గోల గోక్రానాథ్ శాసనసభ నియోజకవర్గంఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 403 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం, లఖింపూర్ ఖేరి జిల్లా పరిధిలో ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో ఉప ఎన్నిక జరగగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు అమన్ గిరి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీ పై 34,298 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[5]