అక్షాంశ రేఖాంశాలు: 26°48′N 82°44′E / 26.80°N 82.74°E / 26.80; 82.74

బస్తీ (ఉత్తర ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బస్తీ
వైశిష్ఠి
పట్టణం
బస్తీ is located in Uttar Pradesh
బస్తీ
బస్తీ
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°48′N 82°44′E / 26.80°N 82.74°E / 26.80; 82.74
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబస్తీ
జనాభా
 (2011)[1]
 • Total1,14,657
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)

బస్తీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది బస్తీ జిల్లా ముఖ్య పట్టణం. ఒక భాగం బస్తీ రెవెన్యూ డివిజన్. ఇది రాష్ట్ర రాజధాని లక్నో నుండి తూర్పున 202 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బస్తీని మొదట వైశిష్ఠి అని పిలిచేవారు.[3] ఈ ప్రాంతంలోవశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేదనీ, అందుచేత దీనికి వైశిష్ఠి అనే పేరు వచ్చిందనీ భావిస్తారు. పురాతన కాలంలో రామ లక్ష్మణులు ఇక్కడి వశిష్ఠాశ్రమంలో గడిపారని ఇక్కడి ప్రజల నమ్మకం.

ప్రస్తుతం జిల్లా విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఎక్కువ భాగం అటవీప్రాంతం. క్రమంగా ఈ ప్రాంతం నివాసయోగ్యంగా మారింది. జిల్లాకు పట్టణానికీ ఈ పేరు ఎల వచ్చిందో చెప్పే ఆధారాలు లేవు. బహుశా 16 వ శతాబ్దంలో కల్హణ రాజు తన రాజధానిగా చేసుకుని పాలించి ఉండవచ్చు. 1801 లో బస్తీ, తహసీలు ప్రధాన కార్యాలయంగా మారింది. 1865 లో కొత్తగా స్థాపించబడిన జిల్లాకు ముఖ్య పట్టణమైంది.

1857 స్వాతంత్ర్య సంగ్రామంలో, అమోర్హా రాజ్యానికి చెందిన 250 మంది అమరవీరులను బ్రిటిషు ప్రభుత్వం, ఛావనీ వద్ద ఉన్న రావి చెట్లకు ఉరితీసింది.[4][5][6][7]

భౌగోళికం

[మార్చు]

జిల్లా 26° 23', 27 ° 30' ఉత్తర అక్షాంశాలు, 82° 17', 83° 20' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఉత్తర దక్షిణాల్లో దీని గరిష్ఠ పొడవు 75 కి.మీ., తూర్పు, పడమరల్లో వెడల్పు 70 కి.మీ. ఈ జిల్లా తూర్పున కొత్తగా సృష్టించిన జిల్లా సంత్ కబీర్ నగర్ పశ్చిమాన గోండా జిల్లాలు ఉన్నాయి. దక్షిణాన, అమోర్హా ఖాస్ సమీపంలో ఉన్న ఘఘ్రా నది ప్రవహిస్తోంది. ఇది జిల్లాను, ఫైజాబాద్, కొత్తగా సృష్టించిన అంబేద్కర్ నగర్ జిల్లాల నుండి వేరు చేస్తుంది. ఉత్తర సరిహద్దున సిద్దార్థనగర్ జిల్లా ఉంది.[8]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బస్తీ మొత్తం జనాభా 1,14,657, వీరిలో 60,095 మంది పురుషులు, 54,562 మంది మహిళలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులో ఉన్న జనాభా 13,349. బస్తీలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 84,389. ఇది జనాభాలో 73.6%, పురుషుల్లో అక్షరాస్యత 78.3% ఉండగా, స్త్రీలలో 68.5% ఉన్నారు. బస్తీలో షెడ్యూల్డ్ కులాల జనాభా 17,036, షెడ్యూల్డ్ తెగల జనాభా 275. 2011 లో బస్తీలో 17894 గృహాలు ఉన్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Basti". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
  3. "Where is Basti, Information about Basti, Where is Basti Located in Uttar Pradesh, India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 28 October 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Places of Interest". basti.nic.in. Archived from the original on 29 June 2016. Retrieved 9 June 2016.
  5. Thomas, D. (1998). Battles and Honours of the Royal Navy. Leo Cooper. p. 16. ISBN 9780850526233. Retrieved 14 January 2017.
  6. Benett, W.C. (1878). The final settlement report on the Gonda district. Vol. 23. p. 22. Retrieved 14 January 2017.
  7. Michael, B.A. (2014). Statemaking and Territory in South Asia: Lessons from the Anglo–Gorkha War (1814–1816). Anthem Press. p. 151. ISBN 9781783083220. Retrieved 14 January 2017.
  8. "Yahoo maps location of Basti". Yahoo maps. Retrieved 29 March 2009.