నిజాం కళాశాల
నిమ్స్ | |
రకం | సార్వత్రిక |
---|---|
స్థాపితం | 1887 |
స్థానం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అనుబంధాలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
జాలగూడు | అధికారిక జాలగూడు |
నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతంలో ఉంది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. సంవత్సరం పొడుగునా జరిగిన ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
చరిత్ర
[మార్చు]ప్రస్తుతం ఉన్న ప్రధాన కళాశాల భవనం హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల), మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించాడు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.
అనుబంధాలు
[మార్చు]ప్రారంభంలో ఇది మద్రాస్ విశ్వవిద్యాలయానికి 60 సంవత్సరాలు అనుబంధంగా ఉంది. 1947 ఫిబ్రవరి 19 న, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంద కళాశాలగా మార్చబడింది.[1] ఈ కళాశాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో నేటి రాజకీయ నాయకులు, వైద్యులు చాలా మంది ఈ చారిత్రక కళాశాల నుండి వెళ్ళారు.[2]
కొత్త భవనాలు
[మార్చు]కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వసతి కల్పించకపోవడంపై 2022 అక్టోబరు- నవంబరులో నిజాం కళాశాల విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చాడు.[3] వసతి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు.[4]
ఇచ్చిన మాట ప్రకారం, కళాశాలలో వసతి, కొత్త భవనాలకు 2023, ఆగస్టు 12న మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్.రమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విశ్వవిద్యాలయ వీసీ డి.రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.[5][6]
ప్రముఖ పూర్వవిద్యార్ధులు
[మార్చు]- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
- సురేష్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్
- నందమూరి బాలకృష్ణ - సినీనటుడు
- రాకేశ్ శర్మ - వ్యోమగామి
- కె.జి.రామనాథన్ - గణితశాస్త్రవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
- టి.సుబ్బరామిరెడ్డి - రాజ్యసభ సభ్యుడు
- అబ్బూరి ఛాయాదేవి - కథా రచయిత్రి.
- బూర్గుల రామకృష్ణారావు - హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- సీతారాం యేచూరి - పార్లమెంటు సభ్యుడు, సి.పి.ఎం. నాయకుడు
- శ్యాం బెనగళ్ - భారతీయ సినిమా దర్శకుడు
- ఖండవల్లి లక్ష్మీరంజనం - సాహిత్యవేత్త, పరిశోధకులు
- సూరి భగవంతం - శాస్త్రవేత్త
- టీవీ నారాయణ - సామాజిక, విద్యారంగ నిపుణుడు.
- రాజారావు - ఆంగ్ల రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.
- లక్ష్మీ ప్రాతూరి - భారతీయ పారిశ్రామికవేత్త, క్యూరేటర్, ఉపన్యాసకురాలు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Nizam College Hyderabad - Institution in Hyderabad, Attractions in Hyderabad Andhra-Pradesh". web.archive.org. 2016-01-30. Archived from the original on 2016-01-30. Retrieved 2021-01-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nizam College, Nizam College, Hyderabad". web.archive.org. 2011-09-01. Archived from the original on 2017-12-10. Retrieved 2021-01-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Today, Telangana (2022-11-08). "KTR responds to Nizam College students protest, urges Education Minister to address issues". Telangana Today. Archived from the original on 2022-11-08. Retrieved 2023-08-17.
- ↑ "ఆ విద్యార్థుల సమస్యకు వెంటనే ముగింపు పలకండి: మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2022-11-08. Archived from the original on 2023-08-17. Retrieved 2023-08-17.
- ↑ "KTR lays foundation for Nizam College boys hostel". www.deccanchronicle.com. 2023-08-13. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-17.
- ↑ Today, Telangana (2023-08-12). "KT Rama Rao lays foundation stone for classroom complex and boys hostel at Nizam College". Telangana Today. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-17.