Coordinates: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E / 14.435345; 79.969826

నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: mg:Nellore
చి r2.7.3) (బాటు: ta:நெல்லூர் వర్గాన్ని ta:சிறி பொட்டி சிறி ராமுலு மாவட்டம்కి మార్చింది
పంక్తి 196: పంక్తి 196:
[[en:Nellore]]
[[en:Nellore]]
[[hi:नेल्लोर]]
[[hi:नेल्लोर]]
[[ta:சிறி பொட்டி சிறி ராமுலு மாவட்டம்]]
[[ta:நெல்லூர்]]
[[ar:نيلور]]
[[ar:نيلور]]
[[bpy:নেল্লরে]]
[[bpy:নেল্লরে]]

22:45, 3 మార్చి 2013 నాటి కూర్పు

  ?నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E / 14.435345; 79.969826
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13,076 కి.మీ² (5,049 చ.మై)
దూరాలు
చెన్నై నుండి
ఒంగోలు నుండి
తిరుపతి నుండి

• 165 కి.మీలు ఉ (భూమార్గం)
• 125 కి.మీలు ద (భూమార్గం)
• 135 కి.మీలు ఈ (భూమార్గం)
ముఖ్య పట్టణం నెల్లూరు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
26,60,000 (2001 నాటికి)
• 203/కి.మీ² (526/చ.మై)
• 604000
• 1341000
• 1319000
• 65.9
• 74.45
• 57.24
దస్త్రం:Tikkana place.jpg
తిక్కన సాహిత్య రచన చేసిన ప్రదేశంనెల్లూరు

నెల్లూరు, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ముఖ్య పట్టణము, మండలము, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌ కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం కలదు. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి(మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కలదు. రాష్టృంలో అత్యంత వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి.జనాభా సుమారు 5 లక్షలు.

చరిత్ర

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) అల్లా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పొట్టి శ్రీరాములు పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉన్నది. 1956 నవంబరు 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లో భాగమైంది.

విశేషాలు

నెల్లూరులో సాంస్కృతిక సేవా రంగాలు

తెలుగు సాంస్కృతిక సేవలో నెల్లూరు పేరు గాంచినది. కవిత్రయంలోని తిక్కన మహాభారతం లో ని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించారు.

పరిశ్రమలు

అభ్రకం ఉత్పత్తి లో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.

విద్యాలయాలు

  • విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
  • వెంకటగిరి రాజా కళాశాల.
  • దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల.
  • సర్వోదయా కళాశాల.
  • ప్రభుత్వ బి.ఇ.డి కళాశాల.
  • ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాల.
  • వేద సంస్కృత కళాశాల.
  • రత్నం కాన్సెప్ట్ స్కూల్ (గాయత్రి నగర్)
  • ప్రియదర్షిని (యమ్.సి.ఎ ‍‍‍మరియు యమ్.బి ఎ)

బ్యాంకులు

జాతీయ బాంకులు

ప్రైవేటు బాంకులు

సంస్కృతి

పినాకిని బన్క్

సినిమాథియేటర్లు

  • అర్చన 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • గోపిక ఏ/సి,
  • ఇందిరా ఏ/సి,
  • కనక మహల్(మూసివేయబడినది),
  • లీలా మహల్ ఏ/సి,
  • మాధవ్ ఏ/సి,
  • నర్తకి 70ఎమ్.ఎమ్. ఏ/సి,
  • కొత్తహాలు
  • వినాయక హాలు
  • రాధ ఏ/సి,

,

  • అనిత డీలక్స్


క్రొత్తవి:

  • సిరి మల్టీ ప్లెక్స్ ( రెండు హాలులు ),
  • S2 ముల్టిప్లెక్స్ (మూడు హాలులు).

నెల్లూరు చిత్రపటం

ఇతర సమాచారం

  • నెల్లూరు గ్రామ దేవత : ఇరుకళల పరమేశ్వరి
  • నెల్లూరు పిన్ కోడ్ : 524001
  • నెల్లూరు టెలిపోన్ యస్.టి.డి కోడ్ : 0861
  • నెల్లూరు ఆర్టీసీ మరియు షాట్ కట్ కోడ్: ఎన్ ఎల్ ఆర్

రవాణా సౌకర్యాలు

నెల్లూరు నగరం చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్‌ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. www.gedm.in

దేవాలయాలు

bhirava kona ghatika siddeswaralam

పండుగలు /తిరునాళ్ళు

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:

  • రొట్టెల పండుగ : మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.ఈ రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారా లు వున్నాయి. 1905 లో ఈ దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.

బారా షహీద్ దర్గా కధ: యుద్దంలో పన్నెండు మంది వీరులు నెల్లూరు కు దగ్గరలో గండవరం వద్ద అమరులయ్యారు.తలలు లేని ఆ వీరుల దేహాలను గుర్రాలు ఇక్కడకు మోసుకొస్తాయి.భక్తులు ఆ ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ఆర్కాటునవాబు ఒక సారి ఆ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కధనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.మత సామరస్యం కు ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు ,అనుమసముద్రం పేటలలోని దర్గాల ను కూడా సందర్శిస్తారు. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,వీసా రొట్టె,అభివృద్ధి రొట్టె,సమైక్యాంధ్ర రొట్టె...ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు .

నెల్లూరి వంటలు

నెల్లూరు చేపల పులుసు, మలైకాజ

మూలాలు


బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నెల్లూరు&oldid=803537" నుండి వెలికితీశారు