శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం
శ్రీ సంపత్ నినాయగర్ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 17°43′29″N 83°18′46″E / 17.724702°N 83.312717°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
స్థలం | విశాఖపట్నం |
సంస్కృతి | |
దైవం | వినాయకుడు |
శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం విశాఖపట్నం లో ఉన్న దేవాలయం. ఇది విశాఖపట్నం లోని అసీల్ మెట్ట లో ఉంది. [1] ఇక్కడి ప్రధాన దైవం వినాయకుడు.
చరిత్ర
[మార్చు]ఈ ఆలయాన్ని 1962 లో టిఎస్ రాజేశ్వరన్, టిఎస్ సెల్వగణేశన్, ఎస్.జి.సంబంధన్ లు నిర్మించారు. ఈ ముగ్గురూ పోర్టులో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేసేవారు. వారు తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడివినాయకుడికి పూజలు నిర్వహించేవారు. 1967లో కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసాడు. 1996లో ఇది ఎంటోమెంట్స్ పరిధిలోకి వచ్చింది.[2]
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ఈ ఆలయం పి.ఎన్.ఎస్. ఘజీ దాడి నుండి నగరాన్ని రక్షించిందని స్థానిక ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది విశాఖపట్నం తీరంలో ఆ జలాంతర్గామిని ముంచివేసిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. [3]
విశేషాలు
[మార్చు]సంపత్ వినాయగర్ ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో, కొత్తగా కొనుగోలు చేసిన ఏదైనా వాహనం యొక్క పూజను నిర్వహించడానికి ప్రజలు ఇప్పటికీ ఇక్కడికి వస్తూంటారు. [4] ఈ ఆలయం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థిని గొప్ప ఆడంబరంగా జరుపుకుంటారు. ప్రజలు దీనిని నగరం యొక్క అదృష్ట దేవాలయంగా నమ్ముతారు [5]
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu". Archived from the original on 2004-09-17. Retrieved 2020-10-23.
- ↑ "అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా దేవాలయ నిర్వహణ". Amaravati News. Archived from the original on 2020-10-26. Retrieved 2020-10-23.
- ↑ gotirupati
- ↑ "Festive spirit pervades on eve of Ganesh Chaturthi". Deccan Chronicle. 17 September 2015. Retrieved 22 May 2019.
- ↑ timesofindia