పామర్రు
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
పామర్రు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°19′37.884″N 80°57′53.244″E / 16.32719000°N 80.96479000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పామర్రు |
విస్తీర్ణం | 17.8 కి.మీ2 (6.9 చ. మై) |
జనాభా (2011) | 21,395 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 10,366 |
• స్త్రీలు | 11,029 |
• లింగ నిష్పత్తి | 1,064 |
• నివాసాలు | 6,294 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 521157 |
2011 జనగణన కోడ్ | 589581 |
పామర్రు (పామఱ్ఱు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం, ఇది సమీప పట్టణమైన గుడివాడ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6294 ఇళ్లతో, 21395 జనాభాతో 1780 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10366, ఆడవారి సంఖ్య 11029. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4749 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1058. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589581[2].సముద్రమట్టానికి 9 మీ.ఎత్తులో ఉంది.
సమీప పట్టణాలు
[మార్చు]గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల గుడివాడలో ఉంది. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి. ఇక్కడ కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]పామర్రులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ భవనం నిర్మాణం ఉంది.
సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు 12 మంది ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]పామర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]పామర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 255 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1524 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 678 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 845 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]పామర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 789 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 56 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]పామర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]పామఱ్ఱు (స్తూప) జయధ్వజ చరిత్ర[3]
పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం, దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి. పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది .. దానిమధ్యలో ఒక తామర కొలను దానిపై దివ్య ప్రతిష్ఠితమైన శివ లింగం ఉండేవి. కొలనులో నీరు ఎప్పుడూ ‘’ఏనుగు లోతు’’ ఉండేది .శివలింగం కొలను నీటికి పైన దర్శనమిస్తూ ఉండేది .లింగం పాదం ఎంతలోతులో ఉందొ ఎవరికీ అంతు పట్టేదికాదు . ఈ శివ లింగాన్నిఎప్పుడో నాగులు ప్రతిస్టించాయనీ , నిత్యాభి షేకానికి ఒకనదిని కూడా అక్కడ కల్పించాయని , నాగులు తెచ్చిన నదికనుక ‘’నాగులేరు ‘’అనే పేరొచ్చిందని పూర్వులు చెప్పుకొనేవారు .ఆవరణం లేని ఆ శివలింగం మహా ప్రభావ సంపన్నంగా ఉండేది .దివ్యులు వచ్చి అర్చించి వెళ్ళేవారు . ఆశివ లింగం శిరసుపై ఒకపద్మం వికసించి దివ్య పరిమళాలను వెదజల్లేది.ఆ కొలను గట్టున అనేక శాఖలతో విస్తరించిన వట (మర్రి ) వృక్షం ఉండేది .ఆ వటవృక్షం తొర్రలో మహా నాగం ఒకటి నివసించేది .అది రోజూ చెట్టుదిగి ఆమహా శివ లింగాన్ని చుట్టుకొని నాగాభరణంగా భాసించేది
చాలా ఏళ్ళు గడిచాక ఆ చెరువు కొంత పూడిపోయి , చిన్న గ్రామం ఏర్పడింది . తర్వాత కాలంలో లో మహమ్మదీయ ప్రభుత్వమేర్పడి , హిందూ దేవాలయ ధ్వంసం చేసి ,విగ్రహాల పీఠభాగం నిక్షిప్తమై ఉన్న ఉన్న అమూల్య సంపదను దోచుకోవటం ప్రారంభమైంది .అలాంటి సంక్షోభ కాలం లో ఒకమహమ్మదీయ సైన్యం ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి శివలింగ వైభవానికి ఆశ్చర్యపోయి , ఆ శివలింగ మూలాన్ని ధ్వంసం చేస్తే అన్నతమైన ధన కనక వస్తురాసి లభిస్తుందని ఆశపడి ,తటాకం లోకి చేరి చాలాలోతుగా ఉన్న నీటిలో ఉన్న లింగాన్ని పీకటానికి విశ్వ ప్రయత్నం చేశారు . మానవ సాధ్యం కాదని అర్ధమై ఒక ఏనుగును దింపి ప్రయత్నించారు. అది తామర తూడు ఆశతో లింగం పైఉన్న తామర పువ్వును పెకలించింది . దాని మూరెడు పొడవున్న తూడు బయటికి వచ్చింది . అప్పుడు శివలింగం శిరసుపై రంధ్రం ఏర్పడి రక్తం కారటం మొదలు పెట్టింది .కొలను నీరంతా రక్త ప్రవాహమైంది .ఈ హఠాత్సంఘటనకు తురక సైన్యం భయపడి ,ప్రయత్నాన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించింది .ఇప్పటికీ ఆ శివలింగం శిరోభాగం లో మూరెడు లోతు గుంట కనిపిస్తుంది . ప్రతి రోజూ శివలింగ౦పై ఉన్న గుంటను శుభ్రంగా కడిగి, వస్త్రం జొనిపి , తుడిచి శుభ్రం చేస్తారు . లేకపోతె రక్తపు వాసన వస్తుంది .
గ్రామస్తులకు ఈ విశేష శివలింగం పై అశేషభక్తి ఏర్పడి నిత్యపూజలుచేయటం ప్రారంభించారు .క్రమ౦గా కొలను పూడిపోయి గ్రామం వృద్ధి చెందింది .గ్రామస్తులు ఆ మహా మహిమాన్విత శివ లింగానికి ప్రాకారం ,ఆలయం కట్టించి ‘’సోమేశ్వర స్వామి ‘’ గా అర్చిస్తూ నిత్యోత్సవాలు నిర్వహించారు . కొలను గట్టున ఉన్న వటవృక్షం అంటే మర్రి చెట్టు ఇప్పుడు లేదు . చాలాకాలం మర్రి చెట్టు, అందులో పాము ఉండటం యదార్ధం కనుక ఆగ్రామానికి ‘’పాము మర్రి ‘’ అనే పేరొచ్చింది .కొంతకాలానికి ‘’పామ్మర్రి ‘’గా మారి , చివరికి’’ పామర్రు ‘’ అయింది .
‘’పాము వసియించు మఱ్ఱికి – గ్రామం కుఱగటనుగలుగ గా గాంచి,
జనస్తోమమ్ము ‘’పాము మఱ్ఱన’’-‘’బామఱ్ఱ’’ని యదియ పిదప వాడుక పడియెన్’’
పామర్రు క్రమాభి వృద్ధి పొంది , చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా మారి ,1910లో గుడివాడ , తాలూకాలో పామర్రు డివిజన్ అయింది .ఈ డివిజన్ లో 65 గ్రామాలు ఉండేవి .ఈ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ కార్యాలయం పామర్రులో ఉంది.
పామర్రులో ‘’జయ స్తంభం ‘’ నిర్మించారు . ఈ జయ స్తంభం బందరు-హైదరాబాద్ రోడ్డులో , పుల్లేరు కాలువ వంతెన ప్రక్కన నిర్మించారు . పద్నాలుగున్నర అడుగుల ఎత్తులో ,ఆరడుగుల లోతున ఏర్పాటు చేశారు .స్తంభం మధ్యలో నాలుగు పలకలు ,దానికి పైన కిందా ఎనిమిది పలకలుగా ఉండేట్లు నిర్మించారు. శివ- వేంకట కవులు అనే జంటకవులైన ‘’ప్రబంధ పంచానన ‘’బిరుదాంకితులు అడవి సాంబశివరావు పంతులు , నందగిరి వేంకటప్పారావు పంతులు రచించిన ‘’పామఱ్ఱు (స్తూప) జయధ్వజ చరిత్ర ‘’
గ్రామ ప్రముఖులు
[మార్చు]- కొండపల్లి కోటేశ్వరమ్మ: ( 1918 ఆగష్టు 5, - 2018 సెప్టెంబరు 19, ) ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి.[4][5]
బ్యాంకులు
[మార్చు]- సిండికేట్ బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2015, మే-29వ తేదీనాడు ప్రారంభించారు.
- ఇండియన్ బ్యాంక్.
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.
- ఆంధ్రా బ్యాంక్.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ.
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
గ్రామ పంచాయతీ
[మార్చు]- కొరముక్కువానిపురం, చాట్లవానిపురం, కంచర్లవానిపురం, చెన్నువానిపురం గ్రామాలు, పామర్రు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో, ఆలయ ప్రతిష్ఠా దినోత్సవం సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
శ్రీ వల్మీకేశ్వరీ అమ్మవారి (పుట్లమ్మ తల్లి) ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో అమ్మవారి ఏకాదశ వార్షిక మహోత్సవాలు నిర్వహించారు.
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయం స్థానిక వెలమపేటలో, శివాలయం రహదారిపై ఉంది.
శ్రీ కరుమారి అమ్మవారి ఆలయం
[మార్చు]స్థానిక విజయవాడ రహదారిలోని ఈ ఆలయంలో, శ్రావణపూర్ణిమ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, దేవీహోమం నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు.
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
[మార్చు]ఈ గ్రామంలో కార్తీకమాసం, ఆదివారంనాడు, భజనలు చేయుచూ, కీర్తనలు పాడుకుంటూ, రాములవారి దీపస్తంభాన్ని గ్రామంలో ఊరేగిస్తారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]స్థానిక రాళ్ళబండివారి చెరువుకట్టపై స్థిరనివాసి అయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు.
శ్రీ రామాలయం
[మార్చు]ఇది స్థానిక బాపూజీపేటలోని గౌడ రామాలయం.
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
[మార్చు]స్థానిక గుడివాడ రహదారిలోని సాయినగరులోని ఈ ఆలయ 21వ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని, ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతసహిత రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులచే సామూహికంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు.
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయం స్థానిక గుడివాడ రహదారిలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అమృతాభిషేకం, ఆకుపూజ నిర్వహించారు. అనంతరం హరేరామ సంకీర్తన గానంచేసారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా తయారుచేసిన గారెలు, బూరెలదండలతో అలంకరించారు.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం వివిధ వృత్తుల వ్యాపారస్థులు కలరు
గ్రామ విశేషాలు
[మార్చు]పామర్రు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ప్రవాసాంధ్రులొకరు, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
వనరులు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "పామఱ్ఱు (స్తూప) జయధ్వజ చరిత్ర" (PDF).
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Revolutionary Communist leader Kondapalli Koteswaramma passes away". The Times of India. Retrieved 20 September 2018.
- ↑ "తొలితరం కమ్యూనిస్ట్ నేత, కొండపల్లి సీతారామయ్య సతీమణి కన్నుమూత". telugu.samayam.com. Retrieved 17 September 2018.
వెలుపలి లంకెలు
[మార్చు]- CS1 maint: url-status
- తాజాకరించవలసిన వ్యాసాలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- పామర్రు మండలంలోని గ్రామాలు
- కృష్ణా జిల్లా మండల కేంద్రాలు
- ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ గ్రామాలు
- Pages using the Kartographer extension