వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 67

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 66 | పాత చర్చ 67 | పాత చర్చ 68

alt text=2019 జూన్ 7 - 2019 ఆగస్టు 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 జూన్ 7 - 2019 ఆగస్టు 30

వై.వి.సుబ్బారెడ్డి వ్యాసం రెండు వారాల సంరక్షణలో

[మార్చు]

కొన్ని రాజాకీయ కారణాల వలన వై.వి.సుబ్బారెడ్డి వ్యాసాన్ని, ముఖ్యంగా మతం భాగాన్ని మార్చాలని పలువురు అజ్ఞాత వాడుకరులు ప్రయత్నించారు. వారు చేసిన మార్పుల్లో అనవసరపు మార్పులను తొలగించి పేజీని రెండు వారాల పాటు, నమోదైన వాడుకరులు మాత్రమే మార్చే విధంగా సంరక్షణలో చేర్చాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:00, 6 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంపై ఇటీవలి మార్పులు వికీకి మేలో లేక కీడో తెలీదు కాని. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతున్నది. దానితో పాటు కొంత అవేర్‌నెస్, వ్యూస్ కూడా...సరైన మూలాలను జతచేసే పనిలో పడితే కొంత విమర్శ తగ్గవచ్చు...B.K.Viswanadh (చర్చ) 04:45, 7 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తుల పేజీల వర్గాల క్రమబద్ధీకరణ

[మార్చు]

వ్యక్తుల పేజీల వర్గాలను క్రమబద్ధీకరించే ప్రాజెక్టులో భాగంగా కొంత పని జరిగింది. ఒక పాతిక శాతం పనిగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని గురించి ప్రాజెక్టు చర్చా పేజీలో ఒక చర్చ మొదలైంది. వాడుకరులు ఈ చర్చలో పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను చెప్పవలసినదిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 05:19, 7 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు ప్రాజెక్టు ప్రస్తుత దశ కొలిక్కి

[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు ప్రాజెక్టు తొలిసారిగా చేపట్టి చేసిన తొలి దశ పనులు కొలిక్కి చేరుకుంటున్నాయి. ప్రాజెక్టు పేజీలో ఇచ్చిన ఉదాహరణలననుసరించి, మీరు పనిచేసే వ్యాసాలలో తగు పటములు చేర్చి తెవికీలో OSM పటముల విస్తరణకు సహకరించమని కోరుతున్నాను.

OSM తో విజయవాడ పటము తెరపట్టు

ఈ ప్రాజెక్టు పై మీ స్పందనలు, ముందు కృషికి సూచనలు ఇక్కడ కానీ, ప్రాజెక్టు చర్చా పేజీలో కానీ చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 04:49, 13 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (2018-19) పని

[మార్చు]

గత ఏడాది నేను సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వొకేట్ హోదాలో చేసిన పనులను వివరిస్తూ, స్వచ్ఛందంగా చేసిన పనులను విడిగా చూపుతూ నేను ఇక్కడ రాశాను. దయచేసి గమనించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 08:56, 13 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు:, @Pranayraj1985:, @Arjunaraoc: గార్ల స్పందనలకు ధన్యవాదాలు. అర్జున గారు కోరిన విధంగా సర్వే ఫలితాలు, దానిపైన, ఎ2కె అనుభవాలపైన, వ్యూహంపైన ఆధారపడి రూపొందించిన ప్రణాళిక వివరాలు అందిస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:08, 17 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జీవిత చరిత్ర వ్యాసాలలో గమనించిన లోపాలు, తగిన మార్గదర్శకాలు ఏర్పాటు గురించి

[మార్చు]

తెవికీలో మిగతా అన్ని రంగాల వ్యాసాలకన్నా ఎక్కువుగా వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నసంగతి మనందరికి తెలుసు. నాకు తెలిసినంతవరకు వీటికి సరియైన సూచనలుగాని, మార్గదర్శకాలుకాని తెవికీలో ఏమి లేవనుకుంటున్నాను. ముఖ్యంగా కొన్ని జీవితచరిత్ర వ్యాసాలలో నేను గమనించిన ప్రకారం ఉండవలసినన కనీస సమాచారం అనగా జన్మస్థలం, జన్మించిన తేది, చనిపోయిన పక్షంలో మరణించిన తేది వివరాలు, మరికొన్ని అసంపుర్తిగా ఉంటున్నాయి.జన్మించిన తేది కొంత మందికి లభ్యం కాకపోనచ్చు.కనీసం సంవత్సరం కూడా ఉండుటలేదు.కొన్ని వ్యాసాలకు జిల్లా మాత్రమే తెలుపుచున్నారు. కొన్ని వ్యాసాలకు ఆసలు ఆవివరాలు ఏమీ ఉండుటలేదు. గ్రామం వివరం లేకపోతే పునర్య్వస్థీకరణ జరిగినప్పుడు ఆ జిల్లా సరియైన జిల్లా కాకపోవచ్చు. గ్రామం పేరు లేకపోతే జిల్లా తెలుసుకోవటం సాధ్యపడేపనికాదు. గ్రామం, మండలం, జిల్లా వివరాలు పూర్తిగా రాస్తేనే ఆ వ్యాసం ఏ వర్గంలోకి చేరాలి అనేది తెలుస్తుంది. ”హమ్మయ్య రాసాం” అనే పద్దతిలో కాకుండా, ఉండవలసిన కనీస వివరాలతో వ్యాసాలు రాయాలని మన గౌరవ వికీపీడియన్లను కోరుచున్నాను. అందులో మచ్చుకు కొన్ని వ్యాసాలు

ఇదే సమయంలో జీవిత చరిత్ర వ్యాసాలకు సృష్టింపు, అభివృద్ధికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు తయారుచేయుటకు గౌరవ వికీపీడియన్స్ వారి వారి అబిప్రాయాలు, సూచనలుపై స్పందించవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:57, 14 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు తొలిదశ కొలిక్కి

[మార్చు]

తొలిసారిగా వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు ప్రాజెక్టు రూపంలో నిర్వహించి 2019, 2018 ఎన్నికలకు సంబంధించిన పేజీలను అభివృద్ధి చేయటానికి ప్రయత్నించడం జరిగింది. కేవలం ఇద్దరూ మాత్రమే నమోదు చేసుకోని పనిచేయటంతో ఇంకా కొంత పని చేయవలసివుంది. దానిని పూర్తి చేయడానికి సహకరించండి. ఆలాగే ఈ ప్రాజెక్టు పై సూచనలు, అభిప్రాయాలు ఇక్కడ కాని, ప్రాజెక్టు చర్చాపేజీ లో కాని చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 06:31, 15 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిజమే. 2014 ఎన్నికల తరువాత రాసిన ఎమ్మెల్యేల వ్యాసాలలో 2018, 2019 ఎన్నికల తరువాత మార్పులు చేయాల్సిఉంది, అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యాసాలు కూడా రాయాల్సివుంది. ఆయా మార్పులకు ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతందని నా అభిప్రాయం. నేను కూడా వాటిని మార్చడంలో సహకరించగలను -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:16, 15 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అమలాపురం పరిిధిలో ఉన్నాయి మార్పపు చేేశాను. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నియోజకవర్గగల గురించి నా దగ్గర సరైన సమాచారం లేదు. అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింంతా అనురాధ ఒక్కవ్యాసమే సృష్టించాను. -- 2019-07-01T20:47:41 User:Ch Maheswara Raju.
పైన సంతకమరచిన సభ్యుని వివరాలు చేర్చాను--అర్జున (చర్చ) 04:42, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నా సమీక్ష చూడవచ్చు. --అర్జున (చర్చ) 04:55, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikimedia Campaigns/Contests Survey

[మార్చు]

Hello fellow Wikimedians,

Apologies for writing in English. Please help me in translating this message to your language.

I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikimedia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.

If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.

You can read the Privacy Policy for the Survey here

Please find the link to the Survey at: https://forms. gle/eDWQN5UxTBC9TYB1A

P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.

Looking forward to hearing and learning from you.

-- SGill (WMF) sent using MediaWiki message delivery (చర్చ) 06:09, 25 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ జిల్లాల, మండలాల మార్పుల, చేర్పుల ప్రాజెక్టు పనిలో 2019 జూన్ నాటికి స్థితి వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ ప్రకారం జరిగిన మార్పుల చేర్పుల ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు ప్రాజెక్టు పేజీలోని "ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు విభాగం"లో పొందుపర్చబడినవి.గౌరవ వికీపీడియన్స్ పరిశీలించి తగిన సూచనలతో స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:03, 30 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చిన పనిపై స్థితి నివేదిక

[మార్చు]

ఈ ప్రాజెక్టు పనిభాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల వ్యాసాల పేజీలలో భారత జననగణన సెమీడేటా ఎక్కించే పనిని 2017 నవంబరులో చేపట్టి పూర్తిచేయబడింది.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలపై స్థితి వివరాల నివేదిక, గణాంకాల తెలుపు పట్టిక వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం పేజీలో "ఈ ప్రాజెక్టుపనిలో తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామవ్యాసాల నందు జరిగిన కార్యక్రమం ప్రగతి నివేదిక 2019 జూన్ నాటికి స్థితి వివరాలు" అనే విభాగంలో తగిన వివరాలతో పొందుపర్చబడినది.గౌరవ వికీపీడియన్స్ దీనిపై తగుసూచనలతో స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:26, 30 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చాపేజీలో నా స్పందన చూడవచ్చు. --అర్జున (చర్చ) 03:48, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా వాక్యాలు

[మార్చు]

వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల కొన్ని వారాలపాటు మీకు తెలుసా వాక్యాలు చేర్చలేకున్నాను. ఖాళీ దొరికిన వెంటనే ఈ పనిలో పాలు పంచుకోగలను. ఈ లోపున ఈ పనికి పూనుకునే వారెవరైనా ఉంటే వారికి నా ముందస్తు కృతజ్ఞతలు. రవిచంద్ర (చర్చ) 05:58, 1 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జన్మస్థలం తెలియని వ్యక్తుల పేజీలు

[మార్చు]

వ్యక్తులు పుట్టిన ఊరి వివరాలు సరిగా తెలియని పేజీలు వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు వర్గంలో ఉన్నాయి. ఆ వివరాలు తెలిసిన వారు వాటిని చేర్చి, ఆ పేజీని తదనుగుణమైన వర్గం లోకి చేర్చాలని వాడుకరులను కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:00, 1 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు... నాకు తెలిసిన వాటి వివరాలు చేరుస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:27, 16 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రెవెన్యూయేతర గ్రామ వ్యాసాలపై నిర్ణయం గైకొనుట గురించి

[మార్చు]

కొంతమంది వాడుకరులు రెవెన్యూ గ్రామాలపై అవగాహనలేక అనగా శివారు గ్రామాలు, గ్రామ పంచాయితీ హోదా కలిగియుండి రెవెన్యూ గ్రామం కాని గ్రామాలు, గ్రామ పంచాయితీ పరిధిలోని నివాసప్రాంతాలకు వ్యాసాల పేజీలు సృష్టించుట జరుగుతుంది.వీటికి జనన గణన లెక్కలలో ప్రత్యేకంగా ఎటువంటి డేటా ఉండదు.డేటా వివరాలు ఏమీ లేనందున లోగడ సృష్టించిన ఇలాంటి అన్ని గ్రామవ్యాసాలు దాదాపుగా ఏక వాక్యంతో ఉన్నవి.అలాంటి గ్రామాలు వికీపీడియా నియమాలకు లోబడి రెవెన్యూ హోదా లేని గ్రామాలు, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రాజెక్టు పనులలో గుర్తించి, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ వ్యాసం మార్గదర్శకాలు ననుసరించి తొలగించబడ్డవి.

అయినప్పటికీ కొంతమంది వాడుకరులు, అజ్ఞాత వాడుకరులు వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు వర్గంలో " ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి". లేకపోతే ఏమి చేయాలో రాసిన దాని ప్రకారంగానీ, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు ప్రాజెక్టు పేజీలోని సూచనలు ఆధారంగా గానీ, వారి స్వంత ఊరు గురించి లేదా వారికి తెలిసిన, అభిమానం ఉన్న గ్రామం గురించి వికీపీడియాలో వ్యాసం లేదని భావించి, రాయాలనే ఉద్ధేశ్యంతో కొత్తగా వ్యాసం పేజీలు సృష్టించుట జరుగుతుంది.ఇది తప్పుగాదు.సహజం. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది.గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగిన తరువాత కొత్త సర్పంచి, పంచాయితీ సభ్యుల, యం.పి.టి.సి.సభ్యుల వివరాలు, వారి ఊరి అందాలు, గ్రామ చరిత్ర. దేవాలయాలు గురించి రాసుకోవాలనే ఉత్సాహం కూడా ఒక కారణం.ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను.ఖమ్మం జిల్లాలో ఒక అజ్ఞాత వాడకరి జిల్లాలోని అన్ని మండలాలలో రెవెన్యూ హోదాలేని గ్రామ పంచాయితీ వివరాలు పొందుపర్చుట జరిగినది.వాటిని ప్రస్తుతం “మండలంలోని గ్రామ పంచాయితీలు” అనే విభాగంలో ఉండేలాగున సవరించుట జరిగింది.

రెవెన్యూ గ్రామాలు కాని అలాంటి కొన్ని మాదిరి గ్రామాలు

అనుకూలానికి ఉన్న ఇబ్బందులు

  • ఈ గ్రామాలుకు సంభందించిన వివరాలు జనణగణన డేటాలో, ఆది ఏరెవెన్యూ గ్రామానికి చెందిన శివారు గ్రామమో ఆ రెవెన్యూ గ్రామంలో భారత జనన గణన డేటా (వివరాలు) ఉంటుంది.
  • అధికారంగా ఏ గ్రామం ఏ రెవెన్యూ గ్రామానికి చెందిందో తగిన మూలాలతో వివరాలు సేకరించాలి.
  • అ గ్రామానికి సంభందించిన వివరాలు తెలిసినవారు మాత్రమే పూర్తిగా రాయగలరు.దానికి మాదిరి వ్యాసం:కండ్లగుంట గ్రామ వ్యాసం పరిశీలించండి. ఈ గ్రామం గుంటూరు జిల్లా, నకిరికల్లు మండలం, చాగల్లు రెవెన్యూ గ్రామానికి చెందిన శివారు గ్రామం.ఈ గ్రామానికి చెందిన వాడుకరి: జంపని వెంకట్రావు గ్రామం మీద అభిమానంతో వ్యాసం అభివృద్ధి చేసాడు.
  • ఇలాంటి గ్రామాలలో కొందరు పేరుపొందిన వ్యక్తులు జన్మించిఉండవచ్చు.ఆ వ్యాసాలలో జన్మించిన ప్రదేశంగల గ్రామం ఎర్రలింకుతో కనపడుతుంది.అప్పుడు ఏ సమాచారం లేకపోయినా గ్రామం పేజీ సృష్టించి ఆ వ్యక్తి పేరును గ్రామంలో చేర్చిన సందర్బాలు లేకపోలేదు.దానికి మాదిరి వ్యాసం ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జన్మించిన అక్కంపేట గ్రామ వ్యాసం పరిశీలించండి.
  • ఇలాంటి అన్ని గ్రామాలకు వ్యాసాలు సృష్టించి వికీపీడియా నియమాలు ప్రకారం కనీస స్థాయికి వ్యాసాలు అభివృద్ధి చేయుట ఆశించినంతగా జరగకపోవచ్చు.

వ్యతిరేఖతకు ఉన్న నష్టాలు

  • కొన్నిధర్మారం లాంటి పెద్ద గామాలు పట్టణ స్థాయిలో ఉండి, కేవలం గ్రామ పంచాయితీ హోదా మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, బర్థీపూర్ రెవెన్యూ గ్రామానికి చెందిన శివారు గ్రామం. ఇలాంటి గ్రామ వ్యాసాలు వికీలో ఉండటానికి ఆస్కారం ఉండదు. సముదాయం నిర్ణయం మేరకు తొలగించినా ఇంకొకరు సృష్టించగలరు.
  • కొన్ని చారిత్రాత్మక గ్రామాలు మరుగున పడే అవకాశం ఉంది.దానికి మాదిరి వ్యాసం గుండ్లగూడెం గ్రామ వ్యాసం పరిశీలించండి.
  • ఇలాంటి గ్రామాలకు చెందిన మీడియా ఫైల్స్ వికీమీడియా కామన్స్ లో ఎక్కించి ఉండటానికి అవకాశం ఉంది.అలాంటి ఫైల్స్ మరుగునపడి ఉపయోగించటానికి ఎటువంటి అవకాశం లేకపోవచ్చు.దానికి మాదిరి వ్యాసాలు జంగాలవారిగూడెం, రాగన్నగూడ గ్రామ వ్యాసాలు పరిశీలించండి.

గతంలో వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 61 లో "రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు" అనే విభాగంలో చర్చకు పెట్టబడినప్పటికీ పూర్తి చర్చ జరగలేదని భావించి తగిన వివరణలతో తిరిగి చర్చకు ప్రవేశపెట్టటమైనది.అందరికీ అవగాహన కల్పించటం కష్టమైన పనిగా అనిపిస్తున్నందున, దీనికి ప్రత్యామ్నాయంగా సముదాయ సభ్యులు చర్చించి ఒక నిర్నయం తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:45, 2 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ పంచాయితీలు పాలనా వ్యవస్థలో అట్టడుగు స్థాయి. రెవిన్యూగ్రామం జిల్లాపరిపాలన సౌలభ్యంకొరకు ఎర్పడిన విభజన. కావున గ్రామ పంచాయితీ ప్రధాన ప్రాతిపదికగా వికీలో వ్యాసాలుండటం బాగుంటందని నా అభిప్రాయం. ఇక శివారు గ్రామాలకై ఔత్సాహికులు సృష్టించినవి తొలగించనవసరంలేదు. వాటికి సంబంధిత గ్రామపంచాయతీనుండి లింకు చేరిస్తే మంచిది. --అర్జున (చర్చ) 04:01, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక శివారు గ్రామాలకై ఔత్సాహికులు సృష్టించినవి తొలగించనవసరంలేదు. వాటికి సంబంధిత గ్రామపంచాయతీనుండి లింకు చేరిస్తే మంచిది. అంటే దారిమార్పులు చేద్దామంటున్నారా? --పవన్ సంతోష్ (చర్చ) 00:18, 6 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@వాడుకరి:Pavan santhosh.s కాదు, లింకు చేర్చటమే. మొలకల నియంత్రణ నియమాలనుండి గ్రామవ్యాసాలకు మినహాయింపు ఇవ్వడం మంచిది. --అర్జున (చర్చ) 03:52, 6 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిపై ఒకసారి చర్చ జరిగింది. అలాంటి గ్రామ వ్యాసాలు ఎప్పటికీ మొలకలుగానే ఉండిపోతాయి అనే ఉద్దేశంతో తొలగించాలని నిశ్చయించినట్టు గుర్తు. చారిత్రికంగా విశేషం కలిగిన గ్రామాలకు పేజీలు ఉంచాలని కూడా నిశ్చయించాం. (మళ్ళీ చర్చిస్తున్నామంటే, బహుశా చర్చించాల్సిన అవసరం ఏదో ఉండే ఉంటుంది.) అర్జున గారు చెప్పిన "మొలకల నియంత్రణ నియమాలనుండి గ్రామవ్యాసాలకు మినహాయింపు ఇవ్వడం మంచిది." అనే దానికి నేను వ్యతిరేకం. అసలంటూ రాయడానికి విజ్ఞాన సర్వస్వ సంబంధించిన సమాచారం ఉంటే - గ్రామాల పేజీ ఏంటి - ఏ పేజీనీ తొలగించ కూడదు. అలాంటి సమాచారం లేకపోతే, ఇకముందు వచ్చే అవకాశం లేకపోతే, ఆ పేజీని ఉంచాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 05:38, 12 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరిగారికి, గ్రామ వ్యాసాలు స్వతహాగా ప్రాముఖ్యతవి కలిగివుంటాయి కాబట్టి వాటికి వ్యాసాలు వుండాలి అని గత చర్చలలో వైజాసత్య లాంటి వారు వాదించినట్లు గుర్తు. ఒకసారి తొలగించినా ఇతరులు ప్రయత్నించే అవకాశం గ్రామ వ్యాసాలకు ఎక్కువగా వుంటుంది అని రామారావు గారు తెల్పడంతో వాటికి మినహాయింపు ఇస్తే మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 12:02, 14 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మనకొక స్పష్టత ఉండాలి. ఒకప్పుడు గ్రామాల పేజీలు చాలావరకూ ఏక వాక్య వ్యాసాలుగా ఉండేవి. అప్పటి వాదనలు వేరు. జనగణన వారి జాబితాలో ఉన్న గ్రామాల వ్యాసాల్లో సమాచారం చేర్చాక, ఇంకా కొన్ని గ్రామాలు ఏ సమాచారమూ లేకుండా మిగిలిపోయాయి. అవి జనగణన వారి జాబితాలో లేవు. వాళ్ళ దగ్గర వాటి సమాచారం దొరకదు. పోనీ మనవద్ద సమాచారం ఉంటే చేరుద్దాం. లేదూ అంటే అవి మొలకలుగానే ఉండిపోతాయి. వాటి విషయం గురించి మనం మాట్టాడుతున్నాం. వాటి గురించి వైజాసత్య గారు చెప్పారని మీరంటున్న ఆ లింకు ఇవ్వండి చూద్దాం. __చదువరి (చర్చరచనలు) 04:52, 15 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరిగారికి, వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_18#గ్రామ_వ్యాసాల_మొలకల_గురించి_... చూడండి. నేను ఇంతకు మందు వ్యాఖ్యలో తెలిపినట్లు గ్రామపంచాయతీ ప్రాతిపదికగా వ్యాసాలు వుంటే బాగుంటుంది. అలా ప్రస్తుతం లేదు కాబట్టి, కొత్త గ్రామ వ్యాసాలు సృష్టించబడే అవకాశవుంది. --అర్జున (చర్చ) 04:44, 16 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మరొక్కసారి స్పష్టత కోసం.. ఒకప్పుడు గ్రామాల పేజీలు చాలావరకూ ఏక వాక్య వ్యాసాలుగా ఉండేవి. మీరు చూపిన చర్చ ఆ రోజుల నాటిది. జనగణన వారి జాబితాలో ఉన్న గ్రామాల వ్యాసాల్లో సమాచారం చేర్చాక, ఇంకా కొన్ని గ్రామాలు ఏ సమాచారమూ లేకుండా మిగిలిపోయాయి. అవి జనగణన వారి జాబితాలో లేవు. మీరు చూపిన లింకులో వైజాసత్య గారు గాని, మిగతా వారు గానీ మాట్లాడినది ఇవన్నీ జరక్క ముందు. అది ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించదు. జనగణన వాళ్ళ దగ్గర ఆ మిగిలిపోయిన గ్రామాల సమాచారం దొరకదు. అవి మొలకలుగానే ఉండిపోతాయి. పోనీ మీవద్ద సమాచారం ఉంటే, లేదా సమాచారం సేకరించే ఉద్దేశం ఉంటే.. ఆ పని చేపట్టండి. ఇక ఈ చర్చలో నేను చెప్పేదేమీ లేదు. __చదువరి (చర్చరచనలు) 05:20, 16 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు (ఎం) మండలం పేజీలో 16 రెవిన్యూ గ్రామాలు ఉన్నట్లుగా ఉంది. కానీ, పంచాయితీ గ్రామాలతో కలిపి మొత్తం 23 గ్రామాలు ఉన్నాయి. వివరాలకు 2019, జనవరి 26న నమస్తే తెలంగాణలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూడొచ్చు. ఇలా చాలావరకు పంచాయితీ గ్రామ వ్యాసాలు లేవు. కాబట్టి, పంచాయితీ హోదా కలిగిన గ్రామాల గురించి కూడా వ్యాసాలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. గ్రామాల సమాచారంకోసం తెలంగాణ డిజిటల్ మీడియా వారిని అడిగితే జాతీయ ఉపాధి హామి పథకం జాలగూడులోని MIS Reports లో ఉంటుందని చెప్పారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:20, 16 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@నా దృష్టికి వచ్చిన ప్రకాశం జిల్లా గ్రామపంచాయితీల జాబితా చేర్చాను.అర్జున (చర్చ) 09:24, 23 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను గ్రామాల అంశాలు పిన్ కోడ్ , అక్షాంశ రేఖాంశాలు వికీడేటాలో చేర్చటానికి ప్రయత్నిస్తున్నాను. చాలా వికీడేటాలో విషయాలు లేని కొత్త గ్రామాలు ఎదురైనపుడు చేర్చటం విఫలం (constraints violation/Type undefined) అవుతున్నది. (ఉదాహరణకు బొంతపాడు,పెద గొల్లపాలెం,నర్రావారిపాలెం (కర్లపాలెం) తిమ్మారెడ్డిపాలెం ). ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలకు వికీడేటాలో P31 ఆంశం దేనిగురించి అని తెలపనివి:2565 వున్నాయి., ఈ వ్యాసాలు ఆమోదించితే, వికీడేటాలో ప్రాథమిక అంశాలు నమోదు చేయాలి.వీటికి ప్రాధమికంగా గ్రామమని, భారతదేశంలోవుందని, సదరు జిల్లా లో వుందని చేర్చితే దోషం లేకుండా పిన్ కోడ్ చేర్చగలుగుతున్నాను. ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల జనగణన ప్రాజెక్టు నివేదిక చేయబడనందున, ఏవి రెవిన్యూ గ్రామాలో తెలియటంలేదు. యర్రా రామారావు గారికి, చర్చ ప్రారంభించి దాదాపు 20 రోజులు గడిచినందున, మీరు లేక ఇంకా ఈ విషయమై పాల్గొనని నిర్వాహకులు ఈ విషయంపై నిర్ణయం తెలియచేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 12:01, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, పైన ప్రస్తావించిన విషయం ఈ విభాగానికి సంభందించిన విషయం కాదని నాఅభిప్రాయం.దీనిని వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా చర్చా పేజీలో నమోదు చేయగలరని భావిస్తున్నాను.అక్కడ దీని మీద చర్చించుదాం.--యర్రా రామారావు (చర్చ) 14:39, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారికి, వికీడేటా(Wikidata) గురించి గతంలో జరిగిన కృషి, ఈ మధ్య నేను చేస్తున్న కృషి మీకు పూర్తిగా అర్ధం కానట్లుంది. వికీపీడియా లో వికీడేటా వాడబడుతున్నందున, ఇప్పుడుదాకా కేవలం వికీపీడియాలో జరిగిన కృషి కొంత వికీడేటాకు మారుతుంది. ఆప్పుడు ఇతర వికీపీడియాలు, ఇతర కృత్రిమ మేధ వ్యవస్థలు కూడా ఆ వివరాలు వాడుకోగలుగుతాయి. రెవిన్యూ గ్రామాల మాత్రమే వుండాలని నిర్ణయమైందనుకుంటే, చాలా వ్యాసాలు తొలగించబడతాయి కాబట్టి వాటి గురించి వికీడేటా కృషి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఏవి రెవిన్యూ గ్రామాలు, అనేవి నిర్దిష్టంగా వర్గాల ద్వారా గుర్తించగలిగితే నేను చేస్తున్న పనిని ప్రస్తుతం రెవిన్యూ గ్రామాల వరకి పరిమితం చేసుకోగలుగుతాను. అదేమైనా జరిగివుంటే తెలియచేయండి. ఇంకొకవిషయం చర్చల పై స్పందనలు వచ్చినప్పుడు, 20 రోజులుదాటినప్పుడు, ఏదో ఒక నిర్ణయానికి రావటం మంచిది. ఇంకా వేచివుంటే పెద్ద ఉపయోగం వుండదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 14:56, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ మీ ఆవేదన అర్ధమైంది.నేనే అర్దం చేసుకోకుండా ఇది వికీ డేటాకు సంభందించిన విషయం అనే ఉద్ధేశ్యంతో అలా రాసాను.నేనే పొరబడ్దాను.అవును మీరన్నట్లు పొడిగించుట మంచిదికాదు.ముగింపు పలుకుదాం.--యర్రా రామారావు (చర్చ) 15:13, 26 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో అందరి అభిప్రాయాలు పరిశీలించటమైనది.చర్చ ప్రారంభించి 20 రోజులపైన అయినది. ఈ చర్చలో పాల్గోనిన గౌరవ వికీపీడియన్స్ అందరిని అభినందించటమైనది.చర్చలో పాల్గొనని సీనియర్ గౌరవ వికీపీడియన్స్ గానీ, నిర్వాహకులు గానీ ఎప్వరైనా దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని ఇప్పటివరకు వేచి చూడటం జరిగింది.ఎవ్వరూ నిర్ణయం ఇంతవరకు ప్రకటించనందున,ఇక చర్చకు కాలవ్యవధి ఇచ్చుట భావ్యంకాదని నిర్ణయం ప్రకటించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:47, 27 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చపై నిర్ణయాల ప్రకటనకు ముందుగా వివరణ

రెవెన్యూ గ్రామ హోదా లేనప్పటికీ కొన్ని గ్రామాలు చారిత్రకంగా చెందిన గ్రామాలు, అలాగే పట్టణ స్థాయితో సమానంగా ఉన్న కొన్ని శివారు గ్రామాలు, పుణ్యక్షేత్రాలకు చెందినటువంటి గ్రామాలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. రెవెన్యూ హోదా లేని ఇతర గ్రామాలు కేవలం ఏక వాఖ్యంతో ఉన్న గ్రామ వ్యాసాల పేజీలు తెలంగాణ రాష్ట్రంలో పునర్య్వస్థీకరణలో భాగంగా, కొద్దిగా సమాచారం ఉన్న గ్రామాలు మినహా వ్యాసంగా పరిగణించటానికి అవకాశంలేని అన్నీ వ్యాసాలు తొలగించబడ్డవి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ తొలగించబడలేదు. సుమారు అటువంటి గ్రామాలు వెయ్యికి పైగానే ఉండవచ్చు అని నా అభిప్రాయం.లేదా దీనికి ఎక్కువ, తక్కువలు కూడా ఉండవచ్చు. కేవలం ఏక వాఖ్యంతో ఉన్న వ్యాసాలు వలన వికీపీడియాపై సదభిప్రాయం ఉండదని మనందరికీ తెలుసు.గ్రామ వ్యాసాలు ఏమిటి? అలాంటి ఏ వ్యాసాలైనా మనం తొలగించటానికి ప్రతిపాదిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు.కాకపోతే గ్రామ వ్యాసాలకు కొన్ని మార్గదర్శకాలు, ఒక పాలసీ ఉంటూ ఉండాలనే ఈ చర్చను రచ్చబండలో ప్రవేశపెట్టుట జరిగినది.

ప్రకటించిన నిర్ణయాలు

  • కేవలం గ్రామ పంచాయితీ అనే కారణంతో తొలగించకుండా, ఏక వాఖ్యంతో ఉన్నటువంటి రెవెన్యూ హోదాలేని పంచాయితీ, నివాస ప్రాంతాల,శివారు గ్రామల వ్యాసాల పేజీలు తొలగించటానికి నిర్ణయం చేయటమైనది.
  • పైన వివరించిన ప్రకారం రెవెన్యూ గ్రామ హోదా లేనప్పటికీ కొన్ని గ్రామాలు చారిత్రక గ్రామాలు, అలాగే పట్టణ స్థాయితో సమానంగా ఉన్న కొన్ని శివారు గ్రామాలు, పుణ్యక్షేత్రాల ఉన్న గ్రామాలు వీటిని వికీపీడియాలో కొనసాగించుటకు నిర్ణయం ప్రకటించటమైనది.
  • అయితే ఇటువంటి వ్యాసాలు మండలంలోని గ్రామాలు మూసలో చేరవు.
  • అలాగే మండల వ్యాసంలో “మండలంలోని రెవెన్యూ గ్రామాల విభాగం” లో కూడా చేరవు.
  • అదే విభాగం క్రింద “మండలంలో వ్యాసం ఉన్న (రెవెన్యూ గ్రామం కాని) ఇతర గ్రామాలు” అనే విభాగంలో చూపవచ్చు.
  • మండలంలోని గ్రామాలు మూస ఈ వ్యాసాలకు తగిలించనవసరం లేదు.
  • ఈ వ్యాసాలకు కనీసం నమ్మదగిన ఒక మూలాల లంకె కూర్పు తప్పనిసరిగా ఉండాలి.
  • ఇటువంటి గ్రామాలు తెలంగాణకు చెందినవి “వర్గం: తెలంగాణ శివారు గ్రామాలు” అనే వర్గంలోకి,ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన గ్రామాలు “వర్గం: ఆంద్రప్రదేశ్ శివారు గ్రామాలు” అనే వర్గాలలోకి మాత్రమే చేరతాయి.
  • గ్రామ వ్యాసాలకు చెందిన మిగతా వర్గాలలో ఇవి చేర్చరాదు.చేర్చబడవు.
  • ఈ మార్గదర్శకాలుతోపాటు,లోగడ కలిగియున్న మార్గదర్శకాలు కూడా అమలులో ఉన్నట్లుగా పరిగణించాలి.

ఈ నిర్ణయాలను గౌరవ వికీపీడియన్స్ స్వాగతించగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:47, 27 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయాలపై స్పందన

[మార్చు]

@యర్రా రామారావు గారికి, మీరు నిర్ణయం తెలిపినందులకు ధన్యవాదాలు. కాని ఇది వికీమీడియా విధానంగా రూపుదిద్దడంలో మనం వోటు పద్ధతి మరచాము. అది పూర్తయ్యేవరకు ఇది ఒక మంచి సలహాగా మాత్రమే స్వీకరించాలని నా అభిప్రాయం.

  1. ఇక ఈ నిర్ణయం అమలు చేయడానికి పద్ధతులు, ఇబ్బందులు గురించి కూడా సముదాయం ఆలోచించాలి. మూసలో రెవిన్యూ గ్రామాలు మాత్రమే అంటే తదనుగుణంగా మూస శీర్షికని మార్చాలి. కాని దానిని ఎవరైనా మార్చగలిగే వీలున్నందున పొరబాటు మార్పులు జరగడానికి వీలుంది. వాటిని గమనించాల్సిన బాధ్యత మన సముదాయంపై వుంటుంది.
  2. శివారు గ్రామాలను ఏ రెవిన్యూ గ్రామానికి శివారు గ్రామము దానితో గల వర్గం లో చేర్చాలి. రాష్ట్ర స్థాయిలో వర్గానికి ఉపయోగంవుండదు.
  3. వికీడేటా లో గ్రామం లేక కుగ్రామం(hamlet) అని మాత్రమే చేర్చగలం. వికీడేటా లో అవసరమైతే సవరణలు చేయాలి. అలాగే వికీడేటాలో వివరాలతో తెలుగు వికీపీడియా వివరాలను పోల్చి అవసరమైన సవరణలు నిరంతరం చేయాలి.
  4. క్రియాశీలక వాడుకరులు తగ్గుతున్న నేపధ్యంలో (ఇటీవల నేను గమనించినపుడు దాదాపు 13 సంవత్సరాల వెనుక స్థాయికి చేరాము లింకు ) గ్రామ స్థాయి భారీ ప్రాజెక్టుల నాణ్యత పరిరక్షించడం కష్టం.
  5. వికీపీడియాకు అవసరమైన సాంకేతికాలు parser functions, wikidata sparql, quarry, sql queries, OSM editors పై పట్టుగల వారు ఎక్కువగా వుండి, గ్రామాల వ్యాసాలపై ఆసక్తిగల వారుకూడా వుంటే తప్ప, గ్రామ వ్యాసాల వంటి భారీ ప్రాజెక్టుల నాణ్యతగా నిర్వహించడం కష్టమని దాదాపు 12 ఏళ్ల అనుభవంతో నా కనిపిస్తుంది. --అర్జున (చర్చ) 07:52, 29 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీరు ఈ నిర్ణయాలపై వ్యతిరేకాభిప్రాయం తెలియజేస్తున్నారా? ఆ రకంగా ఏకాభిప్రాయం లేదు కాబట్టి ఓటింగ్ ద్వారా నిర్ణయిద్దాం అంటున్నారా? కాస్త వివరంగా చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 10:46, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్, ఇది విధానం అయితే వోటింగ్ జరగాలి, ఓటింగ్ లేకుండా కేవలం కొద్దిమంది స్పందించినందున, ఒక నిర్ణయం ప్రకటించినందున విధానం ఏర్పడదు. మార్గదర్శకమైతే వోటింగ్ అవసరం లేదు. ఇక విధానం చేయాలంటే అమలులో ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని విధానం చేయాలని సూచన ఇచ్చాను.--అర్జున (చర్చ) 03:25, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
విధానమైనా, మార్గదర్శకమైనా వికీపీడియాలో నిర్ణయాలు జరిగేది చర్చ, ఏకాభిప్రాయాలను అనుసరించి. ఓటింగ్ అన్నది చర్చకు ప్రత్యామ్నాయం కానీ, చర్చ కన్నా గొప్పది కానీ కాదు. (en:Wikipedia:Polling is not a substitute for discussion) అలానే పోలింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకోవడాన్ని వికీపీడియాలో ఉద్దేశపూర్వకంగా నిరుత్సాహపరచాలి. కాబట్టి, నేను అనేదేమంటే ఇప్పుడు ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేకపోతే, ఏకాభిప్రాయానికి మధ్యేమార్గం అన్వేషించాలి. అంతే తప్ప పోలింగును ఒక ఆమోదయోగ్యమైన ప్రక్రియగా ముందుకు తీసుకురాకూడదు. --పవన్ సంతోష్ (చర్చ) 07:52, 7 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్, ఆరు సంవత్సరాల క్రిందట ఎంతో సమయం వెచ్చించి, చర్చ జరిపి, ఏర్పడిన పద్దతి అది. అయితే దానిలో కూడా ఇంకా కొన్ని మార్పులు తేవలసివుందని నాకే అనిపిస్తుంది. అంటే విధానానికి, మార్గదర్శకానికి ప్రాథమికంగా అంటే అంశాన్నిపాటించేవిధంగాచేసేతీరులో తేడా వుంటుంది, వాటిని చేయడంలో కూడా సౌలభ్యాలు వేరుగా వుండాలి. ఇక ఇప్పుడున్న పద్ధతి కూడా చర్చలు లేకుండా ఓటింగ్ చేయమనడంలేదు. చర్చ ద్వారా వివిధ కోణాలు పరిశీలించి తెవికీకి అనుగుణమైనదానిని ప్రతిపాదించి వోటు ప్రకారం నిర్ణయం చేయమనే చెప్తుంది. ఇప్పటికీ ఈ గ్రామ విషయాలకు సంబంధించి రెండు సారి చర్చకు పెట్టినట్లు user:యర్రా రామారావు గారు తెలిపారు. చర్చ జరిగింది, నిర్ణయం సంగతే మర్చిపోయాము. ఎట్టకేలకు నిర్ణయం చేయబడింది. మరల ఇంకోసారి చర్చ చేద్దామంటున్నారు. మీకు ఓపిక వున్నా, ఆ నిర్ణయాలప్రభావం పడే పనిలో వున్నవారికి అంత ఓపికవుండకపోవచ్చు. తెవికీలో చర్చలలో ఇద్దరు, ముగ్గురు పాల్గొన్నందున ఏకాభిప్రాయంకుదరక ప్రతిష్ఠంబన వలన పని చురుకుదనం తగ్గిపోయే అవకాశం, చర్చలో పాల్గొనకపోయినా వాటిపై అభిప్రాయాలున్న వారిని మనం విస్మరించే అవకాశం, ఏకాభిప్రాయంకొరకు మరలా మరలా ప్రయత్నించడంలో వుంది అని అనిపిస్తుంది. --అర్జున (చర్చ) 03:26, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మూడు సంగతులు:
  • వాడుకరులు తమ సమయాన్ని వెచ్చించి, ఈ చర్చ చేసారు. నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం చూసి అర్జున గారు "ఒక నిర్ణయానికి రావటం మంచిది." అని కూడా అన్నారు. ఎవరూ ముందుకు రాకపోయేసరికి రామారావు గారు చొరవ తీసుకుని నిర్ణయాన్ని ప్రకటించేసారు. తీరా అంతా అయ్యాక ఇప్పుడు - వోటింగు జరగ లేదు, కాబట్టి దీన్ని సలహాగానే చూడాలి అంటూ ఈ నిర్ణయాన్ని కూడా నీరుగార్చడం జరుగుతోంది. ఇది నిర్ణయం ప్రకటించిన వారిని చిన్నబుచ్చేలా ఉంది. అర్జున గారి అభిప్రాయం అలా ఉన్నప్పుడు "ఒక నిర్ణయానికి రావటం మంచిది." అని ముందు చెప్పకుండా ఉండాల్సింది.
  • పవన్ సంతోష్ గారు చెప్పినట్టు అభిప్రాయాలు ముఖ్యం, చర్చ ముఖ్యం. వోట్ల స్థానం వీటికి వెనకాలే. ఆయన చెప్పినదాన్ని నేను సమర్ధిస్తున్నాను.
  • ఇది విధానం కాదు, మార్గదర్శకం అని అర్జున గారు తీర్మానించారు. అలాగే కానీండి. మార్గదర్శకమే అందాం. ఇకనుండి దీన్ని అనుసరించాలి, అనుసరిద్దాం. భవిష్యత్తులో దీన్ని మార్చాలి అనుకుంటే మళ్ళీ చర్చించాకే మారుద్దాం.

ఇకపై ఈ అంశంపై చర్చను ఆపేసి, రామారావు గారు ప్రకటించిన నిర్ణయాన్ని మార్గదర్శకంగా భావించి అనుసరిద్దాం అని నేను అందరినీ అభ్యర్ధిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 12:27, 11 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరి గారికి, నేను నిర్ణయం ప్రకటించమని కోరినపుడు విధానాల సంగతి నిజంగానే మర్చిపోయాను. ఆ విధానం ఆరుసంవత్సరాల క్రింద ఏర్పడినా, దానిని పాటించడంలో సహసభ్యులు ధ్యాసపెట్టలేదు. ఆ విధానాన్ని పాటించివుంటే కొంతవరకు తెవికీలో నాణ్యత మెరుగయ్యేదని నా నమ్మకం. ఇటీవల నేను ప్రయత్నించిన కొన్ని చర్చలకు కనీసం అధికారులు, నిర్వాహకులు కూడా స్పందించటం లేదు. దీనిలో విజ్ఞత వారికే వదిలివేస్తాను. ఇక user:యర్రా రామారావు గారిని చిన్నబుచ్చే ప్రయత్నం కాదని సభ్యులందరికీ మరొకసారి తెలియచేస్తున్నాను. మార్గదర్శకాన్ని పాటించేవాళ్లు పాటించవచ్చు, పాటించని వాళ్లు పాటించకుండా వుండవచ్చు. తప్పనిసరిగా పాటించాలంటే దీనిని విధానపద్దతిననుసరించి విధానాన్ని చేయటం మంచిది, లేదా ఆ విధాన పద్దతికి సవరణలు అవసరం మనుకుంటే ఆ దిశగా చర్యలు చేపట్టటమంచిది.--అర్జున (చర్చ) 06:52, 12 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, "పాటించేవాళ్లు పాటించవచ్చు, పాటించని వాళ్లు పాటించకుండా వుండవచ్చు." అని మీరు రాయడంతో ఇపుడీ చర్చపై మనందరం పెట్టిన సమయం శుద్ధ దండగై పోయినట్టైంది. మీ అభిప్రాయాన్ని పునఃపరిశీలించమని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 11:18, 12 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

(ఈ చర్చ ముగిసింది కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయాలేమీ చెప్పదల్చుకోలేను. ఫలితంపై మాత్రమే చర్చ జరుగుతోంది కాబట్టి ఫలితం కొరకు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటిస్తాను). సుధీర్ఘంగా జరిగిన ఈ చర్చను పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఒక్కటే విషయం తెలుస్తుంది- మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామాలను ఉంచాలా, తుంచాలా అనేది మాత్రమే. ఇప్పటివరకు తెవికీలో అత్యధిక / సుధీర్ఘచర్చలు జరిగినవి గ్రామవ్యాసాలపైనే. ఈ చర్చకంటే కొంతకాలం ముందే ఇదేవిషయంపై చర్చ జరిగింది. కాబట్టి విభాగం టైటిల్‌లో ఉన్నట్టుగా, పైన చెప్పినట్లుగా ఒక్క విషయంపైనే ఓటింగ్ నిర్వహిస్తే బాగుండేది. సరే చర్చ ప్రారంభమైంది, అంతమైంది కూడా. తరుచుగా ఒకే విషయంపై చర్చను చేయడానికి ఇష్టపడకో, సెలవులో ఉండటం వల్లనో, మరే కారణాలో తెలియవు కాని ఈ చర్చలో కొద్దిమంది సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. చివరికి నిర్ణయం కూడా ఎవరూ ప్రకటించకపోయేసరికి రామారావు గారే చొరవ తీసుకొని నిర్ణయం ప్రకటించారు. స్వయంగా ముందుకు వచ్చి నిర్ణయం ప్రకటించినందుకు అభినందనలు, అదే సమయంలో చర్చలో వెల్లడైన సభ్యుల అభిప్రాయాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను. చర్చ ముగిసేనాటికి ఇందులో పాల్గొన్నది కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే. అందులో ఒక సభ్యుడు (పవన్) ప్రత్యక్షంగా చర్చా విషయంపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేరు. చర్చను ప్రతిపాదించిన సభ్యుడు (రామారావు) ప్రతిపాదనకు, ఫలితానికి మద్యలో చర్చలో ఎలాంటి అభిప్రాయం చెప్పలేరు. ఇద్దరు సభ్యులు (అర్జున మరియు ప్రణయ్‌రాజ్‌లు) పంచాయతీ గ్రామాలు తెవికీలో ఉండుట అవసరమేనని అభిప్రాయపడ్డారు. ఒక సభ్యుడు (చదువరి) మొలకలుగా ఉండే పంచాయతీ గ్రామవ్యాసాలను వ్యతిరేకించారు. అంటే చర్చ ఎటువైపు మొగ్గిందో స్పష్టంగానే ఉంది. ఇది ఓటింగ్ కాదు కాబట్టి చర్చను ప్రకటించిన సభ్యుడు తన స్వంత అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం ప్రకటించియుంటే ఫలితం అర్జున మరియు ప్రణయ్‌రాజ్‌ల అభిప్రాయాలను అనుగుణంగా ఉండేది. కాని నిర్ణయం అలా జరుగలేదు. స్వంతాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకున్నా ఫలితం ఇప్పుడు ప్రకటించినవిధంగా ఉండాల్సింది కాదు. కాని ఇక్కడే పొరపాటు జరిగింది. మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామవ్యాసాలను తొలగించాలనే బలమైన ప్రతిపాదనలు కూడా చర్చలో రాలేవు. అభిప్రాయాలు (ప్రతిపాదించిన సభ్యుడి అభిప్రాయం కూడా లెక్కిస్తే) సరిసమానంగా ఉన్నాయి కాబట్టి ఈ చర్చ ఎలాంటి ఫలితం ఇవ్వని విఫలచర్చగా నిర్ణయిస్తున్నాను. చర్చ విఫలమైననూ చర్చలో పాల్గొన్న సభ్యుల సమయం, పని వృధా అయినట్లు ఏమీకాదు. ఈ చర్చ శాశ్వతంగా రచ్చబండలో ఉంటుంది. చర్చలో సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పలువురి దృష్టిలో రావడమే కాకుండా తదుపరి చర్చాసమయంలో కూడా సభ్యులకు ఈ అభిప్రాయాలు అవగాహనకై పనికి రావచ్చు. కొంత విరామం తర్వాత ఈ విషయంపై మళ్ళీ చర్చ / ఓటింగ్ జరిగేవరకు ఈ చర్చతో సంబంధం లేకుండా ఇదివరకు ఉన్న నియమాలే (మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామవ్యాసాలకు సంబంధించి మాత్రమే) అమలులో ఉండగలవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:04, 12 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరి గారికి, en:Wikipedia:Policies_and_guidelines ప్రకారం "Policies are standards that all users should normally follow, and guidelines are generally meant to be best practices for following those standards in specific contexts. Policies and guidelines should always be applied using reason and common sense." విధానాలకి, మార్గదర్శకాలకి దగ్గర సంబంధం వుంది. దీనిని మార్గదర్శకం అని అనుకుంటే తప్పక పాటించాలనే నిబంధనలేదు. సందర్భానికి తగినట్లు ఆనవసరమనుకుంటే పాటించనవసరం లేదు. ఉదాహరణకు ఇటీవలి శైలి గురించిన చర్చలో పదం తరువాత బ్రాకెట్లలో ఇంకొక పదం వుంటే ఖాళీ ఇవ్వాలని అన్నారు. అది అధ్యక్షుడు(రాలు) అని రాసేటప్పుడు మినహాయింపు ఉండాలని నేను అన్నాను. అలానే ఈ చర్చా విషయం మరియు నిర్ణయం గురించి కూడా.--అర్జున (చర్చ) 04:54, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, విధానాలు, మార్గదర్శకాల మధ్య ఉన్న భేదం గురించి దురవగాహన లున్నాయి. కొన్ని ముఖ్యమైన దురవగాహనలను తొలగిస్తూ, వాటి గురించి మరింతగా విశదీకరిస్తూ ఈ పేజీ ఉంది, చూడండి. మొత్తం 7 దురవగాహనల గురించి వివరించారు. దాన్నిబట్టి మొత్తమ్మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఒక పద్ధతిని పాటించేందుకు స్ఫూర్తి ముఖ్యం, అది విధానమా, మార్గదర్శకమా అనేది కాదు. ఏదేమైనప్పటికీ, మీ అవగాహనను నేను మార్చలేనని నాకు తెలుసు. ఆ పేజీ చూస్తారని ఆశిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:33, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారి, మీరు తెలిపిన లింకు చదివాను. అయితే అది వ్యాసం కావున ఒక అభిప్రాయంగానే పరిగణించాలి. నిర్వచనంలో వున్న తేడానికూడా మీరు అంగీకరించకపోతే ఇంకేమి చెప్పగలను. సరైన కారణాలుంటే నేను నా అవగాహనను మార్చుకోగలనని వికీపీడియాలో నా పనులు తెలియచేస్తాయి.--అర్జున (చర్చ) 03:11, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ. ఆ పేజీలో రాసిన దురవగాహన #7 చూసారా..? విధానపు పేజీలు మార్గదర్శకాల కంటే గొప్పవని, మార్గదర్శకాలు ఎస్సేల కంటే గొప్పవనీ అనుకోవడం ఒక దురవగాహన అంటోంది. ఓ రెండు విషయాలు మళ్ళీ చెబుతున్నానండి.. 1. పద్ధతులను పాటించాలన్న స్ఫూర్తి, కామన్‌సెన్సూ ముఖ్యం; విధానమా, మార్గదర్శకమా అనేది కాదు. 2. ఎంత చర్చించినా నేను మీ అభిప్రాయాన్ని మార్చలేను. __చదువరి (చర్చరచనలు) 04:25, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మరొక్క సంగతి.. "ఇటీవల నేను ప్రయత్నించిన కొన్ని చర్చలకు కనీసం అధికారులు, నిర్వాహకులు కూడా స్పందించటం లేదు." అని మీరు రాసారు. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కూడా స్పందించలేదని అర్థమైంది. ఒక వాడుకరి వికీకి ఉపయోగపడే పనులు చేస్తూ అభిప్రాయాలు సూచనలు కోరినపుడు, తగినట్లుగా స్పందించకపోవడం - తప్పో కాదో తెలీదు గానీ - సరైన పద్ధతి మాత్రం కాదని నేను భావిస్తాను. ఆ వ్యాఖ్యలో మీరు నన్ను కూడా ఉద్దేశించారో లేదో తెలియదు, కానీ ఉద్దేశించి ఉంటే అది పొరపాటేమీ కాదు. సాధ్యమైనంత వరకు ఇకపై అలాంటివి జరక్కుండా చూసుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 05:43, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:12, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పైన పలువురు సభ్యులు స్పందించాకా మరోసారి నేను చెప్పదలిచింది స్పష్టం చేస్తున్నాను. పైన జరిగిన చర్చలో ఏకాభిప్రాయం లేదనో, నిర్ణయం చర్చలోని ముఖ్యమైన ఏకాభిప్రాయాంశాలకు అనుగుణంగా లేదనో అంటే ఈ చర్చ ఫలితం విఫలం కావడం అవుతుంది. అది తప్పు కాదు. కాకపోతే, ఓటింగ్ ద్వారా విధానాలు, మార్గదర్శకాల ఏర్పాటు అన్నది మట్టుకే సరికాదు. --పవన్ సంతోష్ (చర్చ) 13:51, 13 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@పవన్ సంతోష్ గారికి, మీకు వోటు పద్ధతి పై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా వుంది. అది ఎంతోమంది వికీసభ్యుల చర్చలు, అభ్యంతరాలపై ఏకాభిప్రాయం ద్వారా ఏర్పడింది. అది సరికాదంటే దానిని రద్దు చేయటానికి, ఆ విధానం పాటించి రద్దుచేయండి. నాకేమి అభ్యంతరము లేదు.--అర్జున (చర్చ) 03:16, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ చర్చ గమనించాక. 1, చర్చలలో ఎక్కువమంది ప్రతిస్పందిచకపోవడం అనేది. 2, నిర్ణయం జరిగిపోయినట్టుగా ప్రకటించారు కనుక దీనిపై సమీక్ష జరిపి నిర్ణయంలో మార్పులు చేయవచ్చా లేదా?. మొదటిది - దీన్లో ఎక్కువమంది పాల్గొనలేకపోవడానికి కారణం వారు చర్చలు చూడకపోవడ అయిఉండవచ్చు. కనుక ఇలాంటి ముఖ్యమైన చర్చలలో సోషల్ మీడియాలో మెసేజ్, మెయిల్ పంపించడం ద్వారా ఎక్కువమంది పాల్గొనేలా చేయడం, పాల్గొనకపోయినట్టుగా అనిపించినపుడు నిర్ణయం తీసుకొనే ముందు ఇలా చేసి ఉండవచ్చు. ఇక రెండు -నిర్ణయంలో కొందరికి అసంతృప్తి ఉన్నపుడు లేదా నిర్ణయం వెలువడిన తదుపరి మరికొంత చర్చ జరిగిఉండవలసినది అనిపించినపుడు నిర్ణయాన్ని సమీక్షించడం లేదా రద్దు చేయడం వంటి మార్పులు చేయడానికి అవకాశాలు ఇపుడు పరిశీలించడం. తెవికీ లాంటి చిన్న సమూహాల్లో మనం కొన్ని పాలసీలను మనకనుగుణంగా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని నా భావన. దీనికి ఇదే చర్చను వేదికగా ఎందుకు మొదలుపెట్టకూడదు. దీనిపై సభ్యులు ముఖ్యంగా రామారావు గారు సుముఖంగా స్పందిచగలరని అనుకుంటాను.. @పవన్ సంతోష్ గారు చర్చలు విఫలం అవడం జరగదు. విషయం కొంచెం విసృతమైనది అయినపుడు మరికొన్ని సార్లు చర్చలు జరగడం అవసరమే, ఏ ఒక్కసారికో చర్చలు జరిగి అప్పటికి స్పందిస్తున్న సభ్యులు తక్కువగా ఉండి నిర్ణయం తీసుకున్నపుడు, దానిపై తదుపరి పాల్గొను సభ్యులకు అసంతృప్తి ఉండవచ్చు. కాని పలుమార్లు చర్చలు జరిగినపుడు ముందు చర్చల్లో ఎక్కువమంది అభిప్రాయాలను కలిపి నిర్ణయం తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. కనుక గ్రామ వ్యాసాల చర్చలు మరొకసారి పున:పరిశీలనకు ఉండటం వలన ఈ సారి సరైన నిర్ణయం వెలువడగలదని అనుకుంటున్నాను... B.K.Viswanadh (చర్చ) 04:02, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
B.K.Viswanadh గారూ, "నిర్ణయం జరిగిపోయినట్టుగా ప్రకటించారు కనుక దీనిపై సమీక్ష జరిపి నిర్ణయంలో మార్పులు చేయవచ్చా లేదా?" అనే ప్రశ్న వేసారు. కచ్చితంగా చెయ్యొచ్చు, నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, తప్పని వాదించవచ్చు, తిరగదోడమని అడగొచ్చు అని నా ఉద్దేశం. కానీ ఇక్కడ నా అభ్యంతరమల్లా.. ఇది విధానం కాదు, మార్గదర్శకం; ఇష్టమైతే పాటించండి లేదంటే మానెయ్యండి అని అనడం తోనే.
ఇక, ఎక్కువమంది ప్రతిస్పందించకపోవడం గురించి.. ఈ చర్చ జరుగుతున్న సంగతి తెలియక కొంతమంది స్పందించలేదు అని మీరు భావిస్తున్నట్టున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. __చదువరి (చర్చరచనలు) 04:48, 14 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించు మూసను వాడినపుడు

[మార్చు]

ఏదైనా వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదించాలంటే, {{తొలగించు}} అనే మూసను ఆ వ్యాసంలో పైన చేరుస్తున్నాం. ఈ మూసను వాడినపుడు మూసలో "మరింత సమాచారాన్ని చేర్చండి" అనే లింకు కనిపిస్తుంది. 1 అనే అంకెను "ఫీల్డు" గా ఎంచుకుని, ఆ ఫీల్డులో తొలగింపుకు కారణం రాయాలి. పేజీని భద్రపరచాక, మూస పాఠ్యం పేజీలో పైన కనిపిస్తుంది. అందులో ఒక ఎర్రలింకు కూడా కనిపిస్తుంది. తొలగింపుపై చర్చ కోసం సృష్టించే పేజీకి లింకు అది. ఆ లింకును నొక్కి, ఎందుకు తొలగించదలచామనే కారణాన్ని ఆ పేజీలో రాయాలి. దానిపై ఒక వారం పాటు చర్చ జరిగాక, సముదాయ నిర్ణయం మేరకు చర్య తీసుకోవాలి. ఇది తొలగింపు పద్ధతి.

అయితే, మన సముదాయంలో చర్చల పట్ల వాడుకరులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కాబట్టి, చర్చ కోసం ఆగకుండా తొలగిస్తున్నాం. దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:25, 12 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నా వరకు అయితే కొత్త సభ్యుల ప్రయోగాలు (తమ గురించి వ్రాసుకునే వ్యాసాలు), మూలాలు లేని ఏక వాక్య వ్యాసాలు, వేరే భాషల వాళ్ళు ప్రచారం కోసం కృతకంగా అనువాదం చేసిన వ్యాసాలను చర్చలు లేకుండానే తొలగిస్తున్నాను. అయినాగానీ ఇందులో కొంచెం ఉండగలిగేవి అనిపించినవి తొలగింపు మూసచేర్చి సుమారు ఒక వారం రోజులు ఎదురు చూసి ఏ సభ్యుడూ అభ్యంతరం చెప్పకపోతే తొలగిస్తున్నాను. అందరూ అనుసరించగలిగే నియమాలు మనం ఏర్పాటు చేసుకుంటే మంచిదేనేమో. రవిచంద్ర (చర్చ) 14:30, 14 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాల తొలగింపుకు చర్చలు అవసరం. లేకుంటే ఎవరికి నచ్చినట్టు వారు వ్యాస తొలగింపు ప్రతిపాదన చేస్తున్నారు. నేను రాసిన నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు వ్యాసానికి వాడుకరి:Sakura6977 తొలగింపుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఇక్కడ చూడొచ్చు. నా విషయానికి వస్తే ఇతర సభ్యులు పెట్టిన తొలగింపు మూసను అనుసరించి వ్యాసాలను తొలగిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:36, 16 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

InternetArchiveBot కొరకు బాట్ ఫ్లాగ్ అభ్యర్ధన

[మార్చు]

InternetArchiveBot వికీపీడియా వ్యాసాలలో పనిచేయని లింకులను వెదకి, వాటిని ఆర్కీవ్ లో గల లింకులతో మార్చటానికి ప్రయత్నిస్తుంది. అలాగే పనిచేస్తున్న లింకులు ఆర్కీవ్ లో లేకపోతే ఆర్కీవ్ లో చేర్చి, ఆర్కీవ్ లింకులు చేరుస్తుంది. ఈ బాటును వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_65#తెలుగు_వికీపీడియా_కొరకు_ఇంటర్నెట్_ఆర్కైవ్_బాటు_-సముదాయ_స్పందన ద్వారా చర్చ జరిపి ఆహ్వానించడమైనది. (https://phabricator.wikimedia.org/T219962). ఇప్పుడు తెలుగువికీపీడియాలో బాట్ ఫ్లాగ్ కొరకు అభ్యర్ధన చేర్చడమైనది. సభ్యులు స్పందనలు 21 జులై 2019 లోగా కోరడమైనది.--అర్జున (చర్చ) 05:07, 15 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి వ్యాసానికి వికీపీడియాలా మూలాలు తప్పనిసరి.మనం ఈ రోజు ఇచ్చిన మూలాలు కొన్నాళ్లుకు పనిచేయని లింకులుగా మారుచున్నవి.ఉదా:ఈ వ్యాసంలో పై వాక్యంలో 3 వ మూలం "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు" కు చెందినది.అన్ని గ్రామ వ్యాసాలకు ఈ లింకు మూలంగా ఇవ్వబడినది.కానీ ఇది ఇప్పుడు పనిచేయుటలేదు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఈ లింకు తొలగించబడింది.ఇటువంటి పరిస్థితిని అధిగమించాలంటే ఎప్పటికీ పనిచేసే లింకులు వికీపీడియాకు తప్పనిసరి అని భావించి "ఇంటర్నెట్_ఆర్కైవ్_బాటు" ఆహ్వానించడమైనది.--యర్రా రామారావు (చర్చ) 15:24, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాలకు లింకులు ఇచ్చేటపుడు

[మార్చు]

అనేక పేజీల్లో గ్రామాల లింకులు తప్పుగా ఉండటం గమనించాను. అసలు గ్రామానికి కాకుండా వేరే ఏదో గ్రామానికి లింకు ఇవ్వటం, గ్రామానికి నేరుగా లింకు ఇవ్వకుండా దారిమార్పు పేజీకి ఇవ్వటం, అయోమయ నివృత్తి పేజీకి ఇవ్వటం లాంటివి కొన్ని వందల పేజీల్లో చూసాను. గ్రామాలకే కాదు ఇతర లింకుల్లోనూ ఇలాంటివి జరుగుతాయి. ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ పొరపాట్లు జరుగుతున్నాయని నాకు అనిపిస్తోంది. దారిమార్పు పేజీకో, అయోమయ నివృత్తి పేజీకో లింకు ఇస్తే తప్పేంటి, ఆ పేజీ నుండే అసలు పేజీకి వెళ్తారు కదా అని అనుకోవచ్చు. అది చుట్టు తిరుగుడు అవుతుంది. పైగా, ఈ అయోమయ నివృత్తి పేజీలో అసలుపేజీకి లింకు లేనే లేకపోతే..!?

పనిగట్టుకుని దారిమార్పు పేజీలకు, అయోమయ నివృత్తి పేజీలకూ లింకులు ఇవ్వరాదు. ఈ సరికే ఇచ్చిన లింకుల గమ్యాల్లో మార్పులు జరిగినపుడు లింకు తెగిపోకుండా, దారిమార్పు అనే ఏర్పాటు జరిగింది. కొత్తగా ఇచ్చే లింకులను మాత్రం నేరుగా అసలు పేజీకే ఇవ్వాలి. ఇలా చుట్టు తిరుగుడు లింకులు ఇవ్వటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే.. నాకు తట్టిన కారణం ఇది: లింకు ఇచ్చేందుకు, ఎడిటరు మెనూను కాకుండా నేరుగా వికీ మార్కప్ - అంటే, [[ ]] లను - వాడటం వలన ఈ తప్పులు జరుగుతాయి. ఇంకా కారణాలుండవచ్చు (సరైన లింకు వెతికి, ఇచ్చేందుకు బద్ధకించడం మరో కారణం కావచ్చు). ఖానాపూర్ అని రాసి దానికి ఇలా - [[ఖానాపూర్]] - అని ఒక లింకు తగిలిస్తే అది అయోమయ నివృత్తి పేజీకి పోతుంది. ఏ ఖానాపూరో రాసినవారు సరిగ్గా చెప్పకపోతే, చదివే వారికి ఏం తెలుస్తుంది? ఆ అయోమయ నివృత్తి పేజీలో అసలు ఖానాపూర్‌కు లింకు లేనే లేదనుకోండి, ఇక పాఠకుడు ఆ పేజీకి వెళ్లనే లేడు. అందుచేత మనం కొత్తవారికి నేర్పేటపుడు విజువల్ ఎడిటరును వాడమని, అభిరుచుల్లో దాన్ని సెట్ చేసుకోమనీ చెప్పాలి. అది ఇలాంటి తప్పులను నివారిస్తుంది. కొన్ని తప్పులనైతే పనిగట్టుకుని చెయ్యాలన్నా చెయ్యలేం. ఉదా: అసలు ఉనికిలోనే లేని పేజీకి లింకు ఇవ్వటం.

ఇంకొకటి, అయోమయ నివృత్తి పుటలకు లంకెలున్న పుటలు అనే ప్రత్యేక పేజీ ఒకటుంది. ఈ పేజీని ఆధారం చేసుకుని, బా టొకదాన్ని నడిపి (ఇంగ్లీషు వికీలో ఉండే ఉంటది) ఇలాంటి లింకులన్నిటినీ సవరించవచ్చేమో సాంకేతికులు పరిశీలించాలి. __చదువరి (చర్చరచనలు) 00:14, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిజమే. వ్యాసం రాసేప్పుడు పేజి ఉంటుందికదా అని లింకు ఇస్తున్నాం. కానీ ఆ లింకు సరైన పేజీకి వెలుతుందా లేదా అన్నది చూడడంలేదు. కాబట్టి, ఇచ్చిన లింకు సరిగా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. చదువరి గారు చెప్పినట్టు బాటు ద్వారా లింకులు సరిచేస్తే బాగుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:06, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
తెలంగాణ మండల వ్యాసాలలోని మండలంలోని రెవెన్యూ గ్రామాలు విభాగంలోని గ్రామాలు లింకులు,మండలంలోని గ్రామాలు మూస లోని గ్రామాలు లింకులు లోగడ జనన గణన డేటా ఎక్కించే ప్రాజెక్టు పనిలో దాదాపుగా 99% సరియైన గ్రామాలకు లింకులు కలపబడినవి.ఈ విభాగం చర్చాపేజీలో పెట్టినాక మరలా అన్ని జిల్లాలలోని,అన్ని మండలాల గ్రామాల లింకులు పరిశీలించి,అయోమయ నివృత్తి పుటలకు కలిపిన సుమారు 20 గ్రామాల పై బడిన లింకులు సవరించబడి 100% సరిగా ఉన్నవని తెలుపుచున్నాను.ఇవి ఇతర వ్యాసాలలో లింకులు ఇచ్చేటప్పుడు ఎక్కువ జరగటానికి అవకాశం ఉందని నేను భావించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:35, 2 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, తెలంగాణ గ్రామాలు మండలాలు, తత్సంబంధిత మూసల పేజీల నుండి ఇతర గ్రామాలు మండలాల పేజీలకు ఇచ్చే లింకులన్నిటినీ సంస్కరించానని మీరు చెబుతున్నారు. సంతోషం. గ్రామాల పేజీల విషయంలో మీరు చేస్తున్న పని లోని నాణ్యత, దాని పట్ల మీకున్న ఆత్మవిశ్వాసం ఇక్కడ మీరు రాసిన వ్యాఖ్య ద్వారా తెలుస్తోంది. నాకు చాలా స్ఫూర్తి నిచ్చింది మీ వ్యాఖ్య. ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చరచనలు) 04:25, 4 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పేజీల్లో ఆచి తూచి వాడాల్సిన పదాలు

[మార్చు]

వీకీ పేజీల్లో ఎక్కడో గానీ వాడకూడనివి, జాగ్రత్తగా అచి తూచి వాడాల్సినవీ పదాలు, వాక్యాలూ కొన్ని ఉన్నాయి. కొన్ని భాష పరమైనవి, కొన్ని సందర్భానికి సంబంధించినవీ. నా అభిప్రాయంలో అలాంటివి కొన్ని:

  • ప్రస్తుతం, గత (గత రాత్రి, గత ఎన్నికల్లో వగైరా), తేదీ లేకుండా వారం మాత్రమే చెప్పడం (బుధవారం రాత్రి మరణించారు).. ఇలాంటి కాలదోషం పట్టే పదాలు: కొన్నాళ్ళ తరువాత ఇలాంటి పదాలు, వాక్యాలను చదివితే అసహజంగా ఉంటుంది.
  • "మరియు": తెలుగు భాషకు సహజమైన వాడుకలో లేని పదం ఇది. దాన్ని పూర్తిగా వర్జించవచ్చు. ఇంగ్లీషు నుండి అనువాదాలు చేసేటపుడు ఇది ఎక్కువగా కనబడుతుంది.
  • "యొక్క" అనే పదం కూడా కొద్దిగా అలాంటిదే. ఎక్కడో తప్ప చాలా సందర్భాల్లో దాన్ని వర్జించవచ్చు.
  • కర్మణి ప్రయోగం: తెలుగు భాషకు సహజమైనది కాదు ఈ ప్రయోగం. అతడు చేసాడు అని అంటాం గానీ, అతడి చేత చెయ్యబడింది అని అనం. మన తెలుగు వాక్యము కూడా అదే చెబుతోంది. అయితే కొన్ని చోట్ల ఇది వాడక తప్పని పరిస్థితి ఉండొచ్చేమో నాకు తెలియదు.

వాడుకరులు అభిప్రాయాలు తెలుపవల్సినదిగా మనవి. కొత్త వాడుకరులకు ఈ విషయాలను చెప్పాలని కూడా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:45, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఇకపై ఈ పదాల విషయంలో జాగ్రత్త పడతాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:58, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Can you help with a translation to Telugu?

[మార్చు]

Greetings. On behalf of the Community Engagement department at the Wikimedia Foundation, I'd like to request some assistance in getting an important message translated to your language as soon as possible. Really appreciate your attention! --Elitre (WMF) (చర్చ) 12:54, 19 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

భారత దేశంలో సముదాయాలకు మద్దతు

[మార్చు]

అందరికీ నమస్కారం,

వికీపీడియా ప్రాజెక్టులకు బలం - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వదాన్యులైన స్వచ్ఛంద సేవకులు, సమూహాలు, సంస్థల నెట్‌వర్కు అయిన మీరే. మీరంతా కలిసి, వికీపీడియా ప్రాజెక్టులను, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.

వికీమీడియా ఇండియా గుర్తింపును రద్దు చేయాలని అఫిలియేషన్స్ కమిటీ సిఫారసు చేసిన సంగతి మీరు వినే ఉంటారు. దీని వలన భారత్‌లో వికీమీడియా సమూహాల భవిష్యత్తు ఏమౌతుందని కొందరు సముదాయ సభ్యులు అడిగారు. అఫిలియేషన్స్ కమిటీ నిర్ణయం గురించి మరికొంత సమాచారాన్ని మీకు ఇద్దామని, భారత్ లోని సముదాయాలకు దన్నుగా నిలవడంలో మా నిబద్ధతను మళ్ళీ చాటాలని మేం భావిస్తున్నాం.

వికీపీడియా అనుబంధ సంస్థలకు ప్రతినిధిగా ఉంటూ వాళ్లకు సహాయకంగా ఉండే అఫిలియేషన్స్ కమిటీని స్వచ్ఛంద సేవకులు నడిపిస్తూంటారు. కొన్ని సంవత్సరాల పాటు వికీమీడియా ఇండియా కార్యకలాపాలను చాప్టర్ అవసరాలకు అనుగుణంగా మలచేందుకు కృషి చేసిన తరువాత, దానితో ఉన్న ఒప్పందాన్ని పొడిగించవద్దని 2019 జూన్‌లో కమిటీ సిఫారసు చేసింది.

2011 లో మొదటిగా వికీమీడియా ఇండియా ఒక చాప్టరుగా గుర్తింపు పొందింది. 2015 లో చాప్టరు ఒప్పందంలోని నిబంధనలను అమలు చెయ్యడంలో అది ఇబ్బందులు ఎదుర్కొంది. అఫిలియేషన్స్ కమిటీతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకొని, పనిచేసి 2017 నాటికి తిరిగి గాడిలో పడింది. అయితే, మళ్ళీ 2017, 2019 మధ్య కాలంలో లాభాపేక్ష లేని సంస్థగా పని చేసేందుకు చాప్టరు ప్రభుత్వం నుండి లైసెన్సు తెచ్చుకోలేక పోయింది. ఫౌండేషన్ నుండి నిధులు పొందేందుకు వీలుగా దానికి చట్టబద్ధమైన ధార్మిక సంస్థగా కూడా రిజిస్ట్రేషను లేదిప్పుడు. ఈ లైసెన్సు, రిజిస్ట్రేషను రెండూ పొందగలిగేవే నని ఫౌండేషన్, అఫిలియేషన్స్ కమిటీ రెండూ భావిస్తున్నాయి. గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలను చాప్టరు తీసుకుంటుందని కూడా అవి భావిస్తున్నాయి.

మా ప్రపంచవ్యాప్త ఉద్యమంలో తమదైన ముద్ర వేస్తూ, గొప్ప నాయకత్వాన్ని అందిస్తున్న భారత సముదాయం పట్ల మాకు కృతజ్ఞతా భావం ఉంది. ప్రస్తుతం 8 భారతీయ భాషల్లోని సముదాయాలకు ఫౌండేషన్ మద్దతు నిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో కొత్తగా మరో రెంటిని అఫిలియేషన్స్ కమిటీ ప్రకటించబోతోంది. భారత్ పాఠకుల నుండి నెలకు మాకు 70 కోట్ల పైచిలుకు పేజీవ్యూలు వస్తాయి. భారత సముదాయం అభివృద్ధి చెందడం వికీపీడియా భవిష్యత్తుకు, వికీమీడియా ప్రాజెక్టుల భవిష్యత్తుకూ చాలా ప్రధానం.

వికీపీడియా ఉద్యమానికి భారత గణతంత్ర రాజ్యం ఎంతో ముఖ్యమైనది. భారత్‌లో స్వచ్ఛందంగా పని చేస్తున్న ఎడిటర్లు, సమర్పకులు, పాఠకులు, దాతల పట్ల మా నిబద్ధత కొనసాగుతూనే ఉంటుంది. వికీమీడియా ప్రాజెక్టులు, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో మీరు చేస్తున్న కృషి పట్ల మేము కృతజ్ఞులమై ఉంటాం. మీతో కలిసి చేసే కృషిని కొనసాగించేందుకు మేం ఎదురు చూస్తున్నాం.

వికీమీడియా ఫౌండేషన్ తరఫున,

వాలెరీ డి కోస్టా
ఛీఫ్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్
వికీమీడియా ఫౌండేషన్

కొన్ని జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి చర్చా వేదికలు

[మార్చు]

తోటి తెలుగు వికీపీడియన్లతో నేను కొన్ని మెయిలింగు లిస్టుల వివరాలు పంచుకోవాలనుకుంటున్నాను.

ఎందుకంటే..

ఈ కింద ఇస్తున్న జాబితాలోని వివిధ మెయిలింగ్ లిస్టుల్లో చేరడం వికీపీడియన్లుగా మనకు రకరకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు:

  • తెలుగు వికీపీడియన్లు చేస్తున్న పనిని పలువురు వికీమీడియన్ సోదరులతో పంచుకోవడానికి
  • ప్రపంచవ్యాప్తంగానో, జాతీయ స్థాయిలోనో వివిధ వికీమీడియా ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనిని కానీ తెలుసుకోవడానికి
  • వివిధ స్థాయిల్లో జరుగుతున్న నిర్ణయాలను సమీక్షించడానికి
  • పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలు, కాన్ఫరెన్సుల వివరాలు తెలుసుకోవడానికి
  • ...ఇంకా మరెన్నో విధాలుగా వివిధ అంతర్జాతీయ వికీమీడియా ఫోరంలలో గొంతులు వినడానికి, మీ వాణి వినిపించడానికి
మెయిలింగు లిస్టులు అంటే

మీలో చాలామందికి మెయిలింగు లిస్టుల గురించి వ్యక్తిగతంగానూ, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానూ తెలిసివుండొచ్చు. అయితే తెలియని వారి కోసం వివరిస్తున్నాను. తెలిసినవారు ఈ భాగం వదిలి ముందుకు వెళ్ళండి.

మెయిలింగ్ లిస్టు కొన్ని మెయిలైడీల సంకలనంగా ఉంటుంది. అది థీమ్ ప్రకారం కానీ (ఉదాహరణకు వికీడేటాలో భారతదేశానికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఉన్నవారు), ప్రాజెక్టు ప్రకారం కానీ (తెలుగు వికీపీడియా గురించి చర్చించేందుకు ఒక మెయిలైడీ ఉంది), ప్రాంతం ఆధారంగా కానీ (బెంగళూరు వికీపీడియన్లు), జాతీయ స్థాయిలో కానీ (వికీమీడియా ఇండియా) ఉండొచ్చు. మెయిలింగ్ లిస్టు ఓపెన్ అయితే ఆ థీమ్ పట్ల ఆసక్తి ఉన్నవారంతా చేరవచ్చు, అలానే ఆర్కైవ్స్ పేజీలో గతంలో జరిగిన చర్చలను చదువుకోవచ్చు. ఐతే మెయిల్ రాసేప్పుడు ఆ థీమ్ కి సరిపోతోందా? లేదా? చదివే వారు ఎవరు లాంటి ప్రశ్నలు వేసుకుని రాయండి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురించి బెంగళూరు మెయిలింగ్ లిస్టులో రాస్తే ప్రయోజనం లేకపోగా ఆ మెయిలింగ్ లిస్టును స్పామ్ చేసినట్టు అవుతుంది.

ఈ మెయిలింగ్ లిస్టులు చూడండి

ఈ కింద ఇస్తున్న లింకులోనే వాటిలో చేరడానికి (subscribe) వీలు, గత చర్చలు చదవడానికి (Visit the Archives) లింకులు ఉంటాయి. ఈ కింద ఇచ్చినవి కేవలం ఉదాహరణ ప్రాయమే. ఇంకా మరెన్నో ఉన్నాయి లిస్టులు.

  • వికీమీడియా ఇండియా-l లేక wikimediaindia-l: ఇది భారతదేశ వికీమీడియా సముదాయపు మెయిలింగ్ లిస్టు. ఈ లిస్టులో భారతదేశ స్థాయిలో వికీమీడియా ప్రాజెక్టుల గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి.
  • అనలిటిక్స్ లిస్టు: వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల మీద విశ్లేషణలు జరుగుతూనే ఉంటాయి. అంకెలు, శాతాలు తయారవుతూనే ఉంటాయి. అంకెలను, శాతాలను నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగించుకోవడం ఒక మంచి పద్ధతి. పరిశోధనకు ఇవి తప్పనిసరి. అలాంటి అనలిటిక్స్ ఫలితాలు ఇక్కడ పంచుకుంటారు, చర్చిస్తారు.
  • బెస్ట్-ప్రాక్టీసుల లిస్టు: వికీమీడియా ప్రపంచంలో ఉత్తమ పద్ధతుల గురించి చర్చించడం, వాటిని పంచుకోవడం ఈ లిస్టు ముఖ్యోద్దేశాలు.
  • ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లిస్టు: కృత్రిమ మేధస్సు లేక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లిస్టులో వికీమీడియా ప్రాజెక్టులో ఉపయోగించే, వీటి ద్వారా మెరుగుపరిచే ఏఐ గురించి చర్చించి, పంచుకుంటారు.

తెలుగు వారికి సంబంధించినవి:

  • wikite-l లేక తెలుగు వికీపీడియా లిస్టు: తెలుగు వికీపీడియా (మరియు ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల) గురించిన చర్చలకై ఉద్దేశించిన మెయిలింగు లిస్టు ఇది.
  • wikimedia-in-hyd లేక హైదరాబాద్ లిస్టు: హైదరాబాదులోని, హైదరాబాదుకు చెందిన వికీమీడియా సముదాయానికి చెందిన మెయిలింగు లిస్టు ఇది.
  • wikimedia-in-blr లేక బెంగళూరు లిస్టు: బెంగళూరులోని, బెంగళూరుకు చెందిన వికీమీడియా సముదాయానికి చెందిన మెయిలింగు లిస్టు ఇది.
మరిన్ని మెయిలింగ్ లిస్టులు
  • ఇక్కడ చూస్తే మరిన్ని లిస్టులు, వాటి వివరాలు కనిపిస్తాయి.

మీకు ఆసక్తి ఉన్న మెయిలింగ్ లిస్టులో చేరడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అలానే @Chaduvari: గారు నన్ను ఇలాంటి జాబితా కావాలని కోరారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:02, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Editing News #1—July 2019

[మార్చు]

18:32, 23 జూలై 2019 (UTC)

అసలు ఏంటీ వికీమీడియా ఇండియా

[మార్చు]

పైనున్న భారత దేశంలో సముదాయాలకు మద్దతు అనే విభాగం గమనించండి. వికీమీడియా ఫౌండేషనుకు భారతదేశంలో అధికారికంగా వికీమీడియా ఇండియా అనే ఒక అనుబంధ చాప్టరు ఉంది అని తెలుస్తోంది. అది ఫౌండేషను విధానాలకు అనుగుణంగా పని చేయనందున ప్రస్తుతం దాని గుర్తింపును రద్దు చేస్తున్నారు. పై నోటీసును అనువదిస్తూంటే నాక్కొన్ని సందేహాలొచ్చాయి. ఫౌండేషను ఇచ్చిన నోటీసుకు చాప్టరు ఇచ్చిన బహిరంగ సమాధానం కూడా ఈ లింకులో చూసాను. ఇవి చూసాక, బయటికి కనబడేదాని కంటే మించి వెనక కొంచెమేదో ఉందని నాకు అనిపించింది. నేను గమనించినవి:

  1. వికీమీడియా ఇండియా చాప్టరు పనులేంటో తెలవదు గానీ, దానివలన తెలుగు వికీకి ఒరిగిందేమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే - తప్పు కావచ్చు. అసలు భారతీయ వికీలకు అది ఏ విధంగానైనా ఉపయోగపడిందో లేదో తెలవదు.
  2. చాప్టరు, ప్రభుత్వం నుండి లైసెన్సు తెచ్చుకోలేక పోయింది. అది ఫౌండేషనుకు నచ్చలేదు. అంచేత చాప్టరు హోదాను యూజరు గ్రూపు హోదాకు తగ్గించాలని నిర్ణయించారు. తన విధానాలకు అనుగుణంగా పని చెయ్యని చాప్టరును వదిలించుకోవాలని ఫౌండేషను అనుకోవడంలో తప్పేమీ లేదు. అయితే..
  3. చాప్టరు దీన్ని వ్యతిరేకిస్తూ పైన చూపిన లింకులో కొంత వివరణ ఇచ్చింది. దాని ప్రకారం సి.ఐ.ఎస్ ఎ.2.కె అనే సంస్థతో చాప్టరుకు పొరపొచ్చాలున్నాయి. అసలు ఈ సి.ఐ.ఎస్ సంస్థ వీళ్ళ మధ్యలోకి ఎందుకొచ్చిందో, దాని ధ్యేయాలేంటో స్పష్టంగా తెలవదు గానీ, వీళ్ళు చేస్తున్న కొన్ని పనుల గురించి మాత్రం మనకు తెలుసు. కొంతవరకూ ఈ పనులు తెవికీని ప్రభావితం చేస్తున్నాయి -ముఖ్యంగా పవన్ సంతోష్ గారి వలన. ఫౌండేషను, చాప్టరుకూ మధ్య ఉన్న భేదభావాలకు ఒక కారణం సి.ఐ.ఎస్ కావచ్చేమో తెలవదు.
  4. పై లింకులో చాప్టరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఫౌండేషనుకు చాప్టరు ఇంటెగ్రిటీ పైనే సందేహం ఉందేమోననిపిస్తోంది. చాప్టరు సభ్యత్వంలో విస్తృతి లేదని వారు భావించినట్లున్నారు. "The chapter lacks broad and diverse membership.." అని ఫౌండేషను అందంట. సంస్థ బెస్ట్ ప్రాక్టీసులను అవలంబించాలని కూడా చెప్పిందంట. ఎందుకు ఆ అభిప్రాయాలకు వచ్చిందో తెలియదు.
  5. అలాగే డబ్బుల్లేకుండా పనులేం జరుగుతాయని చాప్టరు పదేపదే అనడం ఆ లింకులో కనిపిస్తోంది. ఇన్‌కం టాక్సు నోటీసు కారణంగా ఫౌండేషనుకు వార్షిక నివేదిక ఇవ్వడం ఆలస్యమైందని చాప్టరు రాస్తూ, నిధులిచ్చేదేమీ లేకపోగా రిపోర్టులు మాత్రం అడుగుతున్నారంటూ affcom ను నీరసంగా నిరసించింది కూడా.

ఇదంతా చూస్తూంటే - బయటిక్కనబడే దాని కంటే కనబడనిది ఇంకా ఏమైనా వీళ్ళ మధ్య ఉందేమో ననిపిస్తోంది! ఫౌండేషను, చాప్టరు రెండూ కూడా మరిన్ని వివరాలను చెప్పాల్సి ఉందేమో..!? ఫౌండేషను మరింత పారదర్శకంగా ఉండాలేమో (ముఖ్యంగా మూడు, నాలుగు పాయింట్లలో చూపిన విషయాల పట్ల)..!? వాడుకరు లేమంటారో చూడాలి.__చదువరి (చర్చరచనలు) 05:47, 27 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దీన్ని గురించి మొదటి సారిగా అర్జునరావు గారి ద్వారా విన్నాను. సభ్యుల మధ్య ఏదో బేధాభిప్రాయాల గురించి కూడా ఆయన నాకు చెప్పారు. అంతకంటే నాకు ఎక్కువ వివరాలు తెలియవు. కానీ చాప్టరు కంటే వికీమీడియా ఫౌండేషన్ వారు సి. ఐ. ఎస్ ను నమ్మడం ఎందుకంటే ఆ సంస్థ ఎప్పటి నుంచో ఇంటర్నెట్ ను సామాన్య జనులకు చేర్చే ప్రయత్నాలు వికీమీడియాను ఆకర్షించి ఉండవచ్చు. అలాగే ప్రభుత్వ గుర్తింపు, వారు చేస్తున్న కార్యక్రమాల విస్తృతి, జమా ఖర్చుల నిర్వహణలో వాళ్ళు పాటించే ప్రమాణాలు కూడా కారణం కావచ్చు. ఏ సంస్థ విశ్వసనీయత సమకూరాలంటే వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నా దాన్ని సరైన విధానంలో ప్రెజెంట్ చేసే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వికీమీడియా అధ్యాయం కొత్తది కావున తనను తాను సరైన విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో విఫలమైంది అనుకోవచ్చు. రవిచంద్ర (చర్చ) 13:33, 31 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి, @రవిచంద్ర వికీమీడియా భారతదేశం సహవ్యవస్థాపకునిగా మరియు మొదటి అధ్యక్షునిగా అక్టోబరు 2012 వరకు సేవ చేశాను. ఆ తరువాత నేను అంతగా చాప్టర్ పనులలో పాలుపంచుకోలేదు. అప్పట్లో సిఐఎస్ కూడా సమాంతరంగా వికీపీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నందున, వికీమీడియా ఇండియా చాప్టర్ కు FCRA permission వచ్చే దాకా పెద్దగా పని చేయలేకపోయింది. చాప్టర్ బలం పుంజుకుంటే సిఐఎస్ కార్యక్రమాలు ఆగుతాయి అనుకున్నాము. కాని చాప్టర్ కు వచ్చిన FCRA permission,పొడిగించడంలో ఇబ్బందులు ఏర్పడినందున చాప్టర్ గుర్తింపు రద్దవుతున్నట్లుగా తెలిసింది. ఇటీవలి సైన్ పోస్ట్ లో Derecognition of Wikimedia India అనే విభాగంలో మరిన్ని వివరాలు చూడవచ్చు. -- అర్జున (చర్చ) 11:11, 2 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ అంశాన్ని చర్చకు పెట్టినందుకు ధన్యవాదాలు చదువరి గారూ. ఇది తెలుగు వికీపీడియన్లు చర్చించదగ్గ అంశమని నేను భావిస్తున్నాను. గత ఐదారు సంవత్సరాలుగా తెలుగు వికీపీడియా వాలంటీరుగానూ, నాలుగేళ్ళుగా సీఐఎస్‌-ఎ2కె ఉద్యోగిగానూ పనిచేస్తూ ఉన్నాను. ఐతే ఈ సమాధానం పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో కేవలం తెలుగు వికీపీడియన్‌గా చెప్తున్నాననీ, ఈ సమాధానంలో నా వ్యక్తిగత అభిప్రాయాలు సీఐఎస్‌-ఎ2కె వారి అధికారిక నిలువు (స్టాండ్‌)కు సంబంధం లేకపోవడమే కాక ఒక్కోచోట పూర్తి భిన్నంగా ఉన్నాయని ముందుగా స్పష్టం చేస్తున్నాను. అంతేకాక నేను సీఐఎస్-ఎ2కెకి ఇటీవలే రాజీనామా చేసి సంస్థ బయటకు వచ్చి, ఇప్పుడే ఆ సంగతి తెలుగు వికీపీడియా రచ్చబండలోనూ ప్రకటించాను.
వికీమీడియా ఇండియా చాప్టర్ చరిత్ర మొత్తాన్ని సంగ్రహంగా రాయగలిగిన సామర్థ్యం, అనుభవం నాకు ఉందని నేను భావించట్లేదు. ఐతే, ఒక భారతీయ వికీపీడియన్‌గా ఈ చాప్టర్ పనితీరు, పద్ధతులు, ఇది భారతీయ సముదాయంపై మొత్తంగా, తెలుగు సముదాయంపై ప్రత్యేకంగా చూపిన ప్రభావాన్ని గురించి నేను వ్యక్తిగత స్థాయిలో వేసుకున్న అంచనా మీతో పంచుకోదలుచుకున్నాను.
  • ఈ వికీమీడియా ఇండియా చాప్టర్ అనేది వికీమీడియా ఫౌండేషన్‌కు అనుబంధమైన స్ట్రక్చర్లలో భారత స్థాయి స్ట్రక్చర్. దీని ఎగ్జిక్యూటివ్ కమిటీలో భారతదేశ స్థాయిలో పలు సముదాయ సభ్యులు పాలుపంచుకుంటారని సాధారణంగా ఎవరైనా ఆశిస్తారు. ఐతే, ఇటీవలి కొన్ని సంవత్సరాలుగా తెలుగు వికీమీడియా సముదాయం నుంచి కానీ, తమిళ వికీమీడియా సముదాయం నుంచి కానీ, ఇతర భారతీయ భాషల వికీమీడియా సముదాయాల నుంచి కానీ చాలా చాలా తక్కువ, మనలాంటి సముదాయాల విషయంలో చూస్తే అసలు లేని, పరిస్థితి కనిపిస్తోంది. నాకు తెలిసినంతవరకూ ఓ మూడేళ్ళ క్రితం మన కశ్యప్ గారు దీనికి పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పుడో 2011 నాడు దీని సంస్థాపక అధ్యక్షులుగా అర్జున రావు గారు వ్యవహరించారు. ఆపైన మనకేమీ ప్రాతినిధ్యం లేదు. వాళ్ళ గత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల జాబితా చూడండి. ఇందులో అర్జున రావు గారు తప్పిస్తే మరెవరూ తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోగలవారు లేరు. (మరో ఇద్దరు సభ్యులు తెలుగు మాతృభాషగా కలిగినవారు, తమను తాము తెవికీపీడియన్లుగా చెప్పుకోదగ్గ కృషిచేసినవారు కాదు.) మనకే కాదు, సభ్యులు జాగ్రత్తగా గమనిస్తే తమిళ, హిందీ, గుజరాతీ, పంజాబీ వంటి ఇతర భారతీయ భాషల వికీపీడియన్ల ప్రాతినిధ్యం కూడా ఇంతకన్నా మెరుగేమీ కాదు. ఇంతగా ప్రాతినిధ్యం లేమి పెట్టుకుని జాతీయ చాప్టర్‌గా ఎలా చెప్పుకుంటారో అర్థం కాదు.
  • దీనిలో ఎవరున్నారన్నది చూస్తే, చాలామంది వికీపీడియాలో కానీ, వికీపీడియాల కోసం కానీ, వికీపీడియాల ద్వారా కానీ పనిచేయకుండా వికీపీడియన్లమని చెప్పుకునే వ్యక్తులు దీని ఎగ్జిక్యూటివ్ కమిటీలో అత్యధికులుగా ఉన్నారు. ఉదాహరణకు ఈ చాప్టర్‌కు దాదాపు రెండేళ్ళకు పైగా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న రాహుల్ దేశ్‌ముఖ్‌ తన హోం వికీపీడియా అయిన మరాఠీలో ఓ రెండేళ్ళుగా చేసిన ఎడిట్లు 50లోపు. కార్యదర్శి యోహాన్ థామస్ ఆంగ్ల వికీపీడియా కంట్రిబ్యూటర్‌గా చెప్పుకుంటూంటాడు. ఆయనకు గత 11 సంవత్సరాల్లో ఆంగ్ల వికీపీడియాలో చేసిన అన్ని దిద్దుబాట్లూ 600 లోపు. సంతోష్ శింగారె అనే మరో సభ్యుడికి మొత్తంగా మరాఠీ వికీపీడియాలో 11 వందల ఎడిట్లు, వికీడేటాలోనూ, కామన్సులోనూ చెరో వెయ్యి ఎడిట్లు ఉన్నాయి. 2011లో తొలిసారి అక్కౌంట్ సృష్టించుకున్నాకా ఈ ఎనిమిదేళ్ళలో చేసిన మార్పుచేర్పులివి. సంకేత్ ఓస్వాల్ అనే మరో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడి ఎడిట్ల వివరాలు చూస్తే తనను తాను ఆంగ్ల వికీపీడియన్‌గా చెప్పుకునే ఇతను 18 ప్రాజెక్టుల్లో కలిపి 2013 నుంచి ఓ మూడువేల ఎడిట్లు చేసివుంటాడు. ఇందులో కామన్సు ఎక్కింపులు ఎక్కువ, వాటిలో తొలగింపు శాతాలు మరీ ఎక్కువ. సుధన్వా జోగులేకర్ అనే ఒకాయన 2012-13లో చాప్టర్ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన ఎడిట్లు 2011 నుంచి అన్ని ప్రాజెక్టులూ కలుపుకుని 143. 2015 నుంచి ఏ ప్రాజెక్టులోనూ ఒక్క ఎడిట్ కూడా లేదు, కానీ ఇప్పటికీ భారతీయ వికీపీడియన్‌ని అంటూ ప్రశ్నిస్తూ ఉండడం విశేషం. కేవలం ఎడిట్ కౌంట్ మట్టుకే చూస్తే ఇలా ఉంది. కొద్దిపాటి నాణ్యతా ప్రమాణాలు చూసినా వికీమీడియా ప్రాజెక్టులపై గట్టి అవగాహన ఉన్నవారు వీరిలో అరుదని తేలుతుంది. మొత్తంగా ఈ గుంపులో నిజంగా వికీమీడియా సముదాయానికి చెందినవారు చాలా చాలా మైనారిటీ. మొత్తంగా చూస్తే 2011-2012లో మాత్రమే వికీమీడియా ప్రాజెక్టులపై గట్టి కృషిచేసిన, చేస్తున్నవారు మెజారిటీతో బోర్డు ఏర్పడిందని తెలుస్తూంది. 2014 నుంచి ఇప్పటివరకూ వికీమీడియా ప్రాజెక్టుల్లో గట్టి కృషిచేసినవారు మెజారిటీతో ఉన్న బోర్డు లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.
  • అతికొద్ది కాలం వీళ్ళకు ఫైనాన్షియల్ కంప్లయన్స్ ఉన్నప్పుడు డబ్బు వచ్చింది. అర్జునరావు గారు ఉన్న కొద్ది కాలం పక్కన పెడితే దేశ స్థాయిలో కానీ, కనీసం కొన్ని సముదాయాల స్థాయిలో కానీ వారి వనరులు వినియోగించి, ఉద్యమానికి మేలు చేద్దామన్న ప్రయత్నాలు ఆపైన ఎప్పుడూ జరగలేదు. దీనికి ప్రధాన కారణం, నా అభిప్రాయంలో, ఎవరైనా ఈ చాప్టర్‌లో భాగం కావచ్చుననీ, ఆ భాగమైనవారంతా ఓట్లు వేయచ్చనీ ఉన్న లూప్‌హోల్ వినియోగించుకుని పాత బీసీసీఐ తరహాలో ఉద్యమంలో భాగం కాని వారు వచ్చిదీన్ని ఆక్రమించడం.
  • బాధ్యతాయుతంగా వ్యవహరించడం, సముదాయానికి బాధ్యులుగా ఉండడం వంటివి ఇటీవలి బోర్డులో కనిపించలేదు. గత ఏడాది సీఐఎస్‌-ఎ2కె నుంచి ప్రత్యేక స్కాలర్‌షిప్ తీసుకుని వికీమీడియా ఇండియా అధ్యక్షుడు రాహుల్ దేశ్‌ముఖ్ వికీమానియాకు వెళ్ళాడు. అప్పటికే బోర్డు సభ్యుల్లో ఇద్దరికి వికీమేనియాకు స్కాలర్‌షిప్ ప్రాసెస్ ద్వారానే లభించివుండడంతో వారు ప్రాతినిధ్యం వహించేకాడికి ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం ఏమి వచ్చిందని భారతీయ సముదాయ సభ్యులు చర్చించడం ప్రారంభించాకా దాదాపు ఏడాది కావస్తున్నా, పలువురు గౌరవనీయులైన వికీమీడియన్లు అడుగుతున్నా ఇప్పటికీ తనవైపు నుంచి సమాధానం కూడా చెప్పలేదంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బోర్డును డీ-రికగ్నైజ్ చేస్తున్నారన్న సంగతి వికీమీడియా ఇండియా సముదాయ సభ్యులకు చెప్పమని ఆఫ్‌కాం (వికీమీడియా ఫౌండేషన్ అఫ్లియేషన్స్ కమిటీ) కోరినా చెప్పలేదు. భారతీయ వికీమీడయన్లకు తెలియపరిచే బాధ్యత విస్మరించి, నేరుగా ప్రధాన వికీమీడియా మెయిలింగ్ లిస్టులో వివాదం పెట్టుకున్నాకా మనకు వికీమీడియా ఫౌండేషన్ వారే తెలియపరిచారు. కొందరు భారతీయ వికీపీడియన్లు దీన్ని వార్తల్లో చదవవలిసి రావడం విస్మయకరం. అంటే ఇంత ముఖ్యమైన సంగతి మనకు చెప్పడం మాని ఎక్కడో వికీమీడియా-l మెయిలింగు లిస్టుల్లోనూ, పత్రికల్లోనూ కూడా ప్రకటిస్తారన్నమాట. వికీమీడియా ఇండియా వారు మనల్ని ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకుంటూ మనకే సంగతి సందర్భాలు తెలియపరచరని నాకు అర్థమైంది.
కాబట్టి కేవలం ఎఫ్‌సీఆర్‌ఎ (విదేశీ నిధులు తెచ్చుకోగల సమర్థత) హోదా ఉండడం, ఉండకపోవడం మాత్రం ఈ డీ-రికగ్నిషన్‌కి ఏకైక కారణం కాదని, అంతకుమించిన సమస్యలు ఉన్నాయని నా అంచనా. వికీమీడియా ఇండియా లాంటి ఒక స్ట్రక్చర్ ఇలాంటి వ్యక్తుల చేతిలో ఉండడం, అది కూడా ఒక నాడో రెన్నాళ్ళో కాక ఏళ్ళ తరబడి అలాంటివారి చేతిలోంచి భారతీయ వికీమీడియా సముదాయం స్వాధీనపరుచుకోలేకపోవడం గమనిస్తే దీని డీ-రికగ్నైజేషన్ అన్నివిధాలా సరైనదేనని, భారతీయ వికీమీడియా సముదాయానికి మొత్తంగా మేలుచేసేదేనని నా వ్యక్తిగత అభిప్రాయం.
సీఐఎస్‌-ఎ2కె వారి అధికారిక స్పందన ఇదైతే కాదనీ, సంస్థాగతంగా సీఐఎస్‌-ఎ2కె వికీమీడియా ఇండియాపై ఆరోపణలు చేయడం కానీ, ఆ చాప్టర్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాయడం కానీ చేయదని నాకున్న అనుభవంతో చెప్పగలను. అలానే ఆ రెండు సంస్థల మధ్య ఉన్న వివాదం గురించి నేను ఒక సంస్థలో పనిచేసివుండడంతో, ఆ సంస్థకు పై విధమైన విధానం ఉండడం వల్ల వ్యక్తిగతంగానైనా ఆ సంగతి మాట్లాడడం సబబు కాదనే అనుకుంటున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 17:26, 4 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారి స్పందనకు ధన్యవాదాలు. సిఐఎస్ వికీమీడియా చాప్టర్ వ్యవస్థాపకానికి,స్థానిక వికీమీడియ సముదాయాలకు ఎంతో తోడ్పాటు నిచ్చింది. అయితే ఆ తరువాత పరిస్థితుల దృష్ట్యా ప్రత్యర్ధిగా మారిందన్నది నా అభిప్రాయం. వికీమీడియా చాప్టర్ రాజ్యంగం లో కొన్ని లొసుగులున్నవని అ తరువాత అనుభవాల వలన తెలిసింది. పవన్ పై చర్చలో ప్రధానంగా చేసిన విమర్శ వికీమీడియా కార్యవర్గంలో పనిచేసినవారికి వికీపీడియాలో కృషి పెద్దగా లేదు. కాని వికీమీడియా అనే స్వచ్ఛంద సేవాసంస్థని నడపడానికి, కేవలం వికీపీడియా ప్రాజెక్టులో కృషి ఒక్కటే సరిపోదు. అయితే వికీమీడియా చాప్టర్ బలహీనతలను దిద్దుకునే అవకాశాలు వికీమీడియా ఫౌండేషన్ స్వంత కార్యాలయం, ఇతర పరిస్థితులు (కేంద్రం స్వచ్ఛంద సంస్థలపై ప్రతిబంధకాలు), సిఐఎస్-ఎ2కె కార్యకలాపాల వలన తగ్గిపోయాయని నా అభిప్రాయం. వికీమీడియా చాప్టర్ కేవలం స్వచ్ఛంద కార్యకర్తలు సభ్యులుగా వికీమీడియా ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థకాగా, సిఐఎస్-ఎ2కె ఏడాదికి కోట్ల రూపాయల బడ్జెట్ తో (CIS-A2K 2018-2019 బడ్జెట్) వికీమీడియా ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి పూర్తి స్థాయి ఉద్యోగులతో ఆరేళ్లకు పైగా పనిచేసింది, ఇంకా పనిచేస్తున్నది. అందువలన వికీమీడియా చాప్టర్ తో పోల్చి చూడడం సరికాదు. అయినా వికీమీడియా ఇండియా నేనున్నప్పుడు, నాకు తెలిసినంత మేరకు వికీమీడియా కు అధికారిక సంస్థలాగా చాలా ప్రచారోద్యమాలు, వికీపీడియన్లకు గుర్తింపులు, 2011 లో భారతదేశ వికీమహాసభ, సిఐఎస్-ఎ2కె తో కలసి 2014, 2015లలో తెవికీ దశాబ్ది మరియు 11వ సంవత్సరపు ఉత్సవాలు చేపట్టింది. కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడానికి తగిన వీలు కల్పించింది.
ఈ సందర్భంలో సిఐఎస్-ఎ2కె కృషి తెలుగు వికీప్రాజెక్టులపై ఏమి ప్రభావం చూపింది అన్నది కూడా చర్చించితే మంచిది. నేను ఇటీవల తెలిపినట్లు తెలుగు వికీపీడియా క్రియాశీలక సభ్యుల సంఖ్య దాదాపు 13 ఏళ్ల క్రిందటి స్థాయికి చేరింది. ముఖ్యంగా సిఐఎస్-ఎ2కె నుండి తెవికీకోసం పనిచేసి, ఇంకా క్రియాశీలకంగా వున్న పవన్ సంతోష్, రహ్మానుద్దీన్ ఈ దిశగా వ్యక్తిగతస్థాయిలోనైనా తమతమ సిఐఎస్-ఎ2కె కృషిపై పూర్తి సమీక్ష సముదాయానికి తెలియపరిస్తే ముందు ముందు ఉపయోగంగా వుంటుంది. అర్జున (చర్చ) 03:54, 5 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, చర్చలో నేను సీఐఎస్‌-ఎ2కె కృషినీ, వికీమీడియా ఇండియా కృషినీ ఏమాత్రం పోల్చలేదు, పోల్చబోవట్లేదు. కాబట్టి ఆమేరకు సీఐఎస్-ఎ2కె సంగతి కొద్దిసేపు అటుంచుదాం. (నేను ఎ2కె భారతీయ భాషల వికీపీడియాలపై, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై నెరపిన అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి విడిగా మాట్లాడతాను, ఎందుకంటే ఈ సందర్భంలో మాట్లాడడం వల్ల మళ్ళీ చాప్టర్‌ని, సీఐఎస్‌తో పోల్చినట్టవుతుంది.) నా విమర్శ మూడు విధాలైనవి:
      • ఈ సంస్థ కార్యవర్గంలో కానీ, కార్యకలాపాల్లో కానీ భారతీయ వికీమీడియా ప్రాజెక్టులకు కనీస ప్రాతినిధ్యం లేకపోవడం. ఉదాహరణకు తెలుగు వికీపీడియాలో మీరు తప్ప వేరెవరూ ఈడీలో ఎన్నికైనవారు కానీ, కో-ఆప్ట్ అయినవారు కానీ లేరు. ఇదే పరిస్థితి చాలా భారతీయ వికీపీడియాలదీను. ఎవరైనా పైన ఇచ్చిన లింకు చూసి తెలుసుకోవచ్చు.
      • వికీమీడియా గవర్నెన్స్‌లో వికీమీడియన్లు మాత్రమే ఉండాలని కాదు నా ఉద్దేశం. వికీమీడియన్లు నామమాత్రం ఐపోవడం, అధ్యక్ష పదవి ఏళ్ళ తరబడి వికీపీడియాపై కనీసమాత్రపు అనుభవం లేని వారిచేతిలో ఉండడం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ బోర్డుల్లో కనీసం సగం మందైనా వికీపీడియాలో అనుభవజ్ఞులైన వారు, వ్యక్తిగతంగా నిర్వహణా వ్యవహారాలపై అనుభవం ఉన్నవారు ఉంటూంటారు. భారతీయ వికీపీడియన్లలో నిర్వహణా సామర్థ్యం కొరవడలేదు. కానీ వారు ఇందులో పాల్గొనకపోవడానికి కారణం సిండికేట్ తరహా రాజకీయాలు 2014 నుంచి వికీమీడియా ఇండియాలో రాజ్యమేలడం మాత్రమే. మీరు విభేదించవచ్చు కానీ యూజర్ గ్రూపులు, చాప్టర్ బోర్డుల్లో మెజారిటీ అవి వేటికి ప్రాతినిధ్యం వహిస్తాయో ఆయా వికీమీడియా ప్రాజెక్టులపై గట్టి అవగాహన, కృషి ఉన్నవారు ఉండాలన్నది నా స్థిరాభిప్రాయం. అలా లేకపోతే ఏమవుతుందన్నది ఉదాహరణల సహితంగా అనేకం చెప్పగలను. కానీ ప్రస్తుతానికి అంత విస్తరించదలుచుకోలేదు.
      • జవాబుదారీతనం లేకపోవడం. సముదాయం ప్రశ్నించినప్పుడు కానీ, తమ సంస్థ డీ-రికగ్నేషన్ అయినప్పుడు కానీ సముదాయానికి కనీసం సమాచారం ఇవ్వడమనే మౌలిక బాధ్యత విస్మరించడం సహించగలిగేది కాదు.
మొత్తంగా చెప్పాలంటే 1. వికీమీడియా ఇండియా చాప్టర్ రాజ్యాంగంలోని లొసుగులను అడ్డంపెట్టుకుని, వికీపీడియాలో పనిచేసిన అనుభవం లేని ఓ సముదాయంలోని కొందరు వ్యక్తులు ఎప్పటికప్పుడు దీని ఈసీకి ఎన్నికవుతూ 2. సిసలైన భారతీయ వికీమీడియన్లను దీని బాధ్యతలు తీసుకోనివ్వకుండా అదే రాజ్యాంగపు లొసుగులను వాడుకుని అడ్డుకుంటూ 3. తాము ఏ సముదాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నారో దానికి కనీసం సంగతి సందర్భాలు చెప్పకపోవడం. ఇవీ సమస్యలు. నేను మళ్ళీ చెప్పేదేమంటే ఈ సమస్యలన్నీ చాప్టర్ ప్రారంభమైన రెండు మూడేళ్ళకు మొదలై ఈనాడు తీవ్రతరమయ్యాయి.
భారతదేశంలోని వికీమీడియా యూజర్ గ్రూప్‌లు, వికీమీడియా సముదాయాలు ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో సంప్రదించుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేయడానికి ఒక ఎంటిటీ ఉండాలి. అది సీఐఎస్-ఎ2కె వంటి భాగస్వామి కాదు. భారతీయ వికీపీడియన్లు నిర్మించుకున్న ఓ వ్యవస్థ ఉండాలి. కానీ, అది వికీమీడియా ఇండియా చాప్టర్ లాగా మనకి ప్రాతినిధ్యం, మనకి బాధ్యత వహించకుండా ప్రతినిధులుగా చెప్పుకునేది కాదు. వేరేది. కాబట్టే ఈ వ్యవస్థ ఇక ముగియడం మేలని నేను భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:24, 5 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చ వలన నావరకు నాకైతే తెలియని విషయాలు తెలుస్తున్నాయి--యర్రా రామారావు (చర్చ) 05:39, 6 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేజీల నిర్వహణ సంవత్సరం వారీ గణాంకాలు

[మార్చు]

వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు#2019-07-30_న_వికీప్రాజెక్టు_పేజీల(వాటి_చర్చాపేజీలతోసహా)_సంవత్సరంవారీ_సవరణలు చూడండి. దాదాపు 14 ఏళ్ల తెవికీ చరిత్రను సులువుగా తెలుసుకోవచ్చు.అర్జున (చర్చ) 12:02, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు మరియు దాని ఉపపేజీలను చాలావరకు కాలపరిమితులు చేర్చుతూ సంస్కరించాను. మీ ప్రాజెక్టులు ఇంకా లింకు చేయనివి వుంటే ఈ పేజీలో లింకు చేర్చండి. అర్జున (చర్చ) 11:01, 2 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామవ్యాసాలలో సమాచారపెట్టె మరియు వ్యాసం మెరుగుకు పైలట్ ప్రాజెక్టు పై ప్రతిక్రియ అభ్యర్ధన

[మార్చు]

గ్రామ వ్యాసాలపై చాలమంది సభ్యులు, చాలా ఏళ్లుగా కృషి చేశారు. గత నాలుగేళ్లలో కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామాలకే అన్ని రకాల వాడుకరుల సవరణలు మొత్తము సవరణలలో సుమారు మూడవ వంతుగా వున్నాయి. 2018 డిసెంబరులో 0.81 శాతం వీక్షణలు మాత్రమే వున్నాయి (సవరణలు, వీక్షణల విశ్లేషణ). అయితే పొరబాటు వలనో ఇతరత్రా కారణాల వలన చాలా గ్రామ వ్యాసాలకు శుద్ధి అవసరమైన స్థితిలో వున్నాయి. వాటిని సవరించుటకు మరియు ముందు సంవత్సరాలలో వాటిలో గణాంకాల నిర్వహణకు వికీడేటా వాడుతూ కొత్త సమాచారపెట్టె నమూనాలు, వికీడేటాలో సవరణలు చేయుటకు ఉపకరణాలు గుర్తించి, ప్రకాశం జిల్లా పైలట్ ప్రాజెక్టులో వాడడమైనది. ఆ వ్యాసాలలో దోషాలు దిద్దుటకు మరియు ఇతర సలహాలు, సూచనలకు సోదర, సోదరీ సభ్యుల సహకారం కోరుతున్నాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్_గ్రామాలు/సమాచారపెట్టె_మెరుగు/వికీడేటా చూసి, ఇక్కడగాని లేక చర్చా పేజీలో (ప్రతిక్రియ_అభ్యర్ధన విభాగం, దానిలోని లింకులు చూసి) ప్రతిస్పందించండి. ధన్యవాదాలు.అర్జున (చర్చ) 12:16, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సమీక్ష పై స్పందన

[మార్చు]

పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. సమీక్ష చూడండి. మీ స్పందనలు ఇక్కడ గాని, ప్రాజెక్టు చర్చాపేజీలోగాని చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 16:02, 30 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]