Coordinates: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E / 14.435345; 79.969826

నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 59.164.192.208 (చర్చ) చేసిన మార్పులను, Malyadri వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 52: పంక్తి 52:


==పరిశ్రమలు==
==పరిశ్రమలు==
అభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నాపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు, ఉన్నాయి.
అభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.


==విద్యాలయాలు==
==విద్యాలయాలు==

19:35, 21 ఏప్రిల్ 2010 నాటి కూర్పు


  ?నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E / 14.435345; 79.969826
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13,076 కి.మీ² (5,049 చ.మై)
దూరాలు
చెన్నై నుండి
ఒంగోలు నుండి
తిరుపతి నుండి

• 165 కి.మీలు ఉ (భూమార్గం)
• 125 కి.మీలు ద (భూమార్గం)
• 135 కి.మీలు ఈ (భూమార్గం)
ముఖ్య పట్టణం నెల్లూరు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
26,60,000 (2001 నాటికి)
• 203/కి.మీ² (526/చ.మై)
• 604000
• 1341000
• 1319000
• 65.9
• 74.45
• 57.24

నెల్లూరు, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ముఖ్య పట్టణము, మండలము, లోకసభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌ కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం కలదు. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి(మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కలదు. రాష్టృంలో అత్యంత వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి.జనాభా సుమారు 5 లక్షలు.

చరిత్ర

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) అల్లా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.శ్రీ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం


నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉన్నది. 1956 నవంబరు 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కిందికి వచ్చింది.

విశేషాలు

విజయవాడ, చెన్నై నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.

నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్ హాం కాలువ ఉంది.

నెల్లూరులో తెలుగు సినిమాలకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ఇక్కడే చదివాడు.

నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు ఆంధ్ర రాష్త్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు , హాస్య నటుడు రమణా రెడ్డి, సినీ ప్రముఖుడు సింగీతం శ్రీనివాసరావు, అలనాటి సినిమా నటుడు,దర్శకుడు వై.వి. రావు, ఆచార్య ఆత్రేయ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి(మాజీ మంత్రి), ఆంధ్ర రాష్త్ర ద్వితీయ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి,కమ్యూనిష్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య గారు మొదలైనవారు.

నెల్లూరులో సాంస్కృతిక సేవా రంగాలు

పరిశ్రమలు

అభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.

విద్యాలయాలు

  • విక్రమసింహపురి విశ్వవిద్యాలయం
  • వెంకటగిరి రాజా కళాశాల.
  • దొడ్ల కవుశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల.
  • సర్వోదయా కళాశాల.
  • ప్రభుత్వ బి.ఇ.డి కళాశాల.
  • ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాల.

బ్యాంకులు

జాతీయ బాంకులు

ప్రైవేటు బాంకులు

సంస్కృతి

సినిమాథియేటర్లు

  • అర్చన 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • గోపిక ఏ/సి,
  • ఇందిరా ఏ/సి,
  • కళ్యాణి ఏ/సి,
  • కనక మహల్(మూసివేయబడినది),
  • కావేరి 70ఎమ్.ఎమ్. A/C
  • కృష్ణా ఏ/సి,
  • లీలా మహల్ ఏ/సి,
  • మాధవ్ ఏ/సి,
  • నర్తకి 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • కొత్తహాలు
  • వినాయక హాలు
  • పద్మావతి ఏ/సి,
  • రాధ ఏ/సి,
  • వెంకట రమణ 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • సెవెన్ హిల్స్ ఏ/సి,
  • అనిత డీలక్స్


క్రొత్తవి:

  • సిరి మల్టీ ప్లెక్ష్ ( రెండు హాలులు ), ఏ/సి.

నెల్లూరు చిత్రపటం

ఇతర సమాచారం

  • నెల్లూరు గ్రామ దేవత : ఇరుకళల పరమేశ్వరి
  • నెల్లూరు పిన్ కోడ్ : 524001
  • నెల్లూరు టెలిపోన్ యస్.టి.డి కోడ్ : 0861
  • నెల్లూరు ఆర్టీసీ మరియు షాట్ కట్ కోడ్: ఎన్ ఎల్ ఆర్

రవాణా సౌకర్యాలు

నెల్లూరు నగరం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

దేవాలయాలు

  • నెల్లూరు జిల్లా అనేక ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. వాటిలో కొన్ని అద్భుతమైనవి.
    • శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం - పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం).
    • శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు
    • భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి గొలగమూడి
    • శ్రీ కామాక్షితాయి ఆలయం, జొన్నవాడ
    • శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, నరసింహ కొండ
    • చంగాళ్లమ్మ గుడి, సూళ్లూరుపేట
    • పెనుశిల నరసింహస్వామి ఆలయం, పెంచలకోన
    • సోమేశ్వర స్వామి ఆలయం, సోమశిల
    • జ్వాలాముఖి అమ్మవారు, నెల్లూరు జిల్లా.
    • సాయిబాబా గుడి
    • వినాయకుని గుడి
    • కన్యకాపరమేశ్వరి ఆలయం
    • మస్తానయ్య దర్గా నెల్లూరు

పండుగలు /తిరునాళ్ళు

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • రొట్టెల పండుగ : మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.

నెల్లూరి వంటలు

నెల్లూరు చెపల పులుసు, మలైకాజ

మూలాలు


చిత్రమాల

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నెల్లూరు&oldid=506556" నుండి వెలికితీశారు