అక్షాంశ రేఖాంశాలు: 11°54′40″N 79°48′45″E / 11.911082°N 79.812533°E / 11.911082; 79.812533

పుదుచ్చేరి

వికీపీడియా నుండి
(Puducherry నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పుదుచ్చేరి
పాండిచ్చేరి
ఎగువ నుండి సవ్యదిశలో: ప్రొమెనేడ్ బీచ్, మాత్రిమండిర్, పాండిచేరి నౌకాశ్రయం, పాండిచేరిలోని బీచ్
Official logo of పుదుచ్చేరి
భారతదేశం లో పుదుచ్చేరి స్థానం (ఎరుపు రంగులో గుర్తించబడింది)
భారతదేశం లో పుదుచ్చేరి స్థానం (ఎరుపు రంగులో గుర్తించబడింది)
Coordinates: 11°54′40″N 79°48′45″E / 11.911082°N 79.812533°E / 11.911082; 79.812533
దేశం భారతదేశం
ప్రాంతందక్షిణ భారతదేశం
నిర్మాణం1954 నవంబరు 1 (16 August 1962 as a UT)
రాజధాని, పెద్ద నగరంపాండిచ్చేరి
జిల్లాజిల్లా సంఖ్య 4
Government
 • ముఖ్యమంత్రివి. నారాయణస్వామి, (భారత జాతీయ కాంగ్రెసు) [1]
 • ప్రధాన కార్యదర్శి, భారతదేశంఅశ్వినీ కుమార్, ఐఎఎస్[2]
 • డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్బాలాజీ శ్రీవాస్తవ, ఐపిఎస్
 • పుదుచ్చేరి శాసనసభఏక సభ, (33*seats) [3]
విస్తీర్ణం
 • Total483 కి.మీ2 (186 చ. మై)
 • Rankవైశాల్యం ప్రకారం ర్యాంకు 34
జనాభా
 (2011)
 • Total13,94,467
 • Rankజనాభా ప్రకారం ర్యాంకు 29
 • జనసాంద్రత2,900/కి.మీ2 (7,500/చ. మై.)
Demonym(s)పుదుచ్చేరియన్, పాండిచేరియన్, పాండియన్
భాషలు
 • అధికారతమిళం, ఆంగ్లం,తెలుగు,మలయాళం, ఫ్రెంచ్[4]
 • అదనపు భాషలుతెలుగు (యానాం జిల్లా),మలయాళం (మహే జిల్లా), [5]
Time zoneUTC+05:30
పిన్‌కోడ్
605014
ISO 3166 codeIN-PY
Vehicle registrationPY 01, PY 02, PY 03, PY 04, PY 05, PY 05V
Websitewww.py.gov.in
Symbols of పుదుచ్చేరి
Emblem
Emblem of Puducherry
Bird
Koel (Eudynamys scolopaceus)[6]
Flower
Cannonball tree flower[6]
Mammal
Indian palm squirrel (Funambulus palmarum)[6]
Tree
Bael fruit tree[6]
^* 30 ఎన్నిక, 3 నామినేటడ్

పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి (Pondicherry), దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం. భారత స్వాతంత్ర్యానికి ముందు, ఫ్రెంచి వారి పరిపాలనలో విభిన్న సంస్కృతిని పొందినందున, దానిని పరిరక్షించడానికి కేంద్రపాలిత ప్రాంతమైంది. ఇది భౌగోళికంగా నాలుగు విడి భాగాలను కలిగివుంది. బంగాళా ఖాతం తీరంలో తమిళనాడు రాష్ట్రం హద్దుగా పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పట్టణం, కరైకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హద్దుగా యానాం ఉన్నాయి. అరేబియన్ సముద్రం తీరాన మాహె ఉంది.

పేరు ఉత్పత్తి

[మార్చు]

తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్థం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం "Poudichéry" అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో 'u' బదులు 'n' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో 'పాండిచేరి' అని పిలువడం మొదలయ్యింది. తరువాత అదే ఖరారైంది. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా 'పుదుచ్చేరి' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతుంది.

చరిత్ర

[మార్చు]
Map showing the districts of Puducherry
Map showing the districts of Puducherry

పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతనాధారాల వల్ల తెలుస్తోంది. సా.శ. 2వ శతాబ్దంలో వ్రాయబడిన ఎరిథ్రేయన్ సముద్రం పెరిప్లస్ అనే పుస్తకంలో 'పొడుకె' అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడింది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న'అరికమేడు' అని 'హంటింగ్ ఫోర్డ్' అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోము ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోముకు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడినాయి. సా.శ. 4వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్, డచ్చి వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందాల ప్రకారం పుదుచ్చేరి పై అధికారం మారుతూ వచ్చింది.1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్, చందేర్ నగర్ లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి.1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.

భారత స్వాతంత్ర్య సమర కాలంలోనే పుదుచ్చేరిని ఫ్రెంచి పాలన నుండి విముక్తి చేయడానికి అనేక ఉద్యమాలు సాగాయి. 1787, 1791లో కరైకాల్ రైతులు భూమి పన్నులను వ్యతిరేకించారు. 1873లో పొన్నుతంబి పిళ్ళై అనే న్యాయవాది పారిస్ న్యాయస్థానంలో ఒక కేసు గెలిచారు. (పుదుచ్చేరి కోర్టులో చెప్పులతో ప్రవేశించినందుకు ఆయనకు విధించిన జరిమానా అన్యాయమని అంగీకరించి పరిహారం చెల్లించారు). 1927 - 1930 కాలంలో విద్యార్థిఉద్యమాలు నడచాయి. జాతీయ నాయకులు పుదుచ్చేరి వాసులను సంబోధించి ప్రసంగించారు. 1934లో 'వి.సుబ్బయ్య' అనే స్వాతంత్ర్య నాయకుడు, కార్మిక నాయకుడు 'స్వతంత్రం' అనే మాస పత్రికను ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచి వారి పై విముఖత మరింత పెరిగింది. 1946లో 'ఫ్రెంచి ఇండియా కాంగ్రెసు' ప్రాంభింపబడింది. 1948 లో భారతదేశంలో విలీనానికి తీర్మానం ఆమోదించారు. దీనికి కమ్యూనిస్టుల మద్దతు కూడా లభించింది. 1947 లో భారత స్వాతంత్ర్యానంతరం 1948లో ఫ్రంచి ప్రభుత్వంతో జరిగి ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాల ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకొనే అవకాశం లభించింది. అయితే ప్రజా ప్రతినిధులలో కొంత ఊగిసలాట, అనిశ్చితి వల్ల, ఎన్నికలలో జరిగిన అవక తవకల వల్ల అసంగ్దిద్ధ పరిస్థితి నెలకొన్నది. 1954 మార్చి 18న పుదుచ్చేరిలో ప్రజా ప్రతినిధులంతా భారతదేశంలో విలీనానికి అంగీకరించారు. తరువాత కరైకాల్ లోనూ ఇదే జరిగింది. అలాగే యానాం విలీనానికి తీర్మానించిన ప్రజా ప్రతినిధులు బెదిరింపులను ఎదుర్కొని ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవాల్సి వచ్చింది. వారంతా కలసి, మేయర్ సత్యానందం నాయకత్యంలో ఊరేగింపుగా యానాం వెళ్ళి, భారతజాతీయ పతాకాన్ని ఎగురవేసి యానాం విముక్తిని ప్రకటించారు. 1954 జూలై 16న కుమరన్ నాయకత్యంలో మాహె పౌరులు కూడా భారతదేశంలో విలీనమైనారు. 1952 చందోర్ నగర్ కూడా భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. దానిని పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలో భాగంగా ఏర్పరచారు.

1954 నవంబరు 1 నుండి పాలనా వ్యవహారాలు భారతదేశపు అధీనంలోకి వచ్చినా, 1962 వరకు అధికారికంగా భారతదేశంలో విలీనం జరుగలేదు. 1963లో పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో ఫ్రెంచి పౌరసత్వాన్ని ఎన్నుకొన్న పుదుచ్చేరి వాసులు (వీరిలో చాలామంది మాతృభాష తమిళం), వారి సంతానం ఇప్పటికీ ఫ్రెంచి పౌరసత్వం కలిగి ఉన్నారు. పుదుచ్చేరిలో ఫ్ర్రాన్సు దేశపు రాయబార కార్యాలయ విభాగం ఒకటి, ఇంకా ఫ్రెంచి సాంస్కృతిక సంస్థలూ పనిచేస్తున్నాయి.

భౌగోళికం

[మార్చు]

ఇది భౌగోళికంగా నాలుగు విడి భాగాలను కలిగివుంది.

జనాభా

[మార్చు]

పుదుచ్చేరిలోని నాలుగు భాగాల మొత్తం జనాభా సుమారు 9,70,000 (2001 జనాభా లెక్కలు ప్రకారం)

పాలనా విధానం

[మార్చు]

పుదుచ్చేరి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. కనుక ఇక్కడి పాలనా విధానం కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే ఉంటుంది. ఎన్నుకొనబడిన ముఖ్య మంత్రి, కాబినెట్ మంత్రులు ఉన్నా కొన్ని విషయాలు కేంద్రప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ప్రతినిధిగా 'లెఫ్టినెంట్ గవర్నర్' ఉంటారు . అయితే కేంద్ర పాలిత ప్రాంతం పాలనకు అవసరమైన నిధులు ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయి.

వాడుక భాషలు

[మార్చు]

పుదుచ్చేరి వాసుల ప్రధాన భాష తమిళమైనా ఆంగ్లభాష, ఫ్రెంచిభాషలు ఈ పట్టణంలో బాగానే వాడబడుతాయి. ప్రధానమైన వీధి బోర్డులు మూడు భాషల్లోనూ ఉంటాయి.

రక్షణ కరకట్ట

[మార్చు]

పుదుచ్చేరి నగరాన్ని సముద్రం అలల తాకిడినుండి కాపాడటానికి 1735 లో ప్రెంచివారు1.25 మైళ్ళ పొడవు, 27 అడుగుల ఎత్తు ఉన్న గోడ (కరకట్ట) ను నిర్మించారు.ఇది సముద్రం అలల తాకిడినుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడుతుంది. 2004 లో వచ్చిన 'సునామీ' ఉప్పెన సమయంలో 24 అడుగుల ఎత్తు అలలనుండి ఈ గోడ పుదుచ్చేరి నగరాన్ని రక్షించింది.

ప్రముఖులు

[మార్చు]

విద్యాసంస్థలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "V Narayanasamy to be new Puducherry Chief Minister". Archived from the original on 2 జూన్ 2016. Retrieved 3 జూన్ 2016.
  2. Varma, M. Dinesh (6 June 2015). "New Chief Secretary assumes charge". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 9 November 2016.
  3. "PUDUCHERRY LEGISLATIVE ASSEMBLY". Archived from the original on 3 November 2017. Retrieved 26 October 2017.
  4. "The Pondicherry Official Languages Act, 1965" (PDF). lawsofindia.org. Laws of India. Archived from the original (PDF) on 3 May 2020. Retrieved 10 June 2019.
  5. "Official Languages of Pondicherry - E-Courts Mission, Government of India". Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 15 డిసెంబరు 2020.
  6. 6.0 6.1 6.2 6.3 "Tamil Nadu News : Puducherry comes out with list of State symbols". The Hindu. 21 April 2007. Archived from the original on 4 January 2013. Retrieved 10 February 2014.

బయటి లంకెలు

[మార్చు]