Jump to content

సాంబారు

వికీపీడియా నుండి
Sambar
Sambar
మూలము
మూలస్థానంభారత దేశము
ప్రదేశం లేదా రాష్ట్రంSouth India
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Broth, lentils, vegetables

సాంబార్ పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

సంభారము అనే సంస్కృతపదం ఉన్నది. పదార్ధ సంచయము అనే అర్ధము ఉన్నది. సంబారము సంభారుకి వికృతము (ఒత్తులేని పదము). సంభారము యొక్క రూపాంతరము సంబారు. సంబారము అనే మాటకే ఉప్పు చింతపండు లోనుగ వంటదినుసులు అనే అర్ధము కాక, వండిన సాదకము (కూర) అనే అర్ధంలో శ్రీనాధుడు వాడినాడు: శాక పాకములలో సంబారములతోడ, పరిపక్వమగు పెసరపప్పుతోడ (భీమేశ్వరపురాణము 1-61), ఇక్కడ సంబారము వంటవస్తువులుగాక సాంబారు వంటి కూరలు(పులుసు) అని అర్ధం వస్తుంది. సంబారమునకు రూపాంతరమైన సాంబారుకు పప్పుపులుసు అనే అర్ధం రూఢమవుతుంది. సంభారము- ప్రకృతి సంబారము-వికృతి సంబారు- రూపాంతరము సాంబార్, సాంబారు- ప్రస్తుతపు వాడుకరూపాలు.

క్యారట్, ముల్లంగి, ములక్కాడ ముక్కలు

సాంబార్ చేసే విధానం

[మార్చు]
ఇడ్లీ సాంబారు

సాంబార్ ఎలా చేయాలీ అంటే సాంబారులో ముల్లంగి, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తమల్లి తరుగి వేస్తారు. చింతపండు నానబెట్టి నీళ్ళు పిండి తీసిపెట్టుకోవాలి. ముందుగా కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. బాణలి పొయ్యిమీద పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసుకుని తిరగమాత (పోపు) పెట్టుకోవాలి. సాంబారు పోపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు ఎండుమిరపకాయలువేసి వేగించి రెండు తెల్లపాయలు చిదిమి వేసి వాటిని కూడా వేగనిచ్చి తరిగిన కూరగాయలు వేసుకోవాలి. తరువాత కూరగాయలను కొంచం సమయం వాడ్చి తగినన్ని నీరు పోసి కొంచెం సమయం ఉడకనివ్వాలి. తరువాత చింతపండు నీరు పోసి మరికొంత సమయం ఉడకనిచ్చి తరువాత ఉడికించిన పప్పును మెత్తగా ఎనిపి చేర్చాలి. తరువాత ఉప్పు కారం సాంబారు పొడి కలిపి చిటికెడు పసుపు వేసి కొంత సమయం చిక్కపడే వరకు ఉడకనిచ్చి దింపుకోవాలి.[1]

సాంబారు ఉపయోగాలు ..ruchi

[మార్చు]
సాంబారు

సాంబారు మసాలాలు రకాలు

[మార్చు]


పప్పు పులుసుకు సంబారుకు తేడాలు

[మార్చు]

సాంబారులో రకాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు జాబితా

[మార్చు]
  1. Jamala, V. "Tamilnadu Style Sambar Recipe For Idli Easy Instant Method". Bhimas Cook. Bhimas Cook. Retrieved 4 January 2024.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సాంబారు&oldid=4077893" నుండి వెలికితీశారు