Jump to content

వృత్తాంతి

వికీపీడియా నుండి

వృత్తాంతి 1838 లో ప్రారంభమైన తెలుగు వార పత్రిక.[1] ఈ పత్రికకు మండిగల వెంకట్రాయశాస్త్రి సంపాదకుడు. ఈ పత్రిక 1841 వరకు నడిచి ఆగిపోయింది. ప్రతి గురువారం ఈ పత్రిక వెలువడేది. తెలుగులో వెలువడ్డ తొలి పత్రికల్లో ఇది ఒకటి.

చరిత్ర

[మార్చు]

ఈ వార పత్రికను మద్రాసులోని కొంతమంది సంపన్నులు కలిసి 1838 లో ప్రారంభించినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఈ పత్రికను ఎవరు ప్రచురించారు? ఏ ముద్రణాలయంలో ముద్రించారన్న విషయంపై స్పష్టత లేదు. ఆరుద్ర వృత్తాంతి ప్రింటింగ్ ప్రెస్సు మద్రాసులో వేపేరి అనే ప్రాంతంలోని చర్చి స్ట్రీటులో ఉందని పేర్కొనగా బంగోరె మాత్రం తీఫింగ్ బజారులో ఉందని రాశాడు. ఈ పత్రికపై నిఘా ఉంచి అందులో వచ్చే వ్యాసాలను ఆంగ్లం లోకి అనువదించి పంపమని అప్పటి తెలుగు అనువాదకుడు జె. సి. మారిస్ ను మద్రాసు ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్రిక ప్రతులేమీ అందుబాటులో లేవు.[2] దీని ప్రతులు దొరకడం లేదు గానీ, ఈ పత్రికలో ప్రచురించిన ఒక పాఠక లేఖను మాత్రం బంగోరె సేకరించాడు. ఈ పత్రిక ఉనికికి ఆ లేఖయే ఆధారం.[3]

వృత్తాంతి - వృత్తాంతిని

[మార్చు]

వృత్తాంతి పేరు విషయంలో ఒక సందిగ్ధత ఉంది. దీన్ని వృత్తాంతిని అని కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే రెండు పత్రికలు వేరు వేరని తెలుస్తుంది. ఒకటి 1838 ప్రాంతంలో వెలువడిన 'వృత్తాంతి' వార పత్రిక. ఇక రెండవ పత్రిక 'వృత్తాంతిని'. ఇది ఫోర్ట్‌ సెంట్‌ జార్జి గెజిట్‌ అయి ఉంటుంది. ఈ గెజెట్ తెలుగు తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ వెలువడేది. 1832 నాటికే ఇది ఉనికిలో ఉంది. గెజిట్‌ను తెలుగులో రాజకీయ వృత్తాంతిని అని అనువాదం చేసారు. కాబట్టి ఈ గెజిటే వృత్తాంతిని అయి ఉంటుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. మొదటి తెలుగు పత్రికలు, సమగ్రాంధ్ర సాహిత్యం, మూడవ సంపుటి, ఆరుద్ర, తెలుగు అకాడమి, హైదరాబాదు, పేజీలు: 288-92.
  2. రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర- వ్యవస్థ. p. 38. Retrieved 28 December 2017.
  3. 3.0 3.1 డా. జె., చెన్నయ్య (2003). "ప్రారంభ దశలో వివిధ పత్రికలు - తొలి పత్రిక". తెలుగు దినపత్రికలు భాషా, సాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్. p. 27.