రవ్వ దోసె
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రవ్వ దోసె ఒక విధమైన గోధుమ రవ్వతో చేసిన దోసె.
కావలసిన పదార్థాలు
[మార్చు]- బియ్యపుపిండి... పావు కేజీ
- మైదా... అర్థపావు కేజీ
- బొంబాయి రవ్వ... అర్ధపావు కేజీ
- జీలకర్ర... ఒక చెంచా
- ఉప్పు... సరిపడా
- నెయ్యి లేక నూనె... సరిపడా
తయారీ విధానం
[మార్చు]- మైదాను, బొంబాయి రవ్వను శుభ్రపరచుకొని, ఒక గిన్నెలో పోసి, బియ్యం పిండిని కూడా వేసి నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా (పలుచగా) కలుపుకోవాలి. దీన్ని నాలుగు గంటల సేపు నానబెట్టాలి.
- తరువాత పొయ్యిమీద పెనం పెట్టి కాలనియ్యాలి.
- నానిన పిండిలో ఒక టీస్పూను జీలకర్ర, సరిపడా ఉప్పువేసి బాగా కలపాలి
- పెనం మీద ఒక టీస్పూను నూనె వేస్తూ కలిపిన పిండి పోసి పలుచగా నెరపాలి.
- కాలే దోశె మీద మళ్ళీ ఒక చెంచా నూనె వేసి, దోశెను తిరగవేసి తీసి... లేత గోధుమ రంగు వచ్చేవరకు వేపాలి.
- దీనికి సైడ్‌డిష్‌గా కొబ్బరి పచ్చడి మొదలైన వాటితో తింటే చాలా బాగుంటుంది.
మూలాలు
[మార్చు]