చేపల పులుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చేపల పులుసు ( chepala pulusu) తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ పులుసు నెల్లూరి చేపల పులుసుగ ప్రసిద్ధి పొందింది. మన రాష్ట్రంలో నెల్లూరు, చీరాల, గుంటూరు వరకు ఈ పద్ధతినే అనుసరిస్తారు.

చేపల పులుసు

కావలసిన పదార్దాలు

[మార్చు]
  • చేపలు: 5 ముక్కలు.
  • ఉప్పు సరిపడ.
  • ఉల్లి పాయ: ఒకటి.
  • ఆవాలు చిన్న స్పూన్,
  • జీలకర్ర చిన్న స్పూన్,
  • కరివెపాకు ఒకటి (ఇది మీ ఇష్టం).
  • కారం 3 స్పూన్స్,
  • టమొటొ ఒక్కటి,
  • నూనె సరిపడ.
  • పసుపు 1/4 స్పూన్,
  • దనియాల పొడి ఒక స్పూన్,
  • చింతపండు పులుసు 2 కప్పులు. (ఇది చాలా ముఖ్యం),
  • మెంతి పొడి సగమ్ టీ స్పూన్ ( యెక్కువ వెయ్యొద్దు చేదు రావచ్చు),

తయారు చేసే పద్దతి

[మార్చు]
  • ఒక వెడల్పాటి బాండి తీసుకోండి. కొంచం వేడి చేసాక, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వెయ్యండి. మాములుగా మన తాలింపు పెడతాం కదా అంతే.
  • ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తరువాత టమాటో వెయ్యండి. తరువాత 2 కప్పులు చింతపండు పులుసు పోసి పసుపు వేసి ఒక 25 నిమిషాలు చిన్న మంట మీద. వేడి చెద్దాం.
  • ఇప్పుడు పులుసు చిక్కగా వుంది అనుకున్నప్పుడు ధనియాల పొడి, మెన్తి పొడి చేపలు ఆ పులుసులో వేసి 10 నిమిషాలు వుడకనిద్దాం. అంతే చేపల పులుసు రెడి.

సూచన

[మార్చు]
  • చేపలు పులుసు చెసిన వెంటనె కన్న ఒక పూట తరువాత చాల బాగుంటుంది. చేపల పులుసు 2 రోజులకు కూడా చెడిపోదు.