లడ్డు

వికీపీడియా నుండి
(లడ్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లడ్డు
లడ్డూలు
మూలము
మూలస్థానందక్షిణ ఆసియా
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు శనగపిండి, పాలు,చక్కెర
వైవిధ్యాలురవ్వ ,
ఇతర సమాచారంపండగలు లేదా మతపరమైన కార్యక్రమాలు
అమ్మకానికి లడ్డూలు
బూందీలడ్డు
డ్రైఫ్రూట్ లడ్డు
సున్నుండ

లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే మిఠాయి. శనగ పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు.[1] [2] బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.

కావలసిన పదార్ధాలు

[మార్చు]

కావలసిన పరికరాలు

[మార్చు]
  • బూందీ చట్రాలు
  • బూరెల మూకుడు
  • రెండు వెడల్పాటి కళాయి గిన్నెలు.

తయారుచేయు విధానం

[మార్చు]
  • శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
  • చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
  • ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
  • నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
  • శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరువాత చట్రం ముద్దలో ఉంచాలి.
  • బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  • శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
  • బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
  • తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
  • చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sweet shops make hay in Diwali shine". The New Indian Express. Archived from the original on 2016-04-21. Retrieved 2015-09-20.
  2. Sangeetha Devi Dundoo. "As good as home". The Hindu.
"https://te.wikipedia.org/w/index.php?title=లడ్డు&oldid=4094306" నుండి వెలికితీశారు