హైదరాబాద్ హలీమ్

వికీపీడియా నుండి
(హైదరాబాదీ హలీం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హలీమ్
హలీం.
మూలము
మూలస్థానంమధ్యప్రాచ్య ప్రాంతం [1]
ప్రదేశం లేదా రాష్ట్రం
మధ్యాసియా
మధ్యప్రాచ్య ప్రాంతం
ఇరాన్
పాకిస్తాన్
టర్కీ
భారతదేశం
బంగ్లాదేశ్
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు గోధుమలు, బార్లీ, దినుసులు, మాంసము
వైవిధ్యాలుహైదరాబాదీ హలీం, ఖిచ్డా లేదా ఖిచ్రా, హరీస్

హలీం : రంజాన్ నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్‌ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌) ని సొంతం చేసుకొంది.

తయారీ విధానం

[మార్చు]

గోధుమ రవ్వ, నెయ్యి, మటన్ (బోన్‌లెస్), పుట్నాల పప్పు (తినే శెనగ పప్పు), గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, తో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే రుచి బాగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకూ గూటా కర్రలతో రుబ్బుతారు. శాకాహార హలీం కూడా క్రమేణా ప్రాచుర్యంలోకి వస్తోంది.

హైదరాబాద్ లో హలీం

[మార్చు]

హైదరాబాద్‌ నగరంలో హలీం తయారీలో ‘పిస్తాహౌస్‌’ అంతర్జాతీయంగా పేరుగాంచింది. ‘ప్యారడైస్‌’, ‘కేఫ్‌ 555’, ‘హైదరాబాద్‌హౌస్‌’ వంటి సంస్థలు కూడా హలీం తయారుచేస్తాయి.

మలేషియా, సింగపూర్‌, సౌదీ అరేబియా వంటి దేశాలకు పోస్టల్‌, విమానాల ద్వారా హలీంను పంపిస్తున్నారు. హలీంను ఆన్‌ లైన్‌ ద్వారా ఆర్డరిచ్చిన వెంటనే హలీం ఇంటికి చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. ఆర్డరందిన వెంటనే ప్రత్యేక బృందాలు వేడి వేడి హలీం డబ్బాలను ఆర్డరిచ్చిన వారికి చేరవేస్తారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]