Jump to content

సనాతన సారథి

వికీపీడియా నుండి
(సనాతన సారధి నుండి దారిమార్పు చెందింది)
మొదటి పత్రిక ముఖచిత్రం

సనాతన సారథి ఆధ్యాత్మిక మాస పత్రిక. దీనిని 1958లో శివరాత్రినాడు ఈ సంచికను సత్యసాయిబాబా ప్రారంభించారు.[1] మొదటి పత్రిక ఫిబ్రవరి 1958 లో విడుదలయింది. ఈ పత్రిక ప్రారంభించేనాటికి సాయిబాబా వయస్సు 32 సంవత్సరాలు. ప్రారంభోత్సవ సమయంలో కొన్ని కాపీలను ప్రచురించి అందరికీ ఉచితంగా ఇవ్వమని స్వామి తెలియజేసాడు.[2]

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే భావాలపై సమాచారం ఈ పత్రిక అందిస్తుంది.[3] సాయి ఆధ్యాత్మిక ప్రసంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి సాయి ఆశ్రమం ఈ మాసపత్రిక ప్రచురణ ప్రారంభించింది. ఈ మాస సంపుటి దేశ బాషలన్నింటితో పాటు ఆంగ్లం, సింధీ, నేపాలీ భాషల్లో కూడా ప్రచురించడం ప్రారంభించారు.

ఇది అనంతపురం జిల్లా, పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం నుండి ప్రచురించబడుతున్నది. బాబా గారి సందేశాలు (ప్రసంగాలు) తెలుగు సనాతన సారథిలో ఉంటాయి. ఇతర భాషలలో అనువాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కూడా సమాచారం తెలియజేస్తుంది. ప్రస్తుతం సనాతన సారథి సంపాదకులు వి.వేంకటేశ్వర్లు. ప్రారంభంలో ఈ పత్రిక నిర్వహణకు బాబా సమర్థుడైన వ్యక్తి ప్రొఫెసర్ నారాయణ కస్తూరిని నియమించాడు. నారాయణ కస్తూరి కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో సంబంధం కలిగి, ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాయి వ్యక్తిగతంగా బెంగళూరు వెళ్లి అవెన్యూ రోడ్‌లోని ‘విచారా దర్పాన్ ప్రెస్‌’ ని సందర్శించి తెలుగు, ఆంగ్ల అక్షరాల కేస్ లతో పాటు ఫుట్-ఆపరేటెడ్ ట్రెడిల్ ప్రింటింగ్ మెషీన్‌ను కొనుగోలు చేసాడు. 1950ల చివరలో ప్రశాంతి నిలయంలో తన నివాసం పక్కనే ‘శ్రీ సత్య సాయి ప్రెస్’ ఏర్పాటు చేసాడు. ముద్రణలో కస్తూరికి సహాయం చేయడానికి, ప్రెస్ లో పనిచేయడానికి వాలంటీర్లను కూడా బాబా నియమించాడు. ప్రచురించవలసిన సమాచారాన్ని సరిచేయడానికి, సూచించడానికి, ప్రేరేపించడానికి ప్రతిరోజూ ప్రెస్‌ను బాబా సందర్శించేవాడు. [2]

మూలాలు

[మార్చు]
  1. "నేడు సత్యసాయిబాబా జన్మదినం - Manaaksharam.com". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-30.
  2. 2.0 2.1 "Cover Story: Sanathana Sarathi…Recreating a 'Prasanthi' in Every Home - Feb 2007". media.radiosai.org. Retrieved 2020-06-30.
  3. "SANATHANA SARATHI". www.sathyasai.org. Archived from the original on 2020-09-28. Retrieved 2020-06-30.

బయటి లింకులు

[మార్చు]