గౌతంరాజు
గౌతంరాజు | |
---|---|
జననం | |
మరణం | 2022 జూలై 6 | (వయసు 68)
మరణ కారణం | అనారోగ్య సమస్యలు |
వృత్తి | ఎడిటర్ |
పిల్లలు | 2 అమ్మాయిలు (సంధ్య, సుమాంజలి) |
తల్లిదండ్రులు |
|
జి. రాజు, గౌతంరాజు లేదా గౌతమ్ రాజు సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ సినిమారంగాలలో సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి ఆయన సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.
బాల్యం
[మార్చు]ఆయన 1954 జనవరి 15న ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం చెన్నైలో స్థిరపడింది.
ఎడిటర్ గా
[మార్చు]1982లో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో ఎడిటర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతంరాజు, చట్టానికి కళ్లులేవు సినిమాతో ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002లో వచ్చిన ఆది సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా నంది పురస్కారం అందుకున్నాడు. చివరగా 2022లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియాకు ఎడిటర్‌గా చేశారు.
చిత్ర సమాహారం
[మార్చు]- 1982: దేఖ్ ఖబర్ రఖ్ నజర్, నాలుగు స్తంభాలాట
- 1983: నెలవంక
- 1984: ఆనంద భైరవి, శ్రీమతి కావాలి
- 1986: కారు దిద్దిన కాపురం, పూజకు పనికిరాని పువ్వు, భలే మిత్రులు
- 1987: న్యాయానికి సంకెళ్ళు, పడమటి సంధ్యారాగం, ప్రేమ సామ్రాట్, ముద్దుల మనవడు
- 1988: జానకి రాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్
- 1989: మౌన పోరాటం, హై హై నాయకా
- 1990: ఆడది, జయమ్ము నిశ్చయమ్మురా, జడ్జిమెంట్, జయసింహ, అన్న-తమ్ముడు
- 1991: కర్తవ్యం, దళపతి, పీపుల్స్ ఎన్కౌంటర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఆడది (1990)[1]
- 1992: బ్రహ్మ, చిట్టెమ్మ మొగుడు
- 1993: మొగుడుగారు, రౌడీ మొగుడు, వారసుడు
- 1994: బొబ్బిలి రాయుడు
- 1995: రాశయ్య
- 1996: పవిత్ర బంధం, మిస్టర్ రోమియో, జంగ్
- 1997: పెళ్ళి చేసుకుందాం,[2] మా ఆయన బంగారం
- 1998: కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి, సంభవం, సూర్యవంశం
- 1999: యమజాతకుడు, సూర్యవంశం
- 2001: అధిపతి, అమ్మాయి కోసం
- 2002: ఆది
- 2003: ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, దిల్, ఠాగూర్, విష్ణు
- 2004: మిస్టర్ & మిసెస్ శైలజా కృష్ణమూర్తి, యజ్ఞం, శివ శంకర్
- 2005: అతనొక్కడే, బన్నీ, భగీరథ, మజా ఔర్ మౌజ్ మస్తీ, వీరభద్ర, శంఖారావం, శ్రీ
- 2006: అన్నవరం, అశోక్, అస్త్రం, అసాధ్యుడు, ఆదిలక్ష్మి, గేమ్, రామ్, లక్ష్మి, విజయ్ ఐ.పి.ఎస్.
- 2007: అతిథి, అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి., ఆపరేషన్ దుర్యోధన, టక్కరి, పెళ్ళైంది కానీ, యోగి, రాజు భాయ్, లక్ష్యం, హైవే
- 2008: ఒంటరి, కాళిదాసు, కృష్ణార్జున, కృష్ణ, నగరం, హరే రామ్
- 2009: కిక్, జయీభవ, డైరీ, ఫిట్టింగ్ మాస్టర్
- 2010: అదుర్స్, ఏం పిల్లో ఏం పిల్లడో, కళ్యాణరామ్ కత్తి, కత్తి కాంతారావు, డాన్ శీను, బెట్టింగ్ బంగార్రాజు, రంగ ది దొంగ, రామ రామ కృష్ణ కృష్ణ, సాధ్యం
- 2011: ఊసరవెల్లి, ప్రేమ కావాలి, బద్రీనాథ్, మిరపకాయ్, వస్తాడు నా రాజు, వీరా
- 2011: మొగుడు (సినిమా)
- 2012: శ్రీమన్నారాయణ
- 2013: ఓం 3D, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
- 2015: సౌఖ్యం[3]
- 2015: ఢీ అంటే ఢీ
- 2016: సప్తగిరి ఎక్స్‌ప్రెస్,[4] వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
- 2017: ఖైదీ నెంబర్ 150
- 2020: బొంభాట్
- 2021: మోసగాళ్ళు
- 2022: వర్మ.. వీడు తేడా
- 2022: శాసనసభ
- 2023 : మధురపూడి గ్రామం అనే నేను
- దెయ్యంతో సహజీవనం
మరణం
[మార్చు]68 ఏళ్ల గౌతంరాజు కిడ్నీ, శ్వాస సంబంధ సమస్యలతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022. జూలై 6 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.[5] ఆయనకు సంధ్య, సుమాంజలి ఇద్దరు పిల్లలున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
- ↑ "Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత". web.archive.org. 2022-07-06. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)