రాజీవ్ గాంధీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాజీవ్ గాంధీ | |||
| |||
పదవీ కాలం 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గం | అమేథీ , ఉత్తర ప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర భారత్ | ||
మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం | ||
సంతానం | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
నివాసం | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1][2]
తొలినాటి జీవితం, విద్య:
[మార్చు]- 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
- అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
- 1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.
రాజకీయ జీవితం:
[మార్చు]రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరా గాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పిదప, 1983లో, అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తదుపరి జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగాడు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు (PCC), పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు. మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ముగిసింది .
ప్రధానమంత్రిగా
[మార్చు]రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
మరణం
[మార్చు]1991 మే 21న, రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యయ్యాడు.
వారసత్వం
[మార్చు]భారతదేశ ఆధునిక చరిత్రలో రాజీవ్ గాంధీ ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆధునిక భారతాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తుంచుకోవడం జరుగుతుంది.
ఇవికూడా చూడండి
[మార్చు]
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
- ↑ విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
వెలుపలి లంకెలు
[మార్చు]- విస్తరించవలసిన వ్యాసాలు
- భారత ప్రధానమంత్రులు
- రక్షణ మంత్రులు
- నెహ్రూ-గాంధీ కుటుంబం
- భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1944 జననాలు
- 1991 మరణాలు
- 9వ లోక్‌సభ సభ్యులు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- హత్య చేయబడ్డ భారతీయులు
- ఇందిరా గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు
- ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు