Jump to content

చక్కెర పొంగలి

వికీపీడియా నుండి
(చక్రపొంగలి నుండి దారిమార్పు చెందింది)
చక్కెర పొంగలి

బియ్యము, బెల్లము, పాలు, సగ్గుబియ్యము మొదలగు వాటి కలయికతో చేయబడు ఒక వంటకం. దేవునికి నైవేద్యముగా ఎక్కువగా ఉపయోగిస్తారు.

చక్కెర పొంగలి అనే పదం సులభంగా మట్లాడే వరవడిలో చక్ర పొంగలిగా మారింది. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయిన నైవేద్యం. దీనిలో ఉండే ముఖ్యమైన పదార్థాలు చక్కెర, పాలు, బియ్యము. సువాసన కోసం, మరింత రుచి కోసం జీడిపప్పు, ఎండుద్రాక్ష, పచ్చకర్పూరం వంటి ఇతరమైన పదార్థాలు కలుపవచ్చు. పై మూడింటిని కలిపిన గిన్నెను నిప్పుమీద ఉడికిస్తే, పాలతో కలిసిన బియ్యం ఉడికి అన్నంలా తయారయి, అందులో ఉన్న చక్కెర కారణంగా తీపిగా ఉంటుంది. చక్కెర బదుల బెల్లం వాడేవారు ఇదివరలో. ఇది శక్తిని ఇచ్చే వంటకం. దీనికి జోడీ దద్ధోజనం, కాస్త కారంగా, ఉప్పగా ఉంటుంది. దద్ధోజనం అనేది వాడుక పేరు. అసలు పేరు దధ్యోదనం, (దధి + ఓదనం), అంటే పెరుగుతో కలిపిన అన్నం. అన్నంలో పెరుగు కలిపి పోపు పెడితే ఇది తయారవుతుంది. చక్ర పొంగలి, దద్ధోజనం తిన్నామంటే పూర్తిగా భోజనం చేసినట్లే. ఈ రెండూ కూడా వైష్ణవ దేవాలయాలలో (ధనుర్మాసంలో) దొరికే ముఖ్యమైన, రుచికరమైన, బలవర్ధకమైన ప్రసాదాలు.