దగ్గుబాటి వెంకటేష్

వికీపీడియా నుండి
(దగ్గుపాటి వెంకటేష్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెంకటేష్
Venkatesh-actor.jpg
వెంకటేష్
జననందగ్గుబాటి వెంకటేష్
(1960-12-13) 1960 డిసెంబరు 13 (వయస్సు: 59  సంవత్సరాలు)
కారంచేడు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాదు
ఇతర పేర్లువెంకీ
విక్టరీ వెంకటేష్
చదువుఎం. బి. ఏ
విద్యాసంస్థలు
 • డాన్ బాస్కో స్కూలు, చెన్నై
 • లయోలా కళాశాల, చెన్నై
 • మాంటరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, అమెరికా
వృత్తిసినిమా నటుడు
జీవిత భాగస్వామినీరజ
పిల్లలు
 • అర్జున్ రామంత్
 • ఆశ్రిత
 • హయవాహిని
 • భావన
తల్లిదండ్రులు
 • దగ్గుబాటి రామానాయుడు (తండ్రి)
 • రాజ్యలక్ష్మి (తల్లి)

వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు.[1] ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడుగారి రెండవ కుమారుడు. డిసెంబర్ 13, 1960ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. అమెరికా లోని మాంటెర్రీ విశ్వవిద్యాలయములో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశాడు. వెంకటేష్ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.

ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు.

సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. సౌందర్యతో ఆయన ఏడు సినిమాలు చేసారు. మీనాతో నాలుగు సినిమాలు (చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం) చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. ఆర్తీ అగర్వాల్తో మూడు సినిమాలు (నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి) చేసారు. ఆమూడు కూడా విజయం సాధించాయి.

వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసారు. పైగా రాఘవేంద్రరావు వెంకటేష్ ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమా అద్భుత ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ లభించింది. ఆతర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులను అందించాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

దగ్గుపాటి వెంకటేష్

వెంకటేష్ ప్రఖ్యాతి గాంచిన డాన్ బోస్కో, ఎగ్మోర్, మద్రాసు (ప్రస్తుత చెన్నై) నుండి పట్టభధ్రుడయ్యారు. మోంటెరే ఇన్స్టిస్టూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఎ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం చిత్ర నిర్మాణం చేబడదామనుకున్నారు, కాని తెలుగు చిత్రాలలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈయన తండ్రి, డి. రామానాయుడు, సోదరుడు డి. సురేష్ బాబు గారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నడుపుతున్నారు.

వెంకటేష్ నీరజ గారిని వివాహమాడారు. వీరికి ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, అమ్మయిల పేర్లు ఆశ్రిత, హయవాహిని, భావన.

నట జీవితం[మార్చు]

వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నటుడిగా రెండేళ్ళ ప్రాయంలోనే, ఆయన కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు, చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. కొన్ని పరాజయాల తర్వాత మొదటి విజయం బొబ్బిలి రాజా రూపంలో లభించింది. బొబ్బిలి రాజా సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన శత్రువు సినిమాలో వెంకటేష్, న్యాయస్థానాల్లో అవినీతిని అరికట్టలేక, విసుగు చెంది, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక ఆవేశపూరితుడైన యువ న్యాయవాది పాత్రను పోషించారు. ఆ తరువాత విలక్షణ దర్శకుడైన రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో, విజయవంతమైన చిత్రం క్షణక్షణంలో నటించారు. ఆ తరువాత కొన్నేళ్లు వివిధ విజయవంతంకాని చిత్రాల్లో నటించారు. అయితే, 1991లో తమిళ సినిమా చిన్నతంబిని తెలుగులో పునర్నిర్మించి విడుదలచేసిన చంటి సినిమా వెంకటేష్ సినీ వ్యాసాంగాన్ని ఒక మలుపుతిప్పిన చిత్రంగా భావించబడుతుంది. అప్పటిదాకా అవేశపూరిత యువకుని పాత్రలు ఎక్కువగా పోషించిన వెంకటేష్, చంటి పాత్రను చాలా శ్రమతో పండించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో అదే సినిమా తిరిగితీసినప్పుడు (అనారీ) అందులో కుడా ప్రధాన పాత్రను వెంకటేషే పోషించారు. ఈ చిత్రంతో వెంకటేష్ కుటుంబ తరహా చిత్రాలు కూడా చేయగలడన్న ముద్ర ఏర్పడింది. మహిళా ప్రేక్షకులలో ఆదరణ కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన చాలా సినిమాలలో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు. ఈయన ఇటీవలి చిత్రాలు లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, తులసి చిత్రాలు వరుసగా విజయవంతమై వెంకటేష్ కు హ్యట్రిక్కును సాధించాయి.

వెంకటేష్ తన పనిని చాలా పట్టుదలతో చేస్తారు. తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని పలు సందర్భాలలో చెప్పుకున్నారు. వెంకటేష్ వినోదభరిత చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. హాస్య ప్రధాన పాత్రలలో పోషిస్తూనే ఈయన ఘర్షణ, లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి గానూ ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది.

చిత్రసమాహారం[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పేరు పాత్ర పేరు
1986 కలియుగ పాండవులు విజయ్
బ్రహ్మరుద్రుడు ప్రసాద్
1987 అజేయుడు మురళి
భారతంలో అర్జునుడు అర్జున్
త్రిమూర్తులు
విజేత విక్రం విక్రం
శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస్
1988 రక్త తిలకం
బ్రహ్మపుత్రుడు
స్వర్ణకమలం చంద్ర
వారసుడొచ్చాడు రఘు
1989 ప్రేమ పృధ్వీ
ఒంటరి పోరాటం విజయ్
ధృవ నక్షత్రం ధృవ కుమార్
టూ టౌన్ రౌడీ శక్తి
1990 అగ్గి రాముడు పెదబాబు
బొబ్బిలి రాజా రాజా
1991 శత్రువు అశోక్
కూలీ నం. 1 రాజు, భరత్
సూర్యా ఐ.పి.ఎస్ సూర్య
క్షణక్షణం చందు
1992 చంటి చంటి
చినరాయుడు చినరాయుడు
సుందరకాండ వెంకటేశ్వర్లు
1993 అబ్బాయి గారు దొరబాబు
కొండపల్లి రాజా రాజా
1994 ముద్దుల ప్రియుడు రాముడు / రాజు
సూపర్ పోలీస్ విజయ్
1995 పోకిరి రాజా చంటి / బాల్ రాజ్
1996 ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు శ్రీరాం
ధర్మ చక్రం రాకేష్
పవిత్ర బంధం విజయ్
సాహస వీరుడు - సాగర కన్య రవి
1997 చిన్నబ్బాయి చిన్నబ్బాయి
పెళ్ళి చేసుకుందాం ఆనంద్
ప్రేమించుకుందాం రా గిరి
1998 గణేష్ గణేష్
ప్రేమంటే ఇదేరా మురళి
సూర్య వంశం హరిశ్చంద్ర ప్రసాద్ / భాను ప్రసాద్
1999 రాజా రాజా
శీను శీను
2000 కలిసుందాం రా రాజా
జయం మనదేరా మహదేవ నాయుడు / అభిరాం
2001 దేవీ పుత్రుడు కృష్ణ/బలరాం
నువ్వు నాకు నచ్చావ్ వెంకతేశ్వర్లు, "వెంకీ"
ప్రేమతో రా చంద్ర శేఖర్
2002 వాసు వాసు
జెమిని జెమిని
2003 వసంతం అశోక్
2004 మల్లీశ్వరి పెళ్ళి కాని ప్రసాద్
ఘర్షణ డిసిపి రామచంద్ర
2005 సోగ్గాడు వెంకటేష్ (అతిథి పాత్ర)
సంక్రాంతి రాఘవేంద్ర
సుభాష్ చంద్ర బోస్ అశోక్/సుభాష్ చంద్ర బొస్
2006 లక్ష్మీ లక్ష్మీ నారాయణ
2007 ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే గణేష్
తులసి తులసి రాం
2008 చింతకాయల రవి రవి
2009 ఈనాడు కమీషనర్
2010 నమో వేంకటేశ వెంకటరమణ
నాగవల్లి (2010 సినిమా) డాక్టర్ విజయ్
2012 బాడీగార్డ్ వెంకటాద్రి నాయుడు
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పెద్దోడు
2013 షాడో చంటి/షాడో
2013 మసాలా బలరాం
2014 దృశ్యం రాంబాబు
2015 గోపాల గోపాల గోపాల రావు
2016 బాబు బంగారం ఎ.సి.పి కృష్ణ
2017 గురు
2019 F2 వెంకీ
2019 వెంకీ మామ వెంకటరత్నం నాయుడు, మిలిటరీ నాయుడు

పురస్కారాలు[మార్చు]

 • 1986 కలియుగ పాండవులు చిత్రానికి గానూ ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం
 • 1988 బ్రహ్మపుత్రుడు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం
 • 1988 స్వర్ణకమలం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
 • 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
 • 1989 ప్రేమ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం
 • 1990 బొబ్బిలి రాజా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారం
 • 1991 శత్రువు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా భాగ్యనగర్ పురస్కారం
 • 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారం
 • 1991 కూలీ నం. 1 చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా మద్రాస్ చిత్ర అభిమానుల పురస్కారం
 • 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా యువవాహిని పురస్కారం
 • 1992 సుందరకాండ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సినీగోయర్స్ పురస్కారం
 • 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం
 • 1993 అబ్బాయిగారు చిత్రానికి గానూ ఉత్తమ నటనకు సినీగోయర్స్ పురస్కారం
 • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
 • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం
 • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కళాసాగర్ పురస్కారం
 • 1995 ధర్మచక్రం చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా వంశీ బర్కిలీ పురస్కారం
 • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
 • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం
 • 1998 గణేష్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా కిన్నెర పురస్కారం
 • 2000 కలిసుందాం రా చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం
 • 2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వేరులే చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం

మూలాలు[మార్చు]

 1. "ఈనాడులో వెంకటేష్ పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 13 December 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 13 December 2016.