Jump to content

చల్లపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 16°7′3″N 80°55′53″E / 16.11750°N 80.93139°E / 16.11750; 80.93139
వికీపీడియా నుండి
(Challapalli నుండి దారిమార్పు చెందింది)
చల్లపల్లి
చల్లపల్లి బాలుర వసతి గృహం
చల్లపల్లి బాలుర వసతి గృహం
పటం
చల్లపల్లి is located in ఆంధ్రప్రదేశ్
చల్లపల్లి
చల్లపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°7′3″N 80°55′53″E / 16.11750°N 80.93139°E / 16.11750; 80.93139
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంచల్లపల్లి
విస్తీర్ణం4.66 కి.మీ2 (1.80 చ. మై)
జనాభా
 (2011)
17,067
 • జనసాంద్రత3,700/కి.మీ2 (9,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు8,183
 • స్త్రీలు8,884
 • లింగ నిష్పత్తి1,086
 • నివాసాలు4,901
ప్రాంతపు కోడ్+91 ( 08671 Edit this on Wikidata )
పిన్‌కోడ్521126
2011 జనగణన కోడ్589750


చల్లపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం లోని గ్రామం, మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 26 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4901 ఇళ్లతో, 17067 జనాభాతో 466 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8183, ఆడవారి సంఖ్య 8884. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2484 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 770. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589750.[2] ఇది సముద్రమట్టానికి 10 మీ.ఎత్తులో ఉంది.చల్లపల్లి విజయవాడ నుండి 70 కి.మీలు, మచిలీపట్నం నుండి 25 కి.మీ.ల దూరంలో ఉంది.

చల్లపల్లి రాజులు/జమిందారులు

[మార్చు]

చల్లపల్లిని రాజధానిగా యార్లగడ్డ వంశీకులు దేవరకోట రాజ్యమును కొద్ది కాలము పాలన చేశారు. ఇప్పటికీ ఇక్కడ చల్లపల్లి రాజా కట్టించిన చల్లపల్లి కోట అనే భవంతి ఉంది. సా.శ. 1576 లో యార్లగడ్డ గురువారాయడు ఈ రాజ్యం స్థాపించారని ప్రతీతి.[3] చల్లపల్లి రాజవంశీకులు నేటికీ అక్కడ జీవిస్తున్నారు. వీరిని చల్లపల్లి జమిందారులు అని కూడా అంటారు.స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట, రాచరిక వ్యవస్థ నిర్మూలనతో, చల్లపల్లి రాజులకు అధికారం పోయింది.

చల్లపల్లి కోట

[మార్చు]

పూర్వం ప్రజలకు సమయాన్ని తెలియజేయటానికి కోటలో ప్రతి గంటకు గంటను మోగించేవారు. ఈ సంప్రదాయము నేటికీ కొనసాగుతున్నది. ఈ కోటనుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుందని, కోట నుండి కనకదుర్గ గుడి రహస్య సొరంగము ఉన్నదని స్థానిక ప్రజల నమ్మకం. అలానే, మచిలీపట్నం శివార్లలో వున్న శివగంగ అమ్మవారి గుడికి అయ్యే ఖర్చు రాజావారు భరించేవారని, కోట నుంచి గుడికి సొరంగమార్గము ఉంది అని ప్రతీతి. ఈ కోట రమారమి 200 సంవత్సరాల పూర్వం కట్టించింది. కోటని చూడటానికి, అక్కడ వారిని కలువటానికి బయటి వారికి కుదురుతుంది, కానీ అనుమతి తీసుకోవాలి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 59 కి.మీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, హైదరాబాదు, నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలోనూ ఉన్నాయి.

  • శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల.
  • రాజావారు గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను కూడా కట్టించారు. పరిసర గ్రామాలకు ఇదే పెద్ద ఉన్నత పాఠశాల.
  • ఆంధ్ర ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల:- ఈ పాఠశాల స్థానిక నారాయణరావునగర్‌లో ఉంది. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు, 500 మంది విద్యార్థినులు విద్యనభ్యసించుచున్న ఈ పాఠశాలలో, ఎస్.సి.ఉప ప్రణళిక నిధులు 4.3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, అదనపు గదుల నిర్మాణానికి, 2013లో శంకుస్థాపన నిర్వహించ్నారు. ఈ నిర్మాణం ఇంకనూ పూర్తికాలేదు.
  • విజయశ్రీ సన్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల:- 2015,అగష్టు-22,23 తేదీలలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన జపాన్ షిటోకాన్ కరాటే ఛాంపియన్ షిప్-2015 పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థి కొనకళ్ళ జగన్ శంకరతేజ రజతపతకం సాధించాడు. ఈ పాఠశాలకే చెందిన విద్యార్థిని కొనకళ్ళ భావన కాంస్య పతకం సాధించింది.
  • సెయింట్ మదర్ థెరెస్సా ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల.
  • శ్రీ వరదా వెంకటరామలింగేశ్వరరావు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి వేసంగి లక్ష్మీకుమారి, జిల్లా ఉత్తమ ఉపాధాయురాలిగా ఎంపికైనారు. ఈమె ఈ పురస్కారాన్నీ, ప్రశంసా పత్రాన్నీ, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, కృష్ణా జిల్లా పాలనాధికారి శ్రీ బాబు-ఏ, చేతులమీదుగా అందుకున్నారు.
  • ఇంకా విజయ జూనియర్ కాలేజి, సిర్స్ప జూనియర్ కాలేజి, శారదా సన్ ఫ్లవర్ జూనియర్ కాలేజి, శ్రీకృష్ణా జూనియర్ కాలెజి, సెయింట్ ధామస్ ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్, చల్లపల్లి ఇంగ్లీష మీడియం హైస్కూల్, ఎ.పి.ఎస్.డబ్ల్యు రెసిడెన్సియల్ స్కూల్, విజయ కాన్వెంట్ హైస్కూల్, వి.ఎస్. సన్ ఫ్లవర్ స్కూల్, చల్లపల్లి

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

చల్లపల్లిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఏడుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి.

కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రి

[మార్చు]

2004లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలతో నిర్మించారు. ఇది మోపిదేవి, మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల మండలాలో పెద్ద ప్రభుత్వ అసుపత్రి.

పద్మావతి వైద్యశాల

[మార్చు]

ఈ వైద్యశాల 28వ వార్షికోత్సవాన్ని 2015,డిసెంబరు-26వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు నూతన వస్త్రాలు బహుకరించారు.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఆంధ్రా బ్యాంక్.

ఆశ్రమాలు

[మార్చు]

అదరణ గృహం, వృద్ధాశ్రమం:- చల్లపల్లిలోని నిమ్మలతోటలో, 2011,జూన్-6వ తేదీనాడు, గుడివాడ మండలం, మోటూరు గ్రామానికి శ్రీ జంజనం రామమోహనరావు, జీసస్ క్రైస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పి, కుటుంబాలనుండి బయటకు వెళ్ళిపోతున్న వృద్ధులకు ఆశ్రయం, వసతి సౌకర్యాలు కల్పించారు. 14 మంది నిత్య అన్నదాతలుగా ఉన్న ఈ ఆశ్రమంలో, ప్రస్తుతం 30 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుచున్నారు. ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగి అయిన శ్రీ రామమోహనరావు, ఉదయం 8 గంటల వరకు, ఈ ఆశ్రమంలో పనిచేసి అఫీసుకు వెళ్ళిపోతారు. తిరిగి సాయంత్రం అరు గంటలకు ఇక్కడకు వచ్చి తన సేవలందించుచున్నారు.

ఎన్.టి.ఆర్.పార్కు

[మార్చు]

చల్లపల్లి గ్రామంలోని ఈ పార్కును రెండు దశాబ్దాల క్రితం రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసారు. నారాయణరావునగర్ లో స్థలాలను పేదలకు అందించిన తరుణంలో, ఈ పార్కులో, తెలుగు మాగాణ సమారాధన స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ పార్కు కార్తీకమాస వనసమారాధన లాంటి కార్యక్రమాలకు అనువుగా ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నుగూడా అభివృద్ధిపరచినరు. ఇటీవల ఈ పార్కును దాతలు, పంచాయతీ సహకారంతో నందనవనంలాగా తీర్చిదిద్దినారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

సాగునీటి సౌకర్యం

[మార్చు]

చల్లపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కె.ఈ.బి.కెనాల్ ద్వారా సరఫరా జరుగుతోంది.

  • కాలువలు: 186 హెక్టార్లు

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ గ్రామ పంచాయతీ 1888 లో బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది. నియోజకవర్గంలోనే అతి పెద్ద రెండవ పంచాయతీ. 2011 నాటికి 10,557 మంది ఓటర్లు కలిగి ఉన్నారు.
  • 1982లో తాలుకా విధానమును మార్చిన తరువాత, దివి తాలుకా నుంచి చల్లపల్లి మండలాన్ని సృష్టించారు. చల్లపల్లి గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది.
  • "గంగులవారిపాలెం" చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
  • 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో కట్టా పద్మావతి సర్పంచిగా ఎన్నికైంది.
  • చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛభారత్ స్ఫూర్తితో,"స్వచ్ఛ చల్లపల్లి"గా తీర్చిదిద్దటానికి గత 200 రోజులుగా జనవిఙాన వేదిక ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ సహకారంతో చేయుచున్న కృషికి, స్వచ్ఛఛాంపియన్ పురస్కారం లభించినది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, జాతీయస్థాయిలో, హైదరాబాదులో "సుకుకి ఎక్స్ నోరో" అను స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "క్లీన్ ఇండియా" సదస్సులో, ఈ పురస్కారాన్ని, జన విఙాన వేదిక అధ్యక్షులు డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్. పద్మావతి, గ్రామ సర్పంచ్ శ్రీమతి కట్టా పద్మావతి, ఈ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు, శ్రీమతి అక్కినేని అమల చేతులమీదుగా అందుకున్నారు. ఈ పురస్కారాన్ని, జనవిఙానవేదీక, చల్లపల్లి గ్రామపంచాయితీ లకు సంయుక్తంగా అందించారు.
  • చల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయస్థాయిలో స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైనది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 2017,మార్చి-8న, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో నిర్వహించు ఒక కార్యక్రమంలో, చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కట్టా పద్మావతి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నుండి ఈ పురస్కారం అందుకోనున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం "స్వచ్ఛశక్తి సప్తాహం-2017" కార్యక్రమంలో పాల్గొనేటందుకు ఈమె గుజరాత్ రాష్ట్రం వెళ్ళినారు. చల్లపల్లి కేంద్రంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించడం, జాతీయస్థాయిలో స్వచ్ఛ చల్లపల్లికి ఖ్యాతి లభించింది. చల్లపల్లిని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా రూపుదిద్దుకునేటందుకు చురుకైన పాత్ర వహించిన ఈ మహిళా సర్పంచిని ప్రభుత్వం గుర్తించి, ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈమెతోపాటు పురస్కారానికి ఎంపికైన మహిళా సర్పంచ్‌లంతా గుజరాత్ రాష్ట్రంలోని వెహెలాల్ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- ఈ ఆలయ 41వ వార్షికోత్సవం, 2017,ఆగష్టు-26వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం:- స్థానిక నిమ్మలతోటలో నూతనంగా నిర్మిచబోయే ఈ ఆలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-10, ఆదివారం నాడు, భూమిపూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినది. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,డిసెంబరు-13వ తేదీ శనివారం, మార్గశిర శుద్ధ చతుర్దశినాడు, స్వామివారి గ్రామోత్సవాన్ని, భక్తులు ఘనంగా నిర్వహించారు. 15వ తేదీ సోమవారం నాడు, ఉదయం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అఖండస్థాపన, మద్యాహ్నం మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠాపన, జలాధివాసం, క్షీరాధివాసం, 16వ తేదీ, మంగళవారం నాడు స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాధివాసం పూజలు, 17వ తేదీ బుధవారం, మార్గశిర బహుళ విదియ నాడు పీఠపూజ, నవరత్న గర్తన్యాసముల విశేషపూజలు నిర్వహించిన అనంతరం, 7-45 గంటలకు, విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, విఘ్నేశ్వరునికి పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదువేలమంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
  • శ్రీ చక్రస్థిత అన్నపూర్ణాసమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2016,ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధ పౌర్ణమినాడు, ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని, నయనానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వామివారికి జలాభిషేకం, పుష్పాభిషేకం, శాస్త్రోక్తంగా విశేషపూజలు నిర్వహించారు.
  • శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ రామాలయం, రజకపేట.
  • శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- చల్లపల్లి గ్రామంలోని విజయవాడ రహదారిపై గల కోమలానగర్ లోని ఈ ఆలయం, బ్రహ్మంగారి ఏడవ తరం మనుమడు, ప్రస్తుత బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి, శ్రీ వీరభోగవసంతంత వెంకటేశ్వరస్వామి గారి చేతులమీదుగా ప్రతిష్ఠ గావింపబడింది.ఈ ఆలయంలో, 36వ వార్షికకళ్యాణమహోత్సవాలు 2014,ఫిబ్రవరి-9 ఆదివారం, మాఘశుద్ధ దశమి నాడు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య, ఘనంగా నిర్వహించారు. తరువాత 11వ తేదీ మంగళవారంనాడు, స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆ రోజే శ్రీ మద్విరాట్ విశ్వకర్మ జయంతిని గూడా ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంవద్ద, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
  • శ్రీ సంపటాలమ్మ అమ్మవారి దేవాలయం;- 2003,మార్చిలో ఈ దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఈ దేవాలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో, మొదటి ఆదివారం జరుగును. అమ్మవారి గ్రామోత్సవం ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో శుక్ల ఏకాదశి నుండి వారం రోజులపాటు నిర్వహించెదరు. అమ్మవారి వంశపారంపర్య అర్చకులు, అమ్మవారి పుట్టింటి వంశీకుల ఆధ్వర్యంలో, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించెదరు. పుట్టింటివారయిన పత్తిపాటివారు, అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించెదరు. ఈ గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, జలబిందెనూ, ఇంటింటికీ తీసికొని వెళ్ళి, భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కలిగించెదరు. భక్తులు అమ్మవారికి నిండు బిందెలతో వారపోసి, పసుపు, కుంకుమలను సమర్పించి, అమ్మవారి అనుగ్రహం పొందటం, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ.
  • శ్రీ గరుడ ఆంజనేయస్వామివారి ఆలయం.
  • శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- బస్సుస్టాండు కూడలిలో ఉన్న ఈ ఆలయంలో, 2014,మే-22 నుండి, హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుచున్నరు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 22న సాయంత్రం 6 గంటలకు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. 23న స్వామివారి జయంతి మహోత్సవాలు, శ్రీ సీతా రామ లక్ష్మణులకు అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి శాంతికళ్యాణం, పూజాది కార్యక్రమాలు నిర్వహించెదరు.
  • చల్లపల్లి గ్రామ జాతర:- చల్లపల్లిలో ప్రతి సంవత్సరం తమ ఇలవేల్పులకు నిర్వహించే గ్రామజాతరను, 2014, ఆగష్టు-10, ఆదివారం, శ్రావణపౌర్ణమి నాడు, ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వీరంకివారి వీరుళ్ళకు, పోతురాజుస్వామి, సంపటాలమ్మ అమ్మవారికి, గ్రామదేవతల విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. డప్పు దరువులకు నాగేంద్రనృత్యం, వీర తాళ్ళు, వీర కత్తులతో సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఆలయంలో పసుపు, కుంకుమలు సమర్పించారు.
  • శ్రీ అయ్యప్పస్వామి ఆలయం:- చల్లపల్లి గ్రామంలోని శివాలయం వెనుక, 30 సెంట్లస్థలంలో, అయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-20, బుధవారం ఉదయం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారలకు ప్రత్యేకపూజలు, భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ గణపతి, అయ్యప్పస్వామి, కుమారస్వామి, మాళికాపురోత్తమ్మ అమ్మవారి దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయనిర్మాణానికి స్థలాన్ని గురుస్వాములు శ్రీ దింటకుర్తి మోహనరావు, శ్రీ అన్నవరపు సత్యనారాయణ అందించారు. ఈ ఆలయాలలో పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
  • జమ్మిలంకమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి జాతరను భక్తులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, కలశస్థూపాలను వీరుళ్ళు శిరస్సుపై ధరించి, అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. జమ్మిలంకమ్మ అమ్మవారి వంశస్తుల ఆధ్వర్యంలో జాతరను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రభను తోడ్కొని కలశాలను, వీరకత్తులు, వీర తాళ్ళతో డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు.
  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చల్లపల్లి తూర్పు వీధిలోని ఈ ఆలయ 23వ ఆరాధన మహోత్సవాలు, 2015,మార్చి-1వ తేదీ ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం నాలుగు వేలకిపైగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
  • శ్రీ అవతార్ మెహర్ బాబా మందిరం:- స్థానిక ఆర్ & బి. ఆవరణలో ఉన్న ఈ మందిరంలో, అవతార్ మెహర్ బాబా స్వర్ణోత్సవ వేడుకలు, 2015,ఆగష్టు-29,30 తేదీలలో ఘనంగా నిర్వహించారు.
  • శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఎస్.టి.కాలనీలో, గురు భవానీలు ఉద్దండి పాండురంరాగారావు, శ్రావణం వెంకటకృష్ణారావుల ఆధ్వర్యంలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,డిసెంబరు-21వ తేదీ సోమవారం ఉదయం 9-45 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.

చల్లపల్లమ్మ గ్రామదేవత

[మార్చు]

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో వేంచేసియున్న గ్రామదేవతలు చల్లపల్లిమ్మ తల్లి అమ్మవారు, పోతురాజు, నాగేంద్రస్వామి వార్లకు గ్రామస్థులు, 2014,మార్చి-4న ప్రత్యేక పూజలు చేసి అన్నదాన సంతర్పణ చేశారు. అడవిగట్టు వద్ద చల్లపల్లిమ్మ తల్లి పేరుతో వేంచేసియున్న సత్యాలమ్మ తల్లికి కొన్నేళ్ళుగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. [ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చి-5; 2వపేజీ]

మోపిదేవి ఆలయం

[మార్చు]

కోట దగ్గరలో, సుమారు 7కిమీ దూరములో, ప్రఖ్యాతి గాంచిన మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (నాగేంద్ర స్వామి) ఆలయం ఉంది. ఇక్కడ శివుని కుమారుడైన కుమారస్వామి నాగేంద్రస్వామి రూపంలో వెలిసారు.

చక్కెర కర్మాగారం

[మార్చు]

చల్లపల్లి నుండి 3 కిలోమీటర్ల దూరములో, లక్ష్మీపురంలో చల్లపల్లి రాజా కట్టించిన చక్కెర కర్మాగారం ఉంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కంచర్ల రాఘవయ్య, సైకత శిల్పి, బుల్లితెర నటుడు, ఉపాధ్యాయుడు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  • శ్రీవైష్ణవి, రమ్యశ్రీ: చల్లపల్లి గ్రామానికి చెందిన ఈ అక్కాచెల్లెళ్ళు, గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీలలో తిరుగులేని ప్రతిభ చూపుచున్నారు. తాజాగా వీరు హాంగ్ కాంగ్ నగరంలో 2015,ఆగష్టు-22,23 తేదీలలో నిర్వహించిన ఏషియన్, హాంగ్ కాంగ్ మెమొరీ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత విభాగంలో పాల్గొని తమ ప్రతిభ చూపినారు. ఈ పోటీలలో శ్రీవైష్ణవి ఏషియన్ ఛాపియన్ షిప్పులో నేంస్ & ఫేసెస్ విభాగంలో స్వర్ణపతకం సాధించింది. హాంగ్ కాంగ్ ఛాంపియన్ షిప్ప్పులోనూ ఇదే విభాగంలో శ్రీవైష్ణవి రజతపతకం సంపాదించింది. రమ్యశ్రీ ఏషియన్ అడల్ట్స్ కేటగిరీలో ఐదవస్థానంలో మిలిచింది. వీరు వందల ఫోన్ నంబర్లను అలవోకగా చెప్పేస్తూ, వేలసంఖ్యలో ముఖాలను గుర్తుపెట్టి పేర్లు చెప్పేస్తారు.
  • ఇక్కడ ఒక కమ్యూనిస్టు స్తూపం ఉంది

ఘనవ్యర్ధాల సంపద ఉత్పత్తి కేంద్రం

[మార్చు]

చల్లపల్లిలోని చిల్లల వాగు సమీపంలో ఉన్న స్థలంలో ఈ కేంద్రాన్ని నిర్మించుచున్నారు.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

చల్లపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

చల్లపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 279 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 186 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 186 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

చల్లపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరకు, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

ఇటుకలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-16. Retrieved 2009-06-29.

బయటి లింకులు

[మార్చు]