బాగ్‌పత్

వికీపీడియా నుండి
(బగ్‌పత్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Baghpat జిల్లా

बाग़पत ज़िला
باغپت ضلع
ఉత్తర ప్రదేశ్ లో Baghpat జిల్లా స్థానము
ఉత్తర ప్రదేశ్ లో Baghpat జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
పరిపాలన విభాగముMeerut
ముఖ్య పట్టణంBaghpat
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుBaghpat
విస్తీర్ణం
 • మొత్తం1,321 కి.మీ2 (510 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం11,63,931
 • సాంద్రత880/కి.మీ2 (2,300/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత65.65 per cent[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో బాగ్‌పత్ జిల్లా (హిందీ:बाग़पत ज़िला) ఒకటి. బాగ్‌పత్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 1321 చ.కి.మీ. జిల్లా జనసంఖ్య 1,163,991.

ఆర్ధికం[మార్చు]

బాగ్‌పత్ నగరంలో షుగర్ మిల్లు ఉంది. జిల్లాలో చెరకు, గోధుమ, ఆవాలు, కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునానది ప్రవహిస్తుంది. బరౌట్ జిల్లాలో రిం & దౌరా అండ్ అగ్రికల్చరల్ ఇప్లిమెంట్స్ ఇండస్ట్రీస్ ఉంది. జిల్లాలోని రాం కిషోరిలాల్ కుటుంబానికి ఉన్న వ్యవసాయభూములు గంగా ఆయిల్ మిల్లు వంటి పలు మిల్లులు ఉన్నాయి. గంగా మిల్లు నుండి 1960 నుండి స్వచ్ఛమైన ఆవాల నూనె తయారు చేయబడుతుంది. బదగయాన్‌లో ప్రముఖ జైన ఆలయం ఉంది.

విభాగాలు[మార్చు]

 • బాగ్‌పత్ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: బాగ్‌పత్, బరౌట్, ఖెక్రా.
 • బాగ్‌పత్ తాలూకాలో 2 మండలాలు ఉన్నాయి : బినౌలి, పిలన.
 • బరౌట్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి : బరౌట్, బినౌలి, చప్రౌలి.
 • ఖెహ్రా తాలూకాలో ఒక మండలం ఉంది : ఖెక్రా
 • జిల్లాలో 3 ప్రధాన పట్టణాలు ఉన్నాయి : బాగ్‌పత్, బరౌట్, ఖెకడా.
 • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : చప్రౌలి, బరౌట్, బాగ్‌పత్.
 • పార్లమెంటు నియోజకవర్గం :- బాగ్‌పత్

జిల్లాలో బాగ్‌పత్ జిల్లాలో ప్రాధాన్యనత కలిగిన గ్రామాలు చప్రౌలి (భారత ప్రధాని చరణ్‌సింగ్ స్వస్థలం), పంచి, కిర్తల్, బుధెర (గుర్జర్), గొత్ర, పిలన, ఖట్టా, ప్రహ్లాదపూర్, ధిల్కౌలి, కథ, నూపుర్, సుర్జా,బజిద్‌పూర్, హర్సన, మండోలా, ఖెక్ర, బదగయోన్, దుండహెరా, పబ్ల, నిరౌరా, ఖెది జాత్, బుధ్సని అహిర్, నవడ అహిర్, సింఘవలి అహిర్, సైద్భర్ అహిర్, పురా మహదేవ్, దగర్‌పూర్, ఫఖర్పూర్, మిత్లి, సిసన, కథ, భరల్ మొదలైన గ్రామాలు ఉన్నాయి.

బాగ్‌పత్ జిల్లా హింసాకార్యకలాపాలకు కేంద్రంగా మారింది. బుధేరా వంటి కొన్ని గ్రామాలలో చక్కని విద్యాభివృద్ధి ఉంది. బాగ్‌పత్ జిల్లాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో గిరోహ్ గ్రూప్ నేరస్థులు తీవ్రంగా నేరకలాపాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ సతహరితం, ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండే బాగ్‌పత్ జిల్లా నివాసానికి అనువైనది. చెరకును అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలలో బాగ్‌పత్ ఒక్కటి.

బాగ్‌పత్ జిల్లా గత భారతీయ ప్రధానమంత్రి చరణ్‌సింగ్ (కిసాన్ కా మషీహా) అజిత్‌సింగ్ స్వత్ష్లలంగా బాగ్‌పత్ పట్టణానికి ప్రత్యేకత ఉంది. ఈ జిల్లా నుండి అజిత్ సింగ్ పలుమార్లు ఎం.పిగా ఎన్నికైయ్యాడు. జిల్లాలోని బరౌట్ పట్టణం ప్రధాన విద్యాకేంద్రంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బరౌట్ వద్ద జింటా వేదిక్ కాలేజి, దిగంబర్ జైన కాలేజ్ ఉంది.

కిర్తల్ గ్రామంలో పురాతనమైన గురుకులం ఉంది. (ఆర్యమహా విద్యాలయ) ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,302,156,[2]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 376 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 986 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.87%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 858:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.54%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతి[మార్చు]

రవాణాసౌకర్యాలు[మార్చు]

బాగ్‌పత్ యమునానదీ తీరంలో ఉంది. బాగ్‌పత్ జిల్లాలో పర్యాటక ఆకర్షణలు

 • జైన్ మందిర్ బడా గావ్
 • జైన్ టెంపుల్ Sisana (జైన తీర్థంకరుడు)
 • యమునా ఘాట్
 • గుఫా వాలే బాబా కా మందిర్
 • పుర మహదేవ్ మందిర్
 • భోలేకి ఝాల్
 • బర్నవా సంస్కృత గురుకుల్
 • బర్నవా జైన్ మందిరం
 • బర్నవా డేరా సచ్చా సౌదా
 • ధన్ ధన్ సద్గురు తేరా హాయ్ అసరా
 • నాగేశ్వర్ బాబా కా మందిర్

విద్య[మార్చు]

బాగ్‌పత్ జిల్లాలోని విద్యాసంస్థలు:

 • శ్రీ యమునా ఇంటర్ కాలేజ్ (ఉత్తర ప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ (UP బోర్డు)
 • జైన్ జూనియర్ హై స్కూల్ (ఉత్తర ప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ (UP బోర్డు)
 • క్రీస్తు జ్యోతి కాన్వెంట్ హై స్కూల్ (సెకండరీ ఎడ్యుకేషన్ ఇండియన్ సర్టిఫికేట్ (ఐ.సి.ఎస్.సీ)
 • శ్రీ నెహ్రూ ఇంటర్ కాలేజ్, పిలానా బాగ్‌పత్
 • షిల్చంద్ ఇంటర్ కాలేజ్, అమ్మి నగర్ సారాయ్, బాగ్‌పత్
 • నేత జి సుభాష్ స్మార్క్ ఇంటర్ కాలేజ్, బుధ్సని అహిర్, బాగ్‌పత్
 • డి.ఎ.వి. పబ్లిక్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్ (సి.బి.ఎస్.సి)
 • జాట్ (జనతా ఇంటర్) కాలేజ్ ఉత్తర ప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ (యు.పి. బోర్డ్) (విల్- సుర్జ)
 • ఫూల్‌వతి ఇన్స్టిట్యూట్ (బాగ్‌పత్)
 • మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ జగ్మోహన్ ఇన్స్టిట్యూట్
 • సామ్రాట్ పృథ్వీరాజ్ డిగ్రీ కళాశాల (బాగ్‌పత్)
 • వంజక్ష్ ఇన్స్టిట్యూట్ కోచింగు అకాడమీ (బాగ్‌పత్)
 • షియర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ (బాగ్‌పత్)
 • దిగంబర్ జైన్ కళాశాల (బరౌత్)
 • జాట్ (జనతా వేద) కాలేజీ (బరౌతు)
 • ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, ఖైలా రతుల్ ఆఫ్ హజ్రీలాల్ ఇన్స్టిట్యూట్ (బాగ్‌పత్) ప్రొఫెషనల్ స్టడీస్.
 • మహర్షి దయానంద్ సరస్వతి శిశు మందిర్, చదువు (బాగ్‌పత్)
 • ఉషోదయ ఇన్స్టిట్యూట్, గౌరీపూర్ జవహర్ నగర్ (బాగ్‌పత్)
 • వివేకానంద్ హై స్కూల్, గోత్రం
 • డి.ఎన్. ఇంటర్ కాలేజ్, ఖట్టా ప్రహ్లాద్పూర్ బాగ్‌పత్
 • సెయిత్ టరీఫ్ సింగ్ జైన్ డిగ్రీ కళాశాల, ఖట్టా ప్రహ్లాద్పూర్, బాగ్‌పత్
 • ఎం.జీ.ఎం. ఇంటర్ కాలేజ్, ధికౌలీ (బాగ్‌పత్)
 • జి.డి. పబ్లిక్ స్కూల్, గౌరీపూర్ జవహర్ నగర్ 250619 (బాగ్‌పత్)
 • డి.ఎ.వి. ఇంటర్ కళాశాల, అగర్వాల్ మండి తతిరి 250601 (బాగ్‌పత్)

తాలూకాలు[మార్చు]

బాగ్‌పత్ జిల్లాలోని తాలూకాలు

 • బాగ్‌పత్
 • బరౌత్
 • ఖెక్రా

మండలాలు భగ్పత్[మార్చు]

 • భగ్పత్ తాలూకాలోని 6 మండలాలు:-
 • బాగ్‌పత్
 • పిలన
 • బినౌలి
 • చప్రౌలి
 • బరౌత్
 • ఖెక్ర

మూలాలు[మార్చు]

 1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gurjars holds Baghpat they have good population in Baghpat and Khekada tehsils , and Jaats holds Baraut and Jaats have good population in Baraut and Chaprauli towns . Mauritius 1,303,717 July 2011 est. line feed character in |quote= at position 195 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help)

బయటి లింకులు[మార్చు]

Official website

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బాగ్‌పత్&oldid=2873861" నుండి వెలికితీశారు