ఆదిశేషుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు, రారాజు. ఈతని అంశలోనే రామాయణంలో లక్ష్మణుడు జన్మించాడు. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు. వేయి పడగల నుంచీ నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది. ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది.
విషయ సూచిక |
[మార్చు] స్వరూపం
అనంత విశ్వం లో గానీ లేదా అనంత సాగరంలోగానీ చుట్టలు చుట్టలుగా పడుకుని శ్రీ మహావిష్ణువుకు శయ్యగా ఉన్నట్లు ఆదిశేషుని గురించి పురాణాల్లో వర్ణించబడి ఉంటుంది. కొన్ని చోట్ల ఐదు తలలు, కొన్ని చోట్ల ఏడు తలలు ఉన్నట్లు చూపించినా సాధారణంగా ఆదిశేషుడికి కొన్ని వందల తలలు ఉంటాయి.
[మార్చు] దేవాలయాలు
- తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆదిశేషుని మీద శయనిస్తున్న విష్ణుమూర్తి నేత్రానందకరంగా దర్శనమిస్తారు.
- తిరువళ్ళూరు లో శ్రీ మహావిష్ణువు శేషపానుపు పై పయనించిన వీరరాఘవ స్వామిగా దర్శనమిస్తాడు.
- నెల్లూరు లో రంగనాయకుల స్వామి కూడా ఆదిశేషుడిపై శయనించినట్లుగా ఉంటుంది.
[మార్చు] విశేషాలు
- భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకచోట సర్పాలలో ఆదిశేషుడు ఆయన అంశే అని చెబుతాడు.
- రామాయణంలో లక్ష్మణుడు ఆదిశేషుని అంశగా చెబుతారు. అలాగే బలరాముడు, నిత్యానంద ప్రభువు , పతంజలి కూడా ఆదిశేషువు అంశలే అని చెప్పబడుతున్నాయి.
- మహాభారతం లోని ఆది పర్వం ప్రకారం ఆదిశేషుని తండ్రి కశ్యపుడు, తల్లి కద్రువ.
- ఆది శేషుడు అంశయైన వాసుకి అనే సర్పం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నపుడు తాడులా ఉపయోగపడింది.
[మార్చు] బయటి లింకులు
- The Glories of Lord Ananta (from Srimad Bhagavatam)
- Ananta Sesha - The Legendary Serpent
- Maha-Vishnu & Ananta Sesha
- Image of ancient Vishnu and Sesha deity form
- Official Website of His Grace Sriman Sankarshan Das Adhikari, disciple of His Holiness A.C. Bhaktivedanta Swami Prabhupada
|
|||||||||||||||||||||||