శ్రీనగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము
అవలోకనం
స్థితిప్రణాళిక
లొకేల్శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు
స్టేషన్లుశ్రీనగర్ (ప్రారంభం) నుండి లెహ్ (వరకు)
సేవలుశ్రీనగర్కార్గిల్లెహ్
వెబ్సైట్http://www.indianrailways.gov.in
ఆపరేషన్
నిర్వాహకులుభారతీయ రైల్వేలు
సాంకేతికం
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6.0 in)

శ్రీనగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము శ్రీనగర్ నుండి కార్గిల్ ద్వారా లెహ్ వరకు భారతీయ రైల్వేలు యొక్క ప్రతిపాదిత రైలు మార్గం. 26 ఫిబ్రవరి 2013 న ఈ జాతీయ పథకాన్ని జాతీయ కార్యక్రమంగా ప్రకటించారు.

2013-14 సంవత్సరంలో శ్రీనగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము సర్వే చేపట్టనున్నట్లు భారత రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ప్రకటించారు.[1]

వ్యూహాత్మక ప్రాముఖ్యత[మార్చు]

ఈ రైల్వే మార్గం పూర్తయిన తర్వాత, లెహ్ నుండి నేరుగా జమ్మూ, కాశ్మీర్, భారత దేశంలోని మిగిలిన రైల్వే జోనులతో అనుసంధానించ బడుతుంది. శ్రీనగర్, లెహ్ యొక్క మధ్య దూరం 422 కి.మీ. (262 మైళ్ళు) దూరంలో ఉంది. లెహ్ కు రైల్వే లైన్లు పూర్తయినప్పుడు, ఢిల్లీ నుండి లెహ్ చేరుకోవడానికి సమయం తగ్గుతుంది. ఇది సురక్షిత ప్రజా రవాణా, త్వరితగతంగా సేవలు అందిస్తుంది. వ్యూహాత్మక సైనిక స్థావరాలైన లెహ్ నకు సిబ్బంది, సామగ్రి రవాణా మరింత సులభంగా చేయబడుతుంది.

సవాళ్లు[మార్చు]

జమ్మూ-బారాముల్లా రైలు మార్గము తరువాత, శ్రీనగర్–కార్గిల్–లెహ్ రైలు మార్గము అధిక పర్వతాలు, పెద్ద సంఖ్యలో సొరంగాలు, అధిక వంతెనలు, తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా భారతీయ రైల్వేలలో అత్యంత సవాలుగా ఉండే రైల్వే ప్రాజెక్టుగా చెప్పవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 16 జులై 2013. Retrieved 13 మే 2013.CS1 maint: archived copy as title (link)