పొద్దుతిరుగుడు నూనె
పొద్దుతిరుగుడు నూనెను పొద్దు తిరుగుడు లేదా సూర్యకాంతి మొక్కయొక్క విత్తనాలనుండి తీయుదురు.పొద్దుతిరుగుడు గింజలనుండి తీసిన నూనె ఆహారయోగ్యమైన వంటనూనె.సూర్యకాం తి మొక్క వృక్షజాతిలో అస్టరేసి (Asteraceae) కుటుంబానికి చెందినమొక్క.మొక్క యొక్క వృక్షశాస్త్ర పేరు హెలియంథస్ అన్నూస్ (helianthus annus).ఈ మొక్క ఆదిమ పుట్తుక స్థలం అమెరికా[1].5వేలసంవత్సరాలక్రితమే అక్కడదీని వునికి వున్నట్లు తెలుస్తున్నది.కీ.పూ.2600 నాటికే పొద్దుతిరుగుడుమొక్కను మెక్సికోలో సాగులోకి తెచ్చినట్లు తెలుస్తున్నది[2].స్పానిష్ పరిశోధకులు దీని ఐరోపాకూ తీసువచ్చారు.మొదట స్పానిష్ లో పెంచబడి, అక్కడినుండి పొరుగురాజాలకు విస్తరించబడినది, [3] ఇది ఏకవార్షికం. ప్రపంచంలో నూనెగింజలకై అత్యధికంగా సాగుచేయబడుచున్నపంటలలో సూర్యకాంతి ఒకటి.చీడపీడలనుతట్టుకొని అత్యధిక దిగుబడి సంకరవంగడాలు అనేకం కనిపెట్టబడినాయి.
మన దేశంలో నెలకు 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరుగుతోందని అంచనా. ఇందులో సన్‌ఫ్లవర్ నూనె వాటా 1.5-2 లక్షల టన్నుల వరకు ఉంటుంది. కానీ మనదేశంలో ఏటా పొద్దుతిరుగుడు పంటతో 60 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనె మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందుకని ఈ నూనె కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి.[4]
- హిందీ, ఒరియా=సూరజ్ముఖి (Surajmukhi) (सूरजमुखी)
- తమిళం, కన్నడ, మళయాళం=సూర్యకాంతి (சூரியகாந்தி) (suryakaanti)
- గుజరాతి, పంజాబీ==సూరజ్ మీఖి (suraj mikhi)
- మణిపూర్= (Numitlei)
ప్రపంచంలో పొద్దుతిరుగుడు పంటను అధికంగా సాగుచేస్తున్న దేశాలు
[మార్చు]ప్రపంచంలో చాలా దేశాలు పొద్దుతిరుగుడు పంటను పండిస్తూన్నాయి.అందులో రష్యా, అర్జెంటినా, టర్కీ, బల్గెరియా, దక్షిణ అమెరికా, చైనా, ఇండియాలో ఈపంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.
భారతదేశంలో సూర్యకాంతి/పొద్దుతిరుగుడు పంటను అధికవిస్తీర్ణంలొ సాగుచేస్తున్న రాష్ట్రాలు
[మార్చు]భారతదేశంలో పొద్దుతిరుగుడు పంటసాగులో కర్నాటకరాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.రెండో స్థానం ఆంధ్ర ప్రదేశ్, మూడోవది మహారాష్ట్ర.బీహారు, హర్యానా, ఉత్తర ప్రదేశ్రాష్ట్రాలలో తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది.
సాగువిధానం
[మార్చు]చాలారకాలభూములో పెరుగుతుంది.నల్లరేగడి భూములు అనుకూలం. విత్తనాన్ని విత్తిన తరువాత మొలకవచ్చేవరకు చల్లని వాతావరణం వుండాలి. మొలక ఏపుగా అయ్యినప్పటినుండి, పూతసమయంవరకు వెచ్చని వాతావరణం వుండాలి, నేల PH 6.5-8.0 మధ్యలో వున్నసరిపోతుంది. పంటకాలం 90-100 రోజులు.హెక్టారుకు విత్తన దిగుబడి 1200-1500 కిలోలు.విత్తనం నల్లటి పెలుసైన పొట్టును కల్గివుండును. విత్తనం రెండు చివరలు దగ్గరిగానొక్కబడి మధ్యభాగం ఉబ్బెత్తుగా, వెడల్పుగా వుండును. విత్తనాన్ని పక్షుల ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. విత్తనంలో నూనె, ప్రోటిన్, పీఛు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భారతదేశంలో ఉత్పత్తిఅయ్యే విత్తానాలో ఉండే పోషకాలకు, విదేశంలో పండే విత్తనాలలో వుండే పోషకాల నిష్పత్తిలో తేడావున్నది.
పొద్దుతిరుగుడు గింజలోవున్న పదార్థాల పట్టిక [5]
పోషక పదార్థం | విదేశ విత్తనం | భారతదేశ విత్తనం |
తేమ% | 3.3-12.8% | 5.0-6.0% |
ముడి మాంసకృత్తులు | 13.5-19.1 | 20.0-30.0 |
నూనె | 22.2-36.5 | 30.0-50.0 |
నూనెలోని అన్ సపొనిఫియబుల్ పదార్థం | 0.8-1.5 | |
పీచు పదార్థం | 23.5-32.3 | 11.0-22.0 |
కాల్చిన ఏర్పడు బూడిద | 2.6-4 | 3.0-6.0 |
నత్రజని | 8.0-20.0 |
నూనె ఉత్పత్తి
[మార్చు]విత్తనాలనుండి నూనెను రెండురకాలుగా ఉత్పత్తిచేయుదురు. ఒకవిధానంలో విత్తనాలను ఎక్సుపెల్లరు అను నూనెతీయు యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు. ఈ పద్ధతిలో నూనెతీయగా మిగులుగా వచ్చు పిండిని గానుగ పిండి లేదా తెలగపిండి అంటారు.ఇందులో 6-10% వరకు నూనె మిగిలివుంటుంది. ఇలా పిండి/గానుగచెక్కలో వున్న నూనెను తిరిగి సాల్వెంట్ ప్లాంట్ అనే పరిశ్రమలో ఆడించి, పిండిళో వున్న మొత్తంనూనెను తీయ్యడం జరుగుతుంది. మరొక పద్ధతిలో గింజలను ఎక్సుట్రూడరు అనేయంత్రం ద్వారా సన్నని ముద్దలాంటి ముక్కలుగా చేసి, దాన్నినేరుగా సాల్వెంట్ ప్లాంట్లో ఆడీంచి నూనెను తీయుదురు.అంతేకాకుండ గ్రామీణస్థాయిలో విద్యుత్తు మోటారుతో తిరిగే గానుగ వంటి రోటరిలలో కూడా పొద్దుతిరుగుడు గింజలనుండి నూనెను తీయుదురు.
నూనె భౌతిక ధర్మాలు-నూనెలోని కొవ్వుఆమ్లాలు
[మార్చు]పొద్దుతిరుగుడులో పలురకాలైన వంగడాలవలన,, పంటపెరిగిన నేల స్వభావం, వాడిన రసాయనిక ఎరువుల ప్రభావం వలన నూనెలోని ఒలిక్, లినొలిక్ ఆమ్లనిష్పత్తి మారడం వలన నూనెయొక్క అయోడిన్ విలువ, సపోనిఫికెసను సంఖ్య,, సాంద్రతలో తేదాలు వుంటాయి.అలాంటి మూడురకాలనూనెలను పట్టికలో ఇవ్వడం జరిగింది.
పొద్దుతిరుగుడు నూనె భౌతిక గుణాల పట్టిక [5][7]
భౌతిక లక్షణం | సగటు పొద్దుతిరుగుడు నూనె | నుసన్ మధ్యస్తంగా ఒలిక్ ఆమ్లమున్న నూనె | అత్యధికంగా ఒలిక్ ఆమ్లమున్ననూనె |
సాంద్రత250C/200C | 0.910-0.923 | 0.914 | 0.909-0.915{250C |
వక్రీభవనసూచిక (ND 40C) | 1.461-1.466 | 1.461-1471 (250C | 1.467-1.472-1 (250C |
సపొనిపికెసన్ విలువ | 188-194 | 190-191 | 182-194 |
అయోడిన్ విలువ | 118-141 | 94-122 | 78-90 |
అన్‌సఫొనిపియబుల్ పధార్దం | ≤1.5 | ≤1.5 | ≤1.5 |
పొద్దుతిరుగుడు వంగడం రకంనుబట్టి నూనె లోని కొవ్వు ఆమ్లాల నిష్పత్తి మారుచుండును.భారతదేశంలో పండు నూనెగింజలలో లినోలిక్ ఆమ్లంలో 40-75% వరకుంటుంది, అలాగే ఒలిక్ ఆమ్లం 19-44% వరకుంటుంది.లినొలిల్ ఆమ్లశాతం నూనెలో పెరిగేకొలది దానియొక్క అయోడిన్ విలువ/సంఖ్య పెరుగుతుంది.కారణం లినొలిక్ బహుద్విబంధాలు (రెండు ద్విబంధాలు) వున్న అసంతృప్తకొవ్వుఆమ్లం.దీనినే బహుబంధాలున్న అసంతృప్తకొవ్వుఆమ్లాలు (ఫ్యూపా:PUFA→Polyunsaturated fatty acids) అంటారు.
నూనెలో సగటుగా లినొలిక్, ఒలిక్ ఆమ్లాలు వున్న పట్టిక [8]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం ( C16:0) | 6.52±1.75 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 1.98±1.44 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 45.39±18.77 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 46.02±16.75 |
లినొలెనిక్ ఆమ్లం (C18:3) | 0.12±0.09 |
భారతదేశంలో పండించు వివిధ వంగడాల/రకాల నూనెలోని కొవ్వుఆమ్లాల నిష్పతి పట్టిక[5]
వంగడం రకం | పామిటిక్ | స్టియరిక్ | ఒలిక్ | లినొలిక్ |
1701 | 6.9 | 3.5 | 18.9 | 70.4 |
1703 | 7.0 | 3.9 | 18. | 70.5 |
1710 | 10.8 | 8.0 | 27.2 | 53.3 |
KSP-9 | 9.0 | 8.1 | 24.7 | 57.4 |
KSP-10 | 7.6 | 5.3 | 24.8 | 61.5 |
camp-7 | 8.3 | 3.2 | 19.5 | 68.8 |
KSR-11 | 6.6 | 4.6 | 20.2 | 68.1 |
EC 68415 | 6.2 | 5.0 | 30.8 | 58.0 |
సరాసరి | 5.9 | 5.8 | 44.0 | 44.3 |
ఎక్కువ శాతం ఒలిక్ ఆమ్లం ఉన్న పొద్దుతిరుగుడు నూనె
[మార్చు]ఈ మధ్యకాలంలో నూనెలో ఎక్కువ శాతంలోఅనగా50-75శాతం వరకు ఓలిక్ ఆమ్లంఉన్న రకానికి చెందిన పొద్దుతిరుగుడు పంటను సాగుచేస్తున్నారు.ముఖ్యంగా CSA-12 రకపు విత్తనాలనుండి వచ్చు నూనెలోఎక్కువశాతం ఒలిక్, పామిటోలిక్ ఆమ్లాలు (ఈ రెండు ఏకద్విబంధమున్న కొవ్వుఆమ్లాలు) ఉండును.[9]
ఎక్కువ ఒలిక్ ఆమ్లాన్ని కలిగిఉన్న పొద్దుతిరుగుడు నూనె భౌతిక లక్షణాలు [10]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం | 3.5-8.0% |
స్టియరిక్ ఆమ్లం | 3.0-7.0% |
పామిటోలిక్ ఆమ్లం | 5.0-7.3%[9] |
ఒలిక్ ఆమ్లం | 75.0%కనిష్ఠం |
లినోలిక్ ఆమ్లం | 5.0-15.0% |
లినోలెనిక్ ఆమ్లం | 0.2%గరిష్ఠం |
పొద్దుతిరుగుడునూనె-వినియోగం
[మార్చు]- అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రథమంగా వినియోగించెది వంటనూనెగా.[5]
- సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు.కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.ఆస్మాను, కొలోన్ క్యాన్సరును నియంత్రణలో ఉంచుతుంది.కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.[11]
- కుసుమ నూనెలో ఉండే ఒమేగా 6.. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
ఇవీ చదవండి
[మార్చు]ఉల్లేఖనాలు/మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ Blackman et al. (2011) [1]. PNAS.
- ↑ Lentz et al. (2008) PNAS.
- ↑ "Sunflower seeds". whfoods.com. Archived from the original on 2015-03-15. Retrieved 2015-03-12.
- ↑ "మన దగ్గరా పొద్దు తిరగాలి". EENADU. Retrieved 2022-03-11.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 SEA,HandBook-2009 by The Solvent Extractors Association of India
- ↑ "Sunflower". flowersofindia.net. Retrieved 2015-03-12.
- ↑ http://www.sunflowernsa.com/uploads/resources/51/warner_.pdf/ Archived 2013-01-08 at the Wayback Machine KATHLEEN WARNER1 , BRADY VICK2 , LARRY KLEINGARTNER3 , RUTH ISAAK3 , AND KATHI DOROFF4
- ↑ Studies on the Fatty Acid Composition of Edible Oil K. Chowdhury, L. A. Banu, S. Khan and A. Latif IFST, BCSIR, Dhaka-1205, Bangladesh
- ↑ 9.0 9.1 "Chemical and physical properties of a sunflower oil with high levels of oleic and palmitic acids". onlinelibrary.wiley.com. Retrieved 2015-03-12.
- ↑ "SUNFLOWER OIL, HIGH OLEIC" (PDF). brenntagspecialties.com. Retrieved 2015-03-12.[permanent dead link]
- ↑ "20 Best Benefits Of Sunflower Oil For Skin, Hair And Health". stylecraze.com. Retrieved 2015-03-12.