Jump to content

బి.హెచ్.పి.వి. టౌన్‌షిప్

అక్షాంశ రేఖాంశాలు: 17°42′12″N 83°12′01″E / 17.703251°N 83.200258°E / 17.703251; 83.200258
వికీపీడియా నుండి
(బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్ నుండి దారిమార్పు చెందింది)
బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌
సమీపప్రాంతం
బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌ is located in Visakhapatnam
బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌
బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌
విశాఖట్నం నగర పటంలో బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌ స్థానం
Coordinates: 17°42′12″N 83°12′01″E / 17.703251°N 83.200258°E / 17.703251; 83.200258
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530012

బి.హెచ్.వి.పి. టౌన్‌షిప్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక శివారు ప్రాంతం.[1] దీని పూర్తిపేరు భారత్ హెవీ ప్లేట్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్ టౌన్‌షిప్‌. ఆ సంస్థ ఉద్యోగుల కోసం 1960లలో ఇది స్థాపించబడింది.[2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°42′12″N 83°12′01″E / 17.703251°N 83.200258°E / 17.703251; 83.200258 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో తంగలం, నాతయ్యపాలెం, ఆటో నగర్, మిండి, గాజువాక మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

గురించి

[మార్చు]

బిహెచ్‌పివి అనేది ఒక ప్రణాళికాబద్ధమైన టౌన్‌షిప్ గా నిర్మించబడింది. ఇందులో పాఠశాల, ఎటిఎంలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్ల వంటి అన్ని ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి.[3]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బురుజుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, రైల్వే స్టేషన్, విజయనగరం, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్, దెందేరు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, దువ్వాడ రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bhpv Township Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  2. "location". economic times. 11 September 2013. Retrieved 18 May 2021.
  3. "about". bhpv school. 27 December 2017. Archived from the original on 2 జనవరి 2017. Retrieved 18 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.