Jump to content

త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు)

అక్షాంశ రేఖాంశాలు: 10°2′8″N 76°19′48″E / 10.03556°N 76.33000°E / 10.03556; 76.33000
వికీపీడియా నుండి
(త్రిక్కాకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు) నుండి దారిమార్పు చెందింది)
త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు)
త్రిక్కకర ఆలయ ప్రవేశ ద్వారం
త్రిక్కకర ఆలయ ప్రవేశ ద్వారం
త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు) is located in Kerala
త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు)
త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు)
Location within Kerala
భౌగోళికాంశాలు :10°2′8″N 76°19′48″E / 10.03556°N 76.33000°E / 10.03556; 76.33000
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కాట్కరయప్పన్
ప్రధాన దేవత:పెరుం శెల్వనాయకి (వాత్సల్యవల్లి)
దిశ, స్థానం:దక్షిణ ముఖము
పుష్కరిణి:కపిల తీర్థము
విమానం:పుష్కల విమానం
కవులు:నమ్మాళ్వార్లు
ప్రత్యక్షం:కపిల మహామునికి

త్రిక్కకర వామనమూర్తి ఆలయం (తమిళనాడు) భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

నమ్మాళ్వార్లు ఈ స్వామి గుణగణాలను కీర్తించాడు. శీలమనగా పెద్దలు పిన్నలతో అరమరికలు లేక కలసిపోవుట. శ్రియఃపతియగు సర్వేశ్వరుడు గుణమును ఆళ్వార్లకు గుర్తుచేసాడు. కాని అది అప్పటి అనుభవమే యనిపించెను. అంతట ఆళ్వార్లు "ఆరుయిర్ పట్టదు?ఎనదుయర్‌పట్టదు" "పుండరీకాక్షుడు, కల్పశాఖల వంటి చతుర్బుజములు కలవాడు, నీలమేఘశ్యామలుడునైన స్వామి తిరుక్కాట్కరై క్షేత్రమున వేంచేసియుండగా నాఆత్మ పడుపాట్లు వేరెవరి యాత్మ పడుచున్నది" యని స్వామి శీల గుణమును కీర్తించాడు. వీరినే మలయాళదేశీయులు వామనుడని పిలతురు.

ఉత్సవాలు

[మార్చు]

శ్రవణ ద్వాదశినాడు గొప్ప ఉత్సవము జరుగును

సాహిత్యం

[మార్చు]

శ్లో. పురే తిరుక్కాట్‌కర నామ్ని పుష్కలం విమాన మాప్త: కపిలాఖ్య తీర్థగే|
   శ్రిత: పెరుం శెల్వ రమా మధి శ్రితో విరాజితే కాట్కర యప్ప నాహ్వయ:||

శ్లో. విభీషణ పురోధేన కటాక్ష: కపిలేక్షిత:|
   శఠారాతి మునిశ్రేష్ఠ దివ్య సూక్తి విభూషణమ్‌ ||

త్రిక్కాకర ఆలయంలో ఓనం సందర్భంగా చుట్టు-విలక్ (చుట్టూ దీపాలు) వెలిగిస్తారు
త్రిక్కకర ఆలయంలో ఆరాట్టు ఊరేగింపులో వామనమూర్తి విగ్రహం
త్రిక్కకర ఆలయం వద్ద సీవేలి

పాశురాలు

[మార్చు]

పా. ఉరుగుమాల్ నె--; ముయిరిన్పర మన్ఱి;
   పెరుగుమాల్ వేట్కైయు; మెన్ శెయగేన్ తొణ్డనేన్;
   తెరువెల్లామ్‌ కావికమழ்; తిరుక్కాట్కరై,
   మరువియ మాయాన్ తన్; మాయమ్‌ నినై తొఱే;

పా. ఆరుయిర్ పట్ట దెనదుయిర్ పట్టదు;
    పేరిదழ் త్తామరైక్కళ్; కనివాయదోర్;
    కారెழிల్ మేగ;త్తెన్ కాట్కరై కోయిళ్‌కొళ్;
    శీరెழிల్ నాల్ తడన్తోళ్; తెయ్‌వవారిక్కే
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-6-1,9.

చేరే మార్గం

[మార్చు]

తిరువనంతపురమునకు 45 కి.మీ. నాగర్‌కోయిల్‌కు 30 కి.మీ. సౌకర్యములు గలవు. ఆలవాయ్-తిరుచ్చూరు రైలుమార్గములో "ఇరు--లక్కొడి స్టేషన్ నుండి "అజ్గమాలి" స్టేషన్ నుండి 15 కి.మీ.

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]