దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A Black and White photo of Dadasaheb Phalke looking at the filmstrip
దదాసాహెబ్ ఫాల్కే - భారతదేశపు తొట్టతొలి సినిమా నిర్మాత (1913).

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు.[1]

చరిత్ర

[మార్చు]

భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించాడు. బొంబాయి లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్‌లలో అతను విద్యాభ్యాసం చేశాడు.

1896లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూశాడు. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషిచేశాడు.

అవార్డు వివరాలు

[మార్చు]

1969లో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం.

బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే.

ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలు

[మార్చు]

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022

[మార్చు]

2022 ఫిబ్రవరి 20న ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2021లో విడుదలై విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. షేర్షా  ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. 83 సినిమాలో నటించిన రణవీర్ సింగ్కు ఉత్తమ నటుడు, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డులు దక్కాయి.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "శ్రీ ఎల్.వి. ప్రసాద్ కు దాదా సాహెబ్ ఫాల్కే". ఆంధ్రపత్రిక. 3 June 1983. Retrieved 17 May 2021.
  2. ఆంధ్రజ్యోతి. "కళాతపస్వికి దాదాసాహెబ్ అవార్డు". Archived from the original on 28 ఏప్రిల్ 2017. Retrieved 24 April 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Andhra Jyothy (26 September 2023). "నటిగా ఐదు దశాబ్దాల సేవలకుగానూ.. ప్రతిష్టాత్మక పురస్కారం!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  4. "Dadasaheb Phalke: అట్టహాసంగా 'దాదా ఫాల్కే' అవార్డుల వేడుక.. మూవీ ఆఫ్‌ ది ఇయర్‌గా 'పుష్ప'". EENADU. Retrieved 2022-02-21.

నవతరంగం వెబ్ లో

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు