Jump to content

ఖమ్మం

అక్షాంశ రేఖాంశాలు: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E / 17.25; 80.16
వికీపీడియా నుండి
(ఖమ్మ౦ నుండి దారిమార్పు చెందింది)
ఖమ్మం
ఖమ్మమెట్ట్
నగరం
నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణం
నరసింహ స్వామి కొండ నుండి ఖమ్మం పట్టణం
ఖమ్మం is located in Telangana
ఖమ్మం
ఖమ్మం
తెలంగాణలో స్థానం
ఖమ్మం is located in India
ఖమ్మం
ఖమ్మం
ఖమ్మం (India)
Coordinates: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E / 17.25; 80.16
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం జిల్లా
Government
 • Bodyఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్
 • మేయర్పూనుకొల్లు నీరజ
 • డిప్యూటీ మేయర్షేక్ ఫాతిమా జోహారా
 • మున్సిపల్ కమీషనర్సందీప్ కుమార్
 • శాసనసభ్యుడుపువ్వాడ అజయ్‌ కుమార్‌
విస్తీర్ణం
 • Total93.45 కి.మీ2 (36.08 చ. మై)
 • Rank3వ (రాష్ట్రంలో)
Elevation
107 మీ (351 అ.)
జనాభా
 (2011)[2]
 • Total3,13,504
 • Rank151 (దేశం)
4 (రాష్ట్రం)
 • జనసాంద్రత3,400/కి.మీ2 (8,700/చ. మై.)
Demonymఖమ్మమైట్
అధికారక
 • భాషతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
507001
Vehicle registrationటిఎస్–04[3]
జాతీయతభారతీయులు
ప్రణాళికా సంస్థఖమ్మం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.[4] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[5] ఖమ్మం పట్టణం వ్యాపార, ఆర్థిక కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దాదాపు 193 కిలోమీటర్లు (120 మై.), సూర్యాపేట నుండి 61 కిలోమీటర్లు (38 మై.), వరంగల్ నుండి 120 కిలోమీటర్లు (75 మై.), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఉత్తరాన దాదాపు 121 కిలోమీటర్లు (75 మై.) దూరంలో ఉంది. మున్నేరు నది ఈ నగరానికి పడమటి వైపున ప్రవహిస్తోంది.[6] 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, ఖమ్మం పట్టణ సముదాయంలో 313,504 జనాభా ఉంది.[2] 2012, అక్టోబరు 19న, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది. కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడిన తరువాత ఖమ్మం జనాభా సుమారు 3,07,000 గా ఉంది.[7]

పద చరిత్ర

[మార్చు]

స్తంభాద్రి, కంబంమెట్టు, ఖమ్మంమెట్టు[8], కమ మెట్ట్[9], గంబంబుమెట్టు[10], కంబము మెట్టు, ఖమ్మం పేర్లతో పరిణామం చెందుతూ వచ్చిన చారిత్రిక ప్రదేశం. ఇచ్చటగల అతిపురాతనమైన స్తంభాద్రి నరసింహస్వామి ఆలయం దీనికి పేరు రావడానికి కారణం[10][11][12][13][14]. ఖమ్మం నిజనామం "కమ్మమెట్టు"[ఆధారం చూపాలి]. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది[15][16][17][18][19][20]. ఈ పేరును "కమోమెట్", "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.[21]

చరిత్ర

[మార్చు]

తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1901 నుండి 1981 వరకు ఖమ్మం పట్టణం తొమ్మిది వేల జనాభా ఉన్న చిన్న పట్టణం నుండి లక్ష మంది జనాభా ఉన్న నగరంగా ఎదిగింది. 24-3-1942 లో పట్టణం మునిసిపాలిటీగా ఏర్పడింది. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉంది.

క్రీ.శ 591వ సంవత్సరంలో హిందూ రాజు మహాదేవ శర్మ ఈ ప్రాంతానికి పాలకుడు. ఆ రోజు అది అతని రాజధాని నగరం. సహదేవరాజు, ఈ రాజు తొమ్మిదవ తరం. 950 ప్రాంతంలో ఓరుగల్లు పట్టణం ఉనికిలో ఉన్న సమయంలో వచ్చిన దాచుకున్న డబ్బుతో రంగారెడ్డి, లకా్ష్మరెడ్డి వెలమారెడ్డి సోదరుల త్రయం ఖమ్మం వచ్చి ఆక్రమించుకున్నట్లు వెల్లడైంది. వారు ఖమ్మం దుర్గను నిర్మించారు. దీని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని చెబుతున్నారు. ఇది సుమారు 300 అడుగుల ఎత్తులో క్రీ.శ.1006లో నిర్మించబడింది తరువాత మూడువందల సంవత్సరాలు రెడ్డి రాజుల పాలనలో ఉంది. తరువాత నంద పాణి, కాళ్ళూరు,గుడ్లూరు వంశాల వారు ఈ ప్రాంతంలో రాజ్యాధిపత్యం వహించారు. 1301 నిజాం ఈ ఖమ్మం దుర్గాన్ని నవాబు షౌకత్ జంగ్ పూర్వీకులకు జాగీరుగా ఇచ్చాడు ఆ తర్వాత 144లో గోల్కొండ నవాబుల రాజవంశంగా మారింది. ప్రాచీన కవులలో గొప్పవాడైన హరిభట్టు 1472-1535 మధ్య కంబమెట్టు నివాసి అని ప్రతీతి.

గోల్కొండ నవాబుల రాజ్యంలో అంతర్భాగమైన ఖమ్మం 1905 వరకు జిల్లాకేంద్రంగా ఉంది. నిజాం పాలకులు తమ పరిపాలనా సౌలభ్యం మేరకు ఓరుగల్లును జిల్లా కేంద్రంగా చేసుకున్నారు[10].

1901వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఐదువేల జనాభాను "పబ్లిసిస్ సపై"గా ప్రకటించింది.వీటిపై స్థానిక నిధి కమిటీకి అన్ని అధికారాలు ఉన్నాయి.కలెక్టర్ ప్రెసిడెంట్ నామినేట్ చేసిన కమిటీ దీని కోసం పనిచేసింది.

1905 దాకా వరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, 1948 లో హైదరాబాద్ రాజ్యం మీద భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపేంత వరకు ఈ పట్టణం ఎక్కువ శాతం జాగీరుల పాలనలో ఉన్నది,1952 లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి అప్పటి ఖమ్మం జనాభా 28 వేలు. 1953 ఖమ్మం పట్టణ కేంద్రంగా ఖమ్మం జిల్లా ఏర్పాటు అయింది.

ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది .[22]

చారిత్రక ఆధారాల ప్రకారం ఖమ్మం నిజనామం "కమ్మమెట్టు" [15][17][18][19][20][23]. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది[ఆధారం చూపాలి].

చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

భౌగోళికం

[మార్చు]

ఖమ్మం భౌగౌళికంగా 17.25° ఉ 80.15° తూలో ఉంది. దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణం అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగా సాగర్ నీరు లభించింది.

ఖమ్మం జిల్లాలోని నేల ఎక్కువగా గోదావరి నదికి దక్షిణాన ఇసుక నేలలు, మధిర మండలంలో నల్లమట్టి, గోదావరి నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు గోదావరి డెల్టా భూముల వలె సారవంతమైనవిగా ఉన్నాయి. జిల్లాలో ప్రధాన నేల చలక (43%), దుబ్బ (28%), నల్లమట్టి (29%). అటవీ సంపదలో ప్రధానంగా టేకు, నల్లమద్ది, చంద్ర, వెదురు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 4% అటవీ విస్తీర్ణంలో, మొత్తం అటవీ విస్తీర్ణం 7,59,438 హెక్టార్లు. జిల్లాలోని వృక్షలలో కలప, సాఫ్ట్ వుడ్, ఇంధనం, వెదురు పొదలు, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే అనేక ఇతర చిన్న అటవీ ఉత్పత్తులుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వన్యప్రాణుల భాండాగారాలు. జిల్లా అంతటా విషపూరితమైన, విషపూరితం కాని పాములు అనేకం కనిపిస్తాయి[24].

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 నాటి భారత జనాభా లెక్కలు ప్రకారం ఖమ్మం జనాభా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి) 3,13,504 గా ఉంది. ఇందులో పురుషులు 155,461 మంది కాగా, స్త్రీలు 158,043 మంది ఉన్నారు. సగటు 1000 మంది పురుషులకు 1017 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఖమ్మం పట్టణ జనాభా 250,182 కాగా, ఖమ్మం గ్రామీణ జనాభా 63,322 గా ఉంది. 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 32,172 మంది ఉన్నారు. వీరిలో 16,725 మంది బాలురు, 15,447 మంది బాలికలు ఉన్నారు. బాలల సగటు నిష్పత్తి 1000కి 924 గా ఉంది. సగటు అక్షరాస్యత రేటు 79.40% (7 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 223,380 అక్షరాస్యులతో, గణనీయంగా ఉంది. రాష్ట్ర సగటు 67.41% కంటే ఎక్కువగా ఉంది.[25][26]

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

[మార్చు]

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వెంకటాయపాలెం వద్ద 53.20 కోట్ల రూపాయలతో 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 100 అడుగుల ఫేసింగ్‌, 11 వందల అడుగుల లోతు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది.[27] 2023, జనవరి 18న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రలు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించారు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[28][29]

ప్రభుత్వ వైద్య కళాశాల

[మార్చు]

ఖమ్మం పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. 8.5 కోట్ల రూపాయలతో పట్టణంలోని పాత కలెక్టరేట్‌ భవనాన్ని ఆధునీకరించి ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చారు. 2023 సెప్టెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కలిసి వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.[30] 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[31][32]

స్వాతంత్ర్యోద్యమం

[మార్చు]

స్వాతంత్ర్య సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు.

  • 1915: మొట్టమొదటి ఇనుము, ఉక్కు దుకాణము స్వతంత్ర సమరయోధుడు తవిడిశెట్టి సాంబయ్య గారిచే స్థాపించబడినది
  • 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది.
  • 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది.
  • 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40,000 మంది హాజరయ్యారు.
  • 1946 - 1946 ఆగస్టు 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ (ఖమ్మం పట్టణం) సందర్శన,
  • 1947 ఆగస్టు, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్‌రవు, గెల్ల కేశవరావు, యడవల్లి వేంకటేశ్వర శర్మ,
  • పుల్లభట్ల వెంకటేశ్వర్లు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు), ఊటుకూరి కమల (స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన)

సంస్కృతి

[మార్చు]

శ్రీరామ భక్తుడు, కర్ణాటక సంగీత స్వరకర్త భక్త రామదాసు (కంచెర్ల గోపన్న)[33] పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు కళా క్షేత్రం[34] పేరుతో ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ థియేటర్ నిర్మించింది.

వరదలు

[మార్చు]

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏటా ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. వర్షాకాలంలో వార్షిక వర్షపాతం 175 సెం.మీ. (60 అం.) గా ఉంటుంది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది వరదల కారణంగా ఖమ్మంలో చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2007లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షంతో నదికి వరదలు వచ్చి బొక్కలగడ్డ ముంపునకు గురయింది. 2009లో వరదలు వచ్చినపుడు కూడా కొన్ని ముంపునకు గురయ్యాయి. ఖమ్మంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజీ కేంద్రాలు వరద బాధితుల కోసం ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందిస్తున్నాయి.

ఆరోగ్యం

[మార్చు]

ఇక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, మమత వైద్య కళాశాల ఉన్నాయి.

ఖమ్మంలోని మున్నేరు నది

పర్యాటక కేంద్రాలు

[మార్చు]

ఇక్కడున్న ఖమ్మం కోట సా.శ. 950లో కాకతీయ రాజవంశంచే నిర్మించబడింది. లకారం సరస్సు మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇవి కాకుండా నగరం చుట్టూ భద్రాచలం, పర్ణశాల, నేలకొండపల్లి, కూసుమంచి వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

పట్టణంలోని నివాస ప్రాంతాలు

[మార్చు]

ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు.

పోడు పట్టాల పంపిణీ

[మార్చు]

ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం 2023, జూన్ 30న మధ్యాహ్నం 3:30 గంటలకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.[38][39]

మూలాలు

[మార్చు]
  1. "Basic Information". Official website of Khammam Municipal Corporation. Archived from the original on 11 February 2016. Retrieved 18 February 2016.
  2. 2.0 2.1 "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
  3. "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
  4. "Khammam". Telangana state portal. Retrieved 15 June 2015.
  5. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  6. "Krishna District Mandals" (PDF). Census of India. p. 145. Retrieved 21 February 2016.
  7. Staff Reporter, . (20 October 2012). "Khammam Municipality upgraded". The Hindu (in Indian English). {{cite news}}: |first= has numeric name (help)
  8. "India peninsula N." www.davidrumsey.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
  9. "India South, Burma, Malay Peninsula". www.davidrumsey.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-05.
  10. 10.0 10.1 10.2 ఖమ్మం పురపాలక సంఘ చరిత్ర 1952-1988 (PDF). ఖమ్మం: ఖమ్మం పురపాలక సంఘం. 1988. pp. 1, 8.
  11. Satyanārāyaṇācārya, Kodamasiṃhaṃ (1969). Stambhādri: Glimpses of Khammam history.
  12. 20va śatābdi rājakīyārthika pariṇāmālu, Telugulō strīla sāhityaṃ: semināru vyāsāla saṅkalanaṃ. Yūnivarsiṭi Ārts & Saīns Kaḷāśāla, Kākatīya Viśvavidyālayaṃ. 2003.
  13. Ravīndranāth, Muttēvi (2007). Tenāli Rāmakr̥ṣṇa kavi: śāstrīya pariśīlana. Pīkāk Buks.
  14. Moorthy, K. K. (1996). Vishnu Mayam Jagat: A Mini Compendium of 400 Vaishnavate Temples (in ఇంగ్లీష్). Message Publications.
  15. 15.0 15.1 A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216
  16. A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
  17. 17.0 17.1 Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
  18. 18.0 18.1 A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
  19. 19.0 19.1 The Geography of India, J. Burgess, 1871, London, p. 48
  20. 20.0 20.1 The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73
  21. https://books.google.co.in/books?id=5zeBDwAAQBAJ&pg=PA155&redir_esc=y#v=onepage&q&f=false
  22. Nizam's Guaranteed State Railway 1870
  23. A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
  24. "History | Khammam District | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-18.
  25. "Provisional Population Totals, Census of India 2011 Cities having population 1 lakh and above" (PDF). The Registrar General & Census Commissioner, India. Retrieved 7 July 2014.
  26. "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 July 2014. Retrieved 5 September 2014.
  27. telugu, NT News (2023-01-18). "సమీకృత కలెక్టరేట్‌ ముస్తాబు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
  28. telugu, NT News (2023-01-18). "ఖమ్మం కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు". www.ntnews.com. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
  29. "Khammam: కలెక్టరేట్, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన నలుగురు సీఎంలు". Samayam Telugu. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.
  30. ABN (2023-09-15). "మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో చేరువగా వైద్య విద్య". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-25. Retrieved 2023-09-25.
  31. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-25.
  32. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-25.
  33. Kancherla Gopanna
  34. "Bhaktha Ramdas Kalakeshthram, Photo-India". Ugo.cn. Archived from the original on 2015-06-11. Retrieved 2013-11-17.
  35. telugu, NT News (2022-06-11). "ల‌కారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-06-11. Retrieved 2022-06-15.
  36. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  37. "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  38. "పోడు పట్టాలతో పది ప్రయోజనాలు". EENADU. 2023-07-01. Archived from the original on 2023-07-01. Retrieved 2023-07-10.
  39. ABN (2023-07-01). "గిరిజనుల ఏళ్లనాటి గోస తీర్చాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-10.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖమ్మం&oldid=4327129" నుండి వెలికితీశారు