వృత్తాంతి

వికీపీడియా నుండి
(వృత్తాంతిని నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వృత్తాంతి తెలుగు పత్రిక 1838లో ప్రారంభించబడినది.[1] ఈ పత్రికకు మండిగల వెంకట్రాయ శాస్త్రి గారు సంపాదకుడు. ఈ పత్రిక 1841 వరకు అనగా నాలుగు సంవత్సరాలు మాత్రమే నడిచింది. ప్రతి గురువారం ఈ పత్రిక వెలువడేది.

నేపథ్యం[మార్చు]

ఈ వార పత్రికను మద్రాసులోని కొంతమంది సంపన్నులు కలిసి 1838 లో ప్రారంభించినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఈ పత్రికను ఎవరు ప్రచురించారు? ఏ ముద్రణాలయంలో ముద్రించారన్న విషయంపై స్పష్టత లేదు. ఆరుద్ర వృత్తాంతి ప్రింటింగ్ ప్రెస్సు మద్రాసులో వేపేరి అనే ప్రాంతంలోని చర్చి స్ట్రీటు ఉందని పేర్కొనగా బంగోరె మాత్రం తీఫింగ్ బజారులో ఉందని రాశాడు. ఈ పత్రికపై నిఘా ఉంచి అందులో వచ్చే వ్యాసాలను ఆంగ్లం లోకి అనువదించి పంపమని అప్పటి తెలుగు అనువాదకుడు జె. సి. మారిస్ ను మద్రాసు ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్రిక ప్రతులేమీ అందుబాటులో లేవు.[2]

మూలాలు[మార్చు]

  1. మొదటి తెలుగు పత్రికలు, సమగ్రాంధ్ర సాహిత్యం, మూడవ సంపుటి, ఆరుద్ర, తెలుగు అకాడమి, హైదరాబాదు, పేజీలు: 288-92.
  2. రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర- వ్యవస్థ. p. 38. Retrieved 28 December 2017.