Coordinates: 16°30′58″N 80°36′58″E / 16.516°N 80.616°E / 16.516; 80.616

విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: hi:विजयवाड़ा, ne:विजयवाड़ा
పంక్తి 312: పంక్తి 312:


==రిఫరెన్స==
==రిఫరెన్స==
{{wiktionary}}
<references/>
<references/>



11:10, 25 జనవరి 2012 నాటి కూర్పు

  ?బెజవాడ
విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
ప్రకాశం బ్యారేజిపై కృష్ణవేణీమాత.
ప్రకాశం బ్యారేజిపై కృష్ణవేణీమాత.
ప్రకాశం బ్యారేజిపై కృష్ణవేణీమాత.
కృష్ణా జిల్లా పటంలో విజయవాడ మండల స్థానం
కృష్ణా జిల్లా పటంలో విజయవాడ మండల స్థానం
కృష్ణా జిల్లా జిల్లా పటంలో విజయవాడ మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°30′58″N 80°36′58″E / 16.516°N 80.616°E / 16.516; 80.616
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
61.88 కి.మీ² (24 చ.మై)
• 11.88 మీ (39 అడుగులు)
వాతావరణం
అవపాతం
ఉష్ణోగ్రత
వేసవికాలం
శీతాకాలం
Tropical climate (Köppen)
• 1,050 mm (41.3 in)
27 °సె (81 °ఫా)
• 43.3 °సె (110 °ఫా)
• 24 °సె (75 °ఫా)
ప్రాంతం కోస్తా ఆంధ్ర
జిల్లా (లు) కృష్ణా జిల్లా జిల్లా
తాలూకాలు విజయవాడ (పట్టణ)
జనాభా
జనసాంద్రత
Metro
అక్షరాస్యత శాతం
8,51,282 (2001 నాటికి)
• 14,231/కి.మీ² (36,858/చ.మై)
• 10,39,518 (34th) (2001)
• 71
అధికార భాష తెలుగు
మేయరు మల్లికా బేగం
ఎంపీ లగడపాటి రాజగోపాల్
ఎంఎల్యే
లోక్‌సభ నియోజకవర్గం విజయవాడ
శాసనసభ నియోజకవర్గం విజయవాడ (తూర్పు), విజయవాడ (పడమర), కంకిపాడు
ప్రణాళికా సంస్థ VGTMUDA
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 520 0xx
• +866
• IN VGA
• AP16


విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము. కృష్ణా జిల్లాలో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.


విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదుకు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.

భౌగోళికం, జనవిస్తరణ

కృష్ణానది తీరాన విజయవాడ - 1943 నాటి చిత్రం (మాగంటి బాపినీడు కూర్చిన "ఆంధ్ర సర్వస్వము" అనే పుస్తకం నుండి)
  • భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
  • నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
దస్త్రం:APcity Vijayawada aerialview.JPG
విజయవాడ నగరంలో ఒక భాగం - మధ్యలో కృష్ణ కాలువను, ఎడమ ప్రక్క కృష్ణానదిని చూడవచ్చును. 2008 చిత్రం.
  • ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ మూడవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.నగరంలో 136 గుర్తింపు పొందిన మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో మొత్తం 2.21 లక్షల మంది జనాభా ఉన్నారు

చరిత్ర

  • నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరివాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివశించారని భావిస్తున్నారు.
  • అర్జునుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్టించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి రాజేంద్రచోళ పురాణములో కూడా పేర్కొన్నారు.
  • హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. కీ.శ. 638 సంవత్సరములో ఇక్కడ బౌద్ధ మతము బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు చైనా దేశపు యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ (Huan-tsang) ఈ ప్రాంతాన్ని దర్శించాడు.
  • బ్రిటీషువారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా అభివృద్ధిని చవిచూసింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజులలో సినిమా వ్యాపారానికి కూడా విజయవాడ ఒక కూడలి అని చెప్పవచ్చు.

విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చింది?

  • విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కధ ఉంది. ఆ కధ ఇలా సాగుతుంది: పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు.
  • ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్టించాడని ప్రతీతి.
  • ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిధిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచినారు.

ఆర్ధికం

చుట్టుప్రక్కల సారవంతమైన నేల, మంచి నీటివనరులు, ప్రగతిశీలురైన రైతులు కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి.


కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.


విజయవాడ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.

నగర పాలన

విజయవాడ నగరం ఆంధ్ర ప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరమైనాగాని ఆ జిల్లా (కృష్ణా జిల్లా) పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి. [1]. నగరంలోని 59 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటాడు.కృష్ణాజిల్లాలోని 15 గ్రామాలతో కలిపి గ్రేటర్ విజవాడ ఏర్పాటు కాబోతున్నది.ప్రక్కనే కృష్ణానదికి అవతలివైపున 3కి.మీ.దూరంలోఉన్న తాడేపల్లి మునిసిపాలిటీనికూడా గ్రేటర్ లో కలపాలని తాడేపల్లి ప్రజలు కోరారు కానీ అది గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నందున గ్రేటర్లో కలిపేందుకు అధికారులు ప్రతిపాదించలేదు.వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.

గ్రేటర్ విజయవాడ

విజయవాడలో కలుపదలచిన కృష్ణాజిల్లాలోని 15 సమీప గ్రామాలు:

  • విజయవాడ గ్రామీణ మండలం నుండి:

నిడమానూరు ,దోనేటికూరు ,ఎనికేపాడు ,ప్రసాదంపాడు ,రామవరప్పాడు ,పాతపాడు ,ఫిర్యాదీనైనవరం ,అంబాపురం ,జక్కంపూడి ,గొల్లపూడి ,నున్న .

కానూరు ,యనమలకుదురు ,తాడిగడప ,పోరంకి .

రవాణా

రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడ నగరం మంచి రవాణా సౌకర్యాలు కలిగి ఉంది. జాతీయ రహదారి-5 (చెన్నై-కొలకత్తా), జాతీయ రహదారి-9 (మచిలీపట్నం-ముంబై), జాతీయ రహదారి-221 (విజయవాడ-జగదల్‌పూర్) - ఇవి విజయవాడ మీదుగా ఉన్నాయి. విజయవాడనుండి రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మార్గాలు:

  • జా.ర.-5: ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా కొలకత్తా
  • జా.ర.-5: గుంటూరు, నెల్లూరు మీదుగా చెన్నై
  • జా.ర.-9: కోదాడ, సూర్యాపేట, హైదరాబాదు మీదుగా ముంబై
  • ఏలూరు రోడ్డు
  • బందరు రోడ్డు
  • నూజివీడు రోడ్డు
  • నరసరావుపేట - కడప - బెంగళూరు

రవాణా వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినా ఈపట్టణానికి ప్రక్కనే గుంటూరు జిల్లాలో ఉన్న తాడేపల్లి,సీతానగరం,ఉండవల్లి సెంటర్,డోలాస్ నగర్,నులకపేట మొదలైన ఊళ్ళకు రవాణా సదుపాయాలు సరిగా అందలేదు.ఇటీవల మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సీతానగరంలోని రామకృష్ణమిషన్ కు వచ్చారు.సీతానగరం నుండివిజయవాడకు, జిల్లా కేంద్రమైన గుంటూరుకునేరుగా బస్సు సౌకర్యం ఉంటే బాగుండేది.విజయవాడ నుండి గుంటూరుకు దాదాపు ప్రతి పావుగంటకు ఒక బస్సు ఉంటుంది. హైదరాబాదుకు ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు దేశంలో అతి పెద్ద బస్సు స్టాండులలో ఒకటి. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు (మోటారు సైకిళ్ళు, కారులు, సైకిళ్ళు వంటివి) అధికంగా వాడుతారు. సరకుల రవాణాకు లారీలు సప్లై చేసే కంపెనీలు నగరంలో చాలా ఎక్కువ ఉన్నాయి.

  • ఉడా ఇన్నర్ రింగ్ రోడ్డు

నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడం తో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదు గా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.

ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు

  • బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.
  • గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం(ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద కలుస్తుంది.
  • ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి తాళ్ళాయిపాలెం-ఇబ్రహీంపట్నంకు రోడ్డు

చుక్కలనంటిన భూముల ధరలు

ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు రోడ్డు వెంబడి ఉన్న స్థలం గజం రూ.15వేల నుంచి రూ.20వేల ఉంటే, వెనుక ఉన్న స్థలాలు గజం రూ.15వేల వరకు పెరిగాయి. జాతీ య రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాలకు మహర్దశ తీసుకొచ్చింది.

  • బైపాస్ రోడ్డు విస్తరణ

బైపాస్‌ రోడ్డు గొల్లపూడి మైలురాయి సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ వ్యాపార కూడళ్లు ఉన్నాయి.మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 18 హోల్‌సేల్‌ సంఘాల ద్వారా 499 టోకు వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే రాష్ట్రంలోనే పెద్దదైన ఐరన్‌ మార్కెట్‌ యార్డు, ఆర్టీసీ డిపోఉన్నాయి.

లిఫ్ట్ సౌకర్యం గల ఏకైక బస్టాండు
విజయవాడ బస్ స్టేషన్ ప్రవేశ ద్వారం

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, నగరాలకు ప్రధాన ప్రయాణ సాధనాలు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్టాండ్ ఈబస్టాండ్‌లో షిర్డీ క్యాంటిన్‌ అధినేత దస్తగిరి స్వంత వ్యయంతో లిఫ్టు సౌకర్యాన్ని కల్పించారు. మన దేశంలో ఇప్పటివరకూ ఏ బస్టాండ్‌లోనూ లిఫ్ట్ సౌకర్యం లేదు. విమాన ప్రయాణం - విజయవాడకు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, రాజమండ్రి, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులున్నాయి.జెట్ ఎయిర్ వెస్, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వారు రోజువారీ సర్వీసులు నడుపుతున్నారు.స్పైస్ జెట్ జూన్ 2011 నుంచి హైదరాబాదుకు విమానసర్వీసు నడపనున్నది. [2][3]


చెన్నై-హౌరా, చెన్నై-ఢిల్లీ రైలు మార్గాల కూడలిగా ఉన్న ఉన్నవిజయవాడ జంక్షన్ దేశంలో అధికంగా రద్దీగా ఉండే రైలు స్టేషన్లలో ఒకటి. [1].[4] నగరం బయటి ప్రాంతాలలో ఉన్న చిన్న స్టేషన్లు - మధురానగర్, గుణదల, రామవరప్పాడు.

విజయవాడ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉన్న మచిలీపట్నం రేవును అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. [5]

సంస్కృతి

ఆంధ్ర ప్రదేశ్ కోస్తా జిల్లాలలోని పెద్ద నగరమైనందున విజయవాడలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల సంస్కృతి ప్రముఖంగా ఉంది. కాని నగరం విస్తరిస్తున్న కొద్దీ నాగరికతలో ఆధునిక జీవన ధోరణులు ప్రబలుతున్నాయి. ఇంతే కాకుండా వ్యాపారం లేదా ఉద్యోగం లేదా చదువు రీత్యా దేశంలోని పలు ప్రాంతాలనుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన లేదా తాత్కాలికంగా ఉంటున్న జనాభా కూడా గణనీయంగా ఉంది. అలాగే ప్రధానంగా హిందువులు ఉన్న నగరమైనా గాని క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతే కాకుండా కులాల మధ్య పెచ్చుపెరిగిన వైషమ్యాల ప్రభావం కూడా విజయవాడలో ప్రబలంగా ఉంది.

విద్య

ఎన్.టి.ఆర్.వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం.

విజయవాడ పెద్దగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. కాని ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

సిద్ధార్థ పబ్లిక్ స్కూలు విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడినది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన సుమారు 8 ఎకరాలలో రేకుల షెడ్డు, 8 మంది టీచర్ల తో ప్రారంభించబడినది.

1982 లో స్కూలు నిల్డింగు సమకూరినది. 1987 లో జిమ్నాజియం నిర్మించబడినది. 1995లో ప్రాధమిక తరగతుల కోసం ప్రత్యేక భవనం నిర్మంచబడినది. ప్రస్తుతము 2500 విధ్యార్థుల తో, 120 టీచర్ల తో, గత 25 ఏళ్ళ నుండీ 100 % 10వ తరగతి సీ బీ ఎస్ సీ బోర్డు పరీక్షా ఉత్తీర్ణత సాధిస్తూ ఉంది.

విజయవాడలోని ప్రముఖ విద్యా సంస్థలు
  • విశ్వవిద్యాలయం - ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.
  • వైద్య విద్య - సిద్ధార్ధ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సస్
  • ఇంజినీరింగ్ - సిద్ధార్ధ, కోనేరు లక్ష్మయ్య,మాంటిస్సోరి .. కాలేజీలు
  • డిగ్రీ కాలేజీలు - S.R.R.కాలేజి,మాంటిస్సోరి కాలేజి,ఆంధ్ర లయోలా కాలేజి, స్టెల్లా మేరీ కాలేజి, సిద్ధార్ధ కాలేజి, శాతవాహన కాలేజి,సప్తగిరి కాలేజి,
  • ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు - గౌతమి, విజ్ఞాన్, వికాస్, కృష్ణవేణి, శ్రీచైతన్య
  • ప్రముఖమైన పాఠశాలలు - మాంటిస్సోరి,సిద్ధార్ధ,బిషప్,గాంథి మున్సిపల్,నిర్మల
  • ఆర్కిటెక్ కాలేజి -
  • లయోలా కాలేజి చాలా పురాతనమయినది,ఎంతొ మంది ప్రముఖులు విద్య ను అభ్యసించారు.

ఆటలు

దేశమంతటిలాగానే క్రికెట్ ఆటకు అత్యంత ప్రజాదరణ ఉంది. ఇందిరా గాఁధీ స్టేడియంలో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.[6]. మంగళగిరి వద్ద ఒక పెద్ద స్టేడియం నిర్మాణం జరుగుతున్నది.[7]- కోనేరు హంపి (చదరంగం గ్రాండ్ మాస్టర్), అయ్యప్ప (బ్యాడ్మింటన్ ఆటగాడు) వంటివారు విజయవాడకు చెందినవారు.

మీడియా

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ప్రముఖ వాణిజ్య, రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రము. ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. ప్రముఖ పాత్రికేయులు మరియు జర్నలిస్టులు వీరే .............. కాశీనాధుని నాగేశ్వరరావు.... శివలెంక శంభుప్రసాదు...... ముట్నూరి కృష్ణారావు..... మోటూరి హనుమంతరావు..... మద్దకూరి చంద్రసేఖరరావు... తుర్లపాటి కుటుంబరావు..... నండూరి రామ్మోహనరావు.....కూచిమంచి సత్యసుబ్రమణ్యం...... . సీ. రాఘవాచారి... వీఆర్ బొమ్మారెద్డ్ది... ఎకేఆర్ బీ కోటేస్వరరావు... పరకాల పట్టాభిరామారావు... తెలకపల్లి రవి... ఉపేంద్ర బాబు.... సయ్యద్ అక్బర్..... ఎ.ఎమ్.ఖాన్ యజ్దాని..... ఖాదర్ మొహియుద్దీన్..... ముహమ్మద్ వజీరుద్దీన్.... శ్రీరాములు.... కుచ్చి గోపాలకృష్ణ.... తిలక్... ఎస్.వెంకటరావు.. ముత్యాల ప్రసాదు... యు. రామక్రిష్ణ... ఎం.బి.నాథన... సత్య ప్రకాశ్ .... ఆర్. రాంప్రసాద్,.... ఈవీ బాలాజీ .... షేకు బాబు... ఎంబి వర్థన్..... అన్నవరపు బ్రమ్మయ్య.... చలపతిరావు.... రాజేంద్రప్రసాదు.... కలీముల్లా... పోలు అజయ కుమారు... ఫాజిలు ... వడ్లమూడి పద్మ... టీ.ఎడుకొండలు.... విజయవాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్లుగా సీ రాఘవాచారి. వీఆర్ బొమ్మారెడ్డి.. ఎకే ఆర్ బీ కోటేస్వరరావు... ఎస్.వెంకటరావు.. పోలు అజయకుమారు..... ఎం బి వర్థన్..... అన్నవరపు బ్రమ్మయ్య... ముత్యాల ప్రసాదు తదితరులు పనిచెసారు.. విజయవాడలో ప్రధానంగా రెండు యూనియన్లు ఉన్నాయి. అవి 1. ఎపియుడబ్ల్యుజె.. 2.ఎపిడబ్ల్యుజె ఎఫ్. తుర్లపాతి కుటుంబరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. సమాజంలో అన్ని రంగాలలో మాదిరిగానే ఈ రంగంలోనూ విలువలు పడిపోతున్నాయి. దబ్బులిస్తేనే వార్థలు రాస్తున్నారనే ప్రచారము ఉన్నది. జర్నలిస్టులు దానిని తొలగించుకోవాలి. పత్రికల మధ్య... ప్రసార మాధ్యమాల మధ్య పోటీ పెరిగింది. అవాంచనీయ ధోరణలు పెరుగుతున్నాయి. కొందరు మందుకు.. పొందుకు బానిసలవుతున్నారు. పొలీసులకు బ్రోకర్లుగా తయారవుతున్నారు. పత్రికా యజమానులకు చెంచాలుగా తయారవుతున్నారు. గులాములవుతున్నారు. పని చే తగానివారు నాయకులవుతున్నారు. ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా ఇంకా మంచివారున్నారు.. వారివల్లే ఇంకా పత్రికలు నిలబడిఉన్నాయి. ఒకసారి ప్రెస్ క్లబ్బులో పాత్రికేయులు అర్ధరాత్రి మద్యం సేవిస్తుంటే పోలీసు కమీషనర్ సురేంద్రబాబు వారిపై లాటీ చార్జీ కూదా చేసారంటే ఇంకా పాత్రికేయ విలువలెక్కడ... ఈ విలువలను కాపాడుకోవడానికి మంచి పాత్రికేయులు ఒకటి కావాల్సిన అవసరం ఉంది...






రేడియో

విజయవాడలో ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్లు : ఏ.ఐ.ఆర్(AIR) రెయిన్‌బౌ క్రిష్ణవేణి ఎఫ్‌ఎమ్ (102.2 MHz), రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3 MHz) మరియు రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5 MHz).

టెలివిజన్

టెలివిజన్ ప్రసారణ మాధ్యమాలు, నగరంలో రెండు విధాలుగావున్నవి. కేబుల్ టి.వి. మరియు 'డైరెక్ట్ టు హోమ్ సాటిల్లైట్ టి.వి'.

ముద్రణా

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. గ్రంధోత్సవాలు ఇక్కడ సర్వసాధారణం. భారతదేశంలోని ప్రచురణ కర్తలు ఇక్కడ హాజరవ్వడమూ సర్వసాధారణమే.
విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర... ప్రజాశక్తి... నవోదయ... జయంతి... అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.

గ్రంధాలయాలు

  1. శ్రీ రామమోహన గ్రంథాలయం.

1911వ సంవత్సరంలో నాటి స్వాత్రంత్య సమరయోధులు, దేశభక్తులు బందరు రోడ్డులోస్థాపించిన ఈ చారిత్రాత్మక గ్రంథాలయానికి సుమారు అర ఎకరం భూమి ఉంది.రెండువేల గజాలు కలిగిన ఈ గ్రంథాలయ భూమిని, భవనాన్ని అమ్మడానికి వీలు లేకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించకుండా, దాతలు వీలునామా రాశారు.గ్రంథాలయం భూముల విలవ రూ. 20కోట్లుపై మాటే. ఇందులో కొంత భాగం కబ్జాదారుల ఆక్రమణలో ఉంది.నగరంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒకరు రూ. 70 లక్షలతో శిథిలావస్థకు వచ్చిన భవంతి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తానని ముందుకొచ్చారు.

కొండపల్లి అడవులు

విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 కి.మీ.² (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి కలవు.[2]

రాజకీయాలు

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ కు 'రాజకీయ రాజధాని' వంటిది. ఇక్కడి ఓటర్లు రాజకీయంగా క్రియాశీలత మరియు పరిపక్వత గలవారు. ఇక్కడి మేజర్ రాజకీయపార్టీలు తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ మరియు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు. క్రితంలో ఈ ప్రాంతం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి.ఈ నగరంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య మరియు విజయవాడు తూర్పు. ఈనగరంలో పాక్షికంగా పెనమలూరు, మైలవరం మరియు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలున్నవి. విజయవాడకు ఒక లోక్‌సభ నియోజకవర్గం వున్నది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఈ నగరంలో విద్యారంగం తగిన స్థాయిలో వున్ననూ ఐ.టీ. రంగంలో అంత ముందంజలో లేదు. ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరం లో ఐ.టీ. పార్కు మరియు ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరి లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.

విజయవాడలో చూడదగిన ప్రదేశములు

లెనిను విగ్రహం (విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు కేంద్రం)
  • విక్టోరియా మ్యూజియము - పురావస్తు శాఖవారి మ్యూజియము. బందరు రోడ్డులో ఉంది. ఇందులో విగ్రహాలు, వర్ణచిత్రాలను భద్రపరచారు. ఇక్కడ రాతి యుగానికి చెందినవిగా భావిస్తున్న ఎన్నో రాతి పనిముట్లను కూడా ఉన్నాయి. ఇక్కడ అల్లూరు నుంచి తెచ్చిన బ్రహ్మాండమయిన బుద్దుని నల్లరాతి (గ్రానైటు) విగ్రహము, మరియు ఇంకొక పాలరాతి విగ్రహము ఉన్నాయి. ఇవి మూడు లేదా నాలుగవ శతాబ్దమునకు చెందినవిగా భావిస్తున్నారు.
  • కొండపల్లి , కొండపల్లి కోట - కొండపల్లి గ్రామం విజయవాడ నగరానికి వాయువ్యాన 14 కి.మీ.ల దూరములో ఉన్నది. కొండపల్లి కలపతో తయారుచేసే బొమ్మలకు పెట్టింది పేరు. "పొనికి" అనే తేలికయిన చెక్కమీద లక్కపూతతో అందమయిన రంగులలో ఈ బొమ్మలను తయారుచేస్తారు. గ్రామాలలోని జీవన శైలిని, పురాణ గాధలలోని పాత్రలను, జంతువులను, పక్షులను, పండ్లను, కాయగూరలను, మొదలైనవాటిని వర్ణిస్తూ తయారవుతాయి. ఏడవ శతాబ్దములో నిర్మించిన మూడు అంతస్తుల కోటను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. అంతేకాదు, ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.
కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి, రైలు వంతెన
  • ప్రకాశం బ్యారేజి - కృష్ణా నదిపై ఇక్కడ ఒక ఆనకట్ట కట్టే ఆలోచన మొదట 1798 లో వచ్చింది. తరువాత 1841 లో కేప్టెన్ బకుల్ చేతులలో ఒక రూపాన్ని సంతరించుకున్నది. 1852 లో ఆనకట్టను నిర్మించడం మెదలుపెట్టి 1855 లో పూర్తి చేసారు. వందేళ్ళ పాటు ఉపయోగపడిన ఆనకట్ట ఆనకట్ట కొట్టుకొని పోవడంతో, 1954 మార్చి 1ఆంధ్ర రాష్ట్రపు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఒక కొత్త రెగ్యులేటరు మరియు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. 1957లో బారేజి పూర్తి అయింది. 1223.5మీటర్ల పొడవు కలిగిన ఈ బారేజీ వలన మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీని వలన కృష్ణా డెల్టా రాష్ట్రం లోనే పెద్ద ధాన్యాగారముగా మారింది. ప్రకాశం బారేజి వలన ఏర్పడిన సరస్సు నలుదిక్కులా కనిపిస్తూ చాలా మనోహరంగా ఉంటుంది.
  • గాంధీ కొండ: గాంధీ కొండ లేదా ఒర్ కొండ అని పిలిచే ఈ కొండ మీద 1968 లో మహాత్ముడి సంస్మరణార్ధం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 15.8 మీటర్లు (52 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక గాంధీ స్మారక గ్రంధాలయం, "సౌండ్ అన్డ్ లైట్ షో" మరియు నక్షత్రశాలలు ఉన్నాయి. ఈ కొండపై నుండి దాదాపు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కొండ మొత్తం చూపించడానికి ఒక బొమ్మ రైలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్తూపం మహాత్ముని సంస్మరణార్ధం భారత దేశములో నిర్మించిన మొదటి స్తంభము. దీనిని అక్టోబరు 6 1968 న అప్పటి అధ్యక్షుడు స్వర్గీయ డా. జాకిర్ హుసేన్ ఆవిష్కరించి, జాతికి అంకితమిచ్చాడు.
  • ఉండవల్లి గుహలు: కీ.శ. 7వ శతాబ్దములో నిర్మితమయిన ఈ గుహలు విజయవాడకు 8 కీ.మీ.ల దూరములో ఉన్నాయి. రెండంతస్తుల ఈ గుహారూపాలను బౌద్ద సన్యాసులు వానా కాలములో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. పడుకున్న భంగిమలో ఉన్న "అనంతశయన విష్ణువు" యుక్క భారీ ఏకశిలా విగ్రహము ఇక్కడ ఉంది. ఈ కొండ నుండి కృష్ణా నది మనోహరముగా కనిపించును. ఈ కొండపైన రాళ్ళమీద విగ్రహ ప్రతిమల మాదిరిగా చెక్కిన చిత్రాలు కూడా చూడ వచ్చు.
  • నరసింహ స్వామి ఆలయము: విజయవాడకు దక్షిణాన 12 కి.మీ.ల దూరములో ఉన్న మంగళగిరిలో ఈ ఆలయము ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటైన నరసింహ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటంటే, భక్తులు ఎంత పానకం సమర్పించినా అందులో సగం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. ఈ ఆలయమును 14వ శతాబ్దములో నిర్మించారు, మరల 17, 18వ శతాబ్దాలలో నమూనాను మార్చినారు. ఆలయానికి వెలుపల రధాకారములో ఉన్న గరుక్మంతుని కోవెల ఉంది.
  • హజరత్‌బల్‌ మసీదు: విజయవాడలో ఈ మస్జిద్ (మసీదు) మతపరమయిన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ఇంకోటి. ఇక్కడ ఉన్న మహమ్మదు ప్రవక్త యొక్క పవిత్రమయిన కేశాన్ని సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఈ పండుగలో ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
  • గుణదల మేరీమాత చర్చి: విజయవాడకు తూర్పున ఉన్న ఈ చర్చఇని 1925 లో రెవ.ఆర్లాటిగారు - గుణదలలోని సెయింట్‌ జోసెఫ్ అనాధాశ్రయములో అప్పటి అధికారి - ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి, తరువాత చర్చీని నిర్మించారు. 1971 లో దీనిని పవిత్రపరిచినారు(చొన్సెచ్రతెద్). ఇప్పుడు మేరీ మాత చర్చీగా ప్రసిద్ది చెందింది. ప్రతీ సంవత్రరం ఫిబ్రవరి నెలలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానిని వేల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.
  • హ్రీంకార తీర్థ (జైనుల ఆలయము): మంగళగిరిలో ఉన్న ఇంకో ఆకర్షణ ఈ జైన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని జైన ఆలయాలలోకి ఇదే అతి పెద్దదని ప్రతీతి. ఈ ఆలయము కళాఖండాలకు పెట్టింది పేరు.
  • రాజీవ్‌ గాంధీ పార్కు: ఈ పార్కును విజయవాడ మునిసిపలు కార్పోరేషను ప్రత్యేక శ్రద్ధ తీసికొని నిర్మించింది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు పెంచబడుతున్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, ఒక మినీ జూ ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ.
  • మొగల్రాజపురం గుహలు: ఈ గుహలను క్రీశ ఐదవ శతాబ్దములో నిర్మించినట్లు చెబుతాతు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహములు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహము దక్షిణ భారతదేశములో మరెక్కడా కనిపించదు.
  • భవానీ ద్వీపం - ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు. ఇది విజయవాడ నగరానికి 4 కి.మీ.ల దూరములో ఉంటుంది. 133 ఎకరాల ఈ దీవిని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారు గొప్ప పర్యాటక ప్రదేశముగా మలచారు. ఇక్కడ ఒక రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా గొప్ప విహారక్షేత్రము. దీవి వద్దకు వెళ్ళేందుకు పడవ వసతి కల్పించారు.
  • అమరావతి - ఇది విజయవాడకు 68 కీ.మీ.ల దూరములో కృష్ణా నది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నపట్టణము. అమరావతి దక్షిణభారతదేశములోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధారామం. క్రీ.పూ. మూడు లేదా రెండవ శతాబ్దాలలో ఆచార్య నాగార్జునుడు ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించాడు. కల్నలు మెకెన్జీ 1797 లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు చాలావరకు మద్రాసు మరియు కోల్కతాలలో ఉన్న మ్యూజియములలో భద్రపరిచారు. ఇక్కడి ప్రాంతంవారు దీనిని దీపాల దిన్నె అని పిలిస్తారు. ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియము ఉన్నది. అందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షము యొక్క శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలయినవాటిని చూడవచ్చు.

తాడేపల్లి మండలం, తాడేపల్లి ప్రధాన గ్రామ పంచాయితి. విజయవాడ కు ప్రక్కనే (గుంటూరు జిల్లా)కృష్ణా నది ఒడ్డున కలదు. మంగళగిరి నియోజకవర్గం.

  • బీసెంటు రోడు - విజయవాడలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం.
  • సత్యనారాయణ స్వామి ఆలయం - ఇది గాంధీ నగర్ లొ ఉన్నది. సత్యనారాయణ స్వామి పేరు మీద ఎన్ని ఆలయాలున్నా, ఈ ఆలయం విజయవాడ వాసులకు ఒక తీర్థం లాంటిది.
  • వేంకటేశ్వర స్వామి ఆలయం - ఇది బందరు రోడ్డు లో ఉన్నది. విజయవాడ లో 3 ముఖ్యమయిన రోడ్లు మర్చిపోకూడనివి. 1 - ఏలూరు రోడ్డు, 2 - బందరు రోడ్డు, 3 - 5వ నంబరు రూట్ రోడ్డు. వేంకటెశ్వర స్వామి గుడి కి వెళ్ళాలంటే, బందరు రోడ్డులో, పశువుల ఆస్పత్రి దగ్గరనుంచి వెళ్ళవలెను.
  • విజయవాడ లో అనేక సినిమా ధియేటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న జనాభాకి వినోదానికి కొదవలేదు.

దేవాలయాలు

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయము

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట

దస్త్రం:MarakataRajarajeswari.jpg
మరకత రాజరాజేశ్వరి

ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో(పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.

వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం - లబ్బీపేట

బెంజి సర్కిల్ నుండి రెండు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర.

ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం

క్షిప్రగణపతి దేవాలయం - పటమట

రామలింగెశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు

స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉన్నది.బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉందీ విజయవాడలో పేరుగాంచిన దేవాలయము.శీవిరాత్రి పర్వదినాన ఘనంగా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రొజు జరిగె ఉత్సవాలులొ ఉ౦డె ప్రభలు చుడడానికి చుట్టుపక్కల గ్రామాల ను౦చె గాక రాష్ర్ట౦ నలుమూలల ను౦చి జన౦ వస్తారు.

మురుగునీటితో క్రిస్టల్ వాటర్

నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత రా వాటర్‌గా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు క్రిస్టల్ వాటర్ దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.[8]

బయటి లింకులు

రిఫరెన్స

  1. VMC
  2. Air Deccan to launch Bangalore-Vijayawada service - India Airline News, Airport developments, Aviation, A380, B787, Kingfisher, Deccan, Jet Airways, Air India, Indian Airlines, Spicejet
  3. "(Gannavaram-Vijayawada) aerodrome". Retrieved 2006-08-20.
  4. Murali Sankar, K.N. "Simulator training for train drivers from [[July 15]] in Vijayawada". The Hindu. Retrieved 2006-08-20. {{cite web}}: URL–wikilink conflict (help)
  5. The Hindu Business Line : Maytas consortium to develop Machilipatnam port at new site
  6. Vijayawada cricket stadium
  7. The Hindu : Andhra Pradesh / Vijayawada News : Keeping home turf in top shape
  8. జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం
"https://te.wikipedia.org/w/index.php?title=విజయవాడ&oldid=688979" నుండి వెలికితీశారు