Jump to content

సచిన్ టెండుల్కర్

వికీపీడియా నుండి
సచిన్ టెండూల్కరె
2017 లో సచిన్ టెండూల్కరె
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సచిన్ రమేష్ టెండూల్కర్
పుట్టిన తేదీ (1973-04-24) 1973 ఏప్రిల్ 24 (వయసు 51)
బొంబాయి, మహారాష్ట్ర
మారుపేరులిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్ [1][2]
ఎత్తు165 cమీ. (5 అ. 5 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగు
  • కుడిచేతి వాటం లెగ్‌బ్రేక్
  • కుడిచేతి వాటం ఆఫ్‌బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 187)1989 నవంబరు 15 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2013 నవంబరు 14 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 74)1989 డిసెంబరు 18 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2012 మార్చి 18 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.10 (formerly 99, 33)
ఏకైక T20I (క్యాప్ 11)2006 డిసెంబరు 1 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988–2013ముంబై క్రికెట్ జట్టు
1992యార్క్‌షైర్
1994ఈస్ట్ బెంగాల్ క్రికెట్ క్లబ్[3]
2008–2013ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 10)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 200 463 310 551
చేసిన పరుగులు 15,921 18,426 25,396 21,999
బ్యాటింగు సగటు 53.78 44.83 57.84 45.54
100లు/50లు 51/68 49/96 81/116 60/114
అత్యుత్తమ స్కోరు 248* 200* 248* 200*
వేసిన బంతులు 4,240 8,054 7,605 10,230
వికెట్లు 46 154 71 201
బౌలింగు సగటు 54.17 44.48 61.74 42.17
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/10 5/32 3/10 5/32
క్యాచ్‌లు/స్టంపింగులు 115/– 140/– 186/– 175/–
మూలం: ESPNcricinfo, 2013 నవంబరు 15
Member of Parliament, Rajya Sabha
In office
27 April 2012 – 26 April 2018
నియోజకవర్గంNominated
సంతకం

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు.

2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.[4] . 2003లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారాను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ [5][6] అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..[7][8][9]

2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

బాల్యం, కుటుంబ జీవితం

[మార్చు]

సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997), అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999.[10]

క్రీడా జీవితం

[మార్చు]

ప్రారంభ రోజులు

[మార్చు]

తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాల హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి.

పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదులో 2006లో జరిగిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేదించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.

దేశవాళీ క్రికెట్

[మార్చు]

1988/1989లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగష్టులో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.

టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994 మార్చి 27న ఆక్లాండ్ వన్డేలో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు.[11] టీమ్ ఇండియా రెగ్యులర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూకు మెడ పట్టేయడంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. కెప్టెన్ అజారుద్దీన్ సచిన్ ను ఓపెనింగ్ కు పంపించాడు. ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 ((15 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులను సాధించాడు.[12] సచిన్ టెండుల్కర్ 1994, సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకం సాధించడంకోసం 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

1996 ప్రపంచ కప్ : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే షేన్‌వార్న్, రోబర్ట్ సన్ లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.[13]

1999 ప్రపంచ కప్ : 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.[14]

క్రీజ్ లో ఉద్యుక్తూడవుతున్న సచిన్.

షేర్‌వార్న్ కు సింహస్వప్నం : 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం[15].

నాయకత్వం : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది.[16] ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది.

2003 ప్రపంచ కప్ : 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.

అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డిసెంబర్ 10, 2005ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.

పేలవ ప్రదర్శన : మార్చి 19, 2006 తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకొనివచ్చింది.[17] క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ దే అత్యధిక స్కోరు.[18] అయిననూ ఆ 3 టెస్టుల సీరీస్ లో అతనిది కనీసం ఒక్క అర్థ శతకం కూడా లేదు.

పాకిస్తాన్ XI తో జరిగిన అనధికార ట్వంటీ-20 మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిల్చి ఇంటర్నేషనల్ XI గెలుపుకు కారణమయ్యాడు.

జనవరి 2007లో వెస్ట్ఇండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు.[19]

2007 ప్రపంచ కప్ : వెస్ట్ఇండీస్ లో జరిగిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడా పై 57* పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయికి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు.[20]

ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమర్శకులకు నోళ్ళు మూయించాడు. దక్షిణాఫ్రికాతో సీరీస్ లో కూడా రెండు సార్లు 90 కి పైగా పరుగులు చేసాడు.[21] ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ చేజిక్కించుకున్నాడు. ఫ్యూచర్ కప్లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్ గా నిల్చాడు.[22]

11000 పరుగులు పూర్తి : జూలై 28, 2007 నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.[23]

2007 అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్ లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిల్చాడు.[24]

1997లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసాడు. ఆ తర్వాత 1999, 2001, 2002 లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు.

ఇక వన్డేలో ఒకే క్యాలెండర్ సం.లో 1000 పరుగులు సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశాడు.1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007 లలో ఈ ఘనత సాధించాడు. 1998లో ఇతను వన్డేలలో 1,894 పరుగులు సాధించాడు. ఇది ఒకే క్యాలెండర్ సం.లో ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు.

టెస్ట్ కెప్టెన్సీకి విముఖత : నవంబర్ 6, 2007 న టెండుల్కర్ వ్యక్తిగత కారణాల వల్ల టెస్టు నాయకత్వం వహించడానికి విముఖత ప్రదర్శించాడు. దీంతో నాయకత్వ వేట మొదలై చివరికి అనిల్ కుంబ్లేకు ఈ కిరీటం లభించింది.

బౌలర్ ఎండ్ వద్ద మాస్టర్ బ్లాస్టర్

సచిన్ టెండుల్కర్ ఎన్నో సెంచరీలు సాధించిననూ సెంచరీలకు చేరువలో అవుటైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 -100 మధ్య స్కోరులో ఔటైనాడు. ఇటీవలే సెప్టెంబర్ 8, 2007పాకిస్తాన్ పై మొహాలీ వన్డేలో 99 పరుగుల వద్ద ఔటైనాడు. అదే పాకిస్తాన్ పై సెప్టెంబర్ 15, 2007గ్వాలియర్ వన్డేలో 97 పరుగులకు ఔటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఔటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సం.లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమాయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్నా అర్థ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

50వ టెస్ట్ సెంచరి  : డిసెంబర్ 19, 2010 న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ మీద 100 వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సచిన్ సాధించిన రికార్డులు

[మార్చు]

వన్డే రికార్డులు

[మార్చు]
  • వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)
  • అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
  • వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు)
  • అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.
  • అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18426 పరుగులు)
  • 10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడు.
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)
  • సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609) 1996-2007 మధ్య వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్ - సౌరవ్ గంగూలీ అత్యంత గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 136 ఇన్నింగ్స్ ల్లో క్రీజును పంచుకొని.. రెండుసార్లు నాటౌట్ గా నిలిచారు. వీరి అత్యధిక భాగస్వామ్యం 258. 49.32 సగటుతో 6,609 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ - మ్యాథ్యూ హెడెన్ 114 ఇన్నింగ్స్ ల్లో 5,372 పరుగులు చేసి.. వన్డే క్రికెట్ లో రెండో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.[12]
  • వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.
  • 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ రికార్డులు

[మార్చు]
  • పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు.
  • టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
  • టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు)
  • 20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
  • కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
  • అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.
  • అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (15837)
  • అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)
  • 12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.
  • విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
  • ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

[మార్చు]

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను ఎనిమిదవ స్థానంలో ఎంపికైయ్యాడు.[25]

చిత్రమాలిక

[మార్చు]

ప్రపంచ కప్ రికార్డులు

[మార్చు]
  • ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (2000+ పరుగులు)
  • 2003 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (673 పరుగులు)
  • 1996 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (523 పరుగులు)

అవార్డులు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

మీడియా గుర్తింపులు

[మార్చు]
  • 2003 ఆగస్ట్లో జీన్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడావ్యక్తిగా ఎన్నికైనాడు.[27]
  • 2006 నవంబర్లో టైంమేగజైన్‌చే ఏషియన్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందినాడు.[28]
  • 2006 డిసెంబర్లో స్పోర్ట్స్ పర్సన్ ఆప్ ది ఇయర్‌గా పేరుసంపాదించాడు.[29]
  • 2010 అక్టోబర్ లండన్లో జరిగిన ద ఆసియన్ అవార్డ్స్ వేడుకల్లో ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, పీపుల్స్ ఛాయస్ అవార్డులు గ్రహించాడు.

టెస్ట్ మ్యాచ్ అవార్డులు

[మార్చు]

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు

# సీరీస్ సీజన్ సీరీస్ లో చూపిన ప్రతిభ
1 బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ సీరీస్ (ఆస్ట్రేలియా తో) 1997/98 446 (3 మ్యాచ్ లు, 5 ఇనింగ్సులు, 2x100, 1x50) ; 13.2-1-48-1; 2 Catches
2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫి టెస్ట్ సీరీస్ (ఆస్ట్రేలియా తో) 1999/00 278 పరుగులు (6 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 9-0-46-1
3 ఇంగ్లాండుతో టెస్ట్ సీరీస్ 2001/02 307 పరుగులు (4 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 17-3-50-1; 4 క్యాచ్ లు
4 బంగ్లాదేశ్ ఔస్రత్రిల 2007 254 పరుగులు (3 ఇన్నింగ్సులు, 2x100, 0x50) ; 6.3-1-35-2; 2 క్యాచ్ లు
5 బోర్డర్ గవాస్కర్ ట్రోఫిటెస్ట్ సీరీస్ (ఆస్ట్రేలియా తో) 2010 403 పరుగులు (3 ఇన్నింగ్సులు, 1x200, 2x50) ;

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు

క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ లో చూపిన ప్రతిభ
1 ఇంగ్లాండు ఓల్డ్ ట్రఫర్డ్, మాంచెస్టర్ 1990 మొదటి ఇన్నింగ్స్: 68 (8x4) ; 2 మ్యాచ్ లు

రెండో ఇన్నింగ్స్: 119 (17x4)

2 ఇంగ్లాండు ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1992/93 మొదటి ఇన్నింగ్స్: 165 (24x4, 1x6) ; 2-1-5-0

రెండో ఇన్నింగ్స్: 2 క్యాచ్ లు; 2-1-4-0

3 న్యూజీలాండ్ ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1995/96 మొదటి ఇన్నింగ్స్: 52 (5x4)
4 ఆస్ట్రేలియా ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1997/98 మొదటి ఇన్నింగ్స్: 4 (1x4) ; 1 Catch

రెండో ఇన్నింగ్స్: 155 (14x4, 4x6)

5 పాకిస్తాన్ ఎం.ఏ.చిదంబరం స్టేడియం, చేపాక్, చెన్నై 1998/99 మొదటి ఇన్నింగ్స్: 0; 3-0-10-1

రెండో ఇన్నింగ్స్: 136 (18x4) ; 7-1-35-2

6 న్యూజీలాండ్ Motera, Ahmedabad 1999/00 మొదటి ఇన్నింగ్స్: 217 (29x4)

రెండో ఇన్నింగ్స్: 15 (3x4) ; 5-2-19-0

7 ఆస్ట్రేలియా మెల్బోర్న్ 1999/00 మొదటి ఇన్నింగ్స్: 116 (9x4, 1x6)

రెండో ఇన్నింగ్స్: 52 (4x4)

8 దక్షిణాఫ్రికా వాంఖేడే స్టేడియం, ముంబాయి 1999/00 మొదటి ఇన్నింగ్స్: 97 (12x4, 2x6) ; 5-1-10-3

రెండో ఇన్నంగ్స్: 8 (2x4) ; 1-0-4-0

9 వెస్ట్‌ఇండీస్ ఈడెన్ గార్డెన్ కోల్కత 2002/03 మొదటి ఇన్నింగ్స్: 36 (7x4) ; 7-0-33-0

రెండో ఇన్నింగ్స్: 176 (26x4)

10 ఆస్ట్రేలియా సిడ్నీ 2003/04 మొదటి ఇనింగ్స్: 241 (33x4)

2వ ఇన్నింగ్సు: 60 (5x4) ; 6-0-36-0; 1 Catch

11 ఆస్ట్రేలియా అడిలైడ్ 2007/08 మొదటి ఇనింగ్స్: 153 (3x6) (13x4)

2వ ఇన్నింగ్సు: 13 (1x4) ;

వన్డే అవార్డులు

[మార్చు]

టెండుల్కర్ వన్డే క్రికెట్ లో 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ (MoS), 56 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (MoM) అవార్డులు పొందినాడు.[30] టెస్ట్ మ్యాచ్ లు ఆడే అన్ని దేశాలపై ఆడి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. UAE (2 మ్యాచ్ లు), నెదర్లాండ్ (1 మ్యాచ్ ), బెర్మూడా (1 మ్యాచ్ ) లపై మాత్రమే అతడు వన్డే క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందలేడు.

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు :

# సీరీస్ (ప్రత్యర్థులు) సీజన్ సీరీస్ గణాంకాలు
1 సింగర్ సీరీస్ (ఆస్ట్రేలియా, శ్రీలంక) [31] 1994 136 (4 మ్యాచ్‌లు & 3 ఇన్నింగ్సులు, 1x100)
2 విల్స్ వరల్డ్ కప్ (వెస్ట్‌ఇండీస్, దక్షిణాఫ్రికా) 1994/95 285 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 39-4-155-8; 1 క్యాచ్
3 వెస్ట్‌ఇండీస్ పర్యటన 1994/95 246 Runs (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 16-0-93-1; 1 క్యాచ్
4 సిల్వర్ జూబ్లీ ఇండెపెండెన్స్ కప్ (బంగ్లాదేశ్, పాకిస్తాన్) 1997/98 258 పరుగులు (5 ఇన్నింగ్సులు, 3x50) ; 23.3-0-148-5; 6 క్యాచ్‌లు
5 కోకాకోలా కప్ (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) 1997/98 435 పరుగులు (5 ఇన్నింగ్సులు, 2x100, 1x50) ; 19-0-101-2
6 జింబాబ్వే పర్యటన 1998/99 158 పరుగులు (3 ఇన్నింగ్సులు, 1x100) ; 6-0-41-0; 1 క్యాచ్
7 కోకాకోలా చాంపియన్‌షిప్ (జింబాబ్వే, శ్రీలంక) 1998/99 274 పరుగులు (5 ఇన్నింగ్సులు, 2x100) ; 14-0-51-2; 1 క్యాచ్
8 దక్షిణాఫ్రికా పర్యటన 1999/00 274 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 1x50) ; 49-1-219-6; 1 క్యాచ్
9 కోకా కోలా కప్ (వెస్ట్‌ఇండీస్, జింబాబ్వే) 2001 282 పరుగులు (5 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 4-0-25-0
10 ఇంగ్లాండు పర్యటన 2001/02 266 పరుగులు (6 ఇన్నింగ్సులు, 2x50) ; 30.5-158-2; 3 క్యాచ్‌లు
11 2003 ప్రపంచ కప్ క్రికెట్ 2002/03 673 పరుగులు (11 ఇన్నింగ్సులు, 1x100, 6x50) ; 18-0-77-2; 4 క్యాచ్‌లు
12 TVS కప్ (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) 2003/04 466 పరుగులు (7 ఇన్నింగ్సులు, 2x100, 2x50) ; 21-0-125-1
13 వెస్ట్‌ఇండీస్ పర్యటన 2006/07 191 పరుగులు (4 ఇన్నింగ్సులు, 1x100, 1x50) ; 23-0-112-4
14 ఫ్యూచర్ కప్ (దక్షిణాఫ్రికాతో) [32][33] 2007 200 పరుగులు (3 మ్యాచులు, 3 ఇన్నింగ్సులు, 2x50)

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు — సచిన్ టెండుల్కర్
# ప్రత్యర్థి మొత్తం స్వదేశంలో విదేశాల్లో తటస్థ వేదికలపై
1 ఆస్ట్రేలియా (47 మ్యాచ్ లు) 10 5 0 5
2 బంగ్లాదేశ్ (10 మ్యాచ్ లు) 1 0 0 1
3 ఇంగ్లాండు (27 మ్యాచ్ లు) 2 0 1 1
4 న్యూజీలాండ్ (38 మ్యాచ్ లు) 5 4 1 0
5 పాకిస్తాన్ (61 మ్యాచ్ లు) 7 1 1 5
6 దక్షిణాఫ్రికా (50 మ్యాచ్ లు) 4 3 1 0
7 శ్రీలంక (65 మ్యాచ్ లు) 5 1 1 3
8 వెస్ట్‌ఇండీస్ (38 మ్యాచ్ లు) 9 3 1 5
9 జింబాబ్వే (34 మ్యాచ్ లు) 8 0 4 4
10 కెన్యా (10 మ్యాచ్ లు) 4 2 0 2
11 నమీబియా (1 మ్యాచ్ ) 1 0 0 1
మొత్తం (381 మ్యాచ్ లు) 56 19 10 27

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sachin Tendulkar: How the Boy Wonder became Master Blaster". NDTV. 6 November 2013. Archived from the original on 16 November 2013. Retrieved 17 November 2013.
  2. Gupta, Gaura (13 November 2013). "Top guns salute Master Blaster Sachin Tendulkar". The Times of India. Archived from the original on 18 November 2013. Retrieved 17 November 2013.
  3. "THROWBACK: When Sachin Tendulkar captained East Bengal in P. Sen Trophy!". BADGEB.com. Archived from the original on 25 April 2020. Retrieved 25 April 2020.
  4. The Tribune http://www.tribuneindia.com/2002/20021214/sports.htm#4. December 14, 2002
  5. "'The Hindu' Indian National Newspaper Article on Sachin's 34th Century". Archived from the original on 2008-05-03. Retrieved 2007-11-25.
  6. BBC Article, Tendulkar achieves superhero status
  7. "Tendulkar is Shane Warne's Greatest". Archived from the original on 2012-12-09. Retrieved 2007-11-25.
  8. "The Best Cricketer". Archived from the original on 2008-06-08. Retrieved 2007-11-25.
  9. Tendulkar is greatest, says Pakistan's Captain Inzamam
  10. క్రిక్‌ఇన్ఫో వెబ్సైటులో సచిన్ టెండుల్కర్‌కు కొడుకు పుట్టిన వార్త., మార్చి 9, 2010న సేకరించారు.
  11. Cricinfo Ind v NZ March 27, 1994 match report
  12. 12.0 12.1 "30 ఏళ్ల క్రితం సచిన్‌ ఆట మొదలైంది ఈ రోజే." EENADU. 2024-03-27. Archived from the original on 2024-03-27. Retrieved 2024-03-30.
  13. SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004
  14. "Report on 1999 WorldCup match against Kenya". Archived from the original on 2009-05-04. Retrieved 2007-11-25.
  15. SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004
  16. "Cricinfo match report AUS v IND 3rd Test 26-30 December 1999". Archived from the original on 11 అక్టోబరు 2007. Retrieved 25 నవంబరు 2007.
  17. India Daily http://www.indiadaily.org/entry/sachin-tendulkar-booed-by-wankhede-crowd/ Archived 2006-10-11 at the Wayback Machine March 20, 2006
  18. http://ind.cricinfo.com/db/ARCHIVE/2005-06/ENG_IN_IND/SCORECARDS/ENG_IND_T3_18-22MAR2006.html
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-07-06. Retrieved 2007-11-25.
  20. http://news.bbc.co.uk/sport1/hi/cricket/6509767.stm
  21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-26. Retrieved 2007-11-25.
  22. http://stats.cricinfo.com/rsavind/engine/records/batting/most_runs_career.html?id=3258;type=tournament
  23. http://content-usa.cricinfo.com/engvind/content/current/story/304149.html
  24. http://stats.cricinfo.com/ci/engine/records/batting/most_runs_career.html?id=3250;type=series
  25. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  26. "ఇండియాn Icon Sachin Tendulkar wins Laureus World Sports Awards 2020". Highonstudy.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-03-06.
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-23. Retrieved 2007-12-28.
  28. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2002-04-26. Retrieved 2002-04-26.
  29. http://blog.india-guides.com/search/label/Amitabh%20Bachchan[permanent dead link]
  30. "Sachin Tendulkar - MoM & MoS Awards in ODI Cricket".[permanent dead link]
  31. Batsman of the series award
  32. Tendulkar decided to share the MoS award with Yuvraj Singh, though it is not aware if the official records will reflect the same.
  33. http://www.rediff.com/cricket/2007/jul/02dravid.htm%7Ctitle=We[permanent dead link] deserved this win, asserts Dravid|publisher=Rediff.com|date=2007-07-02|accessdate=2007-07-02