గద్దె రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ | |
---|---|
జననం | గద్దె రాజేంద్ర ప్రసాద్ 1956 జూలై 19[1] |
వృత్తి | నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు |
పిల్లలు | 2, ఒక కుమార్తె గాయత్రి (మ.2024)[2], ఒక కుమారుడు |
తల్లిదండ్రులు |
|
రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ.[3] అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.
నటన
[మార్చు]ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు.[4] ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
మా అధ్యక్షుడు
[మార్చు]మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు 2015 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాడు. ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడగా తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడిన ఫలితాలు జయసుధ, మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి. జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రప్రసాద్ గెలుపు అనూహ్యంగా తోచింది. రాజేంద్రప్రసాద్ 83ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు.
పురస్కారాలు
[మార్చు]- ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం - 1991
- మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు - 1994
- ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు - 2004
- 2018: ఉత్తమ సహాయనటుడు (మహానటి)
- 2015: ఉత్తమ సహాయనటుడు (శ్రీమంతుడు)
- 2012: ఉత్తమ సహాయనటుడు (జులాయి)
సినీ జీవితం
[మార్చు]పాక్షిక చిత్రాల జాబితా
[మార్చు].కన్నయ్య కృష్ణయ్య
- జనక అయితే గనక (2024)
- లగ్గం (2024)
- ఆర్టిఐ (2024)
- ఉత్సవం (2024)
- కల్కి 2898 ఏ.డీ (2024)
- కృష్ణారామా (2023)
- జిలేబి (2023)
- అన్నీ మంచి శకునములే (2023)
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)
- శాసనసభ (2022)
- అనుకోని ప్రయాణం (2022)
- అఖిల్ (2022)
- మాచర్ల నియోజకవర్గం (2022)
- సూపర్ మచ్చి (2022)
- పెళ్లిసందD (2022)
- సేనాపతి (2021)
- చెక్ మేట్ (2021)
- గాలి సంపత్ (2021)
- కాలేజ్ కుమార్ (2020)
- మిస్ ఇండియా (2020)
- సోలో బ్రతుకే సో బెటర్ (2020)
- అల వైకుంఠపురంలో (2020)
- సరిలేరు నీకెవ్వరు! (2020)
- బుర్రకథ (2019)
- తోలుబొమ్మలాట (2019)
- కౌసల్య కృష్ణమూర్తి (2019)[5]
- కృష్ణార్జున యుద్ధం (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- బేవర్స్ (2018)
- శమంతకమణి (2017)
- అంధగాడు (2017)
- సుప్రీమ్ (2016)
- నాన్నకు ప్రేమతో (2016)
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[6]
- టాప్ ర్యాంకర్స్ (2015)[7]
- శ్రీమంతుడు (2015 సినిమా) (2015)
- దాగుడుమూత దండాకోర్ (2015)
- టామి (2015)
- వసుంధర నిలయం (2013)
- డ్రీం (2012)
- ఓనమాలు (2012)
- అయ్యారే (2012)
- నిప్పు (2012)
- జులాయి
- మొగుడు (సినిమా) (2011)
- భలే మొగుడు భలే పెళ్ళామ్ (2011)
- బావ (సినిమా) (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- పెళ్ళాం పిచ్చోడు (2005)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- శ్రీరామచంద్రులు (2003)
- ఎర్ర మందారం
- మాయలోడు
- లేడీస్ టైలర్
- ఆ ఒక్కటీ అడక్కు
- రాజేంద్రుడు గజేంద్రుడు
- చాలెంజ్
- ఆ నలుగురు
- ఇట్లు మీ శ్రేయోభిలాషి
- ఖుషీ ఖుషీగా
- హిట్లర్
- కొబ్బరి బోండాం
- సరదా సరాదాగా
- శ్రీరామ చంద్రులు
- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
- క్విక్ గన్ మురుగన్
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం
- అప్పుల అప్పారావు
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- ఏప్రిల్ 1 విడుదల
- గోల్మాల్ గోవిందం (1992)
- మాయలోడు
- అత్తింట్లో అద్దెమొగుడు
- ఆస్తులు అంతస్తులు
- వాలు జడ తోలు బెల్టు
- ముత్యమంత ముద్దు (1989)
- దొంగ కోళ్లు (1988)
- ఉదయం (1987)
- కాష్మోరా (1986)
- పేకాట పాపారావు
- భలే మొగుడు
- చెవిలో పువ్వు (1990)
- ప్రేమా జిందాబాద్
- నవయుగం
- తేనెటీగ (1991)
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|
2024 | హరికథ | రంగాచారి | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | [8] |
సంగీత దర్శకత్వం
[మార్చు]దర్శకత్వం
[మార్చు]నట జీవితం
[మార్చు](1977 - 1985)
[మార్చు]రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వం వహించిన స్నేహం (1977) సినిమా ద్వారా వెండితెరపై నటుడిగా అరంగేట్రం చేశారు. ప్రారంభంలో, రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు . రాజేంద్రప్రసాద్ కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రంలో సహాయక పాత్ర పోషించాడు. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్ కు 14 సినిమాలలో అవకాశాలు వచ్చాయి.
(1985 - 2004)
[మార్చు]దర్శకుడు వంశీ తన చిత్రం ప్రేమించు పెళ్లాడులో ఒక ప్రధాన పాత్రను పోషించడానికి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నాడు. రాజేంద్రప్రసాద్ వంశీ దర్శకత్వం వహించిన లేడీస్ టైలర్ సినిమాతో పేరుపొందాడు. రాజేంద్రప్రసాద్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూనే సహాయ పాత్రలలో నటించడం కొనసాగించాడు. 45 సంవత్సరాలకు పైగా నట జీవితంలో, రాజేంద్రప్రసాద్ 200 కంటే ఎక్కువ సినిమాలలో నటించాడు. రాజేంద్రప్రసాద్ కొన్ని తమిళ చిత్రాలలో నటించాడు. రాజేంద్ర ప్రసాద్ ను హాస్య నటుడుగా పేరు పొందాడు. [9] ఆంధ్ర ప్రదేశ్‌లో రాజేంద్ర ప్రసాద్ ను హాస్య నటకిరీటి పిలుచుకుంటారు.[10]
అహ నా పెళ్లంటలో దర్శకుడు జంధ్యాల సహకారంతో స్టార్ గా నిలబడ్డాడు. రాజేంద్రప్రసాద్ ప్రముఖ దర్శకులు వంశీ, ఇవివి సత్యనారాయణ, SV కృష్ణా రెడ్డి రేలంగి నరసింహారావు లాంటి దర్శకులతో పనిచేశాడు. ముఖ్యంగా రేలంగి నరసింహారావుతో రాజేంద్రప్రసాద్ 32 సినిమాలు తీశాడు.
(2004 - 2011)
[మార్చు]రాజేంద్రప్రసాద్ కు పేరు తెచ్చి పెట్టిన సినిమా ఆ నలుగురు , ఆ నలుగురు సినిమాకు గాను రాజేంద్రప్రసాద్ రెండవసారి నంది అవార్డును గెలుచుకున్నాడు.[11] రాజేంద్రప్రసాద్ నటించినమీ శ్రేయోభిలాషి ఓనమాలు వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలను పొందాయి . కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దేవుళ్లులో హనుమంతుడిగా రాజేంద్రప్రసాద్ నటించాడు.
2009లో, రాజేంద్ర ప్రసాద్ ఆంగ్ల భాషా సినిమా క్విక్ గన్ మురుగున్‌లోరాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
(2011 – ప్రస్తుతం)
[మార్చు]జులాయి, ఆగడు, S/O సత్యమూర్తి, శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో వంటి సినిమాలలో రాజేంద్రప్రసాద్ సహాయ పాత్రలను పోషించాడు. దాగుడుమూత దండకోర్ వంటి చిత్రాల్లో తాత పాత్రను పోషించాడు.
అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా రాజేంద్ర ప్రసాద్ కు వీరాభిమాని.[12]
2015లో నటి జయసుధకు వ్యతిరేకంగా పోటీ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[13]
మూలాలు
[మార్చు]- ↑ "జూలై 19న జన్మించిన నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 25 జూలై 2015. Retrieved 9 January 2018.
- ↑ Andhrajyothy (5 October 2024). "రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో." Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Filmibeat. Archived from the original on 20 April 2015. Retrieved 3 April 2016.
- ↑ "నవ్వు అవసరం ఉన్నంతవరకు నేనుంటా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 5 September 2017. Retrieved 5 September 2017.
- ↑ ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 August 2019. Retrieved 10 January 2020.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
- ↑ 123తెలుగు, రివ్యూ (30 January 2015). "Top Rankers Review and Rating". www.123telugu.com. Archived from the original on 26 December 2019. Retrieved 24 February 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (10 December 2024). "రంగాచారి పాత్ర దక్కడం అదృష్టం". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Stars : Star Profiles : Rajendra Prasad Archived 18 ఏప్రిల్ 2012 at the Wayback Machine
- ↑ "Dr Rajendra Prasad News". filmibeat.com. Archived from the original on 27 మే 2014. Retrieved 16 August 2018.
- ↑ "Aa Naluguru – Telugu cinema different perspective – analysis on latest Telugu movies". idlebrain.com. Retrieved 16 August 2018.
- ↑ "Rajendra Prasad Never be Ignored". 14 August 2012. Retrieved 16 August 2018.
- ↑ "Rajendra Prasad beats Jayasudha to win MAA president Post". The Hans India. 17 April 2015. Retrieved 16 August 2018.