Jump to content

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

వికీపీడియా నుండి
వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
జననం(1957-11-30)1957 నవంబరు 30
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం2021 జనవరి 5(2021-01-05) (వయసు 63)
చెన్నై, తమిళనాడు
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లువెన్నెలకంటి
వృత్తి1979 లో స్టేట్ బ్యాంకు - చంద్రగిరి లో ఉద్యోగం
ప్రసిద్ధిసినిమా మాటల, పాటల రచయిత
మతంహిందూ
భార్య / భర్తప్రమీలాకుమారి
పిల్లలుశశాంక్ వెన్నెలకంటి,
రాకేందు మౌళి
తల్లిపద్మావతమ్మ

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (నవంబరు 30, 1957 - జనవరి 5, 2021) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు.[1][2][3][4][5]

జీవిత విషయాలు

[మార్చు]

వెన్నెలకంటి 1957, నవంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించాడు.[6] విద్యాభ్యాసం కూడా నెల్లూరులోనే జరిగింది. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవాడు. కళాశాల రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవాడు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలూ రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు.[7] 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంధ్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించాడు.

సినిమారంగం

[మార్చు]

1986లో నటుడు, నిర్మాత డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసాడు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత 1987లో నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో అన్నా చెల్లెలు సినిమాలో ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ అనే పాట రాశాడు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించాడు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసాడు. కమల్ హాసన్ నటించిన సత్యభామ సినిమాకు డబ్బింగు వ్రాసాడు. సుమారు 2000 పాటలు వ్రాసాడు.

ఇతని కుమారులు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, రాకేందు మౌళి సినిమా గీతరచయితగాను ఎదుగుతున్నారు.[8]

సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

వెన్నెలకంటి చెన్నైలోని తన నివాసంలో 2021, జనవరి 5న గుండెపోటుతో మరణించాడు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. Students showcase talent at youth fest - The Hindu
  2. "All movies of Vennelakanti Rajeswara Prasad | Cinveda - Indian Movies - Hindi, Tamil, Telugu". Archived from the original on 2014-02-22. Retrieved 2015-11-30.
  3. A literary treat at Ugadi festivities - The Hindu
  4. Karthee's upbeat - The Hindu
  5. Raaga - Telugu - Lyricist - Vennalakanti
  6. సాక్షి, సినిమా (5 January 2021). "ప్రముఖ పాటల రచయిత కన్నుమూత". Sakshi. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
  7. ఈనాడు, సినిమా (5 January 2021). "ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
  8. వై.సునీతా, చౌదరి (8 July 2012). "Chip off the old block". ది హిందూ. Retrieved 30 November 2017.
  9. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (5 January 2021). "పాటల, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు". www.andhrajyothy.com. Archived from the original on 5 January 2021. Retrieved 5 January 2021.
  10. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.

ఇతర లింకులు

[మార్చు]