉంటానని చెప్పాడు. రావణుడు అందుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకుని శ్రీలంకకు బయలు దేరాడు. రావణుడు గోలాగోకర్నాథ్ (అప్పుడు గోలిహర అనేవారు) చేరగానే కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. రావణుడు అక్కడన్న గొల్లపిల్లావాడిని (భగవానుడు గణేశుడు) పిలిచి కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చి కొంతకాలం శివలింగాన్ని తలమీద ఉంచుకోవలని తాను తిరిగి వచ్చి శివలింగాన్ని తిరిగి తీసుకుంటానని కోరాడు. గొల్లనాని రూపంలో ఉన్న గణేశుడు శివలింగాన్ని భూమి మీద పెట్టాడు. శివుడు శాశ్వతంగా అక్కడే నిలిచిపోయాడు. తిరిగి వచ్చిన రావణుడు శివలింగాన్ని పెకిలించాలని సర్వవిధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. రావణుడి నిరాశవలన కలిగిన ఆగ్రహంతో శివలింగం మీద బొటనవ్రేలితో నొక్కాడు. ఇప్పటికీ శివలింగం మీద రావణుని వేలి ముద్ర ఉందని భావిస్తున్నారు. చైత్ర మాసంలో ఆలయంలో చేతి- మేళా పేరుతో ఒక మాసకాలం మేళా నిర్వహిస్తారు.
కప్ప గుడి
[మార్చు]అసమానమైన కప్పగుడి ఒయెల్ గుడి పట్టణంలో ఉంది. ఇది లఖింపూర్‌కు 12 కి.మీ దూరంలో లల్హింపూర్ - సీతాపూర్ మార్గంలో ఉంది. ముండక్ తంత్రా ఆధారిత ఆలయం దేశంలో ఇది ఒక్కటే అని భావిస్తున్నారు. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ఈ ఆలయాన్ని 1860 - 1870 పూర్వకాలపు ఒయెల్ రాజు నిర్మించాడని భావిస్తున్నారు.[34] ఆలయ ప్రధాన దైవం పరమశివుడు. ఆలయం ముందు పెద్ద కప్ప ఉంటుంది. ఆలయం అష్టదళ తామర ఆకారంలో నిర్మించబడింది. బనారస్ ప్రతి నర్మదేశ్వర్ నర్మదా కుండ్ నుండి తీసుకువచ్చిన శివలింగం ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఆలయ ప్రధాన ద్వారం తూర్పు ముఖంగా ఉంటుంది. మరొక ద్వారం దక్షిణదిశలో ఉంటుంది. ఈ ఆలయం తంత్ర విద్య ఆధారితంగా నిర్మించబడిందని భావిస్తున్నారు.
దేవకాలి శివాలయం
[మార్చు]పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేసునప్రదేశం ఇదేనని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో సర్పాలు నివాసాలలో ప్రవేశించవని విశ్వసిస్తున్నారు. ఆలయప్రధానదైవం ఈశ్వరుడు. దేవకాళి బ్రహ్మదేవుని కుమార్తె దేవకాళి ఇక్కడ దీర్ఘతపమాచరించిందని భావిస్తున్నారు. బ్రహ్మదేవుని కుమార్తె తపమాచరించిన ప్రదేశం కనుక ఇది దేవకాలి అయిందని భావిస్తున్నారు.
సాయి ఆలయం (సికతా కాలనీ)
[మార్చు]సాయి ఆలయం (సికతా కాలనీ) శారదా వంతెన, డీర్ పార్క్ లఖింపూర్‌లోని ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
షాపింగ్ సెంటర్లు
[మార్చు]లఖింపూర్ నగరంలో షైపింగ్ సెంటర్లు, బజారు వీధులు అధికంగా ఉంటాయి. లల్హింపూర్ కేరి కేంద్రంలో ఉన్న కొన్ని ప్రధాన షాపింగ్ సెంటర్లు:-
- సిటీ మార్ట్ (సంక్త దేవి మందిర్ సమీపంలో)
- వి-మార్ట్ (మహాత్మా గాంధీ విద్యాలయ సమీపంలో)
- వాల్యూ ప్లస్ (హనుమాన్ మందిర్ సమీపంలో మహారాజ్ నగర్)
- జైస్వాల్ కాంప్లెక్స్ (మెయిన్ బజార్)
- ఎలక్ట్రానిక్స్ వరల్డ్ (రోడ్వేస్ బస్ స్టాండ్ సమీపంలో)
- మధుర్-తియారా ఫొటొ స్టూడియో (విలౌగ్బీ హాల్ సమీపంలో)
- షాపింగ్ సెంటర్లతో నగరంలో షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, దియేటర్లు, కార్యాలయాలు ఉన్నాయి.
పండుగలు , ఉత్సవాలు
[మార్చు]జిల్లాలో పలు పండుగలు, ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. వార్షిక పండుగలలో దసరా, దీపావళి, ఫఫెయిర్ ముఖ్యమైనవి. ఖేరి పట్టణంలో ఎయిడ్ ఆల్- ఫిట్రి - ఎయిడ్ ఉత్సవం సంవత్సరానికి రెండుమార్లు నిర్వహించబడుతుంది.
చలనచిత్రాలు
[మార్చు]లఖింపూర్ చిత్రపరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఉంరావ్ జాన్ (1991), గమన్ (1881), స్వాడ్స్ లఖింపూర్‌లో చిత్రీకరించబడ్డాయి.[35] (2004).
దియేటర్లు
[మార్చు]లఖంపూర్‌లో రాజ్ ప్యాలెస్, బసంత్ సినిమా, సిద్ధాంత్ ప్యాలెస్ మొదలైన సినిమా దియేటర్లు ఉన్నాయి.
ప్రముఖులు
[మార్చు]లఖింపూర్‌లో పలువురు ప్రముఖులు జన్మించారు.
- బిల్లీ ఆర్యన్ సింగ్:- ప్రముఖ వేటగాడు.[36] 1995లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 1976లో వన్యప్రాణి బంగారు పతకం అందుకున్నాడు.[37] ఒక సంవత్సరం తరువాత పులుల సంరక్షణకు జీవితకాల సాధన పురస్కారం 1999లో అందుకున్నాడు. 2006లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడు. .[38]
- జాఫర్ అలి నక్వి:- పార్లమెంటు సభ్యుడు, నేషనల్ మానిటరింగ్ కమిటీ ఫర్ మైనారిటీ ఎజ్య్కేషన్ కమిషన్ చైర్మన్‌గా పనిచేసాడు.[39] మునుపటి కేబినెట్ మంత్రి.
- జితిన్ ప్రసాద్:-రాష్ట్ర యూనియన్ మంత్రి, పెట్రోలియం మంత్రి, నేచురల్ గ్యాస్ మంత్రిగా పనిచేసాడు.
- ముజాఫర్ అలి:- ఇండియన్ చిత్ర నిర్మాత, దర్శకుడు. ఉంరావ్ జాన్, గమన్ చిత్ర రూపకర్త. ఫ్యాషన్ డిజైనర్, కవి, కళాకారుడు, సంగీత ప్రియుడు, సాంఘిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత.[40]
- షణ్ముగన్ మంజునాథన్:- ఐ.ఐ.ఎం లక్నో పట్టభద్రుడు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫీసర్. ఆయన హత్య దేశంతటా కలవరం కలిగించింది.[41][42][43]
- 'మనోజ్ కుమార్ గుప్తా:- ఇంజనీర్ రిపబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు (పి.డబల్యూ.డి) ఉద్యోగి, ఆయన ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు వేడుకల ఖర్చును మంజూరు చేయడానికి నిరాకరించిన తతువాత ఆయన ఔరాయ వద్ద హత్యకు గురి అయ్యాడు.[44]
- పరుల్ చౌహాన్: ఇండియన్ టెలివిజన్ మోడల్, బాలీవుడ్ నటి. ఆమె రంగిని టి.వి సీరియల్ ద్వారా ప్రజాదరణ చూరగొన్నారు.
- మంగల్ దిల్లాన్:- నటుడు, చలనచిత్ర నిర్మాత. ఆయన లఖింపూర్ నిఘాసన్ నివాసి.
- డాక్టర్. ఎం.. అంసారి జి.ఎన్ మెడికల్ కాలేజి ప్రొఫెసర్, ఎ.ఎం.యు. అలిగర్. మైక్రో న్యూట్రీషియన్ (సూక్ష్మ పోషకాలు) లోపాలు, హెచ్.ఐ.వి./ఎయిడ్స్ డిసాస్టర్స్ మేనేజ్మెంటు, ఎంవిరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఆయన పరిశోధ చేపట్టాడు. ఆయన నాగపూర్ లోని ఇండియన్ ఇన్శ్టిట్యూట్ ఆఫ్ పీస్ ఆధ్వర్యంలో న్యూక్లియర్ తొలగింపు, పర్యావరణం, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఫర్ ప్రివెంషన్ ఆఫ్ న్యూక్లియర్ వార్, కొరకు పనిచేసాడు.[45][46]
- డాక్టర్. ఓం నారాయణన్ పాండే:- హీనాటోఫీ, అంకోలజీ (యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్) ప్రొఫెసర్‌గా పనిచేసాడు. ఆయన కేంసర్ పరిశోధకుడు, ఉపాధ్యాయుడు, క్లినిక్ నిర్వాహి. అయాన గోలా పబ్లిక్ ఇంటర్ కాలేజ్ విద్యార్థి.
- గిరిజ శంకర్ శుక్ల:- న్యూక్లియర్ పరిశోధకుడు, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ (యునైటెడ్ స్టేట్స్ న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్: వాషింగ్టన్ డి.సి. యు.ఎస్.ఎ) . ఆయన లఖింపూర్‌లో పుట్టాడు. వారణాసి ఐ.ఐ.టిలో మెకానికల్ ఇంజనీర్‌గా విద్యాభ్యాసం చేసాడు.[47]
- గోదావరి దేవి:- భగవాందీన్ ఆర్య కన్యా ఇంటర్ కాలేజ్ స్థాపకుడు, మొదటి ప్రింసిపల్‌గా పనిచేసింది.. ఆయన జాతీయ కాంగ్రెస్ సభ్యుడుగా క్రియాశీలక పాత్ర వహిస్తుంది. స్వతంత్ర సమర యోధురాలుగా అవార్డు అందుకుంది.
వృక్షజాలం , జంతుజాలం
[మార్చు]లఖింపూర్ ఖేరి జిల్లాలో దుధ్వాటైగర్ అభయారణ్యం [48], కిషన్‌పూర్ వన్యప్రాణి అభయారణ్యం పేర్లతో రెండు ప్రాంతాలలో అభయారణ్యాలు స్థాపించబడ్డాయి. 1987లో విలీనం చేయబడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూపొందించబడిన తరువాత దుధ్వా అభయారణ్యం రాష్ట్రంలోని మొదటి అభయారణ్యంగా గుర్తించబడుతుంది. ఇది అంతరించి పోతున్న పులులు, చిరుతలు, ఖడ్గమృగాలు, హిస్పిడ్ హేర్, ఏనుగులు, బ్లాక్ డీర్, స్వాంప్ డీర్ వంటి పలు వన్యమృగాలకు ఆశ్రయం యిస్తుంది. దుధ్వాలో దాదాపు 400 జాతిల పక్షులు ఉన్నాయి. వీటిలో ఈగ్రెట్లు, కార్మొరాంట్స్, హెరాంస్, పలు జాతుల బాతులు, గూస్, టీల్ మొదలైన పక్షులు ప్రధానమైనవి. ఇందులో చిత్తడి నేలలు, సరోవరాలు ఆకర్షణీయమైన నీటి పక్షులకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాయి. శీతాకాలపు చిలి నుండి రక్షించుకోవడానికి హిమాలయాల నుండి పలు జాతుల పక్షులు ఇక్కడకు వలస వచ్చి కొంతకాలం నివసించి పోతుంటాయి.బాంకే తాల్‌లో పక్షులను వీక్షించడం ప్రధాన ఆకర్షణ. శ్రీ.డి.బి బ్రాండిస్ సందర్శన 1860లో 303 చ.కి.మీ ఉన్న దుధ్వానేషనల్ పార్క్ అటవీప్రాంతం 1861 నాటికి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురాబడింది. [49] ఖేరీలో మొత్తం జిల్లాలో సాలవృక్షాలు, ఇతర వృక్షాలు ఖారీగర్ పరగణాలోని పచ్చికభూములు మోహన్ నది, సుహెలి నది మద్య ఉన్న ప్రదేశం ఉత్తర ఖేరి డివిజన్‌లో భాగంగా ఉంది. 1867, 1879 మద్య డివిజన్‌లో అభయారణ్య ప్రాంతం అధికం చేయబడింది.1937లో ఈ ప్రాంతం అభయారణ్యంగా అధికార పూర్వకంగా ప్రకటించబడింది.
సోనాపూర్ అభయారణ్యం
[మార్చు]15.7 చ.కి.మీ వైశాల్యం ఉన్న సోనాపూర్ అభయారణ్యం 1958లో స్వాంప్ డీర్ రక్షణార్ధం స్థాపించబడింది. ఆరంభంలో ఇది చాలా చిన్నదిగా ఉండేది. 1977 తరువాత ఇది 212 చ.కి.మీకి విస్తరించబడింది. తరువాత అభయారణ్యానికి అధికభూభాగం మంజూరు చేయబడింది. తరువాత 1968లో ఇది దుధ్వా అభయారణ్యం అని పిలువబడింది.ప్రద్తుతం పార్క్ వైశాల్యం 616 చ.కి.మీ. 1958లో స్థాపించబడిన వన్యమృగ అభయారణ్యం 1977 ఫిబ్రవరి 1 నాటికి నేషనల్ పార్క్‌గా మారింది. తరువాత 11 సంవత్సరాల తరువాత 1988లో ఇది పులుల రిజర్వేషన్‌గా మారింది. దుధ్వా టైగర్ రిజర్వ్ ఇండియా - నేపాల్ సరిహద్దులో హిమాలయ పాదపర్వతాల వద్ద ఉంది. దుధ్వా పులుల అభయారణ్యం 1987-88 మద్య దుధ్వా నేషనల్ పార్క్, కిషంపూర్ అభయారణ్యంలను కలుపుకుని 203 చ.కి.మీ వైశాల్యంలో స్థాపించబడింది. 1997 నాటికి అభయారణ్యం వైశాల్యం 884 చ.కి.మీ ఉంది. జిల్లాకేంద్ర లఖింపూర్ నుండి ఇది 100 కి.మీ దూరంలో ఉంది.
ఆర్ధికం
[మార్చు]2011 గణాంకాలు లఖింపూర్ ఖేరి జిల్లా అక్షరాస్యత 60.56% (2001 గణాంకాల ప్రకారం అక్షరాస్యత 48.39%). పురుషుల అక్షరాస్యత 69.57%, స్త్రీల అక్షరాస్యత 50.42%, [50] 2001లో పురుషుల అక్షరాస్యత 59.50%, స్త్రీల అక్షరాస్యత 35.38%. [50] చివరి దశాబ్ధంలో జిల్లాలో అక్షరాస్యత శాతం అధికం అయింది. ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ, కాలేజ్ స్థాయిలో విద్యాసౌకర్యం లభిస్తుంది.[51]
విద్యాసంస్థల జాబితా
[మార్చు]- 1775 జూనియర్ బేసిక్ పాఠశాలలు
- 325 సీనియర్ బేసిక్ పాఠశాలలు
- 63 సీనియర్ సెకండరీ స్కూల్స్
- 4 డిగ్రీ కళాశాలలు
- 1 ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణా సంస్థ 3 సైట్లు
- 1 ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ (సుశీల్ వర్మ మెమోరియల్ ప్రెవేట్ లిమిటెడ్. ITI) [52]
- 3 పాలిటెక్నిక్ కళాశాలలు
- 1 అగ్రికల్చరల్ కాలేజ్
- 1 లా కాలేజ్
ప్రభుత్వపాఠశాలలు
[మార్చు]- భగవాన్ డీన్ ఆర్య కన్యా ఇంటర్ కాలేజ్
- కేన్ గ్రోయర్స్ నెహ్రూ (పోస్ట్ గ్రాడ్యుయేట్) కాలేజ్ [53]
- ధరమ్ సభ ఇంటర్ కాలేజ్
- ప్రభుత్వ ఇంటర్ కాలేజ్
- ప్రభుత్వ బాలికల ఇంటర్ కాలేజ్
- ఇస్లామియా ఇంటర్ కాలేజ్
- యువరాజ్ దత్ కాలేజ్ [54]
ప్రైవేట్ పాఠశాలలు
[మార్చు]- ఆదర్శ్ జనతా మహావిద్యాలయ, దెవ్కలి [55]
- ఆదర్శ్ విద్యా మందిర్ ఇంటర్ కాలేజ్
- అజ్మని ఇంటర్నేషనల్ స్కూల్ [56]
- బల్భద్ర ప్రసాద్ శుక్లా (బి.పి.ఎస్ ) పబ్లిక్ స్కూల్ [57]
- సి.బి. సింగ్ గౌర్ మెమోరియల్ స్కూల్
- సిటీ మాంటిస్సోరి, ఖేరి
- చిల్డ్రన్స్ అకాడమీ
- గ్రీన్ఫీల్డ్ అకాడమీ
- గురు నానక్ డిగ్రీ కళాశాల
- గురు నానక్ ఇంటర్ కాలేజ్
- కె.ఎస్.ఆర్ స్కూల్, నిహ్గాసన్ [58]
- కున్వర్ ఖుస్వాక్త్ రాయ్ బాలికల ఇంటర్ కాలేజ్
- లా మాతినా స్కూల్
- లక్నో పబ్లిక్ స్కూల్
- మను లా కాలేజ్ [59]
- పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ [60]
- పండిట్. డీన్ దయాళ్ ఉపాధ్యాయ సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజ్ [61]
- రాయల్ దూరదృష్టి డిగ్రీ కళాశాల [62]
- సెయింట్ డాన్ బాస్కో కాలేజ్ [63]
- సెయింట్ జాన్ యొక్క స్కూల్, గోలా గోకరన్నాథ్
- విద్యా కున్వారీ స్మారక్ సరస్వతి విద్యా నికేతన్ ఇంటర్ కళాశాల గోలా గోకరన్నాథ్
ఆరోగ్యం
[మార్చు]జిల్లా హాస్పిటల్‌లో అన్ని వసతులతో కూడిన వార్డులు ఉన్నాయి. డాక్టర్లు, సూపరింటెండెంట్ నివాసాలు కూడా ఆసుపత్రి ఆవరణలో ఉంటాయి. ఆసుపత్రి ప్రహరీ సరిహద్దు పక్కన జిల్లా జైలు, మెయిన్ రోడ్డు, జైలు రోడ్డు ఉన్నాయి.[64] జిల్లా ఆసుపత్రికి ఎదురుగా జిల్లా మహిళా ఆసుపత్రి ఉంది. ఇక్కడ గైనకాలజీ, ప్రసవం, నియో - నాటల్ కేర్ సదుపాయాలు ఉన్నాయి..[65]
మాధ్యమం
[మార్చు]రేడియో
[మార్చు]లఖింపూర్ జిల్లాలో రేడియో సేవలు లభ్యం ఔతున్నాయి. ఆలిండియా రేడియోకి సంబంధించిన " ఎఫ్.ఎం రెయిన్‌బో ఖేరి "ని 2013 డిసెంబర్ 14న పార్లమెంటు సభ్యుడు అలి నవక్వి చేత స్థాపించబడింది. ఎఫ్.ఎం రెయిన్‌బో ఖేరి ఫ్రీక్వెంసీ (అలల సరళి) 102.3. ఇది చుట్టూ పరిసరాలలో 70 కి.మీ ప్రాంతంలో లభిస్తుంది.
సమాచార వ్యవస్థ
[మార్చు]లఖింపూర్ ఖేర్ జిల్లాలో దేశంలోని అన్ని ప్రముఖ టేలీ కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ సంస్థలు నెట్ వర్క్ సదుపాయాలను అందిస్తున్నాయి. లఖింపూర్ జిల్లా " ఉత్తర ప్రదేశ్ టెలికాం సర్కిల్ "లో పనిచేస్తూ ఉంది. లఖింపూర్ జిల్లా నుండి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చేసే కాల్స్ లోకల్ కాల్స్‌గా పరిగణించబడుతున్నాయి.
జిల్లాలో ఎయిర్సెల్, భారతి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, సెల్వన్, ఐడియా సెల్యులార్ (ఐడియా సెల్యులార్ ), యూనినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా ఇండికాం, [66] వొడాఫోన్ మొదలైన సంస్థలు జిల్లాలో జి.ఎస్.ఎం, సి.డి.ఎం.ఎ, 3జి సేవలు అందిస్తున్నాయి.
- భారతి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, సిఫీ బ్రాడ్‌బాండు సేవలు అందిస్తున్నాయి.
క్రీడలు
[మార్చు]లఖింపూర్ జిలాలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ క్రికెట్, జిల్లాలో పలు లీగ్ క్రికెట్ క్లబ్బులు లీగ్ క్రీడలలో చురుకుగా పాల్గొంటున్నాయి. జిల్లాలో ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ ఇతర క్రీడలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు క్రీడా కార్యకలాపాలు నిర్వహించడం, జట్లు అంతర్ పాఠశాల, ఇంటర్-సిటీ టోర్నమెంట్లు నిర్వహించడం చేస్తున్నారు.
సెయింట్ డాన్ బాస్కో కాలేజ్ వార్షిక మాజీ విద్యార్థి క్రికెట్ టోర్నమెంట్ లో పూర్వ విద్యార్థులు నాటకం, ప్రభుత్వం ఇంటర్ కాలేజ్ వార్షిక జి.ఐ.ఎస్ క్రికెట్ నిర్వహిస్తుంది.
స్టేడియమ్స్
[మార్చు]- మహాత్మా గాంధీ స్టేడియం
- లాల్పూర్ స్టేడియం
- విలోగ్బీ మెమోరియల్ స్టేడియం
చిత్రమాలిక
[మార్చు]-
Swamp Deer (Dudhwa)
-
Swamp Deer (Dudhwa)
-
Deer (Dudhwa)
-
Deer (Dudhwa)
-
Forest view (Dudhwa)
-
Entrance to Park (Dudhwa)
-
Riverside (Dudhwa)
-
Elephants (Dudhwa)
-
Demoiselle Crane (Dudhwa)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "About Lakhimpur-Kheri". Official website Lakhimpur-Kheri. National Informatics Centre. Retrieved 8 May 2013.
- ↑ "Identification of Minority Concentration Districts". Press Information Bureau, Government of India. Ministry of Minority Affairs. Retrieved 8 May 2013.
- ↑ "Rank of Cities on Sanitation 2009-2010: National Urban Sanitation Policynitation policy" (PDF). Ministry of Urban Development website. Government of India. Archived from the original (PDF) on 6 నవంబరు 2013. Retrieved 8 May 2013.
- ↑ "National Parks in Uttar Pradesh". IndiaWildlifeResorts.com. TIS India Business Consultants Pvt Ltd. Archived from the original on 6 ఆగస్టు 2013. Retrieved 8 May 2013.
- ↑ Henry Frowde. The Imperial Gazetteer of India, Vol. XII. Published under the authority of the Secretary of State for India in Council. Oxford, Clarendon Press, 1908.
- ↑ The Imperial Gazetteer of India, Vol. XII, text version
- ↑ http://www.archive.org/stream/imperialgazettee15greauoft/imperialgazettee15greauoft_djvu.txt
- ↑ http://archive.org/stream/imperialgazettee15grea#page/268/mode/2up
- ↑ http://www.mapsofindia.com/maps/uttarpradesh/uttar-pradesh-district.htm
- ↑ http://www.mapsofindia.com/maps/uttarpradesh/districts/lakhimpur.htm
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-24. Retrieved 2014-12-18.
- ↑ Indo-Nepal Water Resource Negotiation: Deepening Divide over Border Project[dead link] - Rakesh Tiwary, South Asia Journal, January - March 2006.
- ↑ Design and Construction of selected Barrages in India (1981), Publication number 149, Central Board of Irrigation and Power, Malcha Marg, Chanakyapuri, New Delhi.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-12-24. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-28. Retrieved 2014-12-18.
- ↑ 16.0 16.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
- ↑ http://ageconsearch.umn.edu/bitstream/119409/2/19-Sanjay-Kumar.pdf
- ↑ http://business.mapsofindia.com/sugar-industry/uttarpradesh.html
- ↑ http://www.bajajhindusthan.com/company-history.php
- ↑ http://www.bajajhindusthan.com/milestones.php
- ↑ http://www.bajajhindusthan.com/index_inner.php?pid=9
- ↑ "Bajaj Hindustan Ltd". The Times Of India.
- ↑ http://www.moneycontrol.com/news/business/sail-to-setsteel-processing-unit-at-lakhimpur-kheri_367503.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-29. Retrieved 2014-12-18.
- ↑ http://www.empoweringindia.org/new/blogs.aspx?st=S26&ac=138[permanent dead link]
- ↑ "Religion in Lakhimpur Kheri" (PDF). a study done by Bharat Sanchar Nigam. Retrieved 19 May 2009.
- ↑ 27.0 27.1 27.2 27.3 27.4 27.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Oregon 3,831,074
- ↑ M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.
- ↑ "Haileybury Roll of Honour: India 1920s". Haileybury School website. Archived from the original on 12 నవంబరు 2013. Retrieved 19 June 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-12. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-07. Retrieved 2014-12-18.
- ↑ http://karavanindia.org/aroundlko/oaltemplesarus%20congregration.htm[permanent dead link]
- ↑ http://timesofindia.indiatimes.com/world/Are-NRIs-Non-Returning-Indians/
- ↑ http://www.fatheroflions.org/ArjanSingh.html
- ↑ http://www.wwfindia.org/news_facts/index.cfm?uNewsID=1160
- ↑ http://india.gov.in/myindia/images/ps_awards.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2014-12-18.
- ↑ http://india.gov.in/myindia/padmashri_awards_list1.php?start=400
- ↑ "Death for 'fuel racket' murderer". BBC News. 2007-03-26. Retrieved 2010-05-07.
- ↑ http://www.indianexpress.com/news/mayas-claim-falls-flat-no-engineer-behind-killing/403547/0
- ↑ "IIM grad's tragedy now on screen - The Times of India". The Times Of India.
- ↑ http://www.indianexpress.com/news/police-seek-lie-detector-test-in-gupta-killi/404721/
- ↑ http://www.amu.ac.in/about3.jsp?did=9109
- ↑ http://www.amu.ac.in/about3.jsp?did=8780
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-12-18.
- ↑ Nature's strongholds: the world's great wildlife reserves – Page 211, ISBN 0-691-12219-9, ISBN 978-0-691-12219-9
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-05-10. Retrieved 2014-12-18.
- ↑ 50.0 50.1 http://www.census2011.co.in/census/district/524-kheri.html
- ↑ "District Profile". Nagar Palika Parishad Lakhimpur Kheri. FA GeoCAD Systems. Archived from the original on 2 జూలై 2013. Retrieved 29 April 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-18. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-24. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-22. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-16. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-16. Retrieved 2014-12-18.
- ↑ http://www.fordschool.umich.edu/news/?news_id=687
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-05. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-11. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-20. Retrieved 2020-05-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-14. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-18. Retrieved 2014-12-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-17. Retrieved 2014-12-18.
- ↑ http://wikimapia.org/8759709/District-Hospital
- ↑ http://wikimapia.org/8759775/District-Women-s-Hospital
- ↑ "Tata Indicom services in Lakhimpur". tataindicom.com. Archived from the original on 11 డిసెంబరు 2008. Retrieved 28 April 2009.
- Pages with non-numeric formatnum arguments
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- All articles with dead external links
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- Pages using bar box without float left or float right
- Commons category link from Wikidata
- Lakhimpur Kheri district
- లక్నో డివిజన్
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు
- భారతదేశం లోని జిల్లాలు
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు