అక్షాంశ రేఖాంశాలు: 14°03′N 78°45′E / 14.05°N 78.75°E / 14.05; 78.75

రాయచోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 14°03′N 78°45′E / 14.05°N 78.75°E / 14.05; 78.75
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండలంరాయచోటి మండలం
విస్తీర్ణం
 • మొత్తం60.59 కి.మీ2 (23.39 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం91,234
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి961
ప్రాంతపు కోడ్+91 ( 8561 Edit this on Wikidata )
పిన్(PIN)516269 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక పట్టణం. అన్నమయ్య జిల్లా కేంద్రం. రాయచోటి మండలానికి ప్రధాన కేంద్రం. మాండవ్య నది ఈ పట్టణం గుండా పోతుంది. ఇది పెన్న ఉపనదుల్లో ఒకటైన చెయ్యేరు లేదా బాహుదా నదికి ఉపనది. ఈ పట్టణంలోని పురాతన వీరభద్రాలయం శైవులకు అత్యంత ప్రీతిపాత్రకరమైంది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిని వీక్షించడానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.ఎక్కడ మనకి కార్లు, వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యమైన గురుమహేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ రాయచోటి

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది. పట్టణానికి చుట్టుపట్ల గల పల్లెప్రజలు రాసీడు అని అంటారు.

జనగణన వివరాలు

[మార్చు]

2011 నాటి జనగనణన ప్రకారం, ఈ పట్టణ జనాభా 91,234. దీనిలో 46,517 పురుషులు, 44,717 స్త్రీలు. పిల్లల (0–6) జనాభా 11,446. ఇది మొత్తం జనాభాలో 12.55%. లింగ నిష్పత్తి 961. అక్షరాస్యత: 73.58%.

పరిపాలన

[మార్చు]

రాయచోటి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం

[మార్చు]

రాయచోటి పట్టణంలోని వీరభద్రుడు నాగకుండల, రుద్రాక్షమాల శోభితుడై, కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమచేత అభయమనే ఖేటకం ధరించి, భద్రకాళీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. అమరుల చేత పూజింపబడటంతో ఈ క్షేత్రం అమరగురు వీరేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. ఆలయ కట్టడాలు చోళ రాజుల శైలిని పోలి ఉన్నాయి. రాజరాజచోళుడు వీరభద్రుడిని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయ గణపతిదేవుడు, మట్లిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని దర్శించి అభివృద్ధి పనులు చేయించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. నవాబుల కాలంలో కొంతమంది దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాగా మాసాపేట వాసులు అడ్డుకున్నారు. శివరాత్రికి వారి వంశస్థులే గర్భగుడిలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

క్షేత్ర విశేషాలు

[మార్చు]
  • వీరేశ్వరుడు వీరలింగం, ఒకే గర్భాలయంలో ఉండటం విశేషం.
  • వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉండవు. రాయచోటిలో వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉన్నాయి.
  • ఆలయంలో ద్వారపాలకులుగా శ్రీనందీశ్వరుడు, మహాకాళేశ్వరుడు ఉన్నారు.
  • ముఖద్వారానికి ఎడమ వైపున సూర్యభగవానుడు, 54 అడుగులు ధ్వజస్తంభం ఉంది.
  • గ్రామదేవత యల్లమ్మ పూజ అనంతరం వీరభద్రుడికి పూజలు చేస్తారు.
  • ఏటా మార్చి 27న, సెప్టెంబరు 14న ఉదయం ఆరు గంటలకు స్వామివారి గర్భగుడిలో సూర్యకిరణాలు విగ్రహం పాదల వద్ద పడతాయి.

మహా నైవేద్యం

[మార్చు]

ఆలయంలో ఏటా మహా నైవేద్య ప్రదానం ఘనంగా జరుగుతుంది. ఆరోజు ఆలయంలో వీరభద్రుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. వీరశైవులు ఉపవాసంతో తయారుచేసిన నైవేద్యాన్ని స్వామి ఎదుట ఉంచుతారు. కత్తులతో విన్యాసాలు చేసి ఖడ్గ మంత్రాలు చదువుతారు. స్వామి తలుపులు తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. వడియరాజులు మొదట ప్రసాదాన్ని కొల్లగొట్టుకు పోయిన అనంతరం మిగిలిన ప్రసాదాన్ని ఇతరులు తీసుకెళ్లడం ఆనవాయితీ. కర్ణాటక భక్తులు స్వామి వారికి వస్త్రాలను బహూకరిస్తారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నందీశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భక్తులు మహానైవేద్యాన్ని పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక భక్తులు ప్రసాదాన్ని ఎండబెట్టుకుని చాలాకాలం వాడుకుంటారు. 360 శేర్ల బియ్యం, వంద కిలోల క్యారెట్, రెండు వందల కిలోల వంకాయలు, రెండు వందల కిలోల గెనుసు గడ్డలు, వంద కిలోల ఉర్ల గడ్డలు, నాలుగు బండ్ల గుమ్మడికాయలు తరిగి వండుతారు. 10శేర్ల బియ్యంతో అత్తిరాసాలు (నిప్పట్లు) నెయ్యితో తయారు చేసి, అన్నంపై వీటిని పేర్చుతారు. భద్రకాళి వీరభద్రుడికి నైవేద్యంగా పెడతారు. ఏదైనా దోషాలు పోవడానికి దీనిని ఏర్పాటు చేస్తారు. నైవేద్య దినాన్ని కన్నడిగులు పవిత్రంగా భావిస్తారు. పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రోడ్డు రవాణా తప్ప రైల్వే, విమాన సౌకర్యాలు అందుబాటులో లేవు. దగ్గరి విమానాశ్రయం కడపలో, రైల్వే స్టేషన్ రాజంపేటలో ఉన్నాయి. రాయచోటి పట్టణం మీదుగా రెండు జాతీయ రహదారులు ఉన్నాయి: కర్నూలు-చిత్తూరులను కలిపే 40వ జాతీయ రహదారి, ఈ రహదారిని బెంగళూరుతో కలిపే 340వ జాతీయ రహదారి.

వ్యక్తులు

[మార్చు]

కె. జయచంద్రారెడ్డి, భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాయచోటి&oldid=4281488" నుండి వెలికితీశారు