దద్ధ్యోదనం

వికీపీడియా నుండి
(దద్దోజనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దద్ధ్యోదనం

దద్ధ్యోదనం పెరుగు, అన్నంతో చేసే రుచికరమైన ఆహారం. దీనిని వాడుకలో దద్ధోజనం అనడం కూడా కద్దు.

కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారుచేయు విధానం

[మార్చు]
  • బియ్యం శుభ్రంగా బాగుచేసి, చక్కగా కడిగి, తరువాత 'అత్తెసరు' పెట్టాలి. అత్తెసరంటే గిన్నెలో బియ్యంపోసి తగినంత నీరు (అంటే వార్చకుండా అన్నం ఉడికేపాటి నీరు) పొయ్యాలి.
  • ఇలా ఉడికిన అన్నాన్ని ఒక కళాయి పళ్ళెంలోకి తిరగబోసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ అన్నం బాగా చల్లారేటట్లు విడిగా ఆరనివ్వాలి.
  • పాలు రెండు పొంగులు రానిచ్చి దించి, చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పాలు పెరుగులో పోసెయ్యాలి.
  • పచ్చి మిరపకాయలు, అల్లం సన్నగ తరిగి ముక్కలుచేసి ఉంచుకోవాలి.
  • ఒక గిన్నెలో గాని, బూరెల మూకుడులో గాని నెయ్యివేసి, నెయ్యి మరిగాక జీడిపప్పు, రెండు ఎండు మిరపకాయలు, కాస్త మినప పప్పు వెయ్యాలి. ఈ రెండు కాస్త ఎర్రబడ్డాక, రెండు మెంతిగింజలు, కాసిని ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడుం వేసి చిటపటలాడాక, పచ్చిమిరప, అల్లం ముక్కలువేసి, కరివేపాకు దూసివేసి కాస్త వేగాక పోపుగిన్నెకిందికి దింపి ఆ పోపుని పాలు, పెరుగు పోసి బాగా కలపాలి.
  • పాలు, అన్నం బాగా చల్లారిన తరువాత బాగా చేతితో నాలుగువైపులా కలిసేటట్లు కలపండి.
  • చివరికి కొత్తిమిర తుంచి వేయండి.

చిట్కాలు

[మార్చు]
  • అన్నం వేడిగా ఉండగా కలిపినా, వేడిపాలలో పెరుగు కలిపినా పెరుగు విరిగిపోతుంది.