ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక
ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సంపుటం 16, సంచిక 4, 1927 ముఖచిత్రం. | |
| ప్రచురణకర్త | ఆంధ్రసాహిత పరిషత్తు |
|---|---|
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక (ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక) ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించిన పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైంది. దీన్ని చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాలలో ముద్రించారు. ఆంధ్రసాహిత్యపరిషత్తు కార్యాలయాన్ని 1921 లో పిఠాపురానికీ, 1922 లో కాకినాడకూ మార్చినపుడు, ఈ పత్రిక కూడా కాకినాడకు మారింది. ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులను అకాడమీ క్రియాశీలత తగ్గిన తరువాత 1973 జూన్‌లో పురావస్తుశాఖకు బదిలీ చేసారు.[1]
చరిత్ర
[మార్చు]మొదట ఈ పత్రికను “జర్నల్ ఆఫ్ ది తెలుగు అకాడమీ” అనే పేరుతో మద్రాసు నుండి ప్రచురించారు. సంస్థను కాకినాడకు మార్చినప్పుడు, పత్రికకు 'ఆంధ్ర సాహత్య పరిషత్పత్రిక' అని పేరు పెట్టారు. పరిశోధనా వ్యాసాలకూ, శాసనాల ప్రచురణలకూ ఈ పత్రిక పేరు పొందింది. అనేక అముద్రిత గ్రంథాలు ఈ పత్రిక ద్వారా ప్రచురితమయ్యాయి. మల్లికార్జున పండితుని శివతత్వ సారము, రాయవాచకం, శాసన పద్యమంజరి వంటి గ్రంథాలు ఈ పత్రిక ద్వారానే వెలుగు చూసాయి. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, కావ్యవిమర్శలు, సమీక్షలు, పీఠికలు, శబ్ద చర్చలు, కవిత్వ లక్షణ వివేచనము, ఇతర భాషా సాహిత్యాలకు సంబంధించిన వ్యాసాలు ఈ పత్రికలో చోటు చేసుకున్నాయి. జయంతి రామయ్య శతజయంతి సంచిక, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి స్మారక సంచిక వంటి ప్రత్యేక సంచికలు కూడా వెలువరించింది.[2]
మొదట్లో ఈ పత్రిక త్రైమాసికంగా (మూడు నెలలకు ఒకసారి) వెలువడేది. తర్వాత మాసపత్రికగా మార్చారు. మొదటి పపంచయుద్ధం సందర్భంగా కాగితానికి కరువు ఏర్పడడంతో మళ్ళీ 1919 నుండి రెండు నెలలకొక సారి వెలువడేది. ప్రాచీన సాహిత్యానికి, విమర్శకి ఇది చాలా సేవచేసింది.[3]
2011 డిసెంబరులో సంస్థ శతజయంతి కార్యక్రమం జరిగింది. [4]
సంపాదకులు, రచయితలు
[మార్చు]పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.
బయటి లింకులు
[మార్చు]- ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటి24, సంచిక 5 (1934). Retrieved 2020-07-10.
మూలాలు
[మార్చు]- ↑ K.N. Murali Sankar. "Rare manuscripts of Andhra Sahitya Parishat under threat". Retrieved 2018-09-21.
- ↑ మువ్వల, సుబ్బరామయ్య (2015). తెలుగుప్రచురణరంగం. విజయవాడ: జయంతి పబ్లికేషన్స్. p. 59.
- ↑ ద్వా, నా శాస్త్రి. సాహిత్య సంస్థలు. pp. 91–92. Retrieved 2018-11-12.
- ↑ "Sahitya Parishat centenary celebrated". Retrieved 2018-09-21.