కొమ్మాది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్మాది వద్ద తూర్పు కనుమలు

కొమ్మాది, ఇది పూర్తిగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1]ఈ గ్రామం విశాఖ నగరం నుండి 20 కి మీ దూరంలో మధురవాడకు సమీపంలో ఉంది. చుట్టూ పచ్చని పొలాలతో తూర్పు కనుమల మధ్య ఈ గ్రామం ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంటుంది. ఈ గ్రామం వద్ద అన్నంరాజు నగర్లో నూతనంగా నిర్మింపబడిన అష్టలక్ష్మీ సమేత నారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆలయంలో స్పటిక లింగ వైశాఖేశ్వరస్వామి విగ్రహం ఉంది. ఆలయంలో నిత్యపూజలు జరుగుతాయి. కొమ్మాది గ్రామం బంగాళాఖాతం సముద్రానికి సమీపంలో ఉన్నందున వాతావరణంలో తేమ వచ్చే అవకాశం ఉంది.

ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం

[మార్చు]
అష్టలక్ష్మీ సమేత నారాయణ స్వామి దేవాలయం

కొమ్మాది నుండి బయలుదేరి వయా మధురవాడ, యండాడ, హనుమంతువాక,మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కోత్తరోడ్ మీదుగా పాత తపాలాకార్యాలయం వరకు 25 ఇ నెంబరు గల బస్సులు ప్రయాణిస్తాయి.25 ఎం, 25 ఇ, 222, ,999 ,111 సంఖ్య గల బస్సు సర్వీసులు వివిధ ప్రాంతాలనుండి కొమ్మాది గ్రామంగుండా ప్రయాణిస్తాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]

లొకేషన్

[మార్చు]

కొమ్మాది.[2]

సమీప ఆరోగ్య కేంద్రాలు

[మార్చు]

రావులమ్మపాలెం , మధురవాడ ప్రభుత్వ హాస్పటల్

విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామంలో చైతన్య ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పబడింది.

మూలాలు

[మార్చు]
  1. https://censusindia.gov.in/2011census/dchb/2813_PART_A_DCHB_VISAKHAPATNAM.pdf Archived 2018-01-04 at the Wayback Machine - (పేజీ సంఖ్య 185)
  2. "కొమ్మాడి · ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం". కొమ్మాడి · ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం. Retrieved 2024-06-30.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కొమ్మాది&oldid=4265434" నుండి వెలికితీశారు